Search
  • Follow NativePlanet
Share
» »తిరువనంతపురం సమీపంలో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు !!

తిరువనంతపురం సమీపంలో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు !!

By Mohammad

తిరువనంతపురం (త్రివేండ్రం) ... భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటి మరియు కేరళ రాష్ట్ర రాజధాని. దక్షిణ భారతదేశంలో, పశ్చిమ కోస్తా తీరం దక్షిణ భాగం అంచున ఉంటుంది ఈ నగరం. ఈ నగరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో 40 నిమిషాల్లో చేరుకొనే విధంగా కోవలం బీచ్ ఉంటుంది. ఇది తిరువనంతపురం వెళ్లే ప్రతి సందర్శకుడు తప్పక చూడాలి. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అనంత పద్మనాభస్వామి ఆలయం.

తిరువనంతపురం గురించి చిన్న కథ

తాళపత్ర గ్రంధాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950 వ రోజు తుళు వంశ బ్రాహ్మణ ఋషి దివాకరము ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేసినట్లు తెలుస్తుంది. పురాణ గాధల ప్రకారం పరుశురాముడు ఈ ప్రదేశం కోసం సముద్రునితో, వరుణుడుతో పోరాడాడని మరియు బలి చక్రవర్తి ఈ ప్రదేశాన్ని పరిపాలించాడని విశ్వసిస్తారు.

ఇది కూడా చదవండి : కేరళ - ఆనందాల నిలయం !

తిరువనంతపురం సమీపంలో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు

తిరువనంతపురం(త్రివేండ్రం) లో సందర్శించే మొట్టమొదటి ప్రదేశం అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఆతరువాత ఆగస్త్యమల శిఖరం, అక్కులమ్ సరస్సు, నేపియర్ మ్యూజియం మరియు మొదలగునవి చూడవలసినవే. అంతే కాక 16 - 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోవలం బీచ్ కూడా తప్పక చూడవలసిన ప్రదేశం గా గుర్తించబడింది. ట్రావెన్కోర్ సంస్థానానికి వచ్చే యూరోపియన్ యాత్రికుల వల్ల ఈ ఓడరేవు ప్రసిద్ధ తీర విహార కేంద్రం అయిపోయింది.

శ్రీ పద్మనాభ స్వామి ఆలయం,తిరువనంతపురం

శ్రీ పద్మనాభ స్వామి ఆలయం,తిరువనంతపురం

శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం తిరువనంతపురం నగరం నడిబొడ్డున ఉన్నది. ఈ ఆలయంలో కొలువైన దైవం విష్ణువు మరియు పద్మనాభ స్వామి విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఇక్కడ స్వామి వారు అనంతశయన ముద్ర లో (యోగ నిద్ర ఆకృతిలో, అనంతుడనే సర్పం మీద పడుకొని ఉన్న భంగిమలో) దర్శనమిస్తాడు.

చిత్ర కృప : Dattu PVSR

శ్రీ పద్మనాభ స్వామి ఆలయం,తిరువనంతపురం

శ్రీ పద్మనాభ స్వామి ఆలయం,తిరువనంతపురం

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో, స్వామి వారి విగ్రహానికి చెరోవైపున శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉంటాయి. ఇప్పటికీ ట్రావెన్కోర్ రాజవంశీయుల చేత నిరహించబడుతున్న ఈ దేవాలయంలో కొద్ది సంవత్సరాల క్రితం సుమారు లక్ష కోట్ల విలువచేసే అనంత సంపద బయటపడింది.

చిత్ర కృప : sreejith Kenoth

శ్రీ పద్మనాభ స్వామి ఆలయం,తిరువనంతపురం

శ్రీ పద్మనాభ స్వామి ఆలయం,తిరువనంతపురం

పద్మనాభ స్వామి గుడి లోకి కేవలం హిందువులకి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. గుడి లోనికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా పంచె కట్టుకొని వెళ్ళాలి. స్త్రీలు సంప్రదాయ దుస్తులు ధరించుకొని పద్మనాభ స్వామి ఆశీస్సులు పొందాలి. ఆలయంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే అల్పిసి ఉత్సవాలు ప్రధానమైనవి.

చిత్ర కృప : Ilya Mauter

కనకకున్ను ప్యాలెస్, తిరువనంతపురం

కనకకున్ను ప్యాలెస్, తిరువనంతపురం

కేరళ యొక్క పూర్వ సంస్కృతిని ప్రతిబింబించే కనకకున్ను ప్యాలెస్ విశాలమైన మైదానంలో ట్రావెన్కోర్ మహారాజు చేత నిర్మించబడినది. ఈ ప్యాలెస్ అద్భుతమైన శిల్పాలతో, వైవిధ్యభరితమైన నమూనాలతో ఆకర్షణీయంగా ఉన్నది. కనకకున్ను రాజభవంతిని ప్రస్తుతం కేరళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు వినియోగిస్తున్నారు.

చిత్ర కృప : dilip ...

నేపియర్ మ్యూజియం, తిరువనంతపురం

నేపియర్ మ్యూజియం, తిరువనంతపురం

తిరువనంతపురం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలంటే నేపియర్ మ్యూజియం సందర్శించాలి. దీనిని సహజ హిస్టరీ మ్యూజియం అని కూడా పిలుస్తారు. మ్యూజియం నిర్మాణం ఇంగ్లీష్, మొఘల్, చైనీస్ మరియు కేరళ శైలి లో ఉంటుంది. మ్యూజియం లోపల వెలకట్టలేని ఆభరణాలు, కాంస్య విగ్రహాలు, ఆలయ రథాలు, మెటల్ బొమ్మలు, ఏనుగు దంతాలతో చేసిన చెక్కడాలు సందర్శకులకు గొప్ప అనుభూతినిస్తాయి.

చిత్ర కృప : Bibin C. Alex

అగస్త్య మల శిఖరం, తిరువనంతపురం

అగస్త్య మల శిఖరం, తిరువనంతపురం

తిరువనంతపురం లో ఏదైనా ఎత్తైన శిఖరం ఉందా ?? అంటే అది అగస్త్య మల శిఖరం అనవచ్చు. ఇది 1. 868 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. శిఖరం మీద ఉన్న అగస్త్యుడి విగ్రహం వల్ల ఈ ప్రదేశం హిందువులకు పవిత్ర స్థలంగా ఉన్నది.

చిత్ర కృప : PlaneMad

అగస్త్య మల శిఖరం ట్రెక్కింగ్, తిరువనంతపురం

అగస్త్య మల శిఖరం ట్రెక్కింగ్, తిరువనంతపురం

కేవలం రెండు నెలలు మాత్రమే (జనవరి - ఫిబ్రవరి) జరిగే ఆగస్త్య మల శిఖర ట్రెక్కింగ్ ను తిరువనంతపురం వచ్చే యాత్రికులు అమితంగా ఇష్టపడతారు. కేరళ ప్రభుత్వ పర్యాటక శాఖ అనుమతి తీసుకున్న తర్వాతనే ట్రెక్కింగ్ యాత్ర ను మొదలు పెట్టాలి. శిఖరం చేరుకొనే మార్గంలో ఎన్నో మూలికలు, ఔషధ మొక్కలు గమనించవచ్చు.

చిత్ర కృప : Unbound Rover

అక్కులాం సరస్సు, తిరువనంతపురం

అక్కులాం సరస్సు, తిరువనంతపురం

తిరువనంతపురం నగరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో అక్కులాం సరస్సు ఉన్నది. ఈ సరస్సు వద్ద చల్లటి గాలులు, నీటి అలలు యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ ఈత, బోటింగ్, నీటి క్రీడలు వంటివి ఆడవచ్చు. ఇది నగరంలో పర్యాటకులకు ఒక పిక్నిక్ స్పాట్ గా చెప్పుకోవచ్చు.

చిత్ర కృప : Sanal Kumar

హ్యాపీ ల్యాండ్ వాటర్ థీమ్ పార్క్, తిరువనంతపురం

హ్యాపీ ల్యాండ్ వాటర్ థీమ్ పార్క్, తిరువనంతపురం

హ్యాపీ ల్యాండ్ వాటర్ థీమ్ పార్క్ తిరువంతపురం కి కూతవేటు దూరంలో ఉన్న వెంబాయం అనే ప్రదేశంలో ఉన్నది. ఉత్సాహంగా ఉండే క్రేజీ క్రూజ్, హిల్ డ్రైవ్, ఫాక్స్, ఛాలెంజర్, కొలంబస్ ఫ్లయింగ్ వంటి పల్స్ రేసింగ్ రైడ్స్ లను ఈ థీమ్ పార్క్ కలిగి ఉంది. శని, ఆది మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో తప్ప మిగితా అన్ని రోజుల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ఈ పార్క్ తెరిచి ఉంటుంది.

చిత్ర కృప : Easa Shamih

జూలాజికల్ పార్క్, తిరువనంతపురం

జూలాజికల్ పార్క్, తిరువనంతపురం

దేశంలో ప్రప్రధమంగా ఏర్పాటుచేసిన జూలాజికల్ పార్క్ తిరువనంతపురం లో ఉన్నది. ఇక్కడ 75 రకాల పక్షులు మరియు ప్రపంచంలోని వివిధ దేశాల నుండి తీసుకొనిచ్చిన జంతువులను సంరక్షిస్తున్నారు. నీలగిరి లన్గూర్, రాయల్ బెంగాల్ పులి, ఆసియా సింహం, జిరాఫీ, జీబ్రాలు మొదలైన జంతువులు కనిపిస్తాయి. జూ లోపల ఉన్న సరస్సులో బోటింగ్ చేస్తూ దప్పిక తీర్చుకోవడానికి వచ్చే వివిధ పక్షులను గమనించవచ్చు.

చిత్ర కృప : Leo Koolhoven

కోవలం, తిరువనంతపురం

కోవలం, తిరువనంతపురం

తిరువనంతపురం నగరానికి 16 - 20 కిలోమీటర్ల దూరంలో, అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న సముద్ర తీర పట్టణం కోవలం. ఇక్కడ విస్తారంగా కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. ఈ పట్టణ అందమంతా అక్కడి తీరాలలోనే దాగుంది.

చిత్ర కృప : Amit Rawat

చోవారా, కోవలం, తిరువనంతపురం

చోవారా, కోవలం, తిరువనంతపురం

కోవలం ప్రధాన బీచ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోవారా ఒక చేపలు పట్టే గ్రామం. పర్యాటకులు కాలినడకన గానీ లేదా స్కూటర్ల మీద గానీ ఈ గ్రామాన్ని సందర్శించవచ్చు. కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా, తెల్లని ఇసుక తిన్నెల మీద కిలోమీటర్ల దూరం నడవటం అనేది ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడికి వచ్చే యాత్రికులు తప్పకుండా కొండమీద ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు.

చిత్ర కృప : Kerala Tourism

హవా తీరం, కోవలం, తిరువనంతపురం

హవా తీరం, కోవలం, తిరువనంతపురం

హవా తీరం పచ్చని కొబ్బరి చెట్ల తోపులు, నీటి తో చక్కగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు, యువకులు స్నానాలు ఆచరించడానికి మక్కువ చూపుతారు. రాత్రి పూట చంద్రుని వెన్నల కాంతులు ఈ నీటిలో గమ్మత్తైనా నీడలను కలగజేస్తాయి. ఇక్కడి విశేషం ఏమిటంటే సముద్ర తీర అందాన్ని ఆస్వాదిస్తూ ... ఆయుర్వేద మసాజ్ చేయించుకోవచ్చు.

చిత్ర కృప : Peter Fristedt

లైట్ హౌస్ తీరం, కోవలం, తిరువనంతపురం

లైట్ హౌస్ తీరం, కోవలం, తిరువనంతపురం

నగరానికి దగ్గరగా ఉన్న లైట్ హౌస్ తీరానికి యాత్రికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇది కోవలం సముద్ర తీరానికి దక్షిణపు అంచున ఉన్నది. రాత్రి పూట తీరం ఒక అందమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. జనవరి లో సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటుంది కానీ ఈ తీరం మాత్రం వెచ్చగా, చలి నుండి ఉపశమనం కలిగించే విధంగా ఉంటుంది.

చిత్ర కృప : Natesh Ramasamy

విజింజం మంచినీటి అక్వెరియమ్, కోవలం, తిరువనంతపురం

విజింజం మంచినీటి అక్వెరియమ్, కోవలం, తిరువనంతపురం

పిల్లలతో వెళ్లే కుటుంబీకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం విజింజం మంచినీటి అక్వెరియమ్. ఇది పిల్లలకు, పెద్దలకు ఒకేరకమైన ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తుంది. ఎండ్ర కాయలు, చేపలు, పెద్ద పెద్ద తాబెళ్ళు, సొరచేపల తో సహా జలచరాలన్నింటినీ చూడవచ్చు. సంవత్సరంలోని అన్ని రోజుల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆక్వెరీయం తెరిచే ఉంటుంది.

చిత్ర కృప : WCities

వలియాతురా రేవు, కోవలం, తిరువనంతపురం

వలియాతురా రేవు, కోవలం, తిరువనంతపురం

నగర శివార్ల లోని వలియాతురా రేవు, పూర్వం కేరళ లోని దక్షిణ తీరంలో గల ఒకేఒక ఓడరేవు. ప్రస్తుతం ఈ రేవులో చేపలను పడుతున్నారు.

చిత్ర కృప : Theapu

విజింజమ్ రాతి గుహ, కోవలం, తిరువనంతపురం

విజింజమ్ రాతి గుహ, కోవలం, తిరువనంతపురం

విజింజమ్ రాతి గుహ లను కోవలం గుహలు అని కూడా అంటారు. ఈ గుహలు నగరం నుండి 17 కిలోమీటర్ల దూరంలో విజింజమ్ గ్రామంలో ఉన్నాయి. ఈ గుహాలయం ఒకే రాతితో చెక్కబడింది. ఇక్కడి ప్రధాన దైవం దక్షిణామూర్తి. సోమవారం నాడు మూసే ఈ ఆలయం, మిగితా అన్ని దినాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది.

చిత్ర కృప : kerala tourism

అరువిక్కరా, కోవలం, తిరువనంతపురం

అరువిక్కరా, కోవలం, తిరువనంతపురం

అరువిక్కరా గ్రామం, నగరం నుండి 15 కిలోమీటర్ల దూరంలో కరమానా నది ఒడ్డున ఉన్నది. పర్యాటకులు తమ వారితో విలువైన సమయాన్ని గడపడానికి ఈ గ్రామానికి వస్తుంటారు. ఈ గ్రామంలోని మహిమలు గల భగవతి ఆలయాన్ని దర్శించుకోవడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు వస్తుంటారు.

చిత్ర కృప : todeepakr

హాల్సియోన్ కాజిల్, కోవలం, తిరువనంతపురం

హాల్సియోన్ కాజిల్, కోవలం, తిరువనంతపురం

ఒకప్పుడు హాల్సియోన్ కాజిల్ ట్రావెన్కోర్ సంస్థానంలో భాగంగా ఉండేది. దీనిని రాజకుటుంబీకులు అందంగా సముద్ర తీరానికి ఒక పక్కన వైభవాలకు, విలాసాలకు తార్కాణంగా కట్టించారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని విలాసవంతమైన 5 స్టార్ హోటల్ గా రూపొందించారు.

చిత్ర కృప : robin_a_p

లైట్ హౌస్, కోవలం, తిరువనంతపురం

లైట్ హౌస్, కోవలం, తిరువనంతపురం

అనేక చారిత్రక మార్పులకు నిదర్శనం కోవాలం లోని దీపస్తంభం. అరేబియా సముద్రం అందాలను ఫోటో లలో బంధించడానికి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. నిజానికి దేశం మొత్తం మీద సందర్శించే లైట్ హౌస్ లలో ఈ లైట్ హౌస్ కే ఎక్కువ ప్రాధాన్యత. ఎరుపు, తెలుపు బ్యాండ్ రంగు రాళ్లతో నిర్మించిన ఈ లైట్ హౌస్ 118 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది.

చిత్ర కృప : Sunish Sebastian

శ్రీ చిత్ర ఆర్ట్ గ్యాలరీ, తిరువనంతపురం

శ్రీ చిత్ర ఆర్ట్ గ్యాలరీ, తిరువనంతపురం

శ్రీ చిత్ర ఆర్ట్ గ్యాలరీ, నేపియర్ మ్యుజియం దగ్గరలో ఉంది. రాజా రవివర్మ, స్పేట్ లోవ, నికోలస్ రోరిచ్ వేసిన అద్భుతమైన పెయింటింగ్స్ ఇక్కడ ప్రదర్శనకై ఉంచారు. అలాగే చైనా, జపాన్, టిబెట్ పెయింటింగ్స్ కూడా చూడవచ్చు. ప్రతి రోజు వందల సంఖ్యలో వచ్చే పర్యాటకులు ఈ ఆర్ట్ గ్యాలరీ మొత్తాన్ని చూడటానికి రెండు గంటల సమయం పడుతుంది.

చిత్ర కృప : Sajetpa

సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం, తిరువనంతపురం

సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం, తిరువనంతపురం

తిరువనంతపురం లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఒక స్టడీ కమ్ వినోద కేంద్రం. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన ఈ మ్యూజియం లో యానిమేటెడ్, ఇంటరాక్టివ్ నమూనాలు మరియు అనేక సాంకేతిక సాధనాలను ప్రదర్శిస్తుంది.

చిత్ర కృప : Vijayakumarblathur

నెయ్యర్ డ్యామ్ మరియు వన్య ప్రాణుల అభయారణ్యం, తిరువనంతపురం

నెయ్యర్ డ్యామ్ మరియు వన్య ప్రాణుల అభయారణ్యం, తిరువనంతపురం

నెయ్యర్ డ్యామ్ ఒక మంచి పిక్నిక్ స్పాట్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడున్న పార్క్ లో మొసళ్ళు, పులులు, సింహాలు, జింకలు మొదలైనవి కనిపిస్తాయి. ఇక్కడికి దగ్గరలో ఉన్న వాచ్ టవర్ ని చూసి ఆనందించవచ్చు. అలాగే 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏనుగుల పునరావాస కేంద్రంలో ఏనుగుల మీద ఎక్కి సవారీ చేయవచ్చు.

చిత్ర కృప : Sovereign Nations

చాలై బజార్, తిరువనంతపురం

చాలై బజార్, తిరువనంతపురం

చాలై బజార్ ని నగరంలోని షాపింగ్ కేంద్రం అని చెప్పవచ్చు. సన్నని రహదారికి ఇరువైపులా దుకాణాల వరుస ఉంటుంది. ఈ బజార్ లో సువాసనలు వెదజల్లే అత్తర్లు, పూలు, సుగుంధ ద్రవ్యాలు దొరుకుతాయి. బంగారం, ఫర్నీచర్, పండ్లు - కూరగాయలు - ఆకుకూరలు, పిల్లలు ఆడుకొనే ఆట వస్తువులు, పిల్లలకు - పెద్దలకు దుస్తులు లభిస్తాయి.

చిత్ర కృప : vivafcstpauli

తిరువనంతపురం ఎలా చేరుకోవాలి ?

తిరువనంతపురం ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

తిరువనంతపురం నగరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడింది. క్యాబ్ లేదా సిటీ బస్సుల్లో ప్రయాణించి నగరం లోకి ప్రవేశించవచ్చు.

రైలు మార్గం

తిరువనంతపురం ప్రధాన రైల్వే జంక్షన్ గా ఉన్నది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కలకత్తా, ఢిల్లీ వంటి నగరాలకు నిత్యం రైళ్లు అందుబాటులో ఉంటాయి.

రోడ్డు మార్గం

తిరువనంతపురం నుండి సమీప నగరాలకు, పట్టణాలకు ప్రభుత్వ, ప్రవేట్ బస్సులు లభిస్తాయి.

చిత్ర కృప : Binoyjsdk

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X