Search
  • Follow NativePlanet
Share
» »రాజమండ్రి- ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని !!

రాజమండ్రి- ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని !!

రాజమండ్రిని ప్రాచుర్యం పొందిన ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని అని అంటారు. ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రము. చరిత్ర ప్రకారం,ఈ నగరం లోనే గొప్ప కవి నన్నయ తెలుగు లిపిని కనుగొన్నాడు. నన్నయ "ఆదికవి", లేదా తెలుగు భాష యొక్క మొట్టమొదటి గొప్ప కవి అని గౌరవించబడ్డాడు. నన్నయ మరియు తెలుగు లిపి యొక్క జన్మ స్థలం రాజమండ్రి. రాజమండ్రికి పూర్వ నామము రాజమహేంద్రి.

రాజమండ్రి, అర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం.రాజమండ్రి నగరం ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగవ అతి పెద్ద నగరము. ఈ పుణ్య క్షేత్రంలో పన్నెండేళ్ళకొకసారి పవిత్రగోదావరి నది పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ వేద సంస్కృతి మరియు విలువలకు కట్టుబడి ఉండుట వలన పురాతన ఆచారాలు ఇప్పటికీ పాటిస్తారు. అనేక అరుదైన కళల రూపాలు నగరంలో ఉన్నాయి. ఇది సీమాంధ్ర లో అత్యధిక జనాభా కలిగిన నగరం. రాజమండ్రి నగరం ముఖ్యంగా ఒక ఆద్యాత్మిక పర్యాటక నగరం ఇక్కడ ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఆలయములు వున్నాయి. ఈ పుణ్య క్షేత్రంలో ఉన్న ప్రధాన ఆకర్షణలను ఒక్కొక్కింటిని చూద్దాం ...!!

రాజమండ్రి హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్రీ కూపన్లు : ఇప్పుడు అన్ని గోఐబిబో కూపన్లను ఉచితంగా సాధించండి

గోదావరి హారతి

గోదావరి హారతి

రాజమండ్రి ఒక దివ్య పుణ్యక్షేత్రం. ఈ పుణ్య నగరం లో ప్రతి నెలా వచ్చే పున్నమికి పరమపుణ్య గోదావరి మాతకు హారతి ఇస్తారు అలానే సంవత్సరానికి ఒకసారి కార్తిక పున్నమి రోజున నగర జనుల మధ్య ఎంతో ఘనంగా గోదావరి మాతకు వేద పండితులు హారతి ఇస్తారు. ఈ కార్యక్రమం ఎంతో బాగుంటుంది. అలానే కోటగుమ్మం లోని మహా శివుని విగ్రహం వద్ద ప్రతి మాస శివరాత్రికి అలానే ప్రతే సంవత్సరం మహా శివ రాత్రికి మహా కుంభ హారతి నిర్వహిస్తారు.

Photo Courtesy: rajahmundry.in

కాటన్ మ్యుజియం మరియు బ్యారేజి

కాటన్ మ్యుజియం మరియు బ్యారేజి

రాజమండ్రిలో సందర్శించవలసిన ప్రదేశాలలో ముఖ్యమైనది. ఇది రాజమండ్రి నగరంలోని ధవళేశ్వరం ప్రాంతంలో కలదు. బ్రిటష్ ఇంజినీర్ సర్ ఆర్ధర్ కాట్టన్ గోదావరి నది పై ఇక్కడ ఆనకట్టను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసారు. ఆ సందర్భం లో తన కూతురుని కోల్పోయారు. ఆ అమరజీవి గుర్తుగా నగరం లో ఆయన బస చేసిన ఇంటిని మ్యుజియం గా 1998 లో మార్చారు అలాగే వారి కూతురు సమాధి గోదావరి రైల్వే స్టేషన్ సమీపం లో వుంది.

Photo Courtesy:telugu nativeplanet

రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం

రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం

రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం నగరానికి చెందిన ప్రముఖులు శ్రీ రాళ్లబండి సుబ్బారావు గారి పేరుమీద స్థాపించిన పురావస్తు ప్రదర్శన శాల. పూర్వకాలంలో రాజులు, బ్రిటిష్ వారు ఉపయోగించిన వస్తువులు మొదలైనవి ఇందులో ఉన్నాయి.

Photo Courtesy:ramareddy vogireddy

రాజమండ్రి కేంద్ర కారాగారం

రాజమండ్రి కేంద్ర కారాగారం

రాజమండ్రిలో సందర్శించవలసిన ప్రదేశాలలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఒకటి. ఇది మెదట్లో ఒక కోట. దీనిని 2-3 శతాబ్ధాల క్రితం భారత దేశానికి వర్తకం చెయ్యడానికి వచ్చిన డచ్ వారు నిర్మించారు. తరువాత ఈ కోట ఆంగ్లేయుల పరిపాలనలో కారాగారం క్రింద మార్చబడింది. ఈ జైలు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ జైలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పురాతనమైన, అన్ని రకాల సురక్షిత వ్యవస్థలు కలిగిన జైలు. డచ్ వారు మూడు నిల్వ గదులు ఏర్పాటు చేశారు, దీనిలో ఆయుధాలు తుపాకులు భద్రపరచుకొనే వారు. ఈ గదులపైన ఒక రంధ్రం ఉన్నది, అవసరం పడినప్పుడు ఆ రంధ్రం గుండా కావలసిన ఆయుధాలు తీసుకొనేవారు. ఈ కారాగారంలో ఒక పెద్ద దేవాలయం ఉండేదని అక్కడున్న ఉన్న శిలా ఫలకం చెబుతుంది. ఇంకో ఆకర్షణ ఈ జైలులో గజలక్ష్మి విగ్రహం కనిపిస్తుంది, ఇది గజపతుల రాజ చిహ్నం.

Photo Courtesy: rajahmundry.in

దత్త ముక్తి క్షేత్రం

దత్త ముక్తి క్షేత్రం

ఈ క్షేత్రం గోదావరి నదీ తీరంలో గౌతమీ ఘాట్ నందు కలదు. ఈ క్షేత్రంలో శ్రీ గణపతి ప్రతిష్ఠ, శ్రీ దత్తత్రేయ ప్రతిష్ఠ, మరకత దత్త పాదుకా ప్రతిష్ఠ మరియు కుంభాభిషేకము శ్రీ శ్రీ శ్రీ గణపతి సఛ్ఛిదానంద స్వామీజీ వారు 2008 వ సంవత్సరము జనవరి 19, 20వ తేదీలలో నిర్వహించినారు.

Photo Courtesy:ramareddy vogireddy

దామెర్ల ఆర్ట్ గ్యాలరి

దామెర్ల ఆర్ట్ గ్యాలరి

ఇక్కడ చిత్రలేఖనం లో ప్రపంచ ఖ్యాతి పొందిన నగర ప్రముఖులు శ్రీ దామోర్ల రామారావు గారి చేతి నుండి జాలువారిన చిత్రాలు భద్రపరిచారు. దీనికి ప్రవేశం ఉచితం.

Photo Courtesy: telugu nativeplanet

ఆర్యభట్ట సైన్సు మ్యూజియం

ఆర్యభట్ట సైన్సు మ్యూజియం

ఈ ఆర్యభట్ట సైన్సు మ్యూజియం రాజమండ్రి నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వుంది. నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఒకరు విద్యార్ధులలో సైన్సు పట్ల అవగాహన కొరకు వారి ఇంటినే మ్యూజియంగా ఏర్పాటుచేసారు. ఈ మ్యూజియం ఒక విజ్ఞాన గనివంటిది. దేశం నలుమూలల నుంచి సేకరించిన సైన్సుకి సంబంధించిన వస్తువులు విద్యార్ధులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Photo Courtesy: telugu nativeplanet

ఇస్కాన్ శ్రీ కృష్ణ దేవాలయం

ఇస్కాన్ శ్రీ కృష్ణ దేవాలయం

ఇస్కాన్ శ్రీ కృష్ణ దేవాలయం గోదావరీ నదీతీరములో జీవిత సభ్యుల సభ్యత్వరుసుములతో మరియు భక్తుల నుండి విరాళాలతో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇస్కాన్ వారు ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. చాలా అందంగా ఉంటుంది. నగరంలోని దర్శనీయ ప్రదేశాలలో ఇది ఒకటి.

Photo Courtesy: Iskcon

కైలాసభూమి

కైలాసభూమి

ఇది హిందువుల యొక్క స్మశానవాటిక. కాని నిజమైన కైలాసము వలె చాల అందముగా వుంటుంది ఎవరైనా సందర్శించవచ్చు.

Photo Courtesy:rajahmundry.in

అయ్యప్ప దేవాలయం

అయ్యప్ప దేవాలయం

ఇది నగరంలో నూతనం గా నిర్మించిన దేవాలయం తూర్పు శబరిమలై గా పేరుగాంచినది అద్భుతంగా వుంటుంది కేరళలో మాత్రమే నిర్వహించే కేరళ వాయిద్యం నిర్వహించే ఆంధ్ర ప్రాంతాలలో ఒకటి.

Photo Courtesy:ramareddy vogireddy

శ్యామలాంబ (సోమలమ్మ తల్లి ) దేవాలయం

శ్యామలాంబ (సోమలమ్మ తల్లి ) దేవాలయం

ఈ అమ్మవారిని రాజమండ్రి నగర దేవతగా పిలుస్తారు. అమ్మ వారి ఆలయం రాజ రాజ నరేంద్రుని కాలం నుంచి వుందనీ, వారు శ్రీ అమ్మవారిని కొలిచేవారని కొంతమంది పెద్దలు చెబుతారు. అమ్మవారు ప్రతి ఏట ఉగాది పర్వదినం సందర్భంలో " నన్ను నగరంలోకి తీసుకువెళ్ళి జాతర చెయ్యాలి " అని వారి భక్తులను ఆదేశించారు అంట ! ఆ తల్లి కోరిన విధం గానే నేడు ప్రతీ ఏట ఇక్కడ అమ్మ వారి జాతర అంగ రంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతర జరిగే తీరు హిందూ కుటుంబంలో ఆడ పిల్లకు గల ప్రాముఖ్యం, అక్క చెళ్ళెల మధ్య వుండే అనుబందం అందరికి స్పూర్తి కలిగిస్తుంది.

Photo Courtesy: rajahmundry.in

ఉమా రామ కోటిలింగేశ్వర స్వామి ఆలయం

ఉమా రామ కోటిలింగేశ్వర స్వామి ఆలయం

ఈ ఆలయం చాల విశిష్ట మైనది మరియు పురాతన మైనది. ఈ ఆలయ చరిత్ర పరకారం బ్రమ్మ దేవుడు మహా సరస్వతి సమేతుడై ఇక్కడ కోతిలిగాలకు పూజించారని ఆ కోటి లింగముల లో ని బ్రమ్మ సరస్వతుల చే పూజించా బడిన లింగాకరమే స్వమివారని అంటారు అలాగే ఈ స్వామివారిని అరణ్య వాసము సమయం లో శ్రీ సీతా రాములు పూజించారని చారిత్రక ఆదారాలు చెబుతున్నాయి. అందుకు గుర్తుగా ఇక్కడ శ్రీ అన్న పూర్ణ సమేత కోటిలింగేశ్వర స్వామి వారితో పాటు శ్రీ సీతా రాముల దేవాలయం కుడా వుంది.

Photo Courtesy: rajahmundry.in

శ్రీ వేణుగోపాలస్వామి గుడి

శ్రీ వేణుగోపాలస్వామి గుడి

శ్రీ వేణుగోపాలస్వామి రాజమహేన్ద్రి క్షేత్ర పాలకుడు. 14 వ శతాబ్దంలో రెడ్దిరాజులు దేవాలయం నిర్మించి అనపర్తి గ్రామన్ని గుడికి దానం చేసారు. నగర ముఖ్య వీధిలోని రాయల్ మసీదుకు, అప్పటి గుడియొక్క ముఖద్వారము, ద్వారము పైన పద్మము, గుడిలోని 12 దేవాలయ స్తంభాలు, సరోవరం, రాతి కట్టడంతో చదరపాకారములో దిగుడు బావి ఇంకాను అలాగే ఉన్నాయి.

Photo Courtesy:ramareddy vogireddy

శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి గుడి

శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి గుడి

మృకండ మహర్షి ఆయన భార్య మరుద్వతికి సంతానం లేకపోవడం చేత శివుడి గురించి తపస్సు చేసి 16 ఏళ్ళు ఆయుష్షు కల సంతానం పొందుతారు. ఆ పిల్లవాడి పేరు మార్కండేయుడు. నారద మహర్షి సూచన మేరపు మార్కండేయుడు గౌతమీ (గోదావరి) తీరంలో శివ లింగాన్ని ప్రతిష్ట చేసుకొని తపస్సు చేస్తాడు. ఇతిహాసం ప్రకారం ఇక్కడే శివుడు మార్కండేయుడిని యముడి బారి నుండి కాపాడి చిరంజీవత్వం ఇచ్చాడు. మార్కండేయుడే శివ లింగాన్ని అమ్మవారిని ప్రతిష్టించడం వల్ల ఇక్కడ స్వామి వారిని శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి అని పిలుస్తారు.

Photo Courtesy:ramareddy vogireddy

మినీ తిరుమల

మినీ తిరుమల

ఈ ఆలయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది ఈ ఆలయం తిరుపతి లో గల ఆలయం వలె నిర్మించారు తిరుమల లో జరిగే ప్రతీ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇది రాజమండ్రి దివాన్చెరువు ప్రాంతం లో వుంది.

Photo Courtesy: ramareddy vogireddy

వరాహ లక్ష్మినరసింహ స్వామి ఆలయం

వరాహ లక్ష్మినరసింహ స్వామి ఆలయం

ఈ ఆలయం రాజముండ్రి సింహచల్ నగర్ లో కలదు ఇది విశాక నగరం సింహాచలం లోని ఆలయానికి నమూనా వంటిది అక్కడి ఆలయం ఎలా వుంటుందే అలాగే ఇక్కడ నిర్మించారు అక్కడి వలె ఇక్కడ కూడా ప్రతి ఏట స్వామి వారి నిజరూప దర్సనం వుంటుంది.

Photo Courtesy:rajahmundry.in

సత్యనారాయణ స్వామి ఆలయం

సత్యనారాయణ స్వామి ఆలయం

ఈ ఆలయం రాజముండ్రి ఆర్యాపురం లో కలదు ఇక్కడ అన్నవరం దేవస్థానం వలె అనేక పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ మధ్య ఈ ఆలయం చాల ప్రాచుర్యం పొందింది. ప్రతి ఏట బక్తులు పెరుగుతున్నారు ఆదాయం కుడా రికార్డు స్థాయి లో నమోదు అవుతుంది .

Photo Courtesy:rajahmundry.in

నృత్య ఆలయం

నృత్య ఆలయం

దేశం లో ఇక్కడ లేని విదం గా రాజమండ్రి లో నృత్య ఆలయం వుంది . ఇది కోటిపల్లి బస్సు స్టాండ్ వద్ద కలదు భారత నృత్య రీతులను వివరించే అద్బుత శిల్ప కలలతో చాల అందం గా వుంటుంది.

Photo Courtesy:rajahmundry.in

స్వతంత్ర సమరయోదుల పార్క్

స్వతంత్ర సమరయోదుల పార్క్

ఈ ఘనత కూడా ఈ నగరానికే చెందుతుంది రాష్ట్రము లో స్వతంత్ర సమరయోదుల కోసం ప్రతేకించి ఒక పార్కు ఎక్కడ లేదు కాని రాజమండ్రి నగరం లో కలదు. ఇక్కడ స్వతంత్రం కోసం పోరాడిన వీరుల విగ్రహాలు ఉంటాయి. అలాగే ఈ పార్క్ లోని ఒక బవనంలో స్వతంత్ర చరిత్రను ఆధ్యయనం చేస్తారు.

Photo Courtesy:rajahmundry.in

గౌతమీ గ్రంధాలయం

గౌతమీ గ్రంధాలయం

ఇప్పుడు ఉన్న ఈ గౌతమీ గ్రంధాలయం వాసురయ గ్రంధ్రాలయం మరియు రత్నకవి గ్రంధలయం సముదాయం. ఇవి రెండు చిన్న చిన్న గ్రంధాలయాలు కలుపబడ్డాయి. వాసురయ గ్రంధ్రాలయం వాసుదేవ సుబ్బారాయడు చేత, రత్నకవి గ్రంధ్రాలయం కొక్కొండ వేంకటర్తం చేత స్థాపించబడ్డాయి. గౌతమీ గ్రంధాలయం పేరు 1898 ఇవ్వబడింది, 1920 సంవత్సరంలో పేరు రిజిష్టరు చేయబడింది.

Photo Courtesy: rajahmundry.in

సి.టి.ఆర్.ఐ

సి.టి.ఆర్.ఐ

భారతదేశములోనే ప్రసిద్దిగాంచిన రీసెర్చ్ సంస్థ ఇది. ఇక్కడ పొగాకు మరియు ఇతర అన్ని రకముల మొక్కలకు సంభందించిన ప్రయోగములు జరుపుతారు. పొగాకు ఉత్పత్తి సంస్థలలో ప్రపంచ ప్రసిద్ది చెందిన సంస్థలలో కూడా సి టి ఆర్ ఐ ఒకటి. దీనిని 1947లో స్థాపించారు. పొగాకు సాగు విధానము మొట్టమొదట 1605 వ సంవత్సరములో పోర్ఛుగీసు దేశమునుండి మన దేశమునకు వ్యాపించినది.

Photo Courtesy: rajahmundry.in

విమాన సౌకర్యం

విమాన సౌకర్యం

నగర శివార్లలో ఉన్న మధురపూడిలో బ్రిటీష్ వారు నిర్మించిన పాత రాజమండ్రి విమానాశ్రయము ఉన్నది. ఈ మధ్యనే భారత విమానయాన సంస్థ నూతన టెర్మినల్ మరియు బవనాలను నిర్మించి జాతీయ విమానశ్రయమునకు దీటుగా నిర్మించారు ఇక్కడ నుండి ప్రతీ రోజు పగటి పూట కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వెస్ మరియు స్పైస్ జెట్ వారు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాలను నడుపుతున్నారు.

Photo Courtesy: rajahmundry.in

రైలు సౌకర్యం

రైలు సౌకర్యం

రాజమండ్రి చెన్నై-కలకత్తా ప్రధాన రైలు మార్గములో వచ్చే ప్రధాన రైలుస్టేషను. గోదావరి మీద ఉన్న రైలు వంతెన వల్ల రాజమండ్రి భారత దేశం నలుమూలలకు కలుపబడుతోంది. రాజమండ్రికి రెండు రైలు స్టేషన్లు ఉన్నాయి. మెదటిది గోదావరి రైలు స్టేషన్ , రెండవది రాజమండ్రి రైలు స్టేషన్.

గోదావరి రైలుస్టేషన్

గోదావరి రైలు స్టేషన్ రాజమండ్రికి మొట్టమెదటి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ మీదుగా కొవ్వూరు నుండి ఉత్తరం వైపు రాజమండ్రి వచ్చే ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ బండ్లు వెళ్తాయి కాని ప్యాసింజర్ బండ్లు మాత్రమే నిలుస్తాయి. రాజమండ్రి నుండి దక్షిణం వైపు కొవ్వూరు, విజయవాడ వెళ్ళే ప్యాసైంజర్ బండ్లు మాత్రమే వెళ్తాయి మరియు ఆగుతాయి.

రాజమండ్రి రైలు స్టేషన్

రెండవ రైల్వే లైను సౌకర్యార్థం రోడ్డు రైలు వంతెన నిర్మాణం జరిగాక రాజమండ్రి రైల్వేస్టేషన్ జరిగింది. కోస్తా జిల్లాలలో విజయవాడ-విశాఖపట్టణం నగరాల మధ్యనున్న ముఖ్య రైలు స్టేషన్. ఈ స్టేషన్ లో అన్ని రైలు బండ్లు ఆగుతాయి.

Photo Courtesy: rajahmundry.in

ఆర్.టి.సి.

ఆర్.టి.సి.

ఆర్.టి.సి. బస్టాండు రాజమండ్రి నుండి రాష్ట్రం నలుమూలకు నడిపే బస్సుల తోటి, ప్రైవేటు బస్సుల తోటి కలుపబడుతోంది. రాజమండ్రి బస్సు కాంప్లెక్స్ నుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలకు, పట్టణాలకు తరచు బస్సులు నడుస్తుంటాయి. ఉత్తర కోస్తా పట్టణాలైన కాకినాడ, తుని, అన్నవరం, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు,గుంటూరుకి బస్సులు సర్వీసులు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్.టి.సి. బస్సు నిలయంతో కలిపి, గోకవరం, కోటిపల్లి హైటెక్ బస్సుస్టాండ్ ,అనే మెత్తం నాలుగు బస్టాండ్లు కలవు.

Photo Courtesy: rajahmundry.in

ప్రైవేటు సర్వీసు

ప్రైవేటు సర్వీసు

రాజమండ్రి చెన్నై-కలకత్తాని కలిపే జాతీయా రహదారి -16 మీద ఉన్నది. రాజమండ్రి నగరంలో రోడ్డు రవాణా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ద్వారా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా సర్వీసు ఆటోల సదుపాయం కూడా ఉన్నది. నగరంలో రవాణాకు ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు బస్సులు నడుపుతున్నాయి.

Photo Courtesy: rajahmundry.in

జలరవాణా

జలరవాణా

రైలు వంతెన మరియు రోడ్డు వంతెన వచ్చాక జల రవాణా మీద ప్రజలు ఆధారపడడం లేదు. కాని జలరవాణా పర్యాటక రంగం ఊపందనుకోవడం వల్ల మళ్ళీ జీవము వస్తున్నది. ఇక్కడ నుండి పాపి కొండలకు, భద్రాచలం మరియు పట్టిసీమకు లాంచీ సదుపాయం ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ వారు కూడా లాంచీలు నడుపుతున్నారు.

Photo Courtesy: rajahmundry.in

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X