Search
  • Follow NativePlanet
Share
» »తంజావూరులో ప్రపంచ ప్రసిద్దిగాంచిన బృహదీశ్వర ఆలయంతో పాటు చూడాల్సిన మరికొన్ని అద్భుత ప్రదేశాలు

తంజావూరులో ప్రపంచ ప్రసిద్దిగాంచిన బృహదీశ్వర ఆలయంతో పాటు చూడాల్సిన మరికొన్ని అద్భుత ప్రదేశాలు

తంజావూరులో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో పదకొండవ పెద్ద రాష్ట్రం. అయితే పర్యాటకులను ఆకర్షిచే విషయంలో మాత్రం ముందు ఉంటుంది.

చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీపై తంజావూరు ఉంది. చరిత్ర కారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది.

తంజావూరు అనే పేరు ఎలా వచ్చింది అనడానికి 3 కథలు ప్రచారంలో వున్నాయి, 'తంజన్ ' అంటే అసురులు. వీరిని సంహరించడానికి విష్ణుమూర్తి ' నీల మేఘ పెరుమాళ్ గా వచ్చి సంహరించిన ప్రదేశం కావడం వల్ల తంజనూర్ గా పిలువబడుతూ తర్వాత తర్వాత తంజావూరుగా మారిందట.

మరో కథనం ప్రకారం తంజావూరును పరిపాలించిన రాజు ధనంజయుని పేరు మీద ఈ ఊరుని ధనుంజయనూరుగా పిలువబడుతూ కాలాంతరాలలో అది తంజావూరుగా మారిందని చెబుతుంటారు.

తమిళంలో తన్ అంటే చల్లని, చై అంటే పంట భూములు అని ఈ రెండు పదాల ద్వారా తంచైనూర్ తంజావూరుగా మారిందని కొందరు చెప్తారు. 6,7వ శతాబ్దాలలో మథరయు రాజు పాలనలో ఉండి 9వ శతాబ్దంలో చోళుల పాలనలోకి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ తంజావూరుకి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది.

తంజావూరు జిల్లా అంటే, అందరికీ గుర్తుకొచ్చేది పల్లవ రాజులు, మదురై, తంజావూరు నాయక రాజు లు, పాండియ, విజయనగర రాజుల వైభవాన్ని చాటే కళా ఖండాలు, నిర్మాణాలే. తంజావూరు పెయిటింగ్స్, బొమ్మలు ప్రపంచ ప్రఖ్యా తి గాంచి ఉన్నాయి. యునెస్కో గుర్తింపును సైతం పొందిన తంజావూరు డెల్టా జిల్లాలో ప్రధాన కేంద్రంగా నిలుస్తూ వస్తున్నది. తంజావురుకు నిత్యం వస్తున్న పర్యాటకులను, అక్కడి జనాభాను పరిగణనలోకి తీసుకుని అందుకు తగ్గ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి తంజావూరులో ప్రపంచ ప్రసిద్దిగాంచిన బృహదీశ్వర ఆలయంతో పాటు మరికొన్ని మరి కొన్ని పర్యాటక స్థలాల గురించి తెలుసుకుందాం..

బృహదీశ్వర ఆలయం

బృహదీశ్వర ఆలయం

తంజావూరు నగరం నడి బొడ్డున వున్న బృహధీశ్వరాలయం ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. బృహదీశ్వర ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరులో ఉంది. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది. దేశ విదేశీ పర్యటకులలో యీ మందిరం గురించి కుతూహలం వుంది, దీన్ని ఒక అద్భుతంగా చెప్తారు. సూర్యుడు యెటు వైపున వున్నా కూడా యీ మందిరం నీడ నేలపై పడదని, మందిర నిర్మాణంలో చూపించిన నైపుణ్యం ప్రస్తుత శిల్పులు కనుగొన లేక పోయేరని అంటారు.

pc: youtube

బృహదీశ్వర ఆలయం

బృహదీశ్వర ఆలయం

బృహత్ అంటే విశాలమైన లేక పెద్ద అని అర్ధం. 1003, 1010 సంత్సరాల మధ్య రాజ రాజ చోళునిచే నిర్మింప బడింది. బయట నుంచే యెత్తైన ప్రహారీ గోడల మధ్య విశాలమైన మందిరం పర్యాటకులను యిట్టే ఆకట్టుకుంటుంది. ప్రహారీ గోడకు చుట్టూరా పెద్ద కందకం (రాజ కోటలను శతృ రాజుల నుంచి కాపాడ్డం కోసం లోతైన కాలువలు తవ్వి వాటిని నీటితో నింపి వుంచేవారు) కందకం పైన వేసిన రోడ్డు మీదుగా లోపలకి వెళితే 30 మీటర్ల యెత్తు అయిదంతస్థుల ‘ కేరలాంతరన్ తిరు వాసల్ ‘ద్వారం' యిరు వైపులా పెద్ద పెద్ద రాతి ద్వార పాలకులు స్వాగతం పలుకుతూ వుంటారు. సుమారు మరో 300 అడుగుల దూరంలో మరో ద్వారం మొదటి ద్వారం కన్నా యెక్కువ శిల్పాలతో వుంటుంది దీనిని ‘రాజరాజ తిరువాసల్‘ అంటారు. ఈ ద్వారానికి కూడా యిరు వైపులా ద్వార పాలకుల శిల్పాలు స్వాగతం పలుకుతూ వుంటాయి.

pc: youtube

బృహదీశ్వర ఆలయం

బృహదీశ్వర ఆలయం

మందిరంలో అడుగు పెట్టగానే యెటు వైపు వెళ్లాలో తెలీని అయోమయం, యెత్తుగా వున్న విమాన గోపురం వైపు వెళ్లాలా? నంది మండపం వైపు వెళ్లాలా? లేక పోతే దాటుకు వచ్చిన ద్వారాలపై తీర్చిన శిల్పాలను చూడాలా? ఎటు చూసినా కళ్లు తిప్పుకోనివ్వని శిల్ప సంపద. ఉలి, సుత్తి తప్ప వేరే పరికరాలు లేని కాలంలో యింత పెద్ద మందిరం, కొన్ని వందల శిల్పాలు అతి కొద్ది కాలంలో నిర్మించారంటే నమ్మ శక్యం కాదు.

pc: youtube

తంజావూరు ప్యాలెస్:

తంజావూరు ప్యాలెస్:

తంజావూరు ప్యాలెస్ ను మరాఠా రాజభవనం అని పిలుస్తారు. కానీ నిజానికి దీని నిర్మాణం తంజావూరును పరిపాలించిన నాయక రాజుల కాలంలో నిర్మించారు. నాయక రాజులు సామ్రాజ్యం కోల్పోవడంతో ఈ భవనం మరాఠా భోస్లే పరిపాలనలోకి వచ్చింది. ఆంగ్లేయుల పాలనలోనూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భోస్లేల ఆధిపథ్యం ఇక్కడ కొనసాగడంతో ఇప్పటికీ ఈ భవనాన్ని మరాఠా రాజ భవనంగానే వ్యవహరిస్తున్నారు. ఈ ప్యాలెస్ లో సదర్ మహాల్ పేలస్, అంత:పురం చూడదగ్గవి.

pc: youtube

విజయనగర కోట :

విజయనగర కోట :

విజయనగర కోట పెద్ద ఆలయం లేదా బ్రహదీస్వర ఈశాన్య ప్రాంతంలో రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నది. నాయక్ లు మరియు మరాఠా రాజుల 16 వ శతాబ్దం AD మధ్య భాగంలో నిర్మించింది మొదలుకుని పూర్తి అయ్యేవరకు ప్రత్యేక కార్యాచరణ బాధ్యత తీసుకున్నారు. కోట లోపల తంజావూర్ ప్యాలెస్, సంగీత మహల్, తంజావూర్ ఆర్ట్ గ్యాలరీ, శివ గంగా గార్డెన్ మరియు సరస్వతి మహల్ గ్రంధాలయం ఉన్నాయి. ఫోర్ట్ భవంతి వెనుక శత్రువులు చొరబాటు వ్యతిరేకంగా ప్యాలెస్ కు రక్షణ ఉండేది. ఈ కోట చాలా శిధిలావస్థలో ఉంది, మరియు దీనిని ఒక పర్యాటక ఆకర్షణగా సాధారణ ప్రజలు సందర్శించవచ్చు. కళ, వాస్తుశిల్పం మరియు చరిత్రలో ఆసక్తి గల పర్యాటకులు ఈ కోట ను చూడటం మాత్రం మిస్ కావద్దు. కోట లోపల ఉన్న ఇతర ఆకర్షణలను సందర్శించండి.

pc: youtube

మనోరా ఫోర్ట్:

మనోరా ఫోర్ట్:

తంజావూరు కు 65 కిలోమీటర్ల దూరంలో మనోరా ఫోర్ట్ ఉన్నది. దీనిని 1814-1815 సంవత్సరాల సమయంలో సెర్ఫోజి -II మరాఠా రాజు నిర్మించారు. ఫోర్ట్ భవంతి వెనుక శత్రువులు చొరబాటు వ్యతిరేకంగా ప్యాలెస్ కు రక్షణ ఉండేది. దీని ఎత్తు 23 మీటర్లు మరియు ఆరు కోణాల గల టవర్. 'మనోరా' అనే పదం 'మీనార్' నుండి తీసుకోబడింది. ఈ ఫోర్ట్ శ్రీలంక మరియు వాణిజ్య భాగంగా పర్యవేక్షించేందుకు ఉపయోగించే తరహాలో అభివృద్ధి చెశారు. ఈ ఫోర్ట్ లోపల కింగ్ మజే నిధిని దాచి ఉండవచ్చు అనే పుకార్లు ఉండుట వల్ల ఆ ప్రాంత వాసులు శోధించడం వల్ల కోటకు చాలా నష్టం జరిగింది.

pc: youtube

సరస్వతి మహల్ గ్రంధాలయం:

సరస్వతి మహల్ గ్రంధాలయం:

తంజావూరు యొక్క సరస్వతి మహల్ లైబ్రరీ ఆసియాలోనే పురాతనమైన వాటిలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ తాళపత్ర మరియు తమిళ, మరాఠీ, తెలుగు, మరియు ఆంగ్ల భాషల సమూహంతో వ్రాయబడిన కాగితం పుస్తకాలపై అచ్చు ప్రతుల అసాధారణమైన సేకరణ ఉంది. సరస్వతి మహల్ లైబ్రరీ 1535-1675 AD నుండి పాలించిన నాయక్ కింగ్స్ రాయల్ లైబ్రరీ ని ప్రారంభిచారు . మరాఠా కింగ్స్ కొద్దికాలంలోనే తంజావూరు యొక్క నియంత్రణను పొంది మరియు సెర్ఫోజి-II (1798-1832) పాలన కింద లైబ్రరీ విలసిల్లింది.

pc: youtube

సంగీత మహాల్ :

సంగీత మహాల్ :

తంజావూరును సందర్శించే పర్యాటకులు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం సంగీత్ మహాల్. సంగీత్ మహాల్ మొదటి అంతస్తులో తంజావూరు ప్యాలెస్ ఉంది. ఈ సంగీత్ మహాల్ ను నాయక రాజు పాలనలో 17వ శతాబ్దంలో నిర్మించారు. ఈ సంగీత్ మహాల్లో వివిధ సంగీతకారులు, నృత్యకారులు ప్రదర్శనల కోసం ఈ ప్రదేశం ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ సంగీత్ మహాల్ ఆ కాలానికి చెందిన భవన నిర్మాతల మరియు వాస్తు శిల్పులు ప్రదర్శితమవుతున్న అద్భుతమైన నైపుణ్యంనకు శాశ్వత గుర్తుగా నిలిచింది. ఇక్కడికి సందర్శన కొరుకు వచ్చే పర్యాటకులకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ సంగీత్ మహాల్లో చేతివృత్తులవారు, హస్తకళాకృతుల ప్రదర్శనల కోసం ఉపయోగిస్తున్నారు.

pc: youtube

ఆర్ట్ గ్యాలరీ :

ఆర్ట్ గ్యాలరీ :

తంజావూరిని పాలించిన రాజులకు సంబందించిన అన్ని విషయాలు ఇక్కడ చూడవచ్చు.నాట్యశాల,దర్బారు,కోట లోపల మ్యూజియం మొదలైనవి ఇట్టే ఆకట్టుకుంటాయి.మ్యూజియంలో ఒక భారి తిమింగలం అస్థిపంజరం కోసం ఒక ఫ్లోర్ కేటాయించారు.శిమ్హాసనాలు,కత్తులు మొదలైనవి చూడవచ్చు. తంజావూరు ఆర్ట్ గ్యాలరీ విస్తృతంగా కళాఖండాలు, చారిత్రిక వస్తువులను మరియు 9 నుండి 12 వ శతాబ్దాల మధ్య కాలంలో ఉనికిలో ఉన్న ప్రముఖ కళాత్మక కాంస్య చిత్రాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తంజావూరు జిల్లాలో అనేక ఆలయాల నుండి తీసుకురాబడిన చారిత్రిక వస్తువులు కూడా ఉన్నాయి. ఈ గ్యాలరీ ఇందిరా మందిర్, పూజా మహల్ మరియు రామ చౌదం హాల్ అనే మూడు విభాగాలుగా విభజించబడింది. రామ చౌదం హాల్ లో కాంస్య విగ్రహాలకు మరియు చిత్రాల సేకరణకు, పూజా మహల్ లో రాతి శిల్పాలకు, ఇందిరా మందిర్ లో ఇళ్ళు ,అయుదశాల మరియు దేవుని యొక్క వివిధ రూపాలు ఉంటాయి.

pc: youtube

తంజావురు పైయింటింగ్స్:

తంజావురు పైయింటింగ్స్:

తంజావురు పైయింటింగ్స్ చాలా ఫేమస్.బంగారు పూత పూయబడిన ఈ పైయింటింగ్స్ ఖరీదు కూడా ఎక్కువే.తంజావూరు సంగీతానికి ప్రసిద్ధి .ప్రతి యేటా ఇక్కడ జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకి అనేక మంది వస్తారు.

pc: youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

తంజావురు వెల్లటానికి చెన్నై నుంచి బస్,రైలు సదుపాయలున్నాయి.తమిళనాడులోని అన్ని పట్టనాలనుంచి తంజావురు బస్సులు వుంటాయి.తిరుచ్చి అతి దగ్గరలో వున్న విమానాశ్రయం.అక్కడినుంచి బస్లో వెళ్ళోచ్చు.తంజావురు మెయిన్ బస్ స్టాండ్ ఊరి ఎంట్రన్స్లో వుంటుంది.అక్కడినుంచి లోకల్ బస్సులు వుంటాయి.

రోడ్డు మార్గం

తంజావూరు ప్రైవేట్ బస్సులు, తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ యొక్క బస్సులు తమిళనాడులో ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. క్రమమైన బస్సు సర్వీసులు త్రిచి మరియు మధురై నుండి తంజావూరు వరకు ఉంటాయి.

రైలు మార్గం త్రిచి జంక్షన్ సమీప రైల్వేస్టేషన్, మరియు తంజావూరు కి 58 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రిచి జంక్షన్ నుంచి నుంచి తంజావూరు కు టాక్సీ ద్వారా చేరటానికి సగటున Rs1,000 ఖర్చవుతుంది. తిరుచ్చి రైల్వే స్టేషన్ త్రివేండ్రం-చెన్నై మార్గంలో ఒక ముఖ్యమైన అంశంగా (మధురై ద్వారా) మరియు ప్రతిరోజూ తన కార్యకలాపాలను సాగిస్తుంది.

విమాన మార్గం తంజావూరు సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం 61kms దూరంలో ఉన్న త్రిచి వద్ద ఉంది. సహేతుకమైన సమీపంలో ఇతర ప్రధాన విమానాశ్రయాలు చెన్నై (322 Km) మరియు బెంగుళూర్ (433 కిమీ).

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more