Search
  • Follow NativePlanet
Share
» » ఏ ప్ర‌యాణానికైనా ప్ర‌ణాళిక అవ‌స‌రమండోయ్‌

ఏ ప్ర‌యాణానికైనా ప్ర‌ణాళిక అవ‌స‌రమండోయ్‌

ఏ ప్ర‌యాణానికైనా ప్ర‌ణాళిక అవ‌స‌రమండోయ్‌!

kerala

మానసిక ప్ర‌శాంత‌త కోసం కొన్నిరోజులు దూరంగా వెళ్లాల‌ని ఎవ‌రికి ఉండ‌దు చెప్పండి. అయితే, అలాంటి ఆలోచ‌న వ‌చ్చిందే త‌ర‌వుగా వెళ్లిపోతాం అంటే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. ఎందుకంటే, ప్ర‌యాణానికి త‌గిన ప్ర‌ణాళిక చాలా అవ‌స‌రం. కొత్త ప్రాంతాల‌కు వెళుతున్నాం అంటే, ఎంత నియంత్రణ పాటించినా ఖర్చు పెరిగిపోతుంది. అందుకే ఎక్క‌డికైనా వెళ్ల‌ద‌లచుకుంటే ముందుగానే బడ్జెట్ ప్ర‌ణాళిక కూడా చేసుకుంటే ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అంటున్నారు ప‌ర్యాట‌క అనుభ‌వం ఉన్న‌వారు. ఉదాహ‌ర‌ణ‌కు మ‌నం విదేశాల‌కో, స్వ‌దేశంలోని సుదూర ప్రాంతాల‌కో విహారానికి వెళ్లాలి అనుకున్నాం. అలాంట‌ప్పుడు విమాన ప్ర‌యాణం త‌ప్ప‌దు అనుకుంటే విమాన‌ టికెట్‌లను ఆరు నుంచి ఎనిమిది వారాలు ముందుగా బుక్‌ చేసుకోవాలి. అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకోవడం వల్ల తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ రౌండ్‌ట్రిప్‌ బుక్‌ చేస్తే మరింత తక్కువలో లభిస్తాయి. రౌండ్‌ ట్రిప్‌ బుక్‌ చేసుకున్న వారికి ఎయిర్‌లైన్స్‌ డిస్కౌంట్స్‌ను అందిస్తుంటాయి.

అంతేకాదు, అవ‌కాశం ఉన్నంత వ‌ర‌కూ వీకెండ్స్‌లో ట్రావెల్‌ ప్లాన్‌ పెట్టుకోకూడదు. ఎందుకంటే, ఈ రోజుల్లో ఎక్కువ మంది టూర్లకు వెళుతుంటారు. కాబట్టి ఆ సమయంలో విమాన ఛార్జీలు, హోటల్‌ రూమ్‌ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, మంగళవారం నుంచి గురువారం మధ్యలో టూర్‌ప్లాన్‌ చేసుకుంటే మంచిది. కుటుంబంతో క‌లిసి టూర్‌కు వెళ్లాల‌నుకునేవారు ఈ సూచ‌న త‌ప్ప‌క పాటించాలి.

tamilnadu

ప్ర‌యాణానికి ముందు ల‌గేజ్‌ను రెండు మూడు సార్లు చెక్ చేసుకోండి. ల‌గేజ్ ప్యాక్ చేసేట‌ప్ప‌డు అన‌వ‌స‌ర‌మైన థింగ్స్ మోసుకెళ్లొద్దు. ఇది వ‌ర్షాకాలం క‌నుక రైన్‌కోట్ త‌ప్ప‌నిస‌రిగా ఉంచుకోవాలి. అలాగే, వెచ్చ‌ద‌నాన్ని అందించే ద‌ల‌స‌రి దుస్తుల‌కు మీ బ్యాగ్‌లో ప్రాధాన్య‌త‌నివ్వండి.

మీ టూర్ ప్ర‌ణాళిక‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మీ కుటుంబ స‌భ్యుల‌కు లేదా మిత్రుల‌కు తెలియ‌జేస్తూ ఉండాలి. ప్ర‌యాణంలో ఏవైనా అనుకోని ఆటంకాలు ఎదురైన‌ప్ప‌డు మీరిచ్చే స‌మాచారం మీకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

విహ‌ర ప్ర‌దేశంలో విడిది చేసేందుకు హోట‌ల్స్ అయితే ఖ‌ర్చు ఎక్కువ అవుతుంది. కాబ‌ట్టి మంచి హాస్టల్స్‌ను ఎంచుకోవచ్చు. స్టూడెంట్స్‌కు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారు హాస్టల్స్‌లో ఉండవచ్చు. హాస్టల్స్‌లో ప్రైవేట్‌ రూమ్స్‌ సైతం అందుబాటులో ఉంటాయి. అలాంటి అవ‌కాశం ఉన్న ప్రాంతాల‌ను ముందుగానే ఆన్వేషించాల్సి ఉంటుంది.

chennai

ఒకవేళ మీరు ఆ ప్ర‌దేశంలో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుందనకుంటే ఇవ‌న్నీ కాకుండా అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకోవడం ఉత్తమం. ఫర్నిష్డ్‌ అపార్ట్‌మెంట్స్‌ హోటల్స్‌ కన్నా తక్కువ ధరలో లభిస్తాయి. కిచెన్‌, లాండ్రీ, టీవీరూమ్‌ వంటి సదుపాయాలన్నీ ఉంటాయి. టూర్‌ ప్లాన్‌ చేసుకునే సమయంలోనే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే బడ్జెట్‌ విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
ఒకవేళ ఎలాంటి డబ్బులు చెల్లించకుండా స్టే చేయాలంటే 'కోచ్‌సర్ఫింగ్‌'ను ఎంచుకోవాలి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రావెలర్స్‌తో కనెక్ట్‌ కావచ్చు. వారి ఇళ్లలో స్టే చేయవచ్చు. ఇలాంటి వెబ్‌సైట్‌ వినియోగదారులకు పూర్తి భద్రతను అందించడం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. రకరకాల స్టేజ్‌ల్లో వెరిఫికేషన్‌ చేశాకే ట్రావెలర్స్‌తో కనెక్ట్‌ అయ్యే అవకాశాన్నిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అధికారిక వెబ్‌సైట్‌ల‌లో తెలుసుకోవ‌డం మంచిది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X