Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడులో ఘనంగా సంక్రాంతి వేడుకలు-జల్లికట్టు జోరు..చూడాల్సిందే

తమిళనాడులో ఘనంగా సంక్రాంతి వేడుకలు-జల్లికట్టు జోరు..చూడాల్సిందే

సంక్రాంతి అనగానే తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల పండుగ, ఇంటి నిండా బందువులో, లోగిళ్ళలో రంగు రంగుల రంగ వల్లలు, గొబ్బెమ్మలు, ఇంటి ముంగిట హరిదాసులు కీర్తనలు, బుడుబుడకల గోలతో ఎంతో సందడిగా జరిగే సంక్రాంతి చాలా ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఆంధ్ర పక్క రాష్ట్రంగా ఉన్న తమిళ నాడులో కూడా ఈ పండుగను చాలా వైవిధ్యంగా జరుపుకుంటారు.

సంక్రాంతి పండగ తమిళనాట నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజును భోగి పొంగల్‌, రెండవ రోజును థాయ్‌ పొంగల్‌, మూడవ రోజును మట్టు పొంగల్‌, నాలుగవ రోజు కనుమ పొంగల్‌.. మన జరుపుకునే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఎలాగో అలాగన్నమాట!

తమిళనాడు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది జల్లికట్టు

తమిళనాడు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది జల్లికట్టు

అయితే మన తెలుగు రాష్ట్రాలలో వలే సాంప్రదాయాలను కచ్చితంగా పాటించే తమిళనాడు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది జల్లికట్టు ఆట. తమిళ నాడులో జల్లి కట్టు చాలా ఘనంగా జరుపుతారు. మదురై చుట్టు పక్కల గ్రామాల్లో ఈ సందడి కనిపిస్తుంది. దాదాపు 50-100వరకు ఎద్దులు పరుగులు పెడుతుంటే, వాటిని అదుపు చేసేందుకు యువకులు పోటీ పడుతుంటారు. ఆంధ్రలో కోడి పందేలు ఎలాగో..తమిళ నాడులో ఈ జల్లికట్టు అలా ప్రసిద్ది చెందిన సంప్రదాయం. ఈ వేడుకను చూడటానికి వేలాది మంది తరలిరావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది.

సంక్రాంతి సందర్భంగా కొత్త బియ్యంతో

సంక్రాంతి సందర్భంగా కొత్త బియ్యంతో

సంక్రాంతి సందర్భంగా కొత్త బియ్యంతో పాయసం చేసి, పిత్రాది దేవతలకు నైవేద్యం పెడతారు.

మామల్లపురం నృత్యోత్సవం.

మామల్లపురం నృత్యోత్సవం.

సంక్రాంతి సీజన్‌లో నెల రోజుల పాటు పండగ ఒకటి జరుగుతుందిక్కడ. అదే మామల్లపురం నృత్యోత్సవం. భరతనాట్యం, కూచిపూడి, కథక్‌, కథాకళి మరియు ఒడిస్సీ... ఇలా భారతీయ సంప్రదాయ నృత్యాలన్నీ ప్రదర్శించడం ఇక్కడ ఆనవాయితీ, ప్రసిద్ధి చెందిన నృత్య కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొనడం విశేషం. సంక్రాంతి నాలుగు రోజులు నృత్యోత్సవం పతాకస్థాయిలో సాగుతుంది.

మామల్లపురం పేరు కొత్తగా ఉందంటారా!

మామల్లపురం పేరు కొత్తగా ఉందంటారా!

మామల్లపురం పేరు మీరు ఇప్పటి వరకూ వినలేదు, వినేఉంటారు అయితే ఈ పట్టణాన్ని మహాబలిపురం అని కూడా పిలుస్తారు. శతాబ్దాల చరిత్ర ఉన్నమహాబలిపురం పల్లవ రాజ్యంలో రేవుపట్నంగా ఉండేది. బంగాళాఖాతం ఒడ్డున క్రీస్తుశకం 7వ శతాబ్దంలో నిర్మించిన మహాబలిపురంలో అడుగడుగునా అద్భుతాలే కనబడుతాయి. కడలి కెరటాలు తాకేంత దూరంలో ఉన్న శివాలయం ఇక్కడ ప్రధాన ఆకర్షణ

ఈ ఆలయం యునెస్కో చారిత్రక సాంప్రదాయంగా

ఈ ఆలయం యునెస్కో చారిత్రక సాంప్రదాయంగా

ఈ ఆలయం యునెస్కో చారిత్రక సాంప్రదాయంగా గుర్తింపు పొందింది. వరాహ గుహ, పాండవుల రథాలు, భారీ శిలలను తొలిచి పౌరాణిక గాథలు తెలిపే శిల్పమాలికలుగా మలచిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొండవాలుపై ఏటవాలుగా నిలిచి ఉన్న బండరాయి ఇప్పుడు సెల్ఫీజోన్‌గా మారింది. మహాబలిపురం సందర్శన ఆశ్చర్యానందాలను కలిగిస్తుంది.

సమీపంలో చూడదగ్గ ప్రదేశాలు :

సమీపంలో చూడదగ్గ ప్రదేశాలు :

నిజంగా ఒక అద్భుతమైన శిల్పకళా స్థావరం అయిన మామల్లపురం లేదా మహాబలిపురంలో చూడవల్సిన ప్రదేశాలు PC: Karthik Easvur

లైట్‌ హౌస్‌

లైట్‌ హౌస్‌

కోటికల మండపం, ద్రౌపది స్నానం చేసిన ప్రదేశం,పాండవుల రథాలు,అరేబియా సముద్రం మరియు టెంపుల్, చోళమండలం ఆర్ట్‌ విలేజ్‌, లైట్‌ హౌస్‌, ఓపెన్‌ ఎయిర్‌ మ్యూజియమ్‌, టైగర్‌ కేవ్‌, ప్రభుత్వ శిల్పకళా కళాశాలతో పాటు మరెన్నో ఉన్నాయి. మహాబలిపురం నుంచి కంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అతి పెద్ద రాయి:

అతి పెద్ద రాయి:

ఏటవాలుగా ఎటువంటి ఆధారం లేకుండా పూర్వ కాలం నుండి ఎటూ కదల కుండా, పడిపోకుండా ఉండే రాయి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది చూడటానికి కొద్ది విచిత్రంగానే ఉంటుంది.

మహాబలిపురం బీచ్:

మహాబలిపురం బీచ్:

మహాబలిపురంలో ఉండే బీచ్ లలో అందమైనది. సాయంత్రాల్లో ఆహ్లాదకరమైన వాతవరణం కలిగి పర్యాటకులను పరవశింపచేస్తుంది. అయితే ఈ బీచ్ లో అలలు చాలా భయానకంగా ఉంటాయి. ఈ బీచ్ లో సముద్రపు లోతు ఎక్కువగా ఉండటం వల్ల సముద్రస్నానాలకు చాస్త దూరంగా ఉండటమే మంచిది.

ఐదు రథాలు:

ఐదు రథాలు:

వీటినే పంచపాండవుల రథాలు లేదా పంచ థాలు అని పిలుస్తారు. వీటి నిర్మాణం ఏకశిలా శిల్పశూలికి అద్ధం పట్టే విధంగా ఉంటుంది.

PC: Girish Gopi

కృష్ణ మండపం:

కృష్ణ మండపం:

మహాబలిపురంలోని అతి పురాతనమైన కట్టడాలలో కొటి కృష్ణ మండపం. ఈ మండపంలో శ్రీకృష్ణ లీలలెన్నో చిత్రీకరించారు.

PC:Hariharanmg

టైగర్ గుహలు:

టైగర్ గుహలు:

మహాబలిపురంకు వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం మరొకటి టైగర్ కేవ్స్. ఇది ఒక పిక్నిక్ స్పాట్. హిందూ టెంపుల్ కూడా. ఒకే కొండరాయిని తొలచి నిర్మించిన ఈ గుహల ప్రవేశ ద్వారం పులుల తలలను పోలి ఉండటం వల్ల దీనికి ఆపేరు వచ్చింది.

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:

రోడ్డు మార్గం :మహాబలిపురం వెళ్లాలంటే ముందుగా చెన్నై, కంచి చేరుకోవాలి. అక్కడి నుంచి నుంచి మహాబలిపురం సుమారు 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ప్రాంతాల నుండి ప్రతి రోజూ మహాబలిపురానికి బస్సులు, ట్యాక్సీల్లో వెళ్ళవచ్చు

రైలు మార్గం : చెంగల్పట్టు మహాబలిపురానికి సమీప రైల్వే స్టేషన్ (29 కి.మీ.)

వాయు మార్గం : చెన్నై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ మహాబలిపురానికి సమీపాన కలదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X