Search
  • Follow NativePlanet
Share
» »మీ సెలవులను ఆహ్లాదంగా గడపడానికి ఆహ్వానిస్తున్న అందమైన ద్వీప రాజధాని- పోర్ట్ బ్లెయిర్

మీ సెలవులను ఆహ్లాదంగా గడపడానికి ఆహ్వానిస్తున్న అందమైన ద్వీప రాజధాని- పోర్ట్ బ్లెయిర్

By Gayatri Devupalli

అండమాన్ నికోబార్ దీవులు, బంగాళాఖాతంలో నెలకొన్న ఒక భారతీయ ద్వీప సమూహం. సుమారుగా 300 దీవులు ఉన్న ఈ ప్రదేశం, తెల్లటి ఇసుక తెన్నెలతో నిండి ఉన్న సముద్రతీరాలను ఇక్కడ చూడవచ్చు. సొరచేపలు మరియు రే చేపలు వంటి సముద్ర జీవులకు ఆలవాలమైన పగడపు దిబ్బలకు ఈ దీవులు ప్రసిద్ధి చెందాయి.

డైవింగ్ మరియు స్నార్కెలింగ్ వంటి సాహసక్రీడలను ఇష్టపడే సాహసవంతులకు, ఇది సరైన గమ్యం. అతి పురాతన మానవ జాతులు ఇక్కడి మారుమూల ద్వీపాల్లో నివసిస్తారు. వైవిధ్యతతో కూడిన విహారాయాత్రలను మీరు ఇష్టపడినట్లైతే, పోర్ట్ బ్లెయిర్ మీరు తప్పక సందర్శించాల్సిందే!

సెల్యులార్ జైల్:

సెల్యులార్ జైల్:

P.C: You Tube

కాలా పానిగా పిలువబడే సెల్యులార్ జైలు, పోర్ట్ బ్లెయిర్ లో అత్యంత ప్రసిద్ధ స్మారక కట్టడం. భారత జాతీయ చరిత్రతో ముడిపడి ఉన్నందున దీనికి విశేష జాతీయ ప్రాధాన్యత ఉంది. బ్రిటీష్ వారి నుండి స్వేచ్ఛ, స్వాతంత్ర్య సముపార్జనకై పోరాడిన పలువురు స్వాతంత్ర సమరయోధులను ఇక్కడే ఖైదు చేశారు.ఇక్కడ ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు మరియు 7.15 గంటలకు సౌండ్ అండ్ లైట్ షో జరుగుతుంది. సోమవారం, బుధవారం మరియు శుక్రవారం ఈ కార్యక్రమ వ్యాఖ్యానం హిందీలో, మిగిలిన రోజులలో ఆంగ్లంలో జరుగుతుంది.

కోర్బైన్ కోవ్ రిలాక్స్

కోర్బైన్ కోవ్ రిలాక్స్

P.C: You Tube

బంగారు రంగు ఇసుక తెన్నెలు మరియు కొబ్బరి చెట్లతో నిండి ఉన్న సముద్ర తీరం మీ శరీరానికి మరియు మనస్సుకు విశ్రాంతిని చేకూరుస్తుంది. ఇది ప్రధాన పట్టణ ప్రాంతం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశ్రాంతిని కోరుకునే విహారయాత్రలకు ఇది అత్యుత్తమ గమ్యస్థానం. గుజ్జనగుళ్లను నిర్మించడానికి, సన్ బాత్ కు లేదా ఇసుకతో కోటలు నిర్మించడానికి ఇది సరైన ప్రదేశం. మీరు సర్ఫింగ్, బోటింగ్ లేదా స్కూబా డైవింగ్ వంటి సాహసక్రీడలను ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఇక్కడకు సమీపంలోనే ఉండే స్నేక్ ఐలాండ్ లో అందమైన మరియు కాంతివంతమైన పగడాల దిబ్బలను సందర్శించవచ్చు

చిడియా టాపు:

చిడియా టాపు:

P.C: You Tube

చిడియా టాపుగా పిలువబడే, పోర్ట్ బ్లెయిర్ లోని పక్షి ద్వీపానికి చేరాలంటే, ఒక ఆహ్లాదకరమైన మధ్యాహ్నం పూట ప్రయాణం మొదలుపెట్టండి. గంటలో చేరుకునే ఈ ద్వీపంలో అందమైన రంగురంగుల పక్షులను, అందమైన సూర్యాస్తమయ దృశ్యం వీక్షించవచ్చు. ఈ ప్రయాణం అందమైన కొండలు మరియు దట్టమైన అటవీ ప్రాంతాల గుండా సాగుతుంది. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు.

జపనీస్ బంకర్లు:

జపనీస్ బంకర్లు:

P.C: You Tube

కోర్బైన్ కోవ్ మార్గంలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి పురాతన జపనీస్ బంకర్లు కనిపిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జపనీస్ సైన్యం అండమాన్, నికోబార్ ద్వీపాన్ని ఆక్రమించుకుని, స్వాధీనం చేసుకుంది. శిథిలమైన ఈ బంకర్లను బాగుచేసి, పునరుద్ధరించారు. అండమాన్ లోని మరోక ద్వీపమైన రాస్ ఐలాండ్ లో కూడా ఇటువంటి బంకర్లను సందర్శించవచ్చు.

సముద్రికా మెరైన్ మ్యూజియం:

సముద్రికా మెరైన్ మ్యూజియం:

P.C: You Tube

ఫిషరీస్ మ్యుజియంగా పిలువబడే సముద్రికా మెరైన్ మ్యూజియంలో, వివిధ రకాల రంగురంగుల చేపలు, పగడాలు మరియు ముత్యపు చిప్పలు కలిగిన అందమైన అక్వేరియం ఉంది. ఇక్కడ, అండమాన్ మరియు నికోబార్ ద్వీపం యొక్క పర్యావరణ వ్యవస్థ మరియు ఇక్కడ నివసించే గిరిజన తెగల సమాచారం విశదంగా లభిస్తుంది. పోర్ట్ బ్లెయిర్ కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవిలో, నికోబార్ సముద్రపు ఒడ్డున తిరుగాడే నీలి తిమింగలం యొక్క అస్థిపంజరం ప్రవేశ ద్వారం వద్ద చూడవచ్చు. దీనిని భారత నౌకాదళం పర్యవేక్షిస్తుంది. దీనికి సమీపంలోనే ఒక చిన్న మొసళ్ళ జూ కూడా ఉంది.

రాస్ ఐలాండ్:

రాస్ ఐలాండ్:

P.C: You Tube

పోర్ట్ బ్లెయిర్కు 2 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంది. రాస్ ఐలాండ్ లో ఘనమైన వృక్షసంపదతో అలరారుతుంది. 1941 లో ఒక భూకంపం సంభవించడానికి ముందు వరకు, రాస్ ఐలాండ్ ప్రధాన కార్య నిర్వాహక కార్యాలయంగా ఉపయోగింపబడేది.ఈ ద్వీపానికి బ్రిటీష్ మారిటైమ్ సర్వేయర్ అయిన సర్ డానియెల్ రోస్ పేరు పెట్టబడింది. ఇది బ్రిటిష్ పాలన సమయంలో వ్యాపార కార్యకలాపాలకు మూలకేంద్రంగా ఉండేది. అంతటి ప్రఖ్యాతి ఉన్నందున ఇక్కడ బ్రిటీష్ వారి హయాంలో నిర్మింపబడిన ఒక బాల్రూమ్, క్లబ్ హౌస్లు, శిధిలమైన ఒక చర్చి, స్మశానవాటిక ఇప్పటికీ చూడవచ్చు.

ఆంత్రొపొలాజికల్ మ్యూజియం:

ఆంత్రొపొలాజికల్ మ్యూజియం:

P.C: You Tube

ఈ మ్యూజియంలో కనిపించే వస్తు,సమాచారం అంతా పేలియోలిథిక్ ద్వీపవాసుల జీవన విధానానికి అద్దంపడతాయి. ఈ మ్యూజియంలో షమానిక్ శిల్పాలు, జరావాల ఛాతీ రక్షణ కవచం వంటి వస్తువువను ప్రదర్శనకు పెట్టారు. అండమాన్ నికోబార్ దీవులలో జీవించే నాలుగు ప్రధాన తెగలైన -జరావాస్, గ్రేట్ అండమానీస్, సెంటినెలీస్ మరియు ఆంజిన్ ల గురించిన సంపూర్ణ సమాచారం సమాచారం ఈ మ్యూజియంలో లభిస్తుంది.

రాస్ ఐలాండ్:

రాస్ ఐలాండ్:

P.C: You Tube

పోర్ట్ బ్లెయిర్కు 2 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంది. రాస్ ఐలాండ్ లో ఘనమైన వృక్షసంపదతో అలరారుతుంది. 1941 లో ఒక భూకంపం సంభవించడానికి ముందు వరకు, రాస్ ఐలాండ్ ప్రధాన కార్య నిర్వాహక కార్యాలయంగా ఉపయోగింపబడేది.ఈ ద్వీపానికి బ్రిటీష్ మారిటైమ్ సర్వేయర్ అయిన సర్ డానియెల్ రోస్ పేరు పెట్టబడింది. ఇది బ్రిటిష్ పాలన సమయంలో వ్యాపార కార్యకలాపాలకు మూలకేంద్రంగా ఉండేది. అంతటి ప్రఖ్యాతి ఉన్నందున ఇక్కడ బ్రిటీష్ వారి హయాంలో నిర్మింపబడిన ఒక బాల్రూమ్, క్లబ్ హౌస్లు, శిధిలమైన ఒక చర్చి, స్మశానవాటిక ఇప్పటికీ చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X