» »భారతదేశం లోనే అత్యంత భయంకరమైన కళావతి కోట మిస్టరీ

భారతదేశం లోనే అత్యంత భయంకరమైన కళావతి కోట మిస్టరీ

Written By: Venkatakarunasri

భారతదేశంలో ఎన్నో అద్భుతమైన కోటలు, కట్టడాలు అనేకం ఉన్నాయి.

వాటి వెనుక వున్న రహస్యాలు ఇప్పటికీ రహస్యంగానే వుండిపోయాయి.

ఈ కోటలో రాత్రిపూట ఇద్దరు నృత్యకారులు అంటే ఒక భార్యాభర్తల జంట,ఆత్మలనేవి ఇక్కడ తిరుగుతాయని అనేక కధలు ప్రచారంలో వున్నాయి.

అయితే దీని గురించి చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవు.

కానీ కొన్ని పురాణగాధల కధనాల ప్రకారం మాత్రం కొందరి కధనాలప్రకారం ఇక్కడ బాధతో పాడిన పాతలాంటి అస్పష్టమైన ధ్వనులు కూడా వస్తాయని అంటారు.

మరి దీని వెనుక ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మరి ఒక అద్భుతమైన కోట గూర్చి దాని వెనక వున్న మిస్టరీ గూర్చి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

కళావతి కోటలో జంట ఆత్మలుగా తిరుగుతాయి

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

మహారాష్ట్ర. 500ఏళ్ల కింద నిర్మించిన ప్రబల్ ఘడ్ కోట. ఈ కోటను ఎంతో ఎత్తులో నిర్మించారు.మరి దీనికి 7 ద్వారాలు వుంటాయి.

డేంజరస్ కోట

డేంజరస్ కోట

ప్రబల్ ఘడ్ కోటను కళావతి కోట అని కూడా అంటారు. దీనిని 2300అడుగుల ఎత్తులో నిర్మించారు.భారతదేశంలోనే అత్యంత డేంజరస్ కోటగా చెప్పుకొనవచ్చును.

కోట గురించి

కోట గురించి

ముఖ్యంగా ఈ కోట గురించి చెప్పుకోవాలంటే ఎంతో కష్టతరమైన మార్గం వుండటంతో చాలా తక్కువ మంది ఇక్కడికి వస్తూ వుంటారు.మరి ఎవ్వరు వచ్చినా సూర్యుడు అస్తమించటానికి ముందే ఇక్కడినుంచి వెళ్ళిపోతుంటారు.

సౌకర్యాలు

సౌకర్యాలు

ఎందుకంటే అత్యంత ఎత్తులో, అత్యంత దుర్లభమైన పరిస్థితులు ఇక్కడ వుంటాయి. ఇక్కడ నీరు, కరెంటు, లాంటి ఎలాంటి సదుపాయాలూ కానీ సౌకర్యాలు కానీ వుండవు.

రాత్రికాగానే

రాత్రికాగానే

రాత్రికాగానే భయంకరమైన నిశ్శబ్దంతో ఆ ప్రాంతమంతా హర్రర్ సినిమాలో సీన్లు తలపించేవిధంగా వుంటుంది.

కోట మిస్టరీ

కోట మిస్టరీ

ఈ కోటలో రాత్రిపూట ఇద్దరు నృత్యకారులు అంటే ఒక భార్యాభర్తల జంట,ఆత్మలనేవి ఇక్కడ తిరుగుతాయని అనేక కధలు ప్రచారంలో వున్నాయి.అయితే దీని గురించి చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవు.

కానీ !!!

కానీ !!!

కానీ కొన్ని పురాణగాధల కధనాల ప్రకారం మాత్రం కొందరి కధనాలప్రకారం ఇక్కడ బాధతో పాడిన పాతలాంటి అస్పష్టమైన ధ్వనులు కూడా వస్తాయని అంటారు.మరి దీని వెనుక ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రబల్ ఘడ్

ప్రబల్ ఘడ్

ఆకాలంలో ప్రబల్ ఘడ్ అనేది అప్పట్లో మహారాష్ట్రలోని ఒక రాష్ట్రానికి రాజధానిగా వుండేది. అయితే అక్కడవున్న ఒక యువజంట తాడు పైన నడుస్తూ అత్యంత ఎత్తులో నడిచే సాహసాలు చేసేవారని దాని గురించి ఆ రాజ్యపు రాజుకు కూడా తెలిసింది.

సాహసఘట్టం

సాహసఘట్టం

దీంతో ఆ రాజు కూడా ఆ సాహసఘట్టాన్ని చూడాలని అనుకుంటాడు.దీంతో వారిని రాజదర్బారుకి పిలిపిస్తారు.అప్పుడు ఆ భార్యాభర్తలు రాజమహల్ కి వస్తారు.

నర్తకుడి భార్య

నర్తకుడి భార్య

అప్పుడు ఆ నర్తకుడి భార్య ఎంతో అందంగా వుంటుంది. ఆమెను చూసి మోహితుడైన రాజు ఆమెనుపొందాలని అనుకుంటాడు. ఆ దుర్బుద్ధితో రాజు వారిరువురిని అత్యంతఎత్తులో ఒక సాహసాన్ని చేయమని కోరుతాడు.

 ప్రకటించుట

ప్రకటించుట

అయితే ఆ సాహసంలో గనక అతడు విజయం సాధిస్తే సగంరాజ్యాన్ని ఇస్తానని ప్రకటిస్తాడు. మరి అది అంతసాధారణమైనది కాదు.ప్రాణాలు కోల్పోవలసిందేనని ఖచ్చితంగా అని రాజుకు తెలుసు.

నాట్యం

నాట్యం

అందుకే అలాంటి సాహసాన్ని చేయమని కోరతాడు. ప్రస్తుతం ఆ రాజ్యంలోని కోటకు ప్రబల్ ఘడ్ కోట వరకు నాట్యం చేస్తూ చేరుకోవాలనే సాహసాన్ని చేయమని కోరతాడు.అప్పుడు ఆ భార్యాభర్తలిద్దరికీ ఏంచేయాలో అర్ధంకాదు.

ఎవ్వరూచేయని సాహసం

ఎవ్వరూచేయని సాహసం

ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నడూ అలాంటి సాహసాన్ని ఎవ్వరూచేయలేదు.ఎవ్వరూ చేయబోరుకూడా. ఒక వేళ ఒప్పుకొనకపోతే ఆ రాజుకు కోపం వస్తుంది. చేస్తే ప్రాణాలకు చెలగాటం అవుతుంది.

చివరి రాత్రి

చివరి రాత్రి

ఇక ప్రాణాలను ఒదులుకోవలసిందే.చివరికి సరేనని ఒప్పుకుంటాడు ఆ నర్తకుడు ఆ రాత్రి వారు నిద్రించనేనిద్రించరు.రాత్రంతా పాడుతూనృత్యం చేస్తూనేగడుపుతారు. ఎందుకంటే అదే వారిజీవితంలో ఇక చివరి రాత్రని వారికితెలుసు.

ముగిసిపోతున్న జీవితం

ముగిసిపోతున్న జీవితం

వారు పాడిన పాటలోని పదాలు రాత్రిగడిచిపోతే జీవితం ముగిసిపోతుందిఅని బాధాకరమైన పదాలను వాడుతూ వారు పాటను పాడారని,అయితే అదే రోజు రాత్రి రాజుయొక్క కొడుకు రాజ్యాధికారం కోసం తనతండ్రిని చంపాలని అనుకుంటాడు.

రాజ్యం

రాజ్యం

రాజు భార్య ఎక్కడ సగం రాజ్యాన్ని నర్తకికి, నర్తకుడికి ఇవ్వాల్సివస్తుందోనని బాధపడుతూవుంటుంది. మరి రాజు యొక్క కూతురు తను ప్రేమించినవ్యక్తితో రాజ్యాన్నివదిలి వెళ్ళిపోవాలని అనుకుంటుందట.

తాళ్ళ సాహసం

తాళ్ళ సాహసం

అయితే వీరందరూ పాడిన ఆ బాధాకరమైన పాటను విని మనస్సును మార్చుకుంటారు.ఇక మరుసటిరోజు వేలమంది ప్రజలు ఆ సాహసాన్ని చూడటానికి వస్తారు.ఈ కోటనుండి ప్రబల్ ఘడ్ కోటవరకు రెండుతాళ్ళను కట్టేసి సాహసాన్ని ప్రారంభిస్తారు.

యువ జంట

యువ జంట

అయితే రాజు తన పరివారంతో రాజమహల్ పై నుండి ఈ సాహసాన్ని చూడసాగారు.ఆ ఇద్దరి యువ జంటఎంతో నేర్పుతో సగదూరాన్ని చాలా చాకచక్యంగా పూర్తిచేస్తారు.అయితే తనమనస్సులో నర్తకుడు నడిచే తాడును కట్ చేసి నర్తకిని తన సొంతం చేసుకోవాలిఅనుకుంటాడు.

నర్తకి ఎలా మరణిస్తుంది?

నర్తకి ఎలా మరణిస్తుంది?

ఇక మహారాణి వారు గనక ఎక్కడ ఆ సాహసంలో విజయంసాధిస్తే సగరాజ్యాన్ని ఇవ్వాల్సివస్తుందేనని బాధపడుతూవుంటుంది.దాంతో మహరాణిఆ నర్తకి యొక్క తాడును కట్ చేయిస్తుంది.దీంతో ఆ నర్తకి పైన్నుండి బడి మరణిస్తుంది.

అస్తవ్యస్తంఅయిపోయిన రాజ్యం

అస్తవ్యస్తంఅయిపోయిన రాజ్యం

భార్య అంటే అమితమైన ప్రేమవున్న ఆ నర్తకుడు కూడా క్రిందికి దూకి తనప్రాణాలను అర్పిస్తాడు.ఈ విధంగా జరిగిన కొంత కాలానికే రాజు మరణిస్తాడు. రాజ్యం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది.

ప్రచారంలో వున్న కధనం

ప్రచారంలో వున్న కధనం

ప్రబల్ ఘడ్ రాజ్యమనేది కాలక్రమంలో అంతరించిపోతుంది. అనేకమంది ప్రబల్ ఘడ్ మీదుగా వెళ్ళే హైవే పైన ఒక మహిళమరియు ఒక పురుషుడిఆత్మ అనేది వారికి కనిపిస్తుందనే కధనం ప్రచారంలో వుంది.

మెట్లు

మెట్లు

ఈ కొండపైకి కోటలోకి చేరటానికి కొండను చెక్కిమెట్లను నిర్మించారు.మరి అవి మూమూలుకోట మెట్లలా కావు.ఎక్కవచ్చు అనుకుంటే పొరపాటే.

2300అడుగుల ఎత్తు

2300అడుగుల ఎత్తు

ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా ప్రాణాలు గాలిలో కలిసిపోవల్సిందే ఎందుకంటే ఆ మెట్లు ఎక్కటానికి ఎలాంటి సపోర్ట్ కానీ ఆధారంకానీ వుండదు.కాలుజారితే అంటే 2300అడుగుల ఎత్తు నుండి కింద బండరాళ్ళపై పడిప్రాణాలను కోల్పోవలసిందే.

జలోర్ ఫోర్ట్

జలోర్ ఫోర్ట్

జలోర్ ఫోర్ట్ గురించి తెలుసుకుందాం.దీనిని కూడా 1200అడుగుల ఎత్తులో నిర్మించారు.ఇక్కడ వున్న జైన్ టెంపుల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

పునరుద్దరణ

పునరుద్దరణ

ఇక్కడ అతి ప్రాచీన శివాలయం కూడా వుంది. కాంతీవ్ మహారాజు నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని రాజా మాన్ సింగ్ తిరిగి పునరుద్దరించారు.