Search
  • Follow NativePlanet
Share
» »రావణుడిని దేవుడిగా కొలుస్తున్న భారతీయులు

రావణుడిని దేవుడిగా కొలుస్తున్న భారతీయులు

భారత దేశంలో ఉన్న రావణుడి దేవాలయాల గురించి.

By Kishore

రావణుడు అన్న తక్షణం మనకు ఆరాధ్యదైవం శ్రీరాముడి భార్యను అపహరించిన రాక్షసరాజుగా మాత్రమే మనకు తెలుసు. అయితే ఆయన తన రాజ్యమైన శ్రీలంకను బాగా పరిపాలించాడు. అక్కడి ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. అందువల్లే ఇప్పటికీ శ్రీలంకలో చాలా చోట్ల రావణుడి గుళ్లు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగదు. అయితే శ్రీరాముడిని దేవుడిగా భావించి పూజించే భారత దేశంలో కూడా రావణుడికి ఆలయాలు ఉన్నాయి. అక్కడ రావణుడికి మిగిలిన దేవుళ్లతో సమానంగా పూజలు నిర్వహిస్తారు. ఇందుకు ప్రధాన కారణం అతను గొప్ప శివభక్తుడు. బ్రహ్మజ్జాని. అందువల్లే ఆయనను భారత దేశంలో కొన్ని చోట్ల ఆరాధిస్తారు. ఈ కథనంలో అటువంటి రావణుడి ఆలయాలను గురించి తెలుసుకొందాం. ఒక వేళ మీరెవరైనా ఆ ప్రాంతానికి వెలితే ఆ దేవాలయాలను కూడా చూసి రావడం మరిచిపోవద్దు.

ఇక్కడ పార్వతి దేవికి శివుడు భర్త కాదు...సందర్శిస్తే చదువులో మీరే ముందుఇక్కడ పార్వతి దేవికి శివుడు భర్త కాదు...సందర్శిస్తే చదువులో మీరే ముందు

1. జోథ్ పుర

1. జోథ్ పుర

Image Source:

రాజస్థాన్ లోని జోధ్పురలో ముద్గల్ బ్రహ్మణులు తామను తాము రావణుడి వంశానికి చెందినవారిగా భావిస్తారు. అందువల్లే ఆయనకు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించి పూజలు కూడా నిర్వహిస్తారు. ఈక్కడ రావణుడికి నిత్యం ధూప, దీప నైవేద్యాలను సమర్పిస్తారు. రావణుడిని పొగుడుతూ భజనలు కూడా చేస్తారు.

2. బిస్రాక్

2. బిస్రాక్

Image Source:

ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాకు దగ్గరగా ఉన్న బిస్రాక్ గ్రామస్తులు రావణుడి జన్మస్థలం ఇదేనని భావిస్తారు. అందువల్ల ఇక్కడ రావణుడికి గుడి కట్టి ఆరాధిస్తున్నారు. ఇక్కడ 42 అడుగుల ఎతైన శివలింగం, 5.5 అడుగుల ఎతైన రావణుడి విగ్రహం నిర్మాణ పనులు చివది దశలో ఉన్నాయి.

3. కాకినాడ

3. కాకినాడ

Image Source:

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని తీర ప్రాంత పట్టణం కాకినాడ. ఈ దేవాలయంలో శివుడితో పాటు రావణుడికి కూడా నిత్యం పూజలు జరుగుతాయి. దేవాలయం వెలుపల 10 తలలతో ఉన్న రావణుడి విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

4. హిమాచల్ ప్రదేశ్

4. హిమాచల్ ప్రదేశ్

Image Source:

హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా జిల్లా పాలంపురం నుంచి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో వైద్యనాథ దేవాలయం ఉంది. శివుడిని మొప్పించి ఆత్మలింగాన్ని పొందిన రావణుడు దానిని తీసుకొని లంకకు బయలుదేరుతాడు. అయితే మార్గమధ్యంలో సంధ్యావందనం చేయాలని భావించి దానిని ఒక గోవుల కాపరికి ఇస్తాడు. దానిని అతను భూమి పై పెడుతాడు. దీంతో ఆత్మలింగాన్ని రావణుడు లంకకు తీసుకెళ్లలేక పోతాడు. ఇది జరిగిన ప్రాంతం పాలంపుర అని చెబుతారు. ఇక్కడ రావణుడికి దేవాలయం ఉంది.

5. కానపుర

5. కానపుర

Image Source:

ఉత్తర ప్రదేశ్ లోని కానపురలో దశకంఠుడైన రావణుడి దేవాలయం ఉంది. నగర శివారులోని శివాలయం పక్కనే రావణుడి దేవాలయం ఉంది. అయితే ఇక్కడ ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

6. మధ్యప్రదేశ్

6. మధ్యప్రదేశ్

Image Source:

మధ్యప్రదేశ్ లోని విదిశా జిల్లాలోని రావణ గ్రామంలో రావణుడి దేవాలయం ఉంది. ఇక్కడ రావణుడి విగ్రహం పడుకొన్న స్థితిలో ఉంటుంది. ఇక్కడ రావణుడిని రావణ బాబా అనే పేరుతో కొలుస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X