Search
  • Follow NativePlanet
Share
» » కళ్ళముందు ఒక అద్భుత ప్రపంచం కి‘రాక్’గార్డెన్: జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే !

కళ్ళముందు ఒక అద్భుత ప్రపంచం కి‘రాక్’గార్డెన్: జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే !

చండీగఢ్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది అమృత్‌ సర్‌. అమృత్‌ సర్‌ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ . అమృత్‌ సర్‌ కు వెళితే వాఘా బార్డర్ కూడా చూడవచ్చు. ఇది అమృత్‌ సర్‌ కు 50కిలో దూరంలో ఉంది. చండీగఢ్ లో ఎక్కడ చూసి

చండీగఢ్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది అమృత్‌ సర్‌. అమృత్‌ సర్‌ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ . అమృత్‌ సర్‌ కు వెళితే వాఘా బార్డర్ కూడా చూడవచ్చు. ఇది అమృత్‌ సర్‌ కు 50కిలో దూరంలో ఉంది. చండీగఢ్ లో ఎక్కడ చూసి యూకరలిప్టస్ చెట్టు, మర్రి చెట్లు కనబడుతాయి. నగరం చూట్టు ఉన్న మైదానాల్లో అశోక, మల్బరీ, కాషియా చెట్లు ఉన్నాయి. చండీగఢ్ లో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.వాటిలో ముఖ్యంగా రోజ్ గార్డెన్ , రాక్ గార్డెన్, కాక్టస్ గార్డెన్, పిన్ జోర్ గార్డెన్, ఇంటర్నేషనల్ డాల్ మ్యూజియం, మ్యూజికల్ ఫౌంటెన్, మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీలు వంటివి ఎన్నో ఉన్నాయి.

రాక్ గార్డెన్ గురించి మనం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం, లేదా ఏదో ఒక పేపర్లో చదివే వుంటాము, కానీ అక్కడి వరకూ ఎవ్వరూ వెళ్ళే వారు చాలా తక్కువే. ఎందుకంటే ఇది ఉత్తర భారత దేశంలో చండీగఢ్ లో ఉంది. అయితే ఈ కథనం చదివాక మీకు అక్కడికి తప్పకుండా వెళ్ళాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అంత ఖచ్చితంగా చెబుతున్నానంటే, ఈ రాక్ గార్డెన్ మొత్తం కూడా వ్యర్థమైన పదార్థాలతోనే నిర్మితమైనది. ఇది చండీగఢ్ లో సుఖ్‌నా సరస్సుకు దగ్గరలో ఉన్న రాతి ఉద్యానవనం. ఈ గార్డెన్ ను నెక్ చంద్ ఉద్యానవనం అని కూడా పిలుస్తారు. ఈ గార్డెన్ గురించి మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేసే మరెన్నో విశేషాలను ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం..

సృజనాత్మకత

సృజనాత్మకత

ఇది సృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణకు, అద్భుత చాతుర్యానికి పెట్టింది పేరు. 1924వ సంవత్సరంలో నేక్ చంద్ అనే వ్యక్తి ఈ గార్డెన్ ను ఏర్పాటు చేశాడు. భారత దేశంలోనే ప్రత్యేక ఉద్యానవంగా తీర్చి దిద్దాడు.

PC:Chandigarh photos, Chandigarh-Main

అద్భుతమైన కళా ఖండాలు

అద్భుతమైన కళా ఖండాలు

తన జీవిత కాలం మొత్తం శ్రమించి ఇటుకలు, రాళ్ళు, గాజు ముక్కలు, గోనె సంచు, ప్లాస్టిక్ డబ్బాలు, సిరామిక్ కుండలు, సింకులు, విద్యుత్ వ్యర్థాలు ఇలా ఒకటేమిటి మన నిత్యం వాడి పడేసే ప్రతి వస్తువును ఉపయోగించి అద్భుతమైన కళా ఖండాలుగా రూపొందించాడు. ఇలా తయారుచేసిన కళా ఖండాలన్నింటిని ఒక చోటకు చేర్చి రాక్ గార్డెన్ పేరుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ రాష్ట్రపు ప్రభుత్వం.

Photo Courtesy : commons.wikimedia.org

రాక్ గార్డెన్ చూడటానికి రెండు కళ్ళు చాలవంటి నమ్మండి

రాక్ గార్డెన్ చూడటానికి రెండు కళ్ళు చాలవంటి నమ్మండి

ఈ రాక్ గార్డెన్ చూడటానికి రెండు కళ్ళు చాలవంటి నమ్మండి. అంత అద్భుతంగా తీర్చి దిద్దాడు నెక్. రాక్ గార్డెన్ లో మద్యలో అక్కడక్కడ నీటి సెలయేర్లు, కొండలు, చిన్న చిన్న ఇరుకు దారులు అంతా సహజసిద్దంగా ప్రకృతిలో ఏర్పడినట్లుగా తయారుచేశారు.

Photo Courtesy : chandigarhtourism.gov.in

 సహజసిద్ధంగా ఏర్పాటు చేసి ఈ గార్డెన్

సహజసిద్ధంగా ఏర్పాటు చేసి ఈ గార్డెన్

మధ్య మధ్యలో ఉండే గోడలు కూడా ఈ రాళ్ళ వరసలే. సహజసిద్ధంగా ఏర్పాటు చేసి ఈ గార్డెన్ లో రాళ్ళో ఇంత అందం దాగున్నదా అని ఎవరైనా ఆశ్చర్యపడకపోరు.

Photo Courtesy : chandigarhtourism.gov.in

ఒక పిక్ నిక్ స్పాట్

ఒక పిక్ నిక్ స్పాట్

ఈ రాక్ గార్డెన్ చూడటానికి కేవలం మన దేశంలోని వారు మాత్రమే కాదు, విదేశీయులు కూడా వస్తుంటారు. ముఖ్యంగా చండీగఢ్ లోని చుట్టుపక్కల వారికి ఇది ఒక పిక్ నిక్ స్పాట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలి మెంబర్స్ కు , పిల్లలకు, జంటలకు, స్నేహితులకు ఇది ఒక స్వర్గదాం అని చెప్పవచ్చు.

Photo Courtesy : chandigarhtourism.gov.in

 లుంబిని పార్క్ ను తలపించే ఒక సరస్సు

లుంబిని పార్క్ ను తలపించే ఒక సరస్సు

ఎందుకంటే రాక్ గార్డెన్ పక్కనే లుంబిని పార్క్ ను తలపించే ఒక సరస్సు ఉన్న ప్రదేశం సాయంత్రపు ఆహ్లాదానికి పెట్టింది పేరు, ఇక్కడ సాయంత్రంలో పర్యాటకులతో, సందర్శకులతో ఎక్కువ సందడిగా ఉంటుంది. రాక్ గార్డెన్ సందర్శనకు రోజుకు 5వేల మందికి పైగా వస్తుంటారు.

Photo Courtesy : chandigarhtourism.gov.in

రాక్ గార్డెన్ లో ఆశ్చర్యపరిచేట్లు

రాక్ గార్డెన్ లో ఆశ్చర్యపరిచేట్లు

రాక్ గార్డెన్ లో ఆశ్చర్యపరిచేట్లు గుర్రాలను వరుసగా నిలబెట్టినట్లుగా రాళ్ళు పేర్చిబడి ఉంటాయి. అంతే కాదు, ఇంకా నెమళ్ళు, పులులు, సింహాలు, పక్షుల, చిలకలు, కుక్కపిల్లలు ఇలా ఒకటేమిటి అడవి ప్రపంచమంతా అక్కడే కొలువుదీరినట్లు కనబడుతుంది.

Photo Courtesy : chandigarhtourism.gov.in

మనుష్యుల బొమ్మలు అచ్చు మనుష్యుల లాగే

మనుష్యుల బొమ్మలు అచ్చు మనుష్యుల లాగే

అంతేనా అనుకోకుండా అత్యద్భుతమైన మనుష్యుల బొమ్మలు అచ్చు మనుష్యుల లాగే రకరకాల వాయిద్యాలతో ఏర్పాటు చేశారు. వీటన్నింటిని చూస్తున్నంత సేపు ముఖ్యంలో ఆశ్చర్యం తప్ప, ఎక్కడా బోర్ అనిపించదు.

PC: Richard Weil

 గాజు ముక్కలు, పగిలిన కుండలు, సిరామిక్ టైల్స్ తో

గాజు ముక్కలు, పగిలిన కుండలు, సిరామిక్ టైల్స్ తో

మొదటి ఏడేళ్ళు గృహాల నుండి, పరిశ్రమల నుండి, వీధుల నుండి వ్యర్ధ పదార్ధాల సేకరణలో గడిపాడు నేక్. విరిగిపోయిన గాజు ముక్కలు, పగిలిన కుండలు, సిరామిక్ టైల్స్, కాలిపోయి, పనిచేయని బల్బులు, సీసాలు, మంగలి వద్ద నుంచి కత్తిరించిన జుట్టు, ఇవే అతని ముడి పదార్ధాలు. క్రమంగా అవన్నీ అద్భుతమైన 20,000 కళాకృతులుగా రూపుదిద్దుకున్నాయి.

Photo Courtesy : commons.wikimedia.org

జలపాతాలు, సింహాసనం, కళారూపాలతో

జలపాతాలు, సింహాసనం, కళారూపాలతో

12 ఎకరాల్లో నాట్యకారులు, సంగీత వాద్య కారులు, వివిధ జంతువులు, రాతి మేడలు, తోరణాలు, జలపాతాలు, సింహాసనం, కళారూపాలతో ‘సుఖ్రాని' అద్భుత సామ్రాజ్యం నిర్మించాడు. ఒక సన్నటి దారి గుండా వెళ్తుంటే, ముందర ఏమి వస్తుందో తెలియని ఉద్విగ్నత!

Photo Courtesy : commons.wikimedia.org

కళ్ళముందు మరో అద్భుత ప్రపంచం

కళ్ళముందు మరో అద్భుత ప్రపంచం

మరొక్క క్షణం ఆగితే, కళ్ళముందు మరో అద్భుత ప్రపంచం.ఇలా సాగుతుంది చండీగఢ్ రాక్ గార్డెన్స్ లో సందర్శకుల పయనం. ‘ఒక్క మనిషి, ఇంత అద్భుతాన్ని సృష్టించగలడా ?', అని ఆశ్చర్యపోనివారు ఉండరు. . చండీగఢ్ కు ఇదొక పెద్ద ఆకర్షణ.

PC: commons.wikimedia.org

రోజ్ గార్డెన్

రోజ్ గార్డెన్

చండీగఢ్‌లో అతి పెద్ద 'రోజ్‌ గార్డెన్‌' ఉన్నది. ఇది మన ఆసియా ఖండంలోనే అతి పెద్ద గార్డెన్‌ అంటే నమ్మండి. ఈ గార్డెన్‌ మొత్తం 27 ఎకరాల స్థలంలో వ్యాపించి ఉన్నది. ఈ గార్డెన్‌ లో దాదాపు 17,000 గులాబీ మొక్కలకు పైగానే ఉన్నాయి. అవీ అన్నీ1600 వెరైటీ గులాబీలు. ఇవి చూస్తే చాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. గులాబీ మొక్కల మధ్య అనేక నీటి ఫౌంటెన్లను కూడా ఏర్పాటు చేశారు.

Photo Courtesy : chandigarhtourism.gov.in

ఓపెన్‌ హ్యాండ్‌ మాన్యుమెంట్‌

ఓపెన్‌ హ్యాండ్‌ మాన్యుమెంట్‌

'ఓపెన్‌ హ్యాండ్‌ మాన్యుమెంట్‌' అని ఒక చెయ్యి పైకి ఎత్తినట్టుగా ఉంటుంది. అక్కడికెళ్ళి ఫొటోలు తీసుకున్నాం. దీనిని చెక్కి డిజైన్‌ చేసింది 'లీ కార్జుసియర్‌'.

Photo Courtesy : commons.wikimedia.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X