» »అస్థిపంజరాల సరస్సు ఇక్కడే...

అస్థిపంజరాల సరస్సు ఇక్కడే...

Written By: Beldaru Sajjendrakishore

ఈ విశాల ప్రపంచంలో కొన్ని విషయాలు అత్యంత ఆశ్చర్యకంగా ఉంటే మరికొన్నింటిలో అంతులేని విషాదం దాగుంది. అయితే అటువంటి విషయాల్లో కొన్ని వేల ఏళ్లుగా నిఘూడ రహస్యంగానే మిగిలి పోయాయి. వాటి పై వందల ఏళ్లుగా పరిశోధలు జరుగుతున్నా విషయం కొలిక్కి రావడం లేదు. ఇటువంటి వాటిలో కొన్ని పర్యాటక ప్రాంతాలుగా మారుతున్నాయి. అటువంటి కోవకు చెందినదే ఉత్తరఖండ్ లోని స్కెలిటన్ లేక్. ఇక్కడ దాదాపు 600 మానవ అస్థిపంజరాలు సరస్సు అడుగు భాగంలో ఉన్నాయి. ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

1. అదే కోవకు రూప్ కుండ్ సరస్సు

1. అదే కోవకు రూప్ కుండ్ సరస్సు

Image source

కొన్ని ఘటనల వల్ల కొన్ని ప్రాంతాలు అత్యంత ఆకర్షణీయంగా మారిపోతాయి. అయితే ఆ ఘటనలు ఎందుకు జరిగాయి. ఎలా జరిగాయి, ఎప్పుడు జరిగాయి తదితర ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. ఇటువంటి కోవకు చెందినదే రూప్ కుండ్ సరస్సు.

2. మనవ మనుగడ అసాధ్యం

2. మనవ మనుగడ అసాధ్యం

Image source

ఉత్తర ఖండ్ లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ సరస్సు ఉంది. ఇక్కడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులు మానవులు నివసించడానికి ఎంతమాత్రం అనుకూలంగా లేవు. ఇక్కడ చలిగాలులు ఒంట్లోని రక్తాన్ని కూడా గడ్డకట్టించేలా ఉంటాయి.

3. ఇది ఒక హిమ సరస్సు

3. ఇది ఒక హిమ సరస్సు

Image source

సముద్ర మట్టానికి 5,026 మీటర్ల ఎత్తు అంటే 16,499 అడుగుల ఎత్తులో ఈ సరస్సు ఉంది. ఈ సరస్సు ఒక గ్లేసియర్ లేక్ అంటే హిమ సరస్సు. అంటే చలికాలంలో పూర్తిగా గడ్డకట్టపోయి ఉండి వేసవిలో ఈ సరస్సులో నీరుకనిపిస్తుంది.

4. 600 అస్థిపంజరాలు ఒకే చోట

4. 600 అస్థిపంజరాలు ఒకే చోట

Image source

ఈ సరస్సుకు మరో పేరు స్కెలిటన్ లేక్. లేదా అస్తిపంజరాల సరస్సు. సుమారు 600 మానవ అస్థిపంజరాలను ఈ సరస్సులో ఉండటం వల్ల ఈ సరస్సుకు ఆ పేరు వచ్చింది. అసలు ఇన్ని అస్థి పంజరాలు ఎందుకు ఇక్కడ ఉన్నాయి అన్న విషయం పై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి.

5. 1942 లో వెలుగులోకి

5. 1942 లో వెలుగులోకి

Image source

నందాదేవి అటవీ రేంజర్ హెచ్.కే మద్వాల్ అనే వ్యక్తి మొదటి సారి 1942లో ఈ సరస్సును మొదటిసారిగా కనుగొన్నాడు. అప్పటి నుంచి భారత దేశానికి చెందిన వారే కాక చాలా మంది ఈ సరస్సు పై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ ఫలితాలు మాత్రం ఒక కొలిక్కి రాలేదు.

6. కొన్ని పొట్టిగా మరికొన్ని పొడవుగా

6. కొన్ని పొట్టిగా మరికొన్ని పొడవుగా

Image source

ఇక ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలను అనుసరించి ఈ 600 అస్థిపంజరాల్లో కొన్ని పొట్టిగా మరికొన్ని పొడవుగా ఉన్నాయి. ఇక ఈ ప్రాంతం కాలుష్య రహితమైదని కావడమే కాకుండా ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండటం వల్ల అస్థిపంజరాలు ఇంకా పాడవుకుండా ఉన్నాయి.

7. డీఎన్ఏ పరీక్షలు

7. డీఎన్ఏ పరీక్షలు

Image source

ఈ అస్థిపంజరాల పై డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా వారు వారు వివిధ ప్రాంతాలు, తెగలకు చెందిన వారిగా తేలింది. ఇక ఎముకల పై కార్బన్ డేటింగ్ చేసిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు క్రీస్తు శకం 850 ఏడాదికి కొంచెం అటూ ఇటుగా ఉండవచ్చునని తేల్చారు. ఇక వీరంతా ఏదో ఒక రోగానికి గురై చనిపోయారనిఒక పరిశోధన సారంశం.

8. ఒకే ప్రాంతం, సమూహానికి చెందిన వారు కాదు

8. ఒకే ప్రాంతం, సమూహానికి చెందిన వారు కాదు

Image source

మరో పరిశోధన ప్రకారం భారీ హిమ పాతం వల్ల వారంతా చనిపోయారని మరో పరిశోధనలో తేలింది. అయితే 2004 లో భారతీయ, యురోపియన్ శాస్త్రవేత్తలు ఇక్కడ దొరికిన ఎముకల గూళ్ల పై అనేక పరిశోధనలు చేశారు. ఇందులో పొట్టిగా ఉన్నవారు టిబెట్ కు చెందిన కూలీలని పొడుగుగా ఉన్నవారు భారత దేశానికి చెందిన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారై ఉండవచ్చునని తేల్చారు.

9. వడగళ్ల వాన వల్ల

9. వడగళ్ల వాన వల్ల

Image source

ఇక వారు ఈ ప్రాంతం గుండా ప్రయాణం చేసే సమయంలో వడగళ్ల వాన కురిసిందని, ఆ వడగళ్లు కూడా దాదాపు ఒక క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండటం వల్ల వాటి దాటికి వీరంతా చనిపోయారని తేల్చారు. ఇందుకు నిదర్శనంగా పుర్రెల పై ఉన్న పగుళ్లను చూపిస్తున్నారు.

10. జవాబు లేని ప్రశ్నలెన్నో

10. జవాబు లేని ప్రశ్నలెన్నో

Image source

ఇక్కడ వాతావరణం మానవులు నివశించడానికి అనుకూలంగా లేదు. దీంతో వారంతా ఇక్కడ ఉండేవారు కాదని తేలింది. అయితే ఇంత మంది ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు. ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారు అన్న విషయాలు మాత్రం ఇప్పటికీ జవాబులేని ప్రశ్నలే.

11. అందుకే ప్రపంచానికి తెలియలేదు

11. అందుకే ప్రపంచానికి తెలియలేదు

Image source

ఇక్కడ భారీ హిమ పాతం కురువడం, ఏడాదిలో దాదాపు సగం రోజులు ఈ సరస్సు గడ్ట కట్టి ఉండటం వల్ల ఈ అస్థి పంజరాల గురించి కాని ఈ సరస్సు గురించి కాని బయటి ప్రపంచానికి 1942 వరకూ తెలియరాలేదని శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు.

12. ట్రెక్కింగ్

12. ట్రెక్కింగ్

Image source

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యటాక ప్రాంతంగా విరాజిల్లు తోంది. చాలా మంది ఈ సరస్సును చూడటానికే ఇక్కడకు వస్తుంటారు. అదే విధంగా ఈ రూప్ కుండ్ సరస్సు ప్రాంతం భారత దేశంలోని ప్రముఖ ట్రెక్కింగ్ మార్గాల్లో ఒకటిగా పేరు గాంచింది.

13. ఎక్కడ ఉంది.

13. ఎక్కడ ఉంది.

Image source

ఉత్తరఖండ్ రాష్ర్టంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో త్రిషూల్ అనే పర్వత లోయల ప్రాంతంలో రూప్ కుండ్ సరస్సు ఉంది. డెహరాడూన్ లోని ఎయిర్ పోర్ట్ ఇక్కడకు 195 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

14.రైలు ద్వారా కూడా

14.రైలు ద్వారా కూడా

Image source

రూప్ కుండ్ కు దగ్గరగా అంటే రుషికేష్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య దూరం 170 కిలోమీటర్లు. ఈ రెండు ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం ద్వారా డెబాల్ చేరుకుంటే అక్కడి నుంచి ట్రెక్కింగ్ ద్వారా 57 కిలోమీటర్ల దూరం నడిస్తే రూప్ కుండ్ చేరవచ్చు.

15. ఇతర పర్యాటక ప్రాంతాలు...

15. ఇతర పర్యాటక ప్రాంతాలు...

Image source

పర్యవారణ ప్రేమికులకు ఉత్తరఖండ్ మంచి పర్యాటక ప్రాంతం. ఇక్కడ డెహరాడూన్, చమోలీ, అవులి, ముస్సోరి, హాల్డ్వాని, నైనిటాల్, రాణికేట్, రాజాజి నేషనల్ పార్క్, యమునోత్రి తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.