Search
  • Follow NativePlanet
Share
» »సాజన్ : మాన్సూన్ ట్రెక్కింగ్ స్థావరం !

సాజన్ : మాన్సూన్ ట్రెక్కింగ్ స్థావరం !

By Mohammad

'సాజన్' అని కూడా పిలువబడే సజన్ అనే చిన్న పట్టణం, మహారాష్ట్రలోని థానే జిల్లాలో కలదు. ఇది ముంబై నుంచి 113 కిలోమీటర్ల దూరంలో రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకొనేవిధంగా ఉంది. సాజన్ చుట్టూ సపోటా, మామిడి చెట్ల తో నిండిన దట్టమైన పచ్చటి అడవులతో కప్పబడి వుంది.

చారిత్రక నేపధ్యం

టోలెమీ తన గ్రంధాలలో సజన్ ను 'చేర్సోనేసస్' గా ప్రస్తావించాడు. ఇక్కడి కోహోజ్ కోట భోజ్ ల కాలం నాటి చరిత్రకు ప్రతీకగా నిలుస్తోంది. పోర్చుగీస్ వారు దాడి చేసినప్పుడు సజన్ ను తాన మయంబు అని పిలిచేవారట. అటు పిమ్మట ఇది ముస్లీమ్, మరాఠాల చేతికి, చివరికి బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్ళింది.

ఇది కూడా చదవండి : ముంబై నుండి అద్భుత రోడ్డు ట్రిప్ ప్రయాణాలు !

ప్రకృతి, ధార్మికత కలిసే చోటు

ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలానే వున్నాయి. నిరంతరం ప్రవహించే 60అడుగుల ఎత్తున్న పలుసా జలపాత౦ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. మీ కుటుంబంతో కలిసి సేద తీరడానికి మోహో కుర్ద్ డ్యాం మరో సహజ సిద్ధంగా ఏర్పడ్డ విహార కేంద్రం.

palusa falls

చిత్ర కృప : Prashant Kadam

చరిత్ర ప్రేమికులకు ఇక్కడి టైగర్ గుహలు, కోహోజ్ పర్వత కోట ఆసక్తి కలిగిస్తే, ప్రధానంగా పండుగ రోజుల్లో చాలా మంది యాత్రికులను ఆకర్షించే పీష్వా గుడి, మహాలక్ష్మి గుడి ఆధ్యాత్మికత కు పట్టుగొమ్మలు గా నిలిచాయి.

పలుసా జలపాతం

పలుసా జలపాతం సాజన్ పట్టణం నుండి 12 కిలోమీటర్ల దూరంలో వున్నది. ఈ జలపాతం చాలా అందంగా, ప్రత్యేకంగా ఉండి, సంవత్సరం పొడవునా నిండు ప్రవాహంతో కనిపిస్తుంది. నీరు 40 అడుగుల నుండి 50 అడుగుల ఎత్తు మీద నుండి జాలువారుతుంది. పలుసా జలపాతానికి నాలుగు వైపులా దట్టమైన అడవులు పరుచుకుని ఉన్నాయి.

waterfall stream

చిత్ర కృప : Chirag Ghai

ఈ ప్రదేశం ఏడాది పొడవునా పర్యాటకులతో కిటకిటలాడుతూ అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. నిరంతరం ప్రవహించే ఇక్కడి స్వచ్చమైన జలం క్రింద వున్న బండ రాళ్ళ మీదకు జాలువారుతున్న దృశ్యం అందం చూసి తీరాల్సిందే. ఇక్కడ పర్వతారోహణ చేయాలనుకునేవారు చేసుకోవచ్చు.

కోహోజ్ పర్వత కోట

కోహోజ్ పర్వత కోట అద్భుతమైన దృశ్యాలను చూపిస్తుంది. జలాశయం మీద ఉన్న ఈ కోట భోజ కాలం నాడు నిర్మించారు. కోట ప్రాకృతిక అందాలకీ, గత వైభవాలకి ప్రతీకగా నిలుస్తుంది. పర్వతారోహణ మీద ఆసక్తికలవారు కోహోజ్ పర్వత కోట పై వరకు ట్రెక్కింగ్ చేయవచ్చు.

kohoj hill parvat

చిత్ర కృప : Ravi S

మోహో ఖుర్ద్ డ్యాం

మోహో నది మీద నిర్మించిన ఆనకట్టలలో మోహో ఖుర్ద్ డ్యాం ఒకటి. డ్యాం చుట్టూ పచ్చదనం, తోటలు, పార్కులు ఉండటంతో పర్యాటకులకు పిక్నిక్ స్పాట్ గా మారిపోయింది. బోటింగ్, ఈత వంటి నీటి క్రీడలను ఆడవచ్చు. జలపాతం నుండి డ్యాం చేరుకోవటం సులభం.

పీష్వా గుడి

పీష్వా గుడి, సాజన్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్నది. గుడికి చేరువలో దట్టమైన అడవి ఉన్నది. అందులో వలస పక్షులు సందడి చేస్తుంటాయి. గుడి కి చేరుకోవటం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కనుక, భక్తులు తక్కువగా వస్తుంటారు.

peeshwa temple

చిత్ర కృప : Prashant Kadam

సాజన్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

సజన్ కు సమీపాన 110 కిలోమీటర్ల దూరంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ విదేశాల నుండి విమానాలు నిత్యం వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో సజన్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

సజన్ కు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ థానే. ముంబై నుండి నేరుగా థానే వరకు రైలు సర్వీసులు ప్రతి రోజూ నడుస్తుంటాయి. ముంబై స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కనెక్ట్ చేయబడింది.

khojo parvat steps

చిత్ర కృప : Dinesh Valke

రోడ్డు మార్గం / బస్సు మార్గం

ముంబై నుండి, థానే నుండి సజన్ కు ప్రతిరోజూ ప్రభుత్వ / ప్రవేట్ వాహనాలు నడుస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X