Search
  • Follow NativePlanet
Share
» »సమయపురం మరియమ్మను దర్శించారా?

సమయపురం మరియమ్మను దర్శించారా?

సమయపురం మరియమ్మ దేవాలయం హిందువులకు అత్యంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం.

సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులనైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు. అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగంను పోలిన వెండి లేదా స్టీల్‌తో తయారు చేసిన శరీరభాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు. దీంతో ఎటువంటి వ్యాదైనా ఇట్టే నయమవుతుందని భక్తులు నమ్ముతున్నారు. ఈ ఆచారం తరతరాలుగా అనవాయితీగా వస్తోంది. ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. ఈ విగ్రహాన్ని ఇసుక, బంకమట్టిని వినియోగించి రూపొందించారు. అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు. ఇంకా ఈ దేవతకు సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం...

సమయపురం మరియమ్మ, తమిళనాడు

సమయపురం మరియమ్మ, తమిళనాడు

P.C: You Tube

తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉన్న సమయపురంలో సమయపురం మరియమ్మ దేవాలయం ఉంది. ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. ఈ విగ్రహాన్ని ఇసుక, బంకమట్టిని వినియోగించి రూపొందించారు.

సమయపురం మరియమ్మ, తమిళనాడు

సమయపురం మరియమ్మ, తమిళనాడు

P.C: You Tube

అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు. అయితే ఆదేవతను పోలిన చిన్న రాతి విగ్రహం ప్రధాన దేవత ముందు ఉంటుంది. ఈ విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఈ సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులనైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు.

సమయపురం మరియమ్మ, తమిళనాడు

సమయపురం మరియమ్మ, తమిళనాడు

P.C: You Tube

అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగంను పోలిన వెండి లేదా స్టీల్‌తో తయారు చేసిన శరీరభాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు. దీంతో ఎటువంటి వ్యాధైనా ఇట్టే నయమవుతుందని భక్తులు నమ్ముతున్నారు.

సమయపురం మరియమ్మ, తమిళనాడు

సమయపురం మరియమ్మ, తమిళనాడు

P.C: You Tube

ఈ ఆచారం తరతరాలుగా అనవాయితీగా వస్తోంది. అదేవిధంగా భక్తులు మావిలక్కు అనే తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడుతారు. ఇది బెల్లం, బియ్యం పిండి, నెయ్యి తయారుచేసిన తీపి వంటకం అందిస్తారు.

సమయపురం మరియమ్మ, తమిళనాడు

సమయపురం మరియమ్మ, తమిళనాడు

P.C: You Tube

మరికొంతమంది భక్తులు దేవతకు ఉప్పును కూడా ముడుపుగా అందిస్తారు. ఈ ఆలయం ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తమిళనాడులో పళని తర్వాత అత్యంత సంపన్న ఆలయం సమయపురంలోని మరియమ్మ ఆలయమేనని చెబుతారు.

సమయపురం మరియమ్మ, తమిళనాడు

సమయపురం మరియమ్మ, తమిళనాడు

P.C: You Tube

దీన్ని బట్టి ప్రతి రోజూ ఎంతమంది ఈ ఆలయానికి వస్తుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అస్పష్టంగా ఉంది. అయితే ప్రస్తుతం లభిస్తున్న ఆధారాలను అనుసరించి ప్రస్తుత సమయపురం మరియమ్మ ఆలయాన్ని విజయరాయ చక్రవర్తి క్రీస్తుశకం 18వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు.

సమయపురం మరియమ్మ, తమిళనాడు

సమయపురం మరియమ్మ, తమిళనాడు

P.C: You Tube

అయితే అంతకు కొన్ని శతాబ్దాల ముందే అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉందని స్థానికులు దానిని పూజించేవారని తెలుస్తోంది. అదేవిధంగా అమ్మవారి విగ్రహం ఇక్కడికి రావడం వెనుక ఒక కథను కూడా వారు వినిపిస్తారు.

సమయపురం మరియమ్మ, తమిళనాడు

సమయపురం మరియమ్మ, తమిళనాడు

P.C: You Tube

వాస్తవంగా ఈ విగ్రహం శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉండేదని కథనం. అయితే ఆ ఆలయ పూజారికి తరుచుగా ఏదో ఒక వ్యాధి వచ్చేది. ఇందుకు ఈ విగ్రహమే ప్రధాన కారణమని భావించి ఆ దేవాలయం నుంచి తొలగించాల్సిందిగా సూచించారు.

సమయపురం మరియమ్మ, తమిళనాడు

సమయపురం మరియమ్మ, తమిళనాడు

P.C: You Tube

అలా తొలిగించిన విగ్రహం ప్రస్తుతం సమయపురంలో ఉంది. కాగా, అప్పట్లో ఆ పూజారి ఈ విగ్రహానికి సరిగా పూజలు చేసేవాడు కాదని అందువల్లే అతను తరుచూ అనారోగ్యానికి గురయ్యేవాడని చెబుతారు.

సమయపురం మరియమ్మ, తమిళనాడు

సమయపురం మరియమ్మ, తమిళనాడు

P.C: You Tube

అయితే ప్రస్తుతం అదే దేవత ఏ వ్యాధినైనా తగ్గించే శక్తిగల దేవతగా పూజలు అందుకొంటూ ఉండటం గమనార్హం. కాగా, విజయనగర రాజుల కాలంలో ఓ యుద్ధంలో గెలిచినందుకు విజయరాయ ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు.

సమయపురం మరియమ్మ, తమిళనాడు

సమయపురం మరియమ్మ, తమిళనాడు

ఈ సమయపురం మరియమ్మ దేవాలయంతో పాటు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు తమిళనాడు సంస్క`తి, సంప్రదాయాలకు చిహ్నాలని చరిత్రకారులు చెబుతారు. విదేశాల్లో కూడా ఈ దేవాలయానికి భక్తులు ఉన్నారు. కాగా, శ్రీలంక, ఫిజి వంటి దేశాల్లో సమయపురం మరియమ్మ పేరుతో దేవాలయాలు కూడా నిర్మిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X