Search
  • Follow NativePlanet
Share
» »తెలుగువాడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ కు తిరుత్తణి పుణ్యక్షేత్రానికి సంబంధం తెలుసా?

తెలుగువాడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ కు తిరుత్తణి పుణ్యక్షేత్రానికి సంబంధం తెలుసా?

తిరుత్తణి పుణ్యక్షేత్రనికి సంబంధించిన కథనం.

ఉపాధ్యాయ వృత్తికి సర్వేపల్లి రాధాకృష్ణన్ తెచ్చిన గుర్తింపు, గౌరవానికి సూచనగా ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటారు. ఆయన మనవ సమాజానికి చేసిన గుర్తింపునకు గుర్తుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు. ఆక్స్ ఫర్డ్ తో పాటు అనేక విశ్వవిద్యాలయాలు అయన్ను గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. ఇంతటి విశిష్టమైన వ్యక్తి తెలుగు మూలాలున్న వ్యక్తి కావడం గమనార్హం. ఇక ఆయన జన్మించింది ప్రముఖ పర్యాటక స్థలమైన తిరుత్తణి. ఆ క్షేత్రంతో పాటు సర్వేపల్లి గురించి క్తుప్తంగా మీ కోసం...

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube

సర్వేపల్లి రాధాకృష్ణన్ 5.9.1888లో మద్రాసుకు ఈశాన్యంగా ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్ కాగా వారి మాతృభాష తెలుగు. ఇక ఆయన జన్మించిన తిరుత్తణి తమిళనాడులో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
ఇక్కడ కొలువై ఉన్న ప్రధాన దైవం సుబ్రహ్మణ్యస్వామి. ఈ దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వల్లీ, దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువై ఉన్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామిని మురుగపెరుమాళ్లుగా పూజిస్తారు. శ్రీవారు ఇక్కడ కొండపై వెలసి ఉన్నారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
ఈ కొండకు ఇరు పక్కల పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వతానికి ఉత్తరాన ఉన్న పర్వతం కొంచెం తెల్లగా ఉండటం వల్ల దీనిని బియ్యపు కొండ అని దక్షిణం వైపు ఉన్న కొండ కొంచెం నల్లగా ఉండటం వల్ల దీనిని గానుగ పిండి కొండ అని పిలుస్తారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవతలుమునుల బాధలను పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేస్తాడు. అటు పై వల్లీ దేవిని చూసి ఇష్టపడి ఆమెను వివాహం చేసుకోవాలని భావిస్తాడు. అయితే ఈ క్రమంలో ఆయన బోయకుల రాజుతో చిన్న పోరు చేయాల్సి వస్తుంది.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
ఇందులో విజయం సాధించిన తర్వాత శాంతించి తిరుత్తణిలో కొలువై ఉన్నాడని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ స్వామి శాంతించి కొలువై ఉన్నాడు కాబట్టి ఈ క్షేత్రానికి తణిగై అని పేరు వచ్చింది. అంటే శాంతిపురం అని అర్థం.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
అదే విధంగా తణిగ అంటే ఓదార్చుట, మన్నించుట అని అర్థం. భక్తుల తప్పులను, పాపాలను మన్నిస్తాడు కాబట్టే ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చింది. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి రోజు వేల సంఖ్యలోసందర్శిస్తూ ఉంటారు. ఇందులో అధికంగా తమిళులే ఉంటారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుడిని పూజించడానికి తిరుత్తణి కొండ పై తన నివాసానికి ఈశాన్య భాగంలో శివలింగం ప్రతిష్టించాడు. తన కుమారుడైన కుమారస్వామి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు కుమారస్వామికి జ్జానశక్తి అనే ఈటను అందజేశారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి


P.C: You Tube
ఆ కారణం వల్లనే ఇక్కడ ఉన్న కుమారస్వామిని జ్జానశక్తి ధరుడనే పేరు వచ్చింది. ఇక్కడ కుమారస్వామి స్థిపించిన లింగానికి కుమారేశ్వరుడని పిలుస్తారు. కుమారస్వామి శివుడిని పూజించడానికి ఏర్పరిచిన తీర్థమే కుమారతీర్థం. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
ఇక్కడ ఉత్సవ మూర్తులుగా ఉన్న వల్లీ, దేవసేనా, సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమానం రుద్రాక్షలతో చేసినది. చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు, స్వామివారు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోణ పతకాలను ధరించి ఉంటారు. ఇక్కడ బంగారు బిల్వపత్రాలతో కూడా కుమార స్వామివారిని అలంకరిస్తారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
సృష్టి కర్త బ్రహ్మ ప్రణవ అర్థం చెప్పలేక పోవడం వల్ల సుబ్రహ్మణ్యుడు ఆయన్ను బంధిస్తాడు. దీంతో ఆయన సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు. అటు పై ఆ పరమశివుడి సూచనమేరకు తిరుత్తణిలో బ్రహ్మతీర్థములోని సుబ్రహ్మణ్యుడిని పూజించి తన శక్తిని తిరిగి పొందుతాడు.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
త్రేతాయుగంలో శ్రీరామ చంద్రుడు రావణ సంహారం అనంతరం ఈ తిరుత్తణి క్షేత్రాన్ని చేరుకొని కుమారస్వామిని పూజిస్తాడు. అప్పుడే శ్రీరామ చంద్రుడికి పూర్తిగా మన:శాంతి కలిగిందని చెబుతారు. శ్రీ మహావిష్ణువు కూడ ఈ క్షేత్రంలో సుబ్రహ్ముడిని పూజించి తాను పోగొట్టుకొన్న శంఖు, చక్రాలను తిరిగి పొందుతాడు.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
ముఖ్యంగా దేవేంద్రుడు ఈ క్షేత్రంలోని ఇంద్ర తీర్థం దగ్గర కరున్ కువలై అనే అరుదైన పూల మొక్కను పెంచుతాడు. ఆ మొక్క ప్రతి రోజూ ఇచ్చే మూడు పుష్పాలతో ఇక్కడి మురుగన్ ను పూజింస్తాడు. అటు పై తారకాసుర అనే రాక్షసుల ద్వారా పోగొట్టుకొన్న సంఘనీతి, పద్మనీతి, చింతామణి మొదలైన దేవలోక ఐశ్వర్యాలను తిరిగి పొందుతాడు.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
ఈ తిరుత్తణి పుణ్యక్షేత్రంలోని ఆలయం చాలా పురాతనమైనది. క్రీస్తుశకం 1600 ఏళ్లకు పూర్వమే ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్లు మనకు తెలుస్తోంది. క్రీస్తుశకం 875-893 లో అపరాజిత వర్మ అనే రాజు శాసనం, క్రీస్తుశకం 907-953లోని మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన ఉంది.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
తిరుపతి నుంచి ఆరక్కోణం వెళ్లేదారిలో మనకు తిరుత్తణి పుణ్యక్షేత్రం వస్తుంది. చెన్నై నుంచి 84 కలోమీటర్లు, తిరుపతి నుంచి 68 కిలోమీటర్లు, అరక్కోణం అదే కాణిపాకం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఈ తిరుత్తణి పుణ్యక్షేత్రం ఉంది. చెన్నై నుంచి తిరుత్తణికి అనేక లోకల్ రైళ్లు ఉన్నాయి.

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

సర్వేపల్లి రాధాకృష్ణన్, తిరుత్తణి

P.C: You Tube
తిరుత్తణిలో బస్ స్టాండ్ నుంచి కొండపైకి బస్సులు, ఆటోలు వెలుతాయి. మెట్ల మార్గం కూడా ఉంది. మొత్తం మెట్లు 365. ఏడాదిలో రోజుల సంఖ్యకు అనుగుణంగా ఈ మెట్లను ఏర్పాటు చేసినట్లు చెబుతారు. ఇక్కడ మనకి కొండ కిందనే కళ్యాణ కట్ట ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X