Search
  • Follow NativePlanet
Share
» »శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...అయితే ఇక్కడికి వెళ్ళండి...

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...అయితే ఇక్కడికి వెళ్ళండి...

సాధారణంగా శివుని ఆలయాలన్నీ లింగాకారరూపంలో మనం చూస్తుంటాంకానీ ఇక్కడ మాత్రం విగ్రహ రూపంలో అది కూడా తలక్రిందులుగా కనిపించే శివుడు.

By Venkatakarunasri

సాధారణంగా శివుని ఆలయాలన్నీ లింగాకారరూపంలో మనం చూస్తుంటాంకానీ ఇక్కడ మాత్రం విగ్రహ రూపంలో అది కూడా తలక్రిందులుగా కనిపించే శివుడు.శివుడి విగ్రహం ప్రక్కనే కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని లాలించే పార్వతీ దేవి వుండటం భక్తులను ఆకట్టుకునే విషయం. తలక్రిందులుగా తపస్సుచేసే పరమేశ్వరుడు నెలల పసికందుఅయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న పార్వతీదేవి రూపం.ఈ భంగిమలుచూడాలంటే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న స్వయంభూ శ్రీపార్వతీసమేత శ్రీశక్తీశ్వరస్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవాల్సిందే. ఇదెక్కడుందో ? అక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం పదండి ...!

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

ఈ క్షేత్రం ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది. పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం కు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం కలదు.

PC: Venkata Viswanath Maddipatla

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

యనమదుర్రు గ్రామంలో గల దేవాలయం - శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం. దీనిని తూర్పుచాళుక్యుల కాలంలో నిర్మించారు. ఈ దేవాలయం పురాతనమైనది మరియు అత్యంత విలక్షణమైన శివలింగాన్ని కలిగి ఉంటుంది.

PC: Venkata Viswanath Maddipatla

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

స్థలపురాణం

యమధర్మరాజు గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆయన జీవులను, కాలం చెల్లిన ప్రాణులను నరకానికి తీసుకెళుతుంటాడు. ఒకానొక దశలో యముడు ఈ పనిపై విరక్తి చెంది, శివుడికి మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు.

PC: Venkata Viswanath Maddipatla

ప్రత్యక్షమైన శివుడు

ప్రత్యక్షమైన శివుడు

ఒకానొక రాక్షసుడి ద్వారా యముడు పేరుమీద ఏర్పడే క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని, తద్వారా యముడు, హరుడు లయకారులన్న భయం పోయి ఆరోగ్యప్రదాతలన్న పేరు వస్తుందని వరం ఇస్తాడు. ఆ ప్రకారమే ఇక్కడ ఆలయం వెలిసిందని, గుడిలో దీర్ఘరోగాలు నయమవుతాయని స్థలపురాణంలో పేర్కొనబడింది.

Sesha Sai Kumar

విశిష్టత

విశిష్టత

యనమదుర్రు గ్రామంలో ఉన్న శక్తీశ్వరాలయం విశిష్టమైనది. శీర్షాసనంలో అపురూపమైన భంగిమలో శివుడు శివలింగంపై దర్శనమిస్తాడు. శక్తి పీఠం లో శివుడు, పార్వతీదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఒకే పానవట్టం మీద ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అమ్మవారు మూడు నెలల పసికందు అయిన బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు కొలువై ఉండడమూ విశేషమే.

PC: Venkata Viswanath Maddipatla

విశిష్టత

విశిష్టత

శివుడు తలక్రిందులుగా దర్శనం ఇవ్వటానికి ప్రధాన కారణం ... యమధర్మ రాజు తపస్సు. ఆ సమయంలో శివుడు తలక్రిందులుగా తపస్సుచేస్తూ .. పార్వతీదేవి బాల కుమారస్వామిని ఒడిలో లాలిస్తూ ఉన్నారు. యముడు ఉన్నపళంగా లోకకల్యాణం కోసం ప్రత్యక్షం కావాలని వేడుకుంటాడు.

PC: Venkata Viswanath Maddipatla

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

యముడి కోరికను మన్నించి శివుడు, పార్వతీ యదా స్థితిలో ప్రత్యక్షమయ్యారని స్థానిక కధనం. వంద సంవత్సరాల కిందట ఈ దేవాలయం ఒక తవ్వకాలలో బయటపడింది. ఇది త్రేతాయుగం నాటిదని చెబుతారు. ఈ తవ్వాకాలలో శివుని విగ్రహం, 3 నెలల బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ని లాలిస్తున్న అమ్మవారి విగ్రహం బయటపడ్డాయి.

PC: Venkata Viswanath Maddipatla

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం మండలంలో గల యనమద్దూర్ గ్రామంలోని ఈ ఆలయచరిత్ర,ఈ ఆలయ అసలు రహస్యమేంటో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుంటాం. శివుడుకి భూమండలం మీద విగ్రహరూపంలో ఉండే ఆలయాలు చాలా అరుదు.

Sesha Sai Kumar

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

అందరూ శివలింగం రూపంలోనే ఆయన్ను పూజిస్తారు కదా!! ఒకేవేళ శివుడు విగ్రహరూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని దర్శిస్తే ఎంతో పుణ్యం చేసుకున్నవారిగా భావిస్తారు. ఇప్పుడు అటువంటి శివుని విగ్రహాన్నే దర్శించుకోబోతున్నాం. ఇక్కడ శివుడు విగ్రహరూపంలోనే కాదు తలకిందులుగా తపస్సు చేస్తూ భక్తులచేత పూజించబడుతున్నారు.

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

ఇక్కడ విగ్రహరూపంలో తల క్రిందులుగా శివుడు ఎందుకు దర్శనమిస్తున్నాడంటే ఈ ఆలయస్థల పురాణం ప్రకారం ఒక సారి యమధర్మరాజు శంబిరుడిని సంహరించాల్సివస్తుంది. శంబిరుడు శివ భక్తుడు కావటంతో శివుడు అనుమతి దీసుకోవాలని యమధర్మరాజు అనుమతి తీసుకుని అనుగ్రహం కోసం తపస్సుచేయటం ఆరంభిస్తాడు.

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

అదే సమయంలో శివుడు కైలాసంలో తలక్రిందులుగా తపస్సుచేస్తూ వుంటారు.ఆయన ప్రక్కన పార్వతీదేవి నెలల పసికందైన కుమారస్వామిని ఒడిలో లాలిస్తూవుంటుంది. ఎందుకు శంభురుడిని యమధర్మరాజు సంహరించాల్సి వచ్చిందంటే మునులు ఒకసారి తపస్సుచేసుకుంటూవుండగా శంభిరుడు మునులను హింసించేవాడు.

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

శంభిరుడు ఆకృత్యాలకు తట్టుకోలేకపోయిన మునీశ్వరులు యమధర్మరాజు దగ్గరకి వెళ్లి ఆ రాక్షసుడిని సంహరించమని కోరతారు. యమధర్మరాజు తపస్సుకు మెచ్చి శంభురుడిని సంహరించటానికి అనుమతినిచ్చింది.లోకకళ్యాణం కోసం తాను తపస్సు చేస్తున్నప్రదేశంలో ఉన్నపళంగా ఆవిర్భవించ వలసిందిగా యమధర్మారాజు కోరతాడు.

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

తపస్సులో వున్న కారణంగా శివుడినుంచి అందుకు ఎలాంటి సమాధానం వుండదు.కాని పార్వతీదేవి అమ్మవారు అందుకు అంగీకరించటంతో వాళ్ళు కైలాసంలో ఎలావున్నారో అలాగే శిలారూపంలో ఇక్కడ ఆవిర్భవిస్తారు. ఈ కారణంగానే మిగతాక్షేత్రాలకన్నా భిన్నంగా ఇక్కడ పార్వతీపరమేశ్వరులు దర్శనమిస్తుంటారు.

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

ఈ ఆలయాన్ని దర్శించుకుంటే దీర్ఘకాలికరోగాలే వెంటనే నయమవుతాయనిఅంటారు. శివలింగతలంపై విలక్షణంగా శీర్శాసనంలో శివుని రూపం ఆలయానికే విశిష్టగా నిలుస్తోంది.అలాగే శక్తీశ్వరఆలయంలో ఒకే పీఠపై శివుడు, పార్వతీ, కుమారస్వామి కొలువై వుండటం మరోప్రత్యేకత.

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

శివుడ్ని ఈ భంగిమలో ఎపుడైనా చూసారా...

అమ్మవారు మాతృమూర్తిగా బాల సుబ్రమణ్యేశ్వరుడ్ని ఒళ్లో చేర్చుకుని లాలిస్తున్నట్లు కొలువైవుండాటం ఈ ఆలయవిశిష్టత.తూర్పుచాళుక్యుల కాలంలో ఈ ఆలయం నిర్మించారని ఆలయస్థల పురాణం చెబుతుంది. కాబట్టి మనం తప్పకుండా దర్శించుకొనవససిన ఆలయాలలో ఈ ఆలయంకూడా ఒకటి.

యనమదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం ఎలా చేరుకోవాలి ?

యనమదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

ఆలయానికి చేరువలో 90 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి దేశీయ విమానాశ్రయం ఉన్నది. ఇక్కడికి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి యనమదుర్రు చేరుకోవచ్చు.

యనమదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం ఎలా చేరుకోవాలి ?

యనమదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం ఎలా చేరుకోవాలి ?

రైలు మార్గం

ఆలయానికి సమీపాన 5 కిలోమీటర్ల దూరంలో భీమవరం రైల్వే స్టేషన్ కలదు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, చెన్నై, కోల్కత్తా తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.

యనమదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం ఎలా చేరుకోవాలి ?

యనమదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

4 కి.మీ ల దూరంలో ఉన్న భీమవరం సమీప బస్ స్టాండ్. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సులు వస్తుంటాయి.

రావణుడు జటాయువు రెక్కలు నరికినపుడు ఆ పక్షి పడ్డ స్థలం ఇప్పుడెలా ఉందో తెలుసా !రావణుడు జటాయువు రెక్కలు నరికినపుడు ఆ పక్షి పడ్డ స్థలం ఇప్పుడెలా ఉందో తెలుసా !

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మన తెలుగు రాష్ట్రాల్లోనే ఖజానా ఎక్కడవుందో తెలిస్తే షాక్ అవుతారు !మన తెలుగు రాష్ట్రాల్లోనే ఖజానా ఎక్కడవుందో తెలిస్తే షాక్ అవుతారు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X