• Follow NativePlanet
Share
» »భక్తుని కోసం తన దిక్కునే మార్చుకున్న దేవాలయం : అంబరనాథ దేవాలయం

భక్తుని కోసం తన దిక్కునే మార్చుకున్న దేవాలయం : అంబరనాథ దేవాలయం

Written By: Venkatakarunasri


దేవతలకు భక్తులను పరీక్షలు చేయటం సహజం. తమ మీద భక్తి కలిగినవాళ్ళు ఎంత భక్తిగా వున్నారో అని అనేకమైన పరీక్షలను చేస్తూవుంటారు. భక్తుల అనేకమైన వేడుకలను తక్షణమే నెరవేర్చే దేవతామూర్తి గురించి మనం పురాతనకాలం నుంచి వాటి నిదర్శనాలు కనిపిస్తూవుంటాయి.

ఇలాంటి ఘటనకి సాక్షి కర్ణాటక రాష్ట్రం. కనకదాసుని భక్తివల్ల శ్రీకృష్ణుడు తన దిక్కు మార్చుకున్న సంఘటన మన ఉడుపిలో జరిగిన విషయం సామాన్యంగా మనకు తెలిసిన విషయమే.

అదే విధంగా మహారాష్ట్రలో శివాలయంలో కూడా శివుడు తన భక్తునికి దర్శన భాగ్యం ఇచ్చేందుకు తన దిక్కునే మార్చుకున్న దేవాలయమేదంటే అది అమరేశ్వర దేవాలయం.ఈ అంబరనాథ దేవాలయం అత్యంత పురాతన దేవాలయమైనా కూడా, ఈ దేవాలయానికి ఒక అద్భుతమైన కథ కూడా ఆధారంగావుంది.

ప్రస్తుత వ్యాసంమూలంగా మహిమాన్వితమైన అంబరనాథ దేవాలయ రహస్యాల గురించి తెలుసుకుందాం.

భక్తుని కోసం తన దిక్కునే మార్చుకున్న దేవాలయం

ఎక్కడుంది?

ఎక్కడుంది?

ఈ అంబరనాథ దేవాలయం మహారాష్ట్రలో అంబరనాథ్ అనే ఊరినుంచి 2 కి.మీ దూరంలో అంబరేశ్వర దేవాలయముంది. ఈ దేవాలయాన్ని అంబ్రేశ్వర శివ దేవాలయమని కూడా పిలుస్తారు.స్థానిక ప్రజలు పురాతనశివాలయం అని పిలుస్తారు.

పురాతనమైన దేవాలయం

పురాతనమైన దేవాలయం

మన భారతదేశంలో అనేకమైన పురాతన దేవాలయాలు వున్నాయి.వాటిలో ఈ అంబరనాథ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం ఒక ఆకర్షణీయమైన చరిత్రను కలిగివుంది.అదేమంటే ........

మహాభారతం

మహాభారతం

మహాభారత కాలంలో పాండవుల వనవాస సమయంలో ఈ అంబరానథ దేవాలయాన్ని నిర్మించారని అక్కడి స్థలపురాణం చెబుతుంది.

స్వయం భూ

స్వయం భూ

ఈ అంబరానథ దేవాలయం యొక్క మరొక విశేషమేమంటే ఇక్కడి లింగ రూపి పరమశివుడు స్వయం భూ లింగం. ఈ లింగం అనంత ఆకాశ లింగమని పాండవులు గుర్తించారు.

ఏక శిల - ఒకే రాత్రిలో నిర్మాణం

ఏక శిల - ఒకే రాత్రిలో నిర్మాణం

ఈ దేవాలయాన్ని ఏక శిలలో నిర్మించిన అద్భుతమైన మందిరం.ఆశ్చర్యం ఏమంటే ఒకే రాత్రిలో ఇలాంటి అందమైన దేవాలయాన్ని నిర్మించారు.

ఆకాశలింగం

ఆకాశలింగం

దేవాలయంలో వున్న లింగం ఆకాశ లింగమైనందున ఆ లింగ గర్భగుడి పైకప్పు నిర్మాణం గావించలేదు.ఇప్పటికీ ఆ దేవాలయం అదే విధంగా వుంది.

దేవాలయం పునరుద్దరణ

దేవాలయం పునరుద్దరణ

అయితే ఈ దేవాలయం 1060 లో పునర్నిర్మించబడింది.ఉత్తర భారతదేశాన్ని కూడా పరిపాలించిన శిలాహార రాజవంశానికి చెందిన చిత్తరాజా ఈ దేవాలయాన్ని మొట్టమొదటి సారిగా పునరుద్దరణ చేసాడని చెప్పబడినది.

రాజ ముమ్మని

రాజ ముమ్మని

ఈ అంబరనాథ దేవాలయాన్ని నిర్మించిన శిలాహార రాజు చిత్తరాజు దీనిని బహుశ నిర్మించివుండవచ్చును.అనంతరం అతని కుమారుడు ముమ్ముని ఈ దేవాలయాన్ని పునఃనిర్మించి అభివృద్ది చేసాడు.

మహా అద్భుతం

మహా అద్భుతం

అయితే ఈ దేవాలయాన్ని అభివృద్ది చేసేముందు ఒక మహా అద్భుతం జరిగిందని అక్కడి స్థలపురాణం చెప్తుంది.

దళితుడు

దళితుడు

ఆ కాలంలో మేలు జాతి, కడ జాతి అనే కులాలు వుండేవి.కడజాతి వారిని సమాజంలో హీనంగా చూసేవారు. ఆ సమయంలో ఈ అంబరనాథ దేవాలయానికి దళితులకు ప్రవేశం నిషిద్ధంచేయబడింది.

 శివభక్తుడు

శివభక్తుడు

పరమశివభక్తుడైన దళితుడు పరమేశ్వరుణ్ణి దర్శించుకొనుటకు వెళ్ళెను.అయితే అతను నీచకులస్థుడైనందువల్ల అక్కడున్న భద్రతాసిబ్బంది దేవాలయంయొక్క ఉత్తరదిక్కువైపుకు నెట్టివేసారు.

ప్రార్థన

ప్రార్థన

దీని గురించి కొంత సమయం చింతించిన శివభక్తుడు అక్కడే నిలబడి పరమశివుడ్ని ప్రార్థించెను.ఆ సమయంలో దేవాలయమే ఉత్తర దిక్కునకు తిరిగెనంట.

మహాభక్తుడు

మహాభక్తుడు

శివుడు మహాభక్తునికోసం తన దిక్కునే మార్చుకున్న ఈ సంఘటనను చూసిన ప్రతిఒక్కరు ఆశ్చర్యచకితులై ఆనాటినుంచి ఆ భక్తుడితో పాటు దళితప్రజలందరికీ దేవాలయప్రవేశం కల్పించినారు.

 ముమ్ముని

ముమ్ముని

అనేక సంవత్సరాలనుండి ఈ దేవాలయం విభిన్నంగా వున్నందువల్ల ఈ దేవాలయాన్ని అభివృద్దిపరచుటకు వచ్చిన ముమ్ముని గర్భగుడిలో వున్న స్వామి తూర్పుదిక్కుకే వున్నాడు,అయితే ప్రవేశద్వారం ఉత్తరదిక్కులో వుండటం గమనించినాడు.

నంది

నంది

దేవాలయం తన స్థితిని మార్పు చేసుకున్నందువల్ల తూర్పుదిక్కులో వున్న నందికి ఏ విధమైన మంటపం లేకుండా పొయిందంట.అదే విధంగా వాస్తు సిద్ధాంతుల ప్రకారం ఉత్తరదిక్కుకు జతగా తూర్పు మరియు దక్షిణ ద్వారాల వైపు కూడా మంటపాలను నిర్మించారు.

 ఇప్పటికీ గమనించవచ్చును

ఇప్పటికీ గమనించవచ్చును

ఇప్పటికీ ఈ దేవాలయాన్ని సూక్ష్మంగా గమనిస్తే ఉత్తరదిక్కులో వున్న దేవాలయ గోడలు కొంచెం ఉత్తరదిక్కులో వున్నట్లే కనిపిస్తాయి.

దక్షిణ శైలి దేవాలయం

దక్షిణ శైలి దేవాలయం

ఉత్తర భారతదేశంలో దక్షిణ శైలిలో నిర్మించిన ఏకైక దేవాలయమేదంటే అది మహారాష్ట్రలోని అంబరనాథదేవాలయం.

శిలాహార రాజవంశస్థులు

శిలాహార రాజవంశస్థులు

ఈ దేవాలయాన్ని అభివృద్ది పరచిన శిలాహార రాజవంశస్థులు దక్షిణ మరియు ఉత్తరభారతదేశాన్ని పరిపాలించిన కారణంగా ఈ ప్రదేశాన్ని దక్షిణ భారతశైలిలో నిర్మించటం జరిగింది.

మరియొక అద్భుతం

మరియొక అద్భుతం

ఈ దేవాలయంలో అద్బుతమైన శిల్పాలు కనిపిస్తాయి. ఈ దేవాలయం యొక్క మరియొక అద్భుతమేమంటే అది అంబరనాథ లింగం.

 పై కప్పు

పై కప్పు

ఈ అంబరనాథ దేవాలయగర్భగుడిలో పై కప్పు లేకుండా వున్నందువల్ల ఆ గర్భగుడి గోడలను నిలబెట్టడానికి 4 స్థంభాలఆధారంతో నిర్మించారు.అయితే ఈ దేవాలయం యొక్క గర్భగుడిని నిర్మించిన శైలి మహాఅద్భుతం అని చెప్పవచ్చును.

సూర్యకిరణాలు

సూర్యకిరణాలు

లింగం మీద పడే సూర్యకిరణాలు ఆశ్చర్యంగా కనిపిస్తాయి.స్వామిని దర్శించుకోవాలంటే భూమి లోపలికి వెళ్ళాలి.గర్భగుడిలోకి వెళ్ళగానే లోపలి వెళ్ళటానికి 20మెట్లు వుంటాయి.వాటి ఆధారంగా లోపల వెలసిన ఆ స్వామి దర్శనం ఇస్తారు.

సొరంగ మార్గం

సొరంగ మార్గం

ఈ దేవాలయంలో ఒక కి.మీ పొడవైన భూగర్భ సొరంగం వుంది.మహాశివరాత్రి సమయంలో ఈ దేవాలయం అత్యధికమైన జనసంఖ్యతో కూడి వుంటుంది.శివునియొక్క ఆశీర్వాదం పొందుటకు దేవాలయానికి శ్రావణమాసంలో అనేకమంది భక్తులుతరలివస్తారు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

విమానమార్గం ద్వారా: అంబరనాథ దేవాలయానికి సమీపంలో వున్న విమానాశ్రయమేదంటే అది ముంబై విమానాశ్రయం.ఇక్కడినుండి టాక్సీలో కానీ క్యాబ్ లో కానీ సులభంగా ఈ దేవాలయానికి చేరవచ్చును.

రైల్వే మార్గం

రైల్వే మార్గం

సమీపంలోని రైల్వేస్టేషనేదంటే అది ముంబై.ఈ ముంబై మార్గంలో అంబర్ నాథ్ స్టేషన్ లో దిగి ఇక్కడనుంచి కేవలం 2కి.మీ ల దూరంలో ఈ దేవాలయానికిచేరవచ్చును.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి