Search
  • Follow NativePlanet
Share
» »శివపురంలో శ్రీ సరస్వతి క్షేత్రం దర్శించి పిల్లలకు అక్షరాభ్యాసములు, బీజాక్షరములు చేయిస్తే..

శివపురంలో శ్రీ సరస్వతి క్షేత్రం దర్శించి పిల్లలకు అక్షరాభ్యాసములు, బీజాక్షరములు చేయిస్తే..

చదువుల తల్లి సరస్వతీదేవికి ఆలయాలు ఎక్కడున్నాయని అడిగితే భాసర, వరంగల్..అని టక్కున చెప్పేస్తారు. ఇంకా? ఎక్కవు పేర్లు చెప్పాలంటే ఎంతటివారైనా కొంచెం తడబడతారు. అయితే కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని దట్టమైన అడవి ప్రాంతంలో ఎత్తైన కొండల మద్యన చారుఘోషిణి నది ఒడ్డున అమ్మవారికి ఆలయం ఉంది. శివపురం గ్రామంలో స్వయంభువుగా పుస్తకధారిణి రూపంలో వెలసినది సరస్వతి అమ్మవారు. కొలను భారతి అనే పేరుతో వెలసిన ఈ అమ్మవారికి 11వ శాతాబ్దికి చెందిన మల్లభూపతి అనే చాళుక్య రాజు నిర్మించినట్లు శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది.

మొత్తం మన భారతదేశంలో 4 చోట్ల వెలసిన అమ్మవారు జమ్ముకాశ్మీరులో సరస్వతిగా 8శక్తిపీఠాలలో ప్రధానపీఠం. కర్ణాటకలో శారదాదేవిగా, ఆదిలాబాద్ లో భాసరలో జ్ఞానసరస్వతిగా పిలువబడుతూ పూజలందుకొంటుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లోని కర్నూలుజిల్లా కొత్తల్లె మండలంలోని శివపురం గ్రామ సమీ పాన శ్రీకొలను భారతిగా పూజలందు కొంటూ ఒక ప్రత్యేకత సంతరించు కొన్న అమ్మవారు ద్వాదశనామాలలో ప్రథమ పేరు శ్రీభారతి పేరుతో పిలువ బడుతూ మన భారతదేశం 'విశిష్టత చాటుతూ వీణలేకుండా, అభయ హస్తం, ఎడమచేతిలో వేదాలు కుడి చేతిలో మూలం ఎడమ చేతిలో పాశంతో దర్శనమిస్తన్న సరస్వతి దేవి ఆలయ క్షేత్ర విశేషాలేంటో తెలుసుకుందాం..

చాళుక్యుల రాజు ల కాలము నాటిది.

చాళుక్యుల రాజు ల కాలము నాటిది.

చాళుక్యుల రాజు ల కాలము నాటిది. గతవైభవ భారత దేశపు అగ్రగామి ఈ దేవాలయం. మల్లభూపతి అనే రాజు నిర్మించినట్లు శాస నాల ద్వారా తెలుస్తుంది. తూర్పు నుండి పడమటికి చక్కగా ఉన్న ఈ నలమల కొండలో శ్రీశూలం శ్రీ కొలను భారతి, సప్తనది సంగమేశ్వరం. ఈ మూడు ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు ఒకే కొండలో ఉండటం విశేషం.

నల్లమల అడవుల చెంత

నల్లమల అడవుల చెంత

నల్లమల అడవుల చెంత కొలను భారతి ఎలా కొలువైయ్యారు అని సంగతి తెలిసిన వారు చాలా తక్కువనే చెప్పాలి. సరస్వతి కొలను భారతి అనే పేరు ఎందుకొచ్చింది? కొల్లం అంటే చెంచుల సమూహం. ఆ జనావాసాల మధ్య ఉంది కాబట్టి కొల్లం భారతి అనేవారట. అదే కొలను భారతి అయ్యిందంటారు స్థానికులు.

 మరో కథనం ప్రకారం కొలను ప్రక్కన వెలసిన

మరో కథనం ప్రకారం కొలను ప్రక్కన వెలసిన

మరో కథనం ప్రకారం కొలను ప్రక్కన వెలసిన భారతి కావున కొలను భారతిగా పిలువబడుతుంది. కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయటానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థ ము అమ్మవారు ఇక్కడకు వచ్చి స్వయంభువుగా నెలవైంది.

ఈ కొలను భారతీ దేవి సన్నిధానంలో అక్షరాభ్యాసములు

ఈ కొలను భారతీ దేవి సన్నిధానంలో అక్షరాభ్యాసములు

ఈ కొలను భారతీ దేవి సన్నిధానంలో అక్షరాభ్యాసములు, బీజాక్షరములు, విద్యాభ్యాసం ప్రారంభిస్తే అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భక్తలు విశ్వాసం. అసలే ఆ తల్లి వీణాధరి... సకల విద్యలకూ అధిదేవత... మరి అంతటి తల్లి పక్కనున్న జలధార మామూలుగా గలగలా, జలజలా అంటుందా? ఆ జలధారకు ఎంత చక్కని పేరో? చారుఘోషిణి. తప్పక చూడదగ్గ క్షేత్రం ఇది.

ఆలయం సమీపంలో సప్త శివాలయాలు ఉండటం విశేషం

ఆలయం సమీపంలో సప్త శివాలయాలు ఉండటం విశేషం

ఈ ఆలయం సమీపంలో సప్త శివాలయాలు ఉండటం విశేషం. సప్త శివాలయాలే ప్రాకారాలుగా.. సుందర తీర్థం అభిషేక జలధిగా కలిగిన కొలను భారతి క్షేత్ర ఆవిర్భావం పురాణ కాలంలో జరిగినట్టు చెబుతున్నారు. అవేకాక జనార్థన స్వామి ఆలయం ఉంది. ఈ సప్త శివాలయాలు రెడ్ శాండ్ స్టోన్ తో నిర్మించినందువల్ల చాళుక్యుల కట్టించిన ఆలయాలని అనుకుంటారు కానీ, అందకు సరైన ఆధారాలు లేవు.

సరస్వతీదేవీ ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో పేరుతో పూజలు

సరస్వతీదేవీ ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో పేరుతో పూజలు

సరస్వతీదేవీ ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో పేరుతో పూజలు అందుకొంటున్నది. వాగ్దేవీ, వాగీశ్వరీ, శారద, భారతమ్మ..ఇలా పలు పేర్లతో పిలుస్తున్నారు. అలా..కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం నల్లమలలో కొలువైన అమ్మవారు.. కొలను భారతిగా పూజలందుకుంటున్నారు.

ఇది అతి ప్రాచీన ఆలయం.

ఇది అతి ప్రాచీన ఆలయం.

ఇది అతి ప్రాచీన ఆలయం. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ను దీపిస్తున్న ఏకైక సరస్వతి క్షేత్రం. కేత్ర ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక విశిష్టత, చరిత్రను బట్టి.. బాసర సరస్వతి దేవస్థానం కన్నా పురాతన దేవాలయంగా చరిత్రకారులు భావిస్తున్నారు.

వరుణ తీర్ధము

వరుణ తీర్ధము

ఇచ్చట, సరస్వతి అమ్మవారి మూలవిరాట్‌ ఎదుట శ్రీచక్రం ఉండటం విశేషం. ఈ క్షేత్రము "వరుణ తీర్ధము"గా ప్రసిద్ధి గాంచెను. శ్రీ శైలమునకు పశ్చిమ దిక్కులో ఉన్న ఈ' కొలను భారతీ అమ్మ వారు', చేతిలో వేదములను ధరించి ఉన్న "పుస్తక పాణి"గా కనపడుతుంది. నాలుగు కరములు(చేతులు) కలిగిన అమ్మవారు ఉత్తర ముఖంగా దర్శనం ఇస్తున్నారు. కుడి రెండు చేతుల్లో పాశం, అభయహస్తం, ఎడమ వైపు రెండు చేతుల్లో పుస్తకం, అంకుశం కనిపిస్తాయి.

రెండో చాళుక్యుల కాలానికి

రెండో చాళుక్యుల కాలానికి

రెండో చాళుక్యుల కాలానికి చెందిన మల్లభూపతిరాజు శిథిలావస్థకు చేరిన అమ్మవారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో జీర్ణోద్ధరణ గావించినట్లు తెలుస్తున్నది. క్షేత్రంలో సప్త శివాలయాలను నిర్మించి శివలింగాలను ఆయన ప్రతిష్టించారు. సహజసిద్ధంగా ఏర్పడిన చారుఘోషిని తీర్థం జీవనదిలా ప్రవహిస్తోంది. 2012లో కాశీనాయన ఆశ్రమం వారు సప్త శివాలయాలను జీర్ణోద్ధరణ గావించారు. నూతన ఆలయ నిర్మాణాలు చేపట్టారు.

రాష్ట్రం నుంచే కాదు..

రాష్ట్రం నుంచే కాదు..

రాష్ట్రం నుంచే కాదు.. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, పశ్బిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ల నుంచీ ఇక్కడికి భక్తులు తరలివస్తుంటారు. క్షేత్రానికి దగ్గర్లోనే ఉన్న సప్తనదుల సంగమేశ్వర క్షేత్రానికి వచ్చే భక్తులు కూడా తిరుగు ప్రయాణంలో కొలనుభారతి క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు.

కొలను భారతికి ఎలా వెళ్లాలి?

కొలను భారతికి ఎలా వెళ్లాలి?

కర్నూలు పట్టణం నుంచి 67 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మకూరు పట్టణానికి చేరుకోవాలి. అక్కడి నుంచి 16 కిలోమీటర్లు ప్రయాణిస్తే కొత్తపల్లి మండలం శివపురానికి చేరుకొంటారు. ప్రైవేట్‌ వాహనాలు, ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంది. శివపురం నుంచి శివపురం చెంచుగూడేం మీదుగా ఐదు కిలోమీటర్ల అటవీమార్గం గుండా ప్రయాణిస్తే.. కొలనుభారతి క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రతి రోజూ ఆర్టీసీ రెండు సర్వీసులను నడుపుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more