Search
  • Follow NativePlanet
Share
» »పర్యాటకుల్ని కట్టిపడేసే మహాబలిపురం శోర్ టెంపుల్ శిల్ప సౌందర్యం

పర్యాటకుల్ని కట్టిపడేసే మహాబలిపురం శోర్ టెంపుల్ శిల్ప సౌందర్యం

చెన్నైకి చేరువలో ఉండే మహాబలిపురంలో ప్రసిద్ధ చారిత్రక కట్టడాలున్నాయి. పల్లవుల పరిపాలనలో ఈ ప్రాంతం స్వర్ణయుగం చూసింది. మహాబలిపురం అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది.. ఆ తీర ప్రాంతంలో వెలసిన దేవాలయమే. ఈ ఆలయం నుంచే పర్యాటకుల సందర్శన మొదలవుతుంది. భారతీయ పురాణ గాథలు, పాత్రలను తలపించే శిల్ప సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకున్న ఈ ఆలయంపై అనేకమంది దేవతలు, దేవుళ్ల విగ్రహాలతోపాటు.. పలువురు నృత్య కళాకారిణుల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి.

మహాబలిపురంలో బంగాళాఖాతం తీరం వెంబడి ఉండే దేవాలయం యునెస్కో గుర్తింపు పొందింది. ఈ సీ శోర్ టెంపుల్ 7వ శతాబ్దంలో రాజసింహాన్ అని కూడా పిలిచే రెండవ నరసింహవర్మచే నిర్మించబడ్డాయి. మొదటి నరసింహవర్మ కొండలను తొలచి గుహాలయాలను నిర్మిస్తే, రెండవ నారసింహవర్మ గ్రానైట్ దిమ్మెలను రకరకాల ఆకారాల్లో మలచి ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మాణాలు చేయడం ఈ శిలాయాల ప్రత్యేకత. ఈ ఆలయాలను సెవన్ పగోడాస్ అని పిలుస్తారు. ఈ ఆలయంతో పాటు ఇంకా వేరే 6 ఆలయాలు కూడా ఉండేవని అవి సముద్రంలో కలిసిపోయాయని ఆర్కియాలజీ వాళ్ళు ఇప్పటికీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారట.

ఈ ఆలయంలో తూర్పుముఖంగో ఉన్న ప్రధాన దేవాలయంలో ధారాలింగం

ఈ ఆలయంలో తూర్పుముఖంగో ఉన్న ప్రధాన దేవాలయంలో ధారాలింగం

ఈ ఆలయంలో తూర్పుముఖంగో ఉన్న ప్రధాన దేవాలయంలో ధారాలింగం, శివలింగం వెనకనే శివపార్వతుల మధ్యలో సుబ్రహ్మణ్యస్వామి ఉన్నట్లు సోమస్కంధ విగ్రహం గర్భగుడి గోడల మీద చెక్కి ఉంటుంది. ధారాలింగం 16ముఖాలు కలిగి 6 అడుగుల బ్లాక్ బాసాల్ట్ స్టోన్ తో చేసిన శివలింగం పైభాగం దెబ్బతిన్నా ఇప్పటికీ మెరిసపోతూ ఉంది.

ప్రశాంతంగా పడుకుని ఉన్న విష్ణుమూర్తి అనంతశయన

ప్రశాంతంగా పడుకుని ఉన్న విష్ణుమూర్తి అనంతశయన

వెనుకవైపు గుడిలో ప్రశాంతంగా పడుకుని ఉన్న విష్ణుమూర్తి అనంతశయన విష్ణు విగ్రహం ఉన్నాయి. గుడి గోపురాలు ఎంతో చక్కని డిజైన్లతో దూరం నుండే కనిపిస్తూ ఎంతబాగున్నాయో అనిపించేలా ఉంటాయి.

చుట్టూ శిల్పాలే..

చుట్టూ శిల్పాలే..

చుట్టూ శిల్పాలే...ఎంత సేపున్నా ఇంకా చూడనివి చాలా ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ ఆలయానికి చుట్టూ సముద్రమే..గుడి ఫెన్సిగ్ లోపల ఉంది. టెంపుల్ చుట్టూ నంది విగ్రహాలు పచ్చటి లాన్, చెట్లతో పరిసరాలు చాలా ఆహ్లాదంగా కనిపిస్తాయి.

పెద్ద పెద్ద అడుగులు వేసేంతటి ఏనుగుల భారీ శిల్పాలు

పెద్ద పెద్ద అడుగులు వేసేంతటి ఏనుగుల భారీ శిల్పాలు

ముఖ్యంగా పెద్ద పెద్ద అడుగులు వేసేంతటి ఏనుగుల భారీ శిల్పాలు పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి. ఈ ఆలయంలో రెండు పెద్ద గోపురాలు, చిన్న గోపురాలు ఉంటాయి.

PC: Sandip Nirmal

ప్రధాన దేవతలుగా శివకేశవులు.

ప్రధాన దేవతలుగా శివకేశవులు.

ప్రధాన దేవతలుగా శివకేశవులు.. ఆలయం చుట్టూ అనేకమైన నంది విగ్రహాలు బారులు తీరి సరిహద్దు గోడలా తీర్చిదిద్దారు. గుడి వెనుక ఒక పెద్ద రాతి సింహం, దానిపై ఓ సైనికుడు స్వారీ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇది ఆనాటి సైనికుల ధైర్యసాహసాలను చాటి చెప్పేదిగా ఉంటుంది.

PC: russavia

అలాగే ఆయలం ఆవరణలో నీళ్ల ట్యాంక్

అలాగే ఆయలం ఆవరణలో నీళ్ల ట్యాంక్

అలాగే ఆయలం ఆవరణలో నీళ్ల ట్యాంక్ , మధ్యలో మినయేచర్ టెంపుల్ ఉంది. చుట్టూ సముద్రం కనిపిస్తూ, సముద్రపు హోరుశబ్దం వింటూ, ఆ శోర్ టెంపుల్ దగ్గర నిలుచుంటే ఇప్పటి రోజుల్లో సముద్రతీరాల్లో రిసార్ట్స్, కాటేజీలు కట్టుకుంటున్నట్లు అప్పట్లో రాజులు దేవుడి కోసం అలా సముద్రతీరంలో గుడి కట్టించారేమో అనిపిస్తుంది. ఆలయం చుట్టూ ప్రహరీ గోడలు, శిల్పాలు, రాతి మెట్లు, కట్టడాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆహ్లాదంగా ఆశ్చర్యపరిచేలా ఉన్న గుడి పరిసరాలను వదిలి రావాలనిపించక మళ్లీ మళ్లీ తిరిగి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.

బిగ్ రాక్:

బిగ్ రాక్:

ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే ఉంది. ఇది ఒక విచిత్రం. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి కాసే కాయలు అరచేయ్యంత పరిమాణం కలిగి వుంటాయి.

 బీచ్ :

బీచ్ :

మహాబలిపురం వెళ్లే పర్యాటకులకు మరో అద్భుతమైన, అపురూపమైన అనుభవం దొరుకుతుంది. మహాబలిపురం బీచ్ అందమైనది. సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఈ బీచ్ లోని అలలు చాల భయంకరంగా వుంటాయి. మరియు బీచ్ లో సముద్రపు లోతు ఎక్కువ. కనుక సముద్ర స్నానం ప్రమాధకరము.ఇక్కడి తీరప్రాంతంలోగల అందమైన పడవలను అద్దెకు తీసుకుని బంగాళాఖాతంలోకి అలా హాయిగా షికారు చేయవచ్చు. అయితే అలాంటి సందర్భాల్లో విధిగా లైఫ్ జాకెట్లు ధరించాల్సి ఉంటుంది.

 తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీఫుడ్

తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీఫుడ్

గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇక్కడ బీచ్ తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీఫుడ్ అత్యంత రుచికరంగా ఉంటుంది. ఇక్కడ భొజనం హోటళ్ళకి, లాడ్జిలకి కొరతే లేదు. కాని రాత్రి సమయాలలో ఉండేటందుకు అనువైన సౌకర్యాలు కలిగిన ప్రాంతంకాదు. భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువమంది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు. దీనికి దగ్గర్లోనే ఎంజీఎం, వీజీపీ గోల్డెన్ బీచ్, మాయాజల్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంప్లెక్స్, చోళమండలం కళాకారుల గ్రామాలు కూడా చూడదగ్గ ప్రదేశాలే.

PC: Ilya Mauter

సమయం

సమయం

మహాబలిపురంన షోర్ దేవాలయం చూడాలంటే అక్టోబర్ నుండి మార్చి వరకు మంచి ఆల్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ షోర్ టెంపుల్ వీక్షించడానికి సందర్శకులు ఎక్కువగా ఉదయం లేదా సాయంత్ర సమయంలో వెళుతుంటారు. ఇక్కడ నిర్వహించే వార్షిక వేడుకలకు "డాన్స్ ఫెస్టివల్"గా అంతర్జాతీయ ఖ్యాతి ఉంది.

PC: russavia

సమయం

సమయం

ఈ డాన్స్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగ రోజున ప్రారంభమై కొత్త సంవత్సరంలోని మొదటి నెల పొడవునా అన్ని శనివారాలలోనూ జరుగుతుంటుంది. ఈ వేడుకలు తమిళనాడు పర్యాటకశాఖవారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెల మొదటి వారందాకా జరుగుతాయి.

PC: mckaysavage

మహాబలిపురం ఎలా వెళ్లాలి

మహాబలిపురం ఎలా వెళ్లాలి

చైన్నెకి సమీపంలో ఉన్న ఈ ప్రాంతానికి విమానంలో వచ్చే వారికి చెన్నై నగరమే అత్యంత సమీప విమానాశ్రయంగా చెప్పవచ్చు. దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ఇది మంచి కూడలి. ఇక రైలు మార్గంలో అయితే ఈ ప్రాంతానికి సమీప రైల్వేస్టేషన్ చెంగల్పట్టు. ఇక్కడి నుంచి 29 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు లేదా చెన్నై నుంచి నేరుగా రైల్లో 58 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవచ్చు.

ఇక రోడ్డు మార్గంలో అయితే చెన్నై, పాండిచ్చేరి, కాంచీపురం, చెంగల్పట్టు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యాలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. పర్యాటకులు చెన్నై నుంచి అద్దె ట్యాక్సీలలో కూడా వెళ్లవచ్చు. బస విషయానికి వస్తే.. చెన్నైలోనే కాకుండా నేరుగా మహాబలిపురంలో కూడా పలు ప్రైవేట్ హోటళ్లు, రిసార్టులు, లాడ్జిలు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X