Search
  • Follow NativePlanet
Share
» »మీ పసుపు కుంకుమలకు రక్ష ఈ అమ్మవారు?

మీ పసుపు కుంకుమలకు రక్ష ఈ అమ్మవారు?

జోగేశ్వరీ దేవి దేవాలయానికి సంబంధించిన కథనం.

పెళ్లైన మహిళల్లో చాాలా మంది తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని దేవతలను పూజిస్తూ ఉంటారు. ఇందుకోసం సుదూర ప్రాంతాలకు సైతం వెలుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఓ ప్రాచీన దేవాలయం మహిళా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా కార్తీక మాసంలో చాలా మంది మహిళా భక్తులు ఈ దేవాలయానికి వెలుతూ ఉంటారు. ఈనేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం మీ కోసం...

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

P.C: You Tube

ముబైంలోని అత్యంత ప్రాచీన దేవాలయం జోగేశ్వరీ మాత దేవాలయం. ఇది ఒక గుహాలయం అంటే కొండను గుహాగా మార్చి నిర్మించిన దేవాలయం అని అర్థం.

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

P.C: You Tube

ఈ దేవాలయం వల్లే ఆ ప్రాంతానికి జోగేశ్వరీ అని పేరువచ్చింది. ఈ దేవాలయంలోని అమ్మవారైన జోగేశ్వరీ అత్యంత మహిమలు కలిగిన వారని మహిళలు నమ్ముతారు.

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

P.C: You Tube

ముఖ్యంగా తమ పసుపు కుంకుమలను చల్లగా చూస్తుందనేది వారి నమ్మకం. అందువల్లే ఒక్క ముంబై నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు మహిళలు వచ్చి పూజలు చేస్తుంటారు.

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

P.C: You Tube

ఈ జోగేశ్వరీ మాత ముంబైతో పాటు మహారాష్ట్రలోని చాలా కుటుంబాలకు కులదైవంగా ఉంది. ఈ దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారన్నదానికి సరైన ఆధారాలు ఏవీలేవు.

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

P.C: You Tube

అయితే ఇక్కడ దొరికిన కొన్ని ఆధారులను అనుసరించి ఈ దేవాలయాన్ని ఐదో దశాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. ఆ సమయంలో స్థానిక రాజులు వారిని ఆదరించినట్లు పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు.

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

P.C: You Tube

మరికొంతమంది మాత్రం అజంతా, ఎల్లోరా గుహలను నిర్మించిన సమయంలో, ఆ గుహాలయాలను నిర్మించినవారే ఇక్కడ కూడా ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు.

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

P.C: You Tube

ముంబైలోని జోగేశ్వరీ అనే ప్రాంతంలో ఉన్న ఈ గుహాలయాన్ని అజంతా, ఎల్లోరా గుహలను నిర్మించిన కార్మికులే నిర్మించినట్లు భావిస్తున్నారు.

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

P.C: You Tube

అక్కడి గుహాలయాలకు, ఈ గుహాలయానికి ఉన్న పోలికలే ఇందుకు కారణం. అజంతా ఎల్లోరా గుహల్లో ఉన్నటువంటి శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఆ శిల్పాలను చెక్కిన తీరు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

P.C: You Tube

ఇక్కడికి చేరుకోవడానికి ముంబై నగరంలో చాలా ప్రాంతాల నుంచి బస్సులు, లోకల్ ట్రైన్‌లు ఉన్నాయి. ఈ గుహాలయంలో జోగేశ్వరీతో పాటు పరమేశ్వరుడు, గణపతి తదితర దేవుళ్ల విగ్రహాలను కూడా మనం చూడవచ్చు.

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై

P.C: You Tube

అంబోలి గుహాలయంగా కూడా దీనికి పేరు. ప్రతి శివరాత్రి, కార్తిక సోమవారాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అందువల్లే ఆ సమయంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X