Search
  • Follow NativePlanet
Share
» »కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

నూతనంగా నిర్మితమైన తెలంగాణరాష్ట్రంలో యలగండ్ల ఖిల్లాదార్ అయిన సయ్యద్ కరీముద్దీన్ పేరిట నిర్మితమైన 100స్మార్ట్ సిటీస్ లో ఒక్కటైన కరీంనగర్ పట్టణానికి 60కిమీల దూరంలో వున్న జీవకళలింగ క్షేత్రం.

By Venkatakarunasri

నూతనంగా నిర్మితమైన తెలంగాణరాష్ట్రంలో యలగండ్ల ఖిల్లాదార్ అయిన సయ్యద్ కరీముద్దీన్ పేరిట నిర్మితమైన 100స్మార్ట్ సిటీస్ లో ఒక్కటైన కరీంనగర్ పట్టణానికి 60కిమీల దూరంలో వున్న జీవకళలింగ క్షేత్రం కోటిలింగాల గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోనే రెండ అతి పెద్ద జీవనదియైన గోదావరీనది తీరాన శాతవాహనుల చరిత్రకు కంచుకోటలాగా నిలిచిన ఈ మహాపుణ్యక్షేత్రాన్ని శివభక్తులు తప్పక దర్శిస్తారు.ఎలాంటివారికైనా ఇక్కడి స్థలపురాణం గురించి తెలిస్తే తప్పక ఈ క్షేత్ర దర్శనానికి పూనుకుంటారు అని వినికిడి. శాతవాహన సామ్రాజ్యఎత్తైన కోటల మధ్యలో నిర్మించటంవలన ఈ ఆలయానికి కోటిలింగాల అనే పేరొచ్చిందని చరిత్రకారులు చెప్పటం ఒక ఎత్తైతే,గోదావరినది ఇసుకను వాడి కోటిఇసుక రేణువుల సాయంతో నిర్మింపబడటం వలన ఈ క్షేత్రానికి కోటిలింగాల అనే పేరొచ్చిందని స్థానికులు మనకు తెలుపుతారు.

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

పాశ్చాత్యులు ఇంకా ఆర్యులు ఈ ప్రాంతాన్ని చాలా తక్కువదృష్టితో చూస్తారు గాని కోటిలింగాల ఘనచరిత్ర తెలుగువారి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన శాతవాహనులు సమయంనుండి వర్ధిల్లింది అని తెలీనివారికి కూడా తెలియచెప్పటం మన భాద్యతఅని మరవకూడదు.

pc:youtube

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

అడుగున బతికే బడుగు జాతిఅని ఎంతో మంది ఆర్యులు దక్షిణభారతీయులైన తెలుగువారిని కించపరచేవిధంగా వక్రీకరించిన చిత్ర పుటలను బద్దలుకొడుతూ భారతీయపురావస్తు శాఖ ఈ ప్రాంతానికి చెందిన కొన్ని ఎంపిక చేయబడిన ప్రదేశాలలో జరిపిన తవ్వకాల పనులవలన కళ్ళు చెదిరే శాతవాహనులకాలం నాటి వస్తు సంపద, గౌతమీపుత్ర శాతవాహనులకాలం నాటి వెండి మరియు ఇనుము లోహాలు మిళితమైన నాణాలు, చౌకనగలు,మట్టిపాత్రలు, భోజనసమయంలో వాడే వస్త్రాలు, వంటగది పరికరాలు లభ్యంకావడంతో నిర్ఘాంతపోయారుఅక్కడ స్థానికులు.

pc:youtube

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

అంతేకాకుండా గోదావరి నదిమీద గుండా తమ నౌకాసంబంధిత వ్యాపారవర్తకపనులతో పాటు యుద్దానికి అవసరమయ్యే ఖనిజాలను,బరువైన యుద్ధసామాగ్రిని తరలించటానికి వాడిన రేవుపట్టణ కేంద్రంగా కూడా వాడారని తెలుస్తోంది.

pc:youtube

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

అఖండ భారతావనిలో పేరొందిన అస్మకమహా జానపద సంస్థానం అనబడే స్వల్పజన పరిపాలనవ్యవస్థలుండే నెలకొన్న ప్రాంతం కావటం ఇంకొక విశేషమనేచెప్పాలి. అలాంటి ఆథ్యాత్మిక మరియు శాస్త్ర ప్రావీణ్యం గల శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ మహాపుణ్యక్షేత్రానికి ఏటా భక్తులతాకిడి ఎక్కువకావటం కూడా ఒక శుభపరిణామమనే చెప్పాలి.

pc:youtube

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

టూకీగా ఈ క్షేత్రం గురించిన చరిత్రను మనం తెలుసుకుంటే ఆజ్ఞేయదిశలో వున్న మునులగుట్టలోని తపశ్శక్తి సంపన్నులైన కొందరు మునుల ఆరాధన వల్ల నిర్మించబడ్డ లింగాదారక్షేత్రమని మనకు తెలుస్తోంది.

pc:youtube

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

స్థానికులు చెప్పే త్రేతాయుగంలోని కధఆధారంగా సాక్షాత్తూ చిరంజీవిఅయిన మహా బాహుబలి ఆంజనేయుడుతెచ్చిన మహాకాశీ లింగ స్థానంలో సమయాభావం వలన మునినిర్మిత ఇసుకరేణువులలింగం ప్రతిష్టించబడిందిఅని తెలుస్తోంది

pc:youtube

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

అలా దేదీప్యమానంగా అఖండ భారతావనిలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకున్న ఈ ఆంజనేయ రక్షిత పార్వతిఆధిత దివ్యలింగ క్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.వేల ఏళ్ల చరిత్రగల ఈ ఆలయం గురించి శాస్త్రీయమరియు శాస్త్ర అంశాలు ఇంకా అక్కడినేలలో భద్రంగా నిక్షిప్తమైవున్నాయని వాటిని ఏరోజుకైనా వెలికితీసి ప్రపంచానికి ఈ శైవక్షేత్రవిశిష్టతను హిందూసనాతనధర్మంలోని
రాజసం, ఆ దర్పాన్ని, ఆత్మగౌరవాన్ని దిక్కులన్నింటికి చాటిన శాతవాహన చరిత్రను గురించి తెలియపరిచే ధృడసంకల్పంతోటున్న ఆర్కియాలజికల్ సర్వేఆఫ్ ఇండియా ఇంకా తెలంగాణాప్రభుత్వ ఆశయం అత్యంత అభినందనీయం.

pc:youtube

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

యల్లంపల్లి ప్రాజెక్ట్ పనులవల్ల ముంపుకి గురౌతుందన్న కొందరి వాదనను తోసిపుచ్చుతూ ఇంతటి ఘనకీర్తిని మన దేశానికందించిన మహా పుణ్యక్షేత్రానికి జాతీయహోదా కలిపించే దిశగా తక్షణచర్యలు చేపట్టిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లాను టెక్నాలజిడెవలప్ద్ సిటీగా పరిగణించటం అక్కడివారికే కాకుండా ఈ రాష్ట్రానికి తద్వారా ఈ దేశానికే గర్వకారణం అన్న విషయంలో ఎలాంటి సంశయంలేదు

pc:youtube

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

కోటి ఇసుకరేణువుల లింగం తెలుసా..?

మానవసృష్టి మూలాలను తమ రోజువారిదినచర్యగా కనుగొంటున్న పాశ్చాత్యశాస్త్రవేత్తలు ఏదోఒక తరుణంలో తమ వ్యర్ధవాదనలపక్కనపెట్టి బృందాల వారీగా వచ్చి ఇక్కడున్న వింతలను,విశేషాలను నమోదుచేసుకునే రోజు దగ్గరలోనే వుంది.ఆ రోజున ఈదేశం ఇంకో స్థితిలో వుండటం ఖాయమనేచెప్పాలి.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X