Search
  • Follow NativePlanet
Share
» »శని దోషం నుంచి దూరంగా ఉండాలా

శని దోషం నుంచి దూరంగా ఉండాలా

దన్వంతరి ఆరోగ్య పీఠం గురించి కథనం.

మీలో చాలా మందికి శనిదోషం ఉంటుంది. కొందరికి ఏలిన నాటి శనిదోషం ఉంటే మరికొందరికి అష్టమ శని ఉంటుంది. వారి వారి నక్షత్రాన్ని అనుసరించి ఈ దోషాలు ఉంటాయి. ఇక ఏ శనిదోషమైనా సమస్యలుమాత్రం దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టం ఇలా అనేక సమస్యలు ఉత్పన్నం కావచ్చు.. శని దోష పరిహార పూజలు చేయడం వల్ల వీటి నుంచి కొంత ఉపశమనంకలిగించవచ్చునని చెబుతారు. అయితే ఒక్కొక్క నక్షత్రం వాళ్లు కు ఒక్కొక్క చోట ఈ శనిదోష పరిహారం దొరుకుతుంది. అయితే ఏ నక్షం వాళ్లకైనా ఈ శనిదోష పరిహారందొరికే ప్రదేశంతమిళనాడులో ఉందిఅటువంటి విశిష్ట దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం....

ఎక్కడ ఉందంటే....

ఎక్కడ ఉందంటే....

P.C: You Tube

తమిళనాడులోని కిల్ పుద్ పేట్, వాలపేట్ వెల్లూరులో శ్రీ ధన్వంతరి ఆరోగ్య పీఠం అనే దేవాలయం ఉంది. చెన్నై-పెరంబదూర్-కాంచిపురం మూల ఈ దేవాలయానికి వెళ్లవచ్చు. చెన్నై నింద సుమారు 112 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. ప్రయాణ సమయం 2.45 గంటలు.

శని ప్రభావం

శని ప్రభావం

P.C: You Tube

శనిప్రభావం వల్ల వ్యాపారంలో నష్టం వస్తుంది. ఇంట్లో ఎంత ప్రయత్నించినా శుభకార్యం అన్నది జరగదు. దంపతుల మధ్య తరుచుగా గొడవలు జరుగుతాయి. ఈ విధంగా చెప్పుకొంటూ పోతే అనేక సమస్యలు మనకు శనిదోషం ఉన్నన్ని రోజులూ ఎదురవుతూనే ఉంటాయి. సమస్య పరిష్కారం కోసం శనిదోష నివారణ పూజలు చేయడం చాలా ముఖ్యం

అన్ని నక్షత్రాల వారికీ

అన్ని నక్షత్రాల వారికీ

P.C: You Tube

ఇక్కడ అన్ని నక్షత్రాలు, వాటికి సంబంధించిన చెట్లకు ప్రధానంగా పూజలు జరుగుతాయి. దీని వల్ల ఆ శనిమహాత్ముడికి శాంతి జరిపించినట్లవుతుందని స్థానిక పూజారులు చెబుతారు. కాళ చక్ర పూజలు చేస్తారు. శనిదోషం ఉన్నవారు ఆ కాళచక్రం ముందు తమ నక్షత్రానికి అనువైన చెట్టు ముందు కుర్చొని పూజలో పాల్గొంటారు.

పూజకు ఏమేమి అవసరం

పూజకు ఏమేమి అవసరం

P.C: You Tube

ఇక్కడ జరిగే పూజకు నల్లటి వస్త్రం, నీలి రంగు వస్త్రం, నల్లద్రాక్షి, బ్యాళ్లు, బియ్యం, వరి తదితర వస్తువులు అవసరం. ఇదే సమయంలో భైరవ, ఆంజనేయుడికి కూడా విశేష పూజలు నిర్వహిస్తారు.

ఇంకా ఎవరెవరు ఉన్నారు

ఇంకా ఎవరెవరు ఉన్నారు

P.C: You Tube

ఈ దేవాలయంలో లక్ష్మీ వినాయక, బాలమురుగన్, శేషాద్రి, ఆనందస్వామి, సూర్య, చంద్ర, బుద్ద, గురునానాయక్ మూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఏమేమి చూడవచ్చు.

ఏమేమి చూడవచ్చు.

P.C: You Tube

ఈ దేవాలయానికి దగ్గరల్లో వల్లూరు కోట ఉంది. చారిత్రాత్మక ప్రధాన్యత కలిగిన ఈ కోట ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఈ కోటలో ఉన్న జలగండేశ్వర దేవాలయం, మసీదు, చర్చ్, మ్యూజియం తదితర పర్యాటక ప్రాంతాలు కూడా చూడదగినవే.

వల్లి మలై

వల్లి మలై

P.C: You Tube

ఇక్కడికి దగ్గర్లో వల్లి మలైయు తిరువళం అనే పేరున ఉన్న క్షేత్రం తమిళవాసులకు అత్యంత పవిత్రమైనది. ఇక్కడ కుమారస్వామి భార్య వల్లి జన్మించిందని చెబుతారు. ఈ చిన్న గుట్ట పై ఉన్న శివుడి దేవాలయం కూడా చూడదగినదే.

బాలమతి

బాలమతి

P.C: You Tube

ఇది ప్రముఖ హిల్ స్టేషన్. వల్లూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. వెల్లూరు వెళ్లిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వెళ్లడానికి ఇష్టపడుతారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ మంది ఇక్కడకు వెలుతుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X