» »కొమురవెల్లి క్షేత్రం - భక్తుల కొంగుబంగారం

కొమురవెల్లి క్షేత్రం - భక్తుల కొంగుబంగారం

Written By: Venkatakarunasri

కొమురవెల్లి మల్లన్నగా కొలువబడే శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం తెలంగాణలోని కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో కలదు. ఈ దేవాలయం సిద్ధిపేట నుండి సికింద్రాబాద్ కు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 10 కి.మీ. ల దూరంలో ఉంది.

కొమురవెల్లి మల్లన్న స్వామిని బన్ద సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. మల్లన్న గుడి దగ్గరనే 15 కి.మీ ల దూరంలో కొండ పోచమ్మ దేవాలయం కూడా ఉంది. కొమురవెల్లి వచ్చి వెళ్ళే వారు తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని కూడా సందర్శిస్తారు. హైదరాబాద్ నుండి ఈ దేవాలయం 85 కి. మీ ల దూరంలో కలదు.

ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంటనగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. వీటిని లష్కర్ బోనాలుగా పిలుస్తారు.

కొమురవెల్లి క్షేత్రం - భక్తుల కొంగుబంగారం

1. కోటొక్క లింగాలకు ... కొలనుపాక !!

1. కోటొక్క లింగాలకు ... కొలనుపాక !!

ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే, అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం (అన్నం) వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగు రంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే.

ఢమరుకం (జగ్గు) వాయిస్తూ, జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపుపచ్చని అంగీలు ధరించి, చేతిలో ముగ్గుపలక, ఢమరుకం (జగ్గు) జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు.

2.హోళీ పండుగ

2.హోళీ పండుగ

జాతర చివరలో కామదహనం (హోళీ) పండుగకు ముందు పెద్ద పట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు, విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు.

చిత్రకృప : oneindia telugu

3. ఉత్సవ విగ్రహాలు

3. ఉత్సవ విగ్రహాలు

వీర శైవ (బలిజ) పూజారులు, వీరభద్రుణ్ణి, భద్రకాళిని పూజించి, సాంప్రదాయబద్ధమైన పూజలు జరిపి, రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నులకొద్దీ కర్రలను పేర్చి, మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. తెల్లవారు జాములో ఆ కర్రలన్నీ చండ్రనిప్పులుగా మారుతాయి.వాటిని విశాలంగా నేర్పి, కణ కణ మండే నిప్పుల మధ్యనుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్ళుతారు. వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు.

చిత్రకృప : oneindia telugu

 4. సందర్శించు సమయం

4. సందర్శించు సమయం

ఉదయం: 6 am - 12 pm వరకు మరియు తిరిగి 3 pm - 7 pm వరకు.

వసతి : వసతికై దేవస్థానం భక్తులకు గదులను అద్దెకు ఇస్తుంది. చాలా వరకు భక్తులు హైదరాబాద్ లో స్టే చేయటానికి ఇష్టపడతారు. అక్కడి నుండే ఒక్కరోజు పర్యటన నిమిత్తం దేవాలయానికి వస్తుంటారు. ఉగాది శివరాత్రి పర్వదినాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.

ఫ్రీ మీల్స్ : దేవస్థానం వారు 12 pm నుండి 2 pm వరకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు.


చిత్రకృప : oneindia telugu

5. సమీప సందర్శన ప్రదేశం

5. సమీప సందర్శన ప్రదేశం

కొమురవెల్లి కి 10 కిలోమీటర్ల దూరంలో వరంగల్ జిల్లా చేర్యాల కలదు. ఇక్కడ శ్రీ లక్ష్మినరసింహ ఆలయం చూడదగ్గది. అలాగే చేర్యాల స్క్రోల్ పెయంటింగులు ప్రసిద్ధి చెందినది. పెయింటింగ్ లను గుడ్డపైన వేస్తుంటారు. పురాణ కథలు చెప్పేటపుడు ఈ గుడ్డపైన వేసిన బొమ్మలను ప్రదర్శిస్తారు. ఈ బొమ్మలు వేయడానికి కోరా గుడ్డను శుద్ధి చేసి బంక, సుద్ద, సున్నం రంగులు కలిపి కథలోని నాయకా నాయకుల చిత్రాలను, వారి వీరోచితాన్ని, శృంగార రసాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రిస్తారు. రాజస్థాన్ నుంచి సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ కళ చేర్యాల గ్రామంలో చేరిందంట. వరంగల్ సరస్వతి దేవాలయం, రత్నాలయం టెంపుల్ (శామీర్ పేట) కూడా చూడవలసినవే !

PC: Rangan Datta Wiki

6. కొమురవెల్లి ఎలా చేరుకోవాలి ?

6. కొమురవెల్లి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : కొమురవెల్లికి దగ్గరలో శంషాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం కలదు. 80 కి.మీ ల దూరంలో వున్న ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి కొమురవెల్లి ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం : కొమురవెల్లి 45 కి. మీ ల దూరంలో జనగాం రైల్వే స్టేషన్ కలదు. స్టేషన్ బయట ప్రభుత్వ బస్సులలో ఎక్కి దేవాలయం చేరుకోవచ్చు .

రోడ్డు/ బస్సు మార్గం : సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంజిబిఎస్ బస్ స్టాండ్, సిద్ధిపేట, చేర్యాల నుండి దేవస్థానం వరకు బస్సులు నడుస్తాయి.

చిత్రకృప : Shahabuddinm