Search
  • Follow NativePlanet
Share
» »భూ వరహస్వామికి, ఖురాన్ కు ఉన్న సంబంధం ఏమిటి?

భూ వరహస్వామికి, ఖురాన్ కు ఉన్న సంబంధం ఏమిటి?

శ్రీ ముష్నం పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం

ఈ పుణ్యక్షేత్రం హిందూ ముస్లీం సోదరభావానికి ప్రతీక. బ్రహోత్సవాల సమయంలో వరాహస్వామి కదలడానికి ముందు ఖచ్చితంగా ముస్లీం పవిత్ర గ్రంధమైన ఖురాన్‌ను ఉత్సవ విగ్రహం ముందు చదవాల్సిందే. లేదంటే ఆ వరాహస్వామి ఉత్సవవిగ్రహం ముందుకు కదలదని చెబుతారు. ఈ నేపథ్యంలో ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం....

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

తమిళనాడులోని కడులూరు జిల్లాలోని శ్రీముష్నం గ్రామంలోనే భూ వరాహస్వామి ఉన్నాడు. మొదట చెన్నై నుంచి వ`ద్ధాచలం చేరుకోవాలి. అక్కడి నుంచి శ్రీ ముష్నంకు నిత్యం బస్సులు ఉన్నాయి.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిదంబరానికి 39 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది. స్వామివారి ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అటు పై సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ తెరిచి ఉంటుంది.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

ఇక్కడ స్వామివారిని పూజించడం వల్ల సకల పాపాలు తొలిగిపోతాయని చెబుతారు. అంతేకాకుండా గ్రహదోషాలు ఉన్నవారు ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తారు. హిరణ్యాక్షుడిని యుద్ధంలో చంపిన తర్వాత వరాహస్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చెబుతారు.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

యుద్ధసమయంలో స్వామివారి శరీరం నుంచి చిందిన చమట వల్ల ఇక్కడ పుష్కరిణి ఏర్పడింది. దీనిలో స్నానం చేస్తే ఎటువంటి చర్మరోగాలైనా సమిసిపోతాయని చెబుతారు.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

ఇక్కడ స్వామివారి విగ్రహం చిన్నదిగా ఉంటుంది. హిరణ్యాక్షుడు తాను చనిపోయే ఆఖరి ఖడియల్లో స్వామివారిని తన వైపునకు చూడమని ప్రార్థిస్తాడని పురాణం చెబుతుంది.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

అందువల్లే స్వామివారి శరీరం పడమర వైపునకు ఉన్నా ముఖం దక్షిణ దిశగా ఉంటుంది. ఇక్కడ స్వామివరు నడుము పై చెయ్యి పెట్టుకొని భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న అమ్మవారిని అంభుజవల్లి అని అంటారు.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

అమ్మవారు స్వామిని అందంగా చూడాలని కోరుకొంటుంది. అమ్మవారి కోరిక తీర్చడానికి నారాయణుడు ఇక్కడ శంఖ, చక్రాలతో వెలిశాడని చెబుతారు.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

అందువల్లే ఉత్సవ మూర్తి విగ్రహం వరాహ రూపంలో ఉండదు. నారాయణుడి రూపంలో ఉంటుంది. ఈ ఆలయంలో జరిగే బ్రహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

మొదటిరోజు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఈ క్రమంలో స్వామివారు తాయ్‌కల్ అనే గ్రామంలోని మసీదు వద్ద ఆగిపోతుంది.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

ఈ మసీదు వద్ద మతపెద్ద స్వామివారికి పూలమాలను సమర్పించి ఖురాన్ చదువుతాడు. అటు పై మాత్రం ఊరేగింపు యధావిధగా కొనసాగుతుంది.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

ఖురాన్ చదవడానికి ముందు ఎంత ప్రయత్నించినా స్వామివారి ఊరేగింపు ముందుకు కదలకపోవడం ఇక్కడ విశేషం. అదే విధంగా ఇక్కడ చితై ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

శ్రీదేవి, భూదేవిని ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో ఊరేగిస్తారు. బ్రహోత్సవాల తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహం చుట్టు పక్కల ఉన్న గ్రామాలకూ వెళుతుంది. అప్పుడు ఆయా గ్రామాల వారు గ్రామ పండుగను చేసుకొంటారు.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

ఇక్కడ కొలువై ఉన్న అంబుజవల్లికి నవరాత్రి సమయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. తమిళ నెలలైన ఆడి, తాయ్ నెలల్లో కూడా అమ్మవారిని సువాసనతో కూడిన పుష్పాలతో అలంకరించిన పల్లకిలో ఊరేగిస్తారు.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

ఇక్కడ వరాహ స్వామితో పాటు గోపాలుడి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. వరాహస్వామితో పాటు ఈ గోపాలుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. అందువల్ల స్వామివారితో పాటు గోపాలుడికి కూడా విశేష పూజలు నిర్వహిస్తారు.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

ఇక్కడ స్వామివారి రెండు కన్నుల నుంచి తులసి, అశ్వర్థ చెట్టు వెలిసినెట్లు స్థానిక పూజారులు చెబుతారు. ఈ అశ్వర్థ చెట్టును పూజిస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని చెబుతారు.

శ్రీముష్నం, భూ వరాహస్వామి

శ్రీముష్నం, భూ వరాహస్వామి

P.C: You Tube

అదేవిధంగా అశ్వర్థ చెట్టు కింద గాయత్రి మంత్రం పటిస్తే చనిపోయిన తర్వాత స్వర్గప్రాప్తి లభిస్తుందని స్థానికుల నమ్మకం. అందువల్లే ఈ దేవాలయాలనికి వచ్చిన వారు తప్పకుండా ఈ చెట్టు కింద గాయత్రి మంత్రం జపిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X