Search
  • Follow NativePlanet
Share
» »కొంగు బంగారం ఈ ఒంటి కన్ను ఆంజనేయస్వామి

కొంగు బంగారం ఈ ఒంటి కన్ను ఆంజనేయస్వామి

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామిని భక్తుల పాలిట కొంగుబంగారంగా పేర్కొంటారు. ఇక్కడ భక్తి శ్రద్ధలతో కోరుకొంటే అన్ని కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. అందువల్లే కేవలం ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఎక్కవు సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి ఆంజనేయుడని సేవించడం వల్ల భూత, ప్రేత, దుష్ట గ్రహ పీడ వదులుతుందని భక్తులు చెబుతుంటారు. ఇంతటి మహిమాన్విత క్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

పరుశరాముడు, యక్షుడి తగువు తీర్చడానికే శివుడు పురుషాంగ రూపంలో వెలిశాడా?పరుశరాముడు, యక్షుడి తగువు తీర్చడానికే శివుడు పురుషాంగ రూపంలో వెలిశాడా?

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి దగ్గర్లోని కసాపురం అనే గ్రామంలో ఉంది. కన్నడలో నెట్టె అంటే నేరుగా అని అర్థం.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
నెట్టె కంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం. ఈ కసాపురంలో స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అందువల్లే మనం కుడి కన్నును మాత్రం చూడలం.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తమనే చూస్తున్నట్లు ప్రతి ఒక భక్తుడికి అనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారిని నెట్టెకంటి ఆంజనేయస్వామి అని అంటారు.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
ప్రతి రోజూ వేలాది మంది దర్శించుకొనే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహ పీడ నివారణ క్షేత్రంగా పేరొందింది. విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తుశకం 1521లో శ్రీ వ్యాసరాయుల వారు తుంగభద్ర నదీ తీరంలో ధ్యానం చేసేవాడు.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
ప్రతి రోజూ తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి పై ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
ఇది గమనించిన వ్యాస రాయులు హనుమంతుని శక్తిని వేరోచోటకి వెళ్లనీయకుండా స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారుచేసి అందులో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారని చెబుతారు.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
దీంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారని చెబుతారు. కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వరి స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయుల వారు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలో కనిపిస్తాడు.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
నీవు దక్షిణ దిశగా వెళ్లు. అక్కడ ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది. దానికి నీవు దగ్గరగా వెళితే అది చిగురుస్తుంది. అక్కడే నేను ఉంటాను. నాకు ఆలయాన్ని కట్టించు అని చెబుతాడు.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
ఆంజనేయస్వామి సూచనమేరకు మరునాటి ఉదయం వ్యాసరాయులు దక్షిణ దిశగా వెళ్లి ఒక ఎండిన వేపచెట్టును చూస్తాడు. అక్కడకు ఆయన చేరుకోగానే ఆ చెట్టు చిగురుస్తుంది.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
ఆ చెట్టు కింద తవ్వగా అంజేయస్వామి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మిస్తాడు. అదే ప్రస్తుత నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
కాగా ప్రతి ఏడాది ఒక చర్మకారుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు కనిపిస్తుంది. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట విహారానికి వెళ్లి వస్తుంటాడని భక్తుల నమ్మకం.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
ప్రతి ఏడాది నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమద్దీక్షలు తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి, పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. ఇందులో బస చేయడానికి అవసరమైన వసతి సౌకర్యాలు ఉన్నాయి.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
శ్రీ క`ష్ణదేవరాయుల గురువైన వ్యాసరాయులు ఒకే సమయంలో కసాపురం, నేమకల్లు, మూరడి అనే గ్రామల్లో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
శ్రావణ మాసం శనివారం ఈ మూడు ఊళ్లను సందర్శిచడం అత్యంత ఫలప్రదమని భావిస్తారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతుంది.

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube
కసాపురం దగ్గర్లో 60 కిలోమీటర్ల దూరంలోనే బళ్లారీ విమానాశ్రయం ఉంది. గుంతకల్ రైల్వే జంక్షన్ సమీప రైల్వేస్టేషన్. ఈ రైల్వేస్టేషన్ దేశంలోని అన్ని పెద్ద నగరాలతో, పట్టణాలతో అనుసంధానించబడి ఉంది. గుంతకల్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, అటోల ద్వారా కసాపురం చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X