Search
  • Follow NativePlanet
Share
» »కంచిలో బంగారు, వెండిబల్లి ఉండే శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించారా?

కంచిలో బంగారు, వెండిబల్లి ఉండే శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించారా?

సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం. విశేష పౌరాణిక చారిత్రిక నగరం. కాంచీపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది అక్కడ కల పురాతన దేవాలయాలు మరియు పట్టు వస్త్రాలు. ఇక్కడ కల దేవాలయాలలో కొన్ని వేయి సంవత్సరాల నాటివి కూడా కలవు. ఇంతటి పురాతన చరిత్ర కల ఈ పట్టణం ఆధ్యాత్మికులకే కాదు చారిత్రకులకు, షాపింగ్ ప్రియులకు కూడా దర్శించ తగినదే. నాలగవ శతాబ్దం నాటి పల్లవుల నుండి తొమ్మిదవ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యం పాలకుల వరకు, బ్రిటిష్ రాజ్ తో సహా అందరు పాలకులూ కాంచీపురం పట్ల ఎంతో శ్రద్ధ చూపి దానిని కళాత్మకంగా ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ కల స్థానికులు ఆ సంస్కృతి ని ఎప్పటికపుడు నిలుపు కుంటూ కన్చిపురానికి ఒక ప్రసిద్ధ నగరంగా కూడా పేరు తెచ్చారు.

ఆధ్యాత్మికంగా, విశిష్ట అద్వైతం బోధ్లించిన ప్రచారకులు కంచి పురం పట్టణం నుండి వచ్చిన వారే. ఈ వేదాంత పర స్కూల్ కంచి మాత నుండి పుట్టింది. ఇంతే కాక, ఇక్కడ అనేక కళాత్మక, మంచి శిల్ప శైలి కల టెంపుల్స్, ఆహ్లాద కర ప్రకృతి కూడా కంచి పట్టణానికి శోభను తెచ్చాయి. ఎంతో పురాతన చారిత్రక విశిష్టత ల నుండి ఆధునిక కాల చరిత్రల వరకు ఈ పట్టణం విశిష్ట త కలిగి అక్కడ కల చిన్న, పెద్ద దేవాలయాలతో శోభిల్లు తోంది. అటువంటి ఆలయాల్లో శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం ఒకటి.

శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి

శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి

శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం. అంతే కాదు శ్రీరంగం, తిరుమల, మేల్కేటే ల తరువాత కంచి శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల వారికి అత్యంత పవిత్ర దర్శనీయ క్షేత్రం. మరో విశేషం ఏమిటంటే ఈ నూట ఎనిమిది దివ్య తిరుపతులలో పదునాలుగు కంచి లోనే ఉండటం. అందులో కొన్ని విష్ణు కంచిలో ఉండగా మరి కొన్ని శివ' కంచి ఉంటాయి. విష్ణు కంచి లో ఉండే శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల ఎంతో విశేష పౌరాణిక మరియు చారిత్రక నేపథ్యం కలిగి ఉంటుంది.

P.C: You Tube

వరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా ప్రముఖంగా హస్తగిరి ఆలయం

వరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా ప్రముఖంగా హస్తగిరి ఆలయం

వరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా ప్రముఖంగా హస్తగిరి ఆలయం లేదా అత్తియురాన్ అని అంటారు. విష్ణు భగవానుని గౌరవం నిర్మించిన ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా ఉన్నది. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలోనే హిందూ మతం పండితుడు అయిన రామానుజాచార్యులు నివసించారని చెబుతారు. ఎకంబరేశ్వర ఆలయం మరియు "ముముర్తివాసం" లేదా మూడు హౌస్ వంటి కామాక్షీ అమ్మవారి ఆలయం పాటు ఈ ఆలయంను చూడండి. ఈ ఆలయంను పెరుమాళ్ కోయిల్ గా సూచిస్తారు మరియు ప్రతి విష్ణు భక్తులు తప్పక సందర్శించాలని భావిస్తారు.

P.C: You Tube

కృతయుగంలో విధాత బ్రహ్మ, త్రేతాయుగంలో గజరాజు గజేంద్రుడు

కృతయుగంలో విధాత బ్రహ్మ, త్రేతాయుగంలో గజరాజు గజేంద్రుడు

కృతయుగంలో విధాత బ్రహ్మ, త్రేతాయుగంలో గజరాజు గజేంద్రుడు , ద్వాపర యుగంలో బృహస్పతి, కలియుగంలో ఆది శేషుడు, ఆళ్వారులు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ ఆదిశంకరులు మరెందరో మహానుభావులు ఈ స్వామిని సేవించారు అని పురాణాలు పేర్కొంటున్నాయి.

P.C: You Tube

స్వామి ఇక్కడ స్వయంభూగా వెలయడం గురించిన కధ

స్వామి ఇక్కడ స్వయంభూగా వెలయడం గురించిన కధ

స్వామి ఇక్కడ స్వయంభూగా వెలయడం గురించిన కధ సత్యయుగం నాటిదిగా తెలుస్తోంది. సరస్వతీ దేవితో ఏర్పడిన వివాదంతో ఆగ్రహించి భూలోకానికి వచ్చిన సృష్టి కర్త శ్రీ మహా విష్ణు అనుగ్రహం కోసం అశ్వమేధ యాగం తలపెట్టారు.

P.C: You Tube

 అందుకని శ్రీ గాయత్రీ దేవిని సరసన కూర్చోబెట్టుకొని యాగం

అందుకని శ్రీ గాయత్రీ దేవిని సరసన కూర్చోబెట్టుకొని యాగం

కాకపోతే యజ్ఞ దీక్షలో సతీసమేతంగా కూర్చోవాలి. అందుకని శ్రీ గాయత్రీ దేవిని సరసన కూర్చోబెట్టుకొని యాగం ఆరంభించారు. ఈ పరిణామానికి ఆగ్రహించిన సరస్వతీ దేవి నదీ రూపంలో ఉదృతం వేగంతో ప్రవహిస్తూ యజ్ఞ వాటికను ముంచివేయబోగా శ్రీ హరి అడ్డుగా శయనించి ప్రవాహాన్ని పక్కకు మళ్లించారు. అలా శయనించిన ప్రదేశంలో మరో దివ్య దేశం ఉన్నది అదే " విన్నసైద పెరుమాళ్" కొలువైన "తిరువెక్క" ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది.విధాత యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసుకున్న తరువాత శ్రీ మన్నారాయణుడు దర్శనమిచ్చి ఆలుమగల మధ్య వివాదాలు సహజమని తెలిపి సృష్టి కర్తను చదువుల తల్లిని కలిపారు. అంతట పద్మాసనుడు, దేవతలు, మునులు స్వామిని ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకోమని ప్రార్ధించారు.అలా స్వామి ఇక్కడ కొలువుతీరారు.

P.C: You Tube

సుమారు ఇరవై అయిదు ఎకరాల స్థలంలో ఉండే ఈ ఆలయాన్ని

సుమారు ఇరవై అయిదు ఎకరాల స్థలంలో ఉండే ఈ ఆలయాన్ని

సుమారు ఇరవై అయిదు ఎకరాల స్థలంలో ఉండే ఈ ఆలయాన్ని తొలుత కంచిని పాలించిన పల్లవ రాజు రెండవ నందివర్మ క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది.(కంచి లోని చాలా ఆలయాలు ఈయన నిర్మించినవే కావడం విశేషం) తరువాత చోళ రాజులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని శాసనాలు తెలుపుతున్నాయి. మరెన్నో రాజవంశాలు ఆలయానికి తమ వంతు కర్తవ్యంగా కైకర్యాలు సమర్పించుకున్నారు. కానీ విజయనగర రాజుల కాలంలో పెక్కు నిర్మాణాలు జరిగి ప్రస్తుత రూపాన్ని సంతరించు కొన్నదీ కోవెల. ఎన్నో తమిళ, తెలుగు మరియు కొన్ని కన్నడ శాసనాలు కనపడటం విశేషం.

మొత్తం మూడు ప్రాకారాలతో, ముప్పై రెండు ఉపాలయాలు, పంతొమ్మిది విమాన గోపురాలు, మూడువందల పైచిలుకు మండపాలతో శోభాయమానంగా ఉంటుంది.

P.C: You Tube

అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయ సొంతం

అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయ సొంతం

అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయ సొంతం. ముఖ్యంగా అనంత పుష్కరణి పక్కన ఉండే నూరు స్తంభాల మండప శిల్ప శోభ వర్ణించ శక్యం కాదు. ఒకే రాతితో చెక్కిన గొలుసులు, కూర్మ సింహాసనానికి దిగువన అమర్చిన తిరిగే చక్రాలు, స్థంభాలకి చెక్కిన రామాయణ, మహా భారత సన్నివేశాలు మహాద్భుతంగా ఉంటాయి.

P.C: You Tube

ముఖ్యంగా సందర్శించవలసిన ఉపాలయాలు శ్రీ నారసింహ

ముఖ్యంగా సందర్శించవలసిన ఉపాలయాలు శ్రీ నారసింహ

ముఖ్యంగా సందర్శించవలసిన ఉపాలయాలు శ్రీ నారసింహ, శ్రీ రామానుజ, ఆళ్వారుల సన్నిధులు.మూడో ప్రాకారంలో కొలువుతీరిన శ్రీ పేరుందేవి అమ్మవారిని దర్శించిన తరువాతే శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనానికి వెళ్ళాలి. ప్రధాన ఆలయంలో మూలవిరాట్టు స్థానిక భంగిమలో దివ్యమైన అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు.ముఖమండపంలో విజయనగర రాజుల కాలంలో సహజ వర్ణాలతో చిత్రించిన వివిధ దేవతా రూపాల చిత్రాలు నేటికీ చెక్కుచెదరక పోవడం చెప్పుకోదగిన సంగతి.

P.C: You Tube

బంగారు బల్లి మరియు వెండిబల్లిని

బంగారు బల్లి మరియు వెండిబల్లిని

స్వామి వారి దర్శనానంతరం వెలుపలకు వచ్చేటప్పుడు పైకప్పుకు ఒక రాతి దూలం పైన చెక్కిన బంగారు బల్లి మరియు వెండిబల్లిని తాకాలి.

P.C: You Tube

పురాణగాథ ఏమిటంటే

పురాణగాథ ఏమిటంటే

దీనికి సంబంధించిన పురాణగాథ ఏమిటంటే గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారు గురువు గారి దేవతార్చనకు కావలసిన పుష్పాలు, ఫలాలు మరియు నీరు ఏర్పాటు చేస్తుండే వారు. ఒకనాడు వారు పెట్టిన నీటి పాత్రలో ఒక బల్లి పడింది. ఆగ్రహించిన మహర్షి వారిని బల్లులుగా జీవించమని శపించారు. తెలియకచేసిన తప్పుకు క్షమించమని వేడుకొనగా ఆయన వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్లి స్వామిని సేవించమని శాప విమోచన తెలిపారు.

P.C: You Tube

కొంతకాలానికి ఇంద్రుడు సూర్యుడు

కొంతకాలానికి ఇంద్రుడు సూర్యుడు

కొంతకాలానికి ఇంద్రుడు సూర్యుడు మరియు చంద్రునితో కలిసి శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనానికి తరలి వచ్చాడు. వారి దర్శనంతో శిష్యులకు శాపవిమోచనం లభించినది.

P.C: You Tube

తాకిన వారి సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి

తాకిన వారి సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి

నాటి నుండి ఇక్కడ వారి రూపాలను ఏర్పరచారు. వీటిని తాకిన వారి సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారని చెబుతారు.

P.C: You Tube

నిత్యపూజల కారణంగా విగ్రహా

నిత్యపూజల కారణంగా విగ్రహా

ఈ ఆలయంలో ఉన్న మరో విశేషము ఏమిటంటే గర్భాలయం లో ఒకప్పుడు అత్తి చెట్టు కాండంతో చేసిన విగ్రహం ఉండేది. చెక్క విగ్రహం. దీనిని బ్రహ్మదేవుని ప్రతిష్టగా భావిస్తారు. నిత్యపూజల కారణంగా విగ్రహా రూపం మారుతున్నందున దాని స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. పాత విగ్రహాన్ని అనంత పుష్కరణిలో వెండి భోషాణంలో ఉంచి నలభై సంవత్సరాల కొకసారి వెలుపలకు తీసి పది రోజుల పాటు భక్తుల దర్శనార్ధం ఉంచుతారు. అనంతరం తిరిగి పుష్కరణిలో ఉంచుతారు. చివరిసారి ఈ ఉత్సవం జరిగింది 1979 వ సంత్సరం జులై నెలలో జరిగింది. తిరిగి 2019 వ సంవత్సరం జులై నెలలో అత్తివరద స్వామి దర్శనం మనకు లభిస్తుంది.

P.C: You Tube

బ్రమ్మోత్సవం

బ్రమ్మోత్సవం

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవం జరుగుతుంది. స్థానికులకు మరియు విదేశీ పర్యాటకులకు చాలా ప్రసిద్ధి చెందింది. పండుగ ఒక క్రమం తప్పకుండా ఉత్సవాలు ప్రారంభాన్ని గుర్తించడానికి భారీ గొడుగులు ఉపయోగిస్తారు. మరో ప్రధాన పండుగ 'బ్రమ్మోత్సవం'ను మే మరియు జూన్ నెలల్లో నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువుకు అనుంగు వాహనం గరుత్మంతుడు. వైనతేయుడు పరాక్రమంలో దిట్ట. ఆకాశంలో గరుడిని చూడటం, అతడి మాట వినడం గొప్ప అదృష్టంగా భావిస్తారు భక్తులు. అందుకనే తిరుమల కోనేటిరాయుని బ్రహ్మోత్సవాల్లో గరుడవాహనంపై చిద్విలాసమూర్తి విహరిస్తుంటే దర్శించుకోవాలని కోట్లాది భక్తులు కోరుకుంటారు.

P.C: You Tube

అయితే ‘కంచి గరుడ సేవ’

అయితే ‘కంచి గరుడ సేవ’

అయితే ‘కంచి గరుడ సేవ' అన్న జాతీయం ఆసక్తికరంగా ఉంటుంది. 108 దివ్యదేశాల్లో ఒకటైన పవిత్రమైన కంచిలో ఆ వైకుంఠనాథుడు శ్రీ వరదరాజ పెరుమాళ్‌గా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. కంచిలో భారీ ఇత్తడి గరుడ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహంపైనే ఉత్సవమూర్తిని ఉంచి గరుడసేవ నిర్వహిస్తారు. దానిపై ఉండే స్వామి విగ్రహానికంటే గరుత్మంతుని వాహనం పెద్దదిగా ఉంటుంది.

P.C: You Tube

ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా

ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా

ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని సిద్ధం చేయడం కోసం ఈ ఇత్తడి గరుడ వాహనాన్ని కూడా శుభ్రం చేస్తారు. దాన్ని శుభ్రం చేసే క్రమంలో అలిసిపోతుంటారు. ‘ స్వామి వారి కోసం గరుడిని శుభ్రం చేస్తారు. ఇంత చేసినా ఈయనేమన్నా వరాలు ఇస్తాడా, అదేదో స్వామి వారికి చేస్తే మనకెంతో పుణ్యం కదా!' అని వాపోతుంటారట. ఇదంతా కంచి గరుడ సేవరా నాయనా అని అనుకుంటారట.

P.C: You Tube

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

కాంచీపురం బెంగుళూరు కు 280 కి. మీ. ల దూరంలోను, చెన్నై కి 72 కి. మీ. ల దూరంలోను కలదు. రోడ్డు మార్గంలో ఈ పట్టణం అతి తేలికగా చేరవచ్చు.

photo kredit : Ashok Prabhakaran

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more