Search
  • Follow NativePlanet
Share
» » యుగాంతం ముందుగా తెలిపే బసవన్న వెలిసిన క్షేత్రం చూశారా?

యుగాంతం ముందుగా తెలిపే బసవన్న వెలిసిన క్షేత్రం చూశారా?

యాగంటి పుణ్యక్షేత్రాలనికి సంబంధించిన కథనం.

యుగాంతం అన్న విషయం ఎప్పటికీ బ్రహ్మ పదార్థమే. అది ఎప్పుడు ఎలా వస్తుందన్న విషయం పై అనేక కథలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే కథావస్తువు ఆధారంగా అనేక నవలలు, సినిమాలు కూడా రూపుదిద్దుకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ యుగాంతాన్ని ముందుకుగా తెలిపే కొన్ని పుణ్యక్షేత్రాలు మన భారత దేశం నలుమూలలా వ్యాపించి ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న యాగండి పుణ్యక్షేత్రం కూడా ఒకటి. అంతే కాకుండా ఈ యాగంటిలో ఉన్న పుష్కరిణిలో ఎల్లప్పుడూ ఒకే పరిమాణంలో నీరు ఉండే పుష్కరిణి కూడా ఉంది. అదే విధంగా ఈ పుణ్యక్షేత్రంలో కాకులు కూడా కనిపించవు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

వరద భయం వద్దు ఆ అయ్యప్పను ఇలా దర్శించుకొందాంవరద భయం వద్దు ఆ అయ్యప్పను ఇలా దర్శించుకొందాం

కొంగు బంగారం ఈ ఒంటి కన్ను ఆంజనేయస్వామికొంగు బంగారం ఈ ఒంటి కన్ను ఆంజనేయస్వామి

యాగంటి దేవలయం

యాగంటి దేవలయం

P.C: You Tube

యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ ఉన్న నందీశ్వరుడికి దేశవ్యాప్తంగా ప్రాచూర్యం ఉంది.

పరుశరాముడు, యక్షుడి తగువు తీర్చడానికే శివుడు పురుషాంగ రూపంలో వెలిశాడా?పరుశరాముడు, యక్షుడి తగువు తీర్చడానికే శివుడు పురుషాంగ రూపంలో వెలిశాడా?

ఉమా మహేశ్వరుడు

ఉమా మహేశ్వరుడు

P.C: You Tube
యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమా మహేశ్వరుడిని లింగం ఉంది. మొదట ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించారు.

అతీత శక్తులున్న ఈ విభిన్న శివలింగాలను దర్శనం చేసుకొన్నారాఅతీత శక్తులున్న ఈ విభిన్న శివలింగాలను దర్శనం చేసుకొన్నారా

వేంకటేశ్వరుడు

వేంకటేశ్వరుడు

P.C: You Tube

అయితే విగ్రహం తయారీ సమయంలో ఆ విగ్రహంలో కొంత భాగం ఆగమశాస్త్రలకు విరుద్ధంగా చెక్కబడింది. దీంతో లోపభూయిస్టమైన సదరు శ్రీ వేంకటేశ్వర విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే కొండ పైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు.

స్వయంభువు

స్వయంభువు

P.C: You Tube

ఇక స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలిసిన ఉమా మహేశ్వర స్వామిని ఇక్కడకు తీసుకు వచ్చి ప్రతిష్టించారని చెబుతారు. ఇదిలా ఉండగా యాగంటిలో మనకు కాకులు కనిపించవు.

అగస్త్య మహాముని

అగస్త్య మహాముని

P.C: You Tube

దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని అగస్త్య మహర్షి సందర్శిస్తాడు. ఇక్కడ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే బాగుంటుందని భావించాడు.

చేతి బొటన వేలుకి

చేతి బొటన వేలుకి

P.C: You Tube

ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బొటన వేలుకి గాయమయ్యింది. తన సంకల్పంలో లోపమేమైనా ఉందనే సందేహంతో వేంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు.

కాకులు కనిపించవు.

కాకులు కనిపించవు.

P.C: You Tube

ఆ సమయంలో అక్కడి కాకులు అగస్త్య మహాముని తపస్సును భంగం కలిగిస్తాయి. దీంతో అగస్త్య మహాముని ఆ ప్రాంతంలో కాకులు సంచరించకుండా శాపించాడు. ఇక్కడ ఆలయంలో దీపం వెలిగిస్తే శనిదోషం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతారు.

పుష్కరిణి నుంచి

పుష్కరిణి నుంచి

P.C: You Tube

అందువల్లే యాగంటి పుణ్యక్షేత్రంలో కాకులు కనిపించవని చెబుతారు. ఇక్కడున్న పుష్కరిణిలో నీరు నంది నుంచి వస్తూ ఉంటుంది.

ఎక్కడి నుంచి వస్తుంది

ఎక్కడి నుంచి వస్తుంది

P.C: You Tube

అయితే ఆ నీరు ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కడికి వెలుతుందన్న విషయానికి సంబంధించి పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం కనిపించడం లేదు.

అగస్త్యుడు స్నానం చేయడం వల్ల

అగస్త్యుడు స్నానం చేయడం వల్ల

P.C: You Tube

ఇక ఈ కోనేరులో అగస్త్యుడు స్నానం చేసినందువల్ల ఈ పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలోనైనా ఈ పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండటం ఇక్కడ విశేషం.

ఔషద గుణాలు

ఔషద గుణాలు

P.C: You Tube

ఇందులోని నీటికి ఔషద గుణాలున్నాయని, ఇందులో స్నానం చేస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్ముతారు. పుష్కరిణి నుంచి ఆలయంలోకి వెళ్లడానికి మెట్ల మార్గం ఉంది.

ఐదు అంతస్తులు

ఐదు అంతస్తులు

P.C: You Tube

ప్రధాన ఆలయంలోని గోపురం ఐదు అంతస్తులను కలిగి ఉంటుంది. దీనిని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం ఉన్నాయి.

అర్థనారీశ్వరుడిగా

అర్థనారీశ్వరుడిగా

P.C: You Tube

గర్భాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపం కనిపిస్తుంది. ఇక్కడ పరమశివుడు అర్థనారీశ్వరుడిగా విగ్రహ రూపంలో కొలువై ఉన్నాడు.

సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు

సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు

P.C: You Tube

యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు మనలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వేంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహాముని కలియుగ దైవమైన వేంకటేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్టింపజేశాడు.

సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు

సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు

P.C: You Tube

యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు మనలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వేంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహాముని కలియుగ దైవమైన వేంకటేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్టింపజేశాడు.

శంకర గుహ

శంకర గుహ

P.C: You Tube

ఇక ఆ పక్కనే ఉన్న ఇంకో గుహలో బ్రహ్మం గారు కొంత కాలం తపస్సుచేసి శిష్యులకు జ్జానోపదేశం చేశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ల గుహ అని కూడా పిలుస్తారు.

బసవన్న విగ్రహం

బసవన్న విగ్రహం

P.C: You Tube

యాగంటిలో అన్నింటికంటే ముఖ్యంగా చూడదగినది ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలిసిన బసవన్న విగ్రమం. ఈ బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది.

విగ్రహం పెరుగుతూ ఉంది

విగ్రహం పెరుగుతూ ఉంది

P.C: You Tube

దీనిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపింస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ బసవన్న విగ్రహం అంతకూ పెరుగుతోంది.

వీరబ్రహ్మం గారు

వీరబ్రహ్మం గారు

P.C: You Tube

ఈ విషయాన్ని పోతులూరు వీరబ్రహ్మం గారు తన కాలజ్జానంలో ఎప్పుడో చెప్పారు. అంతేకాకుండా కలియుగాంతం సమయంలో యాగంటి బసవన్న లేచి రంకేస్తాడని బ్రహ్మంగారు తన కాలజ్జానంలో తెలిపారు.

పురావస్తు శాఖ అధికారులు కూడా

పురావస్తు శాఖ అధికారులు కూడా

P.C: You Tube

ఇదిలా ఉండగా యాగంటి బసవన్న విగ్రహం పరిమానంలో పెరుగుతోందన్న విషయాన్ని పురావస్తు శాఖ అధికారులు కూడా కూడా నిర్థారించారు. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం చెప్పలేకపోతున్నారు.

ఇలా వెళ్లవచ్చు

ఇలా వెళ్లవచ్చు

P.C: You Tube

యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. యాగంటికి దగ్గరగా ఉన్న బనగానపల్లిలో వసతులు ఉన్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.

ఇక్కడ ప్రసాదం ఆ నీటిలో వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తుంది, చర్మవ్యాధులకుఇక్కడ ప్రసాదం ఆ నీటిలో వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తుంది, చర్మవ్యాధులకు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X