Search
  • Follow NativePlanet
Share
» »చక్రకాళి అమ్మవారు మహిమ ఎలాంటిదో తెలుసా?

చక్రకాళి అమ్మవారు మహిమ ఎలాంటిదో తెలుసా?

శ్రీ చక్రకాళి అమ్మవారి దేవాలయం గురించి కథనం.

భక్తులు వెళ్లినా, వెళ్లక పోయినా వారి గోత్ర నామాలు, నక్షత్రంతో పూజలు జరిగే దేవాలయం మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఉంది. అంతేకాకుండా ప్రపంచ శాంతి కోసం ప్రతి రోజూ హోమాలు జరిగే చోటు కూడా ఇదే. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

చక్రకాళీ దేవాలయం, వందలూరు

చక్రకాళీ దేవాలయం, వందలూరు

P.C: You Tube

భారతీయపురాణాలు, జ్యోతిష్యాస్త్రం ప్రకారం మనుషులంతా 27 నక్షత్రాల్తో జన్మించినవారే. వారు ఎవరైనా 12 రాశులు, 12 లగ్నాల్లో జన్మించినవారై ఉంటారు. దీంతో ప్రపంచంలోని ప్రజలందరి క్షేమం కోసం సంకల్పం చేసి పూజలు చేసే ఆలయం భారత దేశంలో ఒకే ఒక చోటున ఉంది.

చక్రకాళీ దేవాలయం, వందలూరు

చక్రకాళీ దేవాలయం, వందలూరు

P.C: You Tube

తమిళనాడులోని రత్నమంగళంలో శ్రీ లక్ష్మీ కుబేరుల ఆలయం పక్కన ఉన్న ఆ ఆలయం పేరే శ్రీ చక్రకాళీ అమ్మవారి ఆలయం. ఈ దేవాలయాలు మరీ విశాలమైనవి కావు. అయితే ప్రత్యేక శక్తులు కలిగినవిగా స్థానిక ప్రజలు చెబుతారు.

చక్రకాళీ దేవాలయం, వందలూరు

చక్రకాళీ దేవాలయం, వందలూరు

P.C: You Tube

శ్రీ చక్రకాళీ ఆలయంలో అమ్మవారి విగ్రహాలు రెండు ఉంటాయి. వెనుక ఉన్న పెద్ద విగ్రహం శ్రీ భవతారిణిది. ఈ విగ్రహం ఒకే రాతిలో మలచబడ్డది. ఈ విగ్రహం 12 అడుగుల ఎత్తు ఉంటుంది.

చక్రకాళీ దేవాలయం, వందలూరు

చక్రకాళీ దేవాలయం, వందలూరు

P.C: You Tube

భవతారిణి అంటే అర్థం భవ బంధాల నుంచి తరింప చేసేది అని అర్థం. అదే విధంగా ప్రపంచాన్ని రక్షించేది అని కూడా అర్థం వస్తుంది. ఈ విగ్రహానికి ముందు ఉన్న చిన్న విగ్రహం శ్రీ చక్రకాళి అమ్మవారిది.

చక్రకాళీ దేవాలయం, వందలూరు

చక్రకాళీ దేవాలయం, వందలూరు

P.C: You Tube

ఈమె పంచ భూతాలను తన త్రిశూలంతో అదుపులో ఉంచుకున్నారని స్థానికులు చెబుతారు. ఇక ఈ ఆలయంలో ప్రతి రోజూ ఉదయం శ్రీ లలితా సహస్ర నామార్చన చేసిన తర్వాత 27 నక్షత్రాలు, 12 రాశులు, 12 లగ్నాలకు ప్రత్యేకంగా పేరు పేరునా పూజలు చేస్తారు.

చక్రకాళీ దేవాలయం, వందలూరు

చక్రకాళీ దేవాలయం, వందలూరు

P.C: You Tube

అందువల్ల ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి పూజలు చేసినట్లు అని ఇక్కడివారి భావన. అదే విధంగా సాయంత్రం మళ్లీ శ్రీ దక్షిణ కాళీ సహస్ర నామ పూజ చేస్తారు. అటు పై కుంకుమను ప్రసాదంగా ఇస్తారు.

చక్రకాళీ దేవాలయం, వందలూరు

చక్రకాళీ దేవాలయం, వందలూరు

P.C: You Tube

ఈ కుంకుమను ధరించడంతో అర్చన చేసిన శక్తి మనకు వస్తుందని పూజారులు చెబుతారు. ఇక్కడ భక్తలు ఉన్నా లేకపోయినా గంటకు ఒకసారి హారతి ఇస్తారు. ముఖ్యంగా రోజూ ఉదయం అలంకరణ చేసి 8 గంటలకు మహా దీపారాధన చేస్తారు.

చక్రకాళీ దేవాలయం, వందలూరు

చక్రకాళీ దేవాలయం, వందలూరు

P.C: You Tube

అదే విధంగా సాయంత్రం ఆరు గంటలకు ఒకసారి మరోసారి హారతి ఇస్తారు. ఈ సమయంలో ఎక్కువ మంది భక్తులు ఉంటారు. అమ్మవారికి చక్రపొంగలి నైవేద్యంగా పెడతారు.

చక్రకాళీ దేవాలయం, వందలూరు

చక్రకాళీ దేవాలయం, వందలూరు

P.C: You Tube

అమ్మవారి ముందు పెద్ద పళ్లెంలో చక్ర పొంగలి పెడితే, అందులో అమ్మవారి ఆకారం ప్రతి బింబిస్తుంది. అటు పై చక్రపొంగలిని ప్రసాదంగా పంచి పెడుతారు. ఈ ఆలయానికి దగ్గర్లో అరైకాసు అమ్మ దేవాలయం, శ్రీ లక్ష్మీ కుబేరుల ఆలయం ఉంది.

చక్రకాళీ దేవాలయం, వందలూరు

చక్రకాళీ దేవాలయం, వందలూరు

P.C: You Tube

చెన్నై నుంచి చెంగల్పట్ వెళ్లే రైలులో వందలూరు చేరుకోవచ్చు. అక్కడి నుంచి కేలంబాకం వెళ్లే తోవలో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. వందలూరు నుంచి ఆటోలు నిత్యం అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X