» »వేసవిలో తెలుగు రాష్ట్రాల కొండ కోనల్లో చల్ల...చల్లగా

వేసవిలో తెలుగు రాష్ట్రాల కొండ కోనల్లో చల్ల...చల్లగా

Written By: Beldaru Sajjendrakishore

వేసవిలో వాతావరణం చల్లగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాలని మనస్సు ఉవ్విళ్లూరుతుంటుంది. ఇంటు వంటి చల్లని ప్రదేశాలకు తెలుగు రాష్ట్రాల్లో కొదువు లేదు. ముఖ్యంగా హిల్స్ స్టేషన్స్ వేసవిలో తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల పర్యాటకలను కూడా ఆహ్వానిస్తున్నాయి.

ఇటువంటి హిల్స్ స్టేషన్స్ లలో లంబసింగి, అనంతగిరి హిల్స్, అరకు వ్యాలీ, నల్లమల కొండ ప్రాంతాలు ముందు వరుసలో ఉంటాయి. ఈ హిల్స్ స్టేషన్స్ కు చుట్టు పక్కల పలు పుణ్యక్షేత్రాలు, నదులు, సముద్రాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలన్నీ మీ కోసం నేటివ్ ప్లానెట్ తీసుకువచ్చింది. మరెందుకు ఆలస్యం వేసవి పర్యాటకానికి సిద్ధం అవ్వండి...

1. లంబసింగి..

1. లంబసింగి..

Image source

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణం జిల్లాలో చింతపల్లి మండలంలో ఒక చిన్న గిరిజన గ్రామం లంబసింగి. దీనికి కొర్రబయలు అని కూడా పేరు. లంబసింగి ఒక గిరిజనుల ప్రాంతము.

2. ఉష్ణోగ్రత 0 డిగ్రీలు

2. ఉష్ణోగ్రత 0 డిగ్రీలు

Image source

డిసెంబరు - జనవరి మాసాల్లో వాతావరణం సుమారుగా 0 డిగ్రీలు ఉంటుంది, మిగిలిన కాలాల్లో సుమారుగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అందువల్ల ఈ ప్రాంతమును ఆంధ్రా కాశ్మీర్ అని కూడా అందురు. సముద్రమట్టానికి ఈ ప్రాంతము నాలుగువేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతంలో వేసవిలో కూడా అత్యంత చల్లగా వుంటుంది

3. చుట్టూ సుందరమైన ప్రాంతాలే

3. చుట్టూ సుందరమైన ప్రాంతాలే

Image source

దీంతో ఈ ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. లంబసింగికి దగ్గరగా ఉన్న , చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పర్యటించే ఒక్కరిని మైమరపిస్తాయి.

4. కాఫీ తోటలు...

4. కాఫీ తోటలు...

Image source

లంబసింగి ఘాట్‌రోడ్డులో కాఫీ తోటలు విస్తారంగా ఉన్నాయి. లంబసింగి చేరుకునే ముందు బోడకొండమ్మ గుడి కనిపిస్తుంది. దీనికి అర కిలోమీటరు దిగువన జలపాతం ఉంది. ఇక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది.

5. ఇవి సదుపాయాలు...

5. ఇవి సదుపాయాలు...

Image source

ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

6.అనంతగిరి హిల్స్

6.అనంతగిరి హిల్స్

Image source

అనంతగిరి కొండలు భారత దేశం లోని తెలంగాణ రాష్ట్రంలో గల వికారాబాదు జిల్లా లోని అనంతగిరిలో ఉన్నాయి. మూసీ నది యొక్క జన్మస్థానం ఈ కొండలే. ఈ నది హైదరాబాద్ వరకూ ప్రవహిస్తుంది.

7.అనంత పద్మనాభస్వామి దేవాలయం వల్లే..

7.అనంత పద్మనాభస్వామి దేవాలయం వల్లే..

Image source

ఈ దేవాలయం అనంతగిరి కోండలలో ఉంది. దీనిని 400 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు "అనంత పద్మనాభస్వామి" రూపంలో ఉంటాడు. అందువలన ఈ ప్రాంతానికి అనంతగిరి అని పేరు వచ్చింది. హైదరాబాదు నగరానికి సుమారు 75 కి.మీ దూరంలో నిర్మితమైనది.

8.ఎన్ని అందాలో...

8.ఎన్ని అందాలో...

Image source

అనంత పద్మనాభస్వామి దేవాలయం నుండి ఎడమవైపు దారిలో మొదటి కుడివైపు మార్గం గుండా వెలితే అనంతగిరి కొండలన్నిటిని వీక్షించవచ్చు. ఆలయం కుడివైపునకు 2 కి.మీ దూరంలో కొండల మధ్యలోని ఉన్నటువంటి జలపాతాలను చూడవచ్చు.

9. ఇవి సదుపాయాలు...

9. ఇవి సదుపాయాలు...

Image source

అనంతగిరి కొండలకు హైదరాబాద్ లేదా వికారబాద్ నుంచి నిత్యం బస్సులు ఉంటాయి. దగ్గర్లో డాబాలు, రెస్టోరెంట్లు అనేకం ఉన్నాయి. పైవేటు ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఫోన్, ఇంటర్ నెట్ ఒక్కొక్కసారి పనిచేయకపోవచ్చు.

10 అరకు వ్యాలీ

10 అరకు వ్యాలీ

Image source

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణం జిల్లా దుంబిరి గూడ మండలంలో అరకు వ్యాలీ ఉంది. ఏడాది మొత్తం ఈ ప్రాంతం పర్యాటకానికి అనుకూలం. అయితే వేసవిలో కూడా చల్లదనం ఉండటం వల్ల ఎక్కువ మంది ఈ ప్రాంతానికి వస్తుంటారు.

11. 600 మీటర్ల ఎత్తు

11. 600 మీటర్ల ఎత్తు

Image source

అరకు లోయ సముద్రమట్టానికి సుమారు 600 మీటర్ల నుండి 900 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖపట్నానికి 115 కి.మీ.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణములతో, కొండలతో లోయలతో ప్రజలను ఆకర్షిస్తోంది. సహజ సాందర్యము కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపము కలిగి సజీవముగా నిలుస్తుంది.

12. బొర్రా గుహలు...

12. బొర్రా గుహలు...

Image source

అరకు వెళ్ళే ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్, ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. దారిలో అనంతగిరి కొండలలో కాఫీ తోటలు పర్యాటకులకు ఆహ్వానం పలుకుతాయి. అరుకు వ్యాలీకి 29 కి.మీ. దూరములో ఉన్న బొర్రా గుహలు ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణ.

13. రైలు ప్రయాణం

13. రైలు ప్రయాణం

Image source

విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. ప్రకృతి అందాలు చూడాలంటే వెళ్లేటప్పుడు రైలు వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది. రైలు వైజాగ్ లో ఉదయం కిరండొల్ వెళ్లే పాసింజర్ ఎక్కాలి. ప్రతి రోజు రైలు ఉదయం 6.50 గంటలకు బయలు దేరుతుంది. అది అలా కొండలు, లోయలు, గుహలు దాటుకుంటూ సాగిపోతుంది. ప్రయాణం సుమారు 5 గంటలు వుంటుంది.

14. సిమిలిగుడ ..ఎతైన బ్రాడ్ గేజ్

14. సిమిలిగుడ ..ఎతైన బ్రాడ్ గేజ్

Image source

ప్రయాణంలో "సిమిలిగుడ" అనే స్టేషను వస్తుంది. అది భారతదేశంలో అతి ఎత్తులో వున్నబ్రాడ్ గేజ్ స్టేషను అంటారు. ఇక వెళ్లే దారిలో బొర్రా గుహలు వస్తాయి. అక్కడ దిగి బొర్రా గుహలు చూసుకొని అరుకు వెళ్ళవచ్చు.

15. అన్ని వసతులు

15. అన్ని వసతులు

Image source

అరుకులో వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జీలు, గెస్ట్ హౌసులు, కాటేజీలు వుంటాయి. కవిటి వాటర్ ఫాల్స్, రణ జల్లెడ వాటర్ ఫాల్స్, అనంత గిరి వాటర్ ఫాల్స్ తదితరాలను ఇక్కడ చూడవచ్చు. కనీసం రెండు రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటే ప్రక`తి అందాలను తిలకించవచ్చు.

16. తిరుగు ప్రయణం

16. తిరుగు ప్రయణం

Image source

బస్సు ప్రయాణం మంచిది. లేదంటే ఒక వాహనంఅద్దెకు తీసుకుంటే అన్నీ చూడవచ్చు. వచ్చే దారిలో త్యాడ/టైడా లో జంగిల్ బెల్స్, అనంతగిరి కాఫీ తోటలు లాంటివి చూడవచ్చు. వర్తక వాణిజ్యాలు గిరిజనులు తయారు చేసే వస్తువులు అమ్ముతారు . గిరిజనాభివృధ్ధి సంస్థ అమ్మే స్వచ్ఛమైన తేనె మొదలైనవి కొనవచ్చు.

17. నల్లమల హిల్స్

17. నల్లమల హిల్స్

Image source

తూర్పు కనుమల్లో నల్లమల కొండలు ఒక భాగం. ఇవి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ర్టంలో కూడా వ్యాపించి ఉన్నాయి. ఇవి కృష్ణా నది మరియు పెన్నా నదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి యున్నవి.

18. ఇవి ఎతైన పర్వత శిఖరాలు

18. ఇవి ఎతైన పర్వత శిఖరాలు

source

వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు మరియు గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు. ఈ రెండు శిఖరాలూ కంభం పట్టణానికి వాయువ్య దిశలో గలవు.

19 పులుల అభయారణ్యం ఉంది.

19 పులుల అభయారణ్యం ఉంది.

source

నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికే రాజీవ్ అభయారణ్యం అని పేరు. ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి.

20.చూడదగిన ప్రదేశాలు

20.చూడదగిన ప్రదేశాలు

source

శ్రీశైలం పుణ్యక్షేత్రంతో పాటు శ్రీశైలం డ్యాం, గుండ్ల బ్రహ్మేశ్వర శిఖరం జలపాతం. నెమలిగుండం. ఒంకారమ్. రుద్రకోడూరు. పావురాలగుట్ట తదితర ప్రాంతాలు చూడదగినవి. అదే విధంగా ఆత్మకూరు నుండి నంద్యాలకు వెళ్ళే మార్గములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివంగత నేత డా:వైయస్ రాజశేకరరెడ్డి గారి జ్ఞాపకార్ధం నల్లకలువ గ్రామానికి సమీపంలో వైయస్ఆర్ స్మృతివనాన్ని నిర్మించినది. ఈ ప్రదేశము ఎంతో ఆహ్లాదకరమైన టూరిస్ట్ ప్రదేశము

21. హార్ల్స్ లీ హిల్స్...

21. హార్ల్స్ లీ హిల్స్...

source

హార్సిలీ హిల్స్ చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర ఉన్న ఒక విహారస్థలం. ఏనుగు మల్లమ్మ కొండ అనేది దీని అసలు పేరు.ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ వేసవి విడిది. ఆంధ్రా ఊటీ అని కూడా హార్ల్స్ లీ హిల్స్ ను పిలుస్తారు.

22. ఆంధ్రప్రదేశ్ లో కెల్లా ఎతైన ప్రదేశం ఇదే..

22. ఆంధ్రప్రదేశ్ లో కెల్లా ఎతైన ప్రదేశం ఇదే..

source

తూర్పు కనుమల లోని దక్షిణ భాగపు కొండల వరుసే ఇక్కడి కొండలు. హార్సిలీ హిల్స్ సముద్ర మట్టానికి 1,314 మీ. (4312 అ.) ఎత్తులో ఉంది. ఇది బెంగళూరు నుండి 160 కి.మీ., తిరుపతి నుండి 140 కి.మీ. దూరంలో ఉంది. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడు నుండి మండు వేసవిలో 32 డిగ్రీల సెంటీ గ్రేడు వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా ఎత్తైన ప్రదేశం హార్సిలీ హిల్స్ లోనే ఉంది.

23. చూడదగిన ప్రదేశాలు...

23. చూడదగిన ప్రదేశాలు...

source

ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఇక్కడి ప్రత్యేకతలు. 142 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ చెట్టు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. వన్యమృగ కేంద్రము, గవర్నర్ బంగ్లా జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషివ్యాలీ విద్యాలయము ఉంది.