Search
 • Follow NativePlanet
Share
» »మ‌న తెలంగాణ‌లోనూ ఓ న‌యాగర జ‌ల‌పాతం ఉందండోయ్‌!

మ‌న తెలంగాణ‌లోనూ ఓ న‌యాగర జ‌ల‌పాతం ఉందండోయ్‌!

ఆకాశంలో కారుమేఘాలు క‌మ్ముకుంటున్న వేళ‌... రోడ్డుకు ఇరువైపులా ప‌చ్చ‌ని చెట్లు, పైర్లు.. భూమికి ప‌చ్చ‌ని రంగేసిన‌ట్లు ఎటు చూసినా ప‌చ్చ‌ద‌నం సింగారించుకున్న అట‌వీ ప్రాంతం. అక్క‌డే ఉంది బొగ‌త జ‌ల‌పాతం. ఎత్త‌యిన రాతి గుట్ట‌ల గుండా నుర‌గ‌లు క‌క్కే స్వ‌చ్ఛ‌మైన నీటి ప్రవాహం దీని సొంతం. వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు ప‌ర్యాట‌క ప్రేమికులు కుటుంబ స‌మేతంగా ఇక్క‌డికి వాలిపోతారు. తెలంగాణ న‌యాగ‌రా జ‌ల‌పాతంగా పేరుగాంచిన బొగ‌త జ‌ల‌పాతం విశేషాలు మీకోసం..!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా కేంద్రం నుంచి 163 జాతీయ ర‌హ‌దారిపై సొంత వాహ‌నంలో మా ప్ర‌యాణం మొద‌లైంది. మొత్తం 130 కిలోమీట‌ర్లు ముందుకు సాగితే మా గ‌మ్యస్థానం చేరుకుంటాం. ములుగు జిల్లా వాజేడు మండ‌లం చీకుప‌ల్లి అట‌వీ ప్రాంతంలో బొగ‌త జ‌ల‌పాతం ఉంది. శ‌ని, ఆదివారాల్లో ఇక్క‌డ ప‌ర్యాట‌కుల తాకిడి ఎక్కువ‌గా ఉంటుందని తెలియ‌డంతో రెండ్రోజుల ముందే బ‌య‌లుదేరాం. జాతీయ ర‌హ‌దారిపై 105 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం త‌ర్వాత ఏటూరునాగారం వైజంక్ష‌న్ చేరుకున్నాం. మేం వెళ్ల‌బోయే అట‌వీ ప్రాంతంలో తినేందుకు ఏమీ దొర‌క‌వ‌ని మా డ్రైవ‌ర్ చెప్ప‌డంతో అక్క‌డే మా బృందానికి స‌రిప‌డా ఆహారం పార్శిల్ చేయించుకున్నాం. ప‌చ్చ‌ని అట‌వీ మార్గం గుండా అక్క‌డి నుంచి సుమారు 25 కిలోమీట‌ర్ల‌కు చీకుప‌ల్లి గ్రామంలోని బొగ‌త జ‌ల‌పాతం చేరుకున్నాం.

మ‌న తెలంగాణ‌లోనూ ఓ న‌యాగర జ‌ల‌పాతం ఉందండోయ్‌!

మ‌న తెలంగాణ‌లోనూ ఓ న‌యాగర జ‌ల‌పాతం ఉందండోయ్‌!

ఆకాశంలో కారుమేఘాలు క‌మ్ముకుంటున్న వేళ‌... రోడ్డుకు ఇరువైపులా ప‌చ్చ‌ని చెట్లు, పైర్లు.. భూమికి ప‌చ్చ‌ని రంగేసిన‌ట్లు ఎటు చూసినా ప‌చ్చ‌ద‌నం సింగారించుకున్న అట‌వీ ప్రాంతం. అక్క‌డే ఉంది బొగ‌త జ‌ల‌పాతం. ఎత్త‌యిన రాతి గుట్ట‌ల గుండా నుర‌గ‌లు క‌క్కే స్వ‌చ్ఛ‌మైన నీటి ప్రవాహం దీని సొంతం. వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు ప‌ర్యాట‌క ప్రేమికులు కుటుంబ స‌మేతంగా ఇక్క‌డికి వాలిపోతారు. తెలంగాణ న‌యాగ‌రా జ‌ల‌పాతంగా పేరుగాంచిన బొగ‌త జ‌ల‌పాతం విశేషాలు మీకోసం..!

ఇక్క‌డ భ‌ద్ర‌త‌కే మొద‌టి ప్రాధాన్య‌త‌..

ఇక్క‌డ భ‌ద్ర‌త‌కే మొద‌టి ప్రాధాన్య‌త‌..

తొల‌క‌రి జ‌ల్లులు ప‌ల‌క‌రించ‌గానే ప‌చ్చ‌ద‌నం తొడుక్కున్న అడ‌వి మాటున దాగిన ఆ జ‌ల‌పాత‌పు అందాల‌ను మాట‌ల్లో వ‌ర్ణించ‌డం క‌ష్ట‌మే. తెలంగాణ న‌యాగ‌రా జ‌ల‌పాతంగా పేరుగాంచిన బొగ‌త జ‌ల‌పాతం మ‌మ్మ‌ల‌ను ఎంత‌గానో ఆక‌ర్షించింది. ఎలాగో వీకెండ్ కాదు క‌దా! పెద్ద‌గా ర‌ద్దీ ఉండ‌దు అనుకున్న మా ఆలోచ‌న‌ల‌కు గండి ప‌డింది. అప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు అక్క‌డ ఎదుర‌య్యారు. అట‌వీ ప్రాంతం మ‌ధ్య‌లో ఉన్న ఈ జ‌ల‌పాతానికి కుటుంబ స‌మేతంగా రావటానికి చాలామంది కాస్త ఆలోచిస్తారు. కానీ, గ‌తంలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌లు దృష్టిలో ఉంచుకొని ఇక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కుల భ‌ద్ర‌త విష‌యంలో అట‌వీశాఖ అధికారులు అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. నేరుగా జ‌ల‌పాతంలో దిగి ఈత కొట్టేందుకు ఎవ్వ‌రినీ అనుమ‌తించ‌డం లేదు. అంతేకాదు, ప‌ర్యాట‌కుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా జ‌ల‌పాతం వ‌ద్ద ఓ కంచె ఏర్పాటు చేశారు. నిత్యం గ‌స్తీ కాస్తున్న‌ట్టు క‌నిపించారు. జ‌ల‌పాతంలో జ‌ల‌కాలాడాల‌ని మాకు ఉన్న‌ప్ప‌టికీ మ‌న భ‌ద్ర‌త కోసం వారు ప‌డుతోన్న క‌ష్టాన్ని చూసి ఆ ఆలోచ‌న‌ను మా మెద‌ళ్ల‌లోంచి చెరిపేశాం.

సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షించే ప్ర‌త్యేక కొల‌ను...

సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షించే ప్ర‌త్యేక కొల‌ను...

అంత దూరం వ‌చ్చి నీటిలో దిగి ఈత కొట్ట‌క‌పోతే ఎలా? అనుకునే వారికోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు ఉన్నాయండోయ్‌! జ‌ల‌పాతానికి అనుబంధంగా ప్ర‌త్యేక‌మైన చిన్ని నీటి కొల‌నును ఏర్పాటు చేశారు. అందులోనే మేమంతా కేరింత‌లు కొట్టాం. అక్క‌డి ప‌చ్చ‌ని ప్ర‌కృతితో పాటు ఎగిసిప‌డుతోన్న జ‌ల‌పాత‌పు అందాల‌ను మా మొబైల్ ఫోన్ల‌లో నిక్షిప్తం చేసుకున్నాం. కుటుంబ‌సభ్యుల‌తో విహారానికి వ‌చ్చే వారి కోసం చిన్న‌పిల్ల‌ల పార్కులు, దీంతో పాటు రోప్ వే సైక్లింగ్‌, విశ్రాంతి తీసుకునేందుకు ప్ర‌త్యేక‌మైన షెడ్ల‌ను ఏర్పాటు చేశారు. మ‌రెందుకు ఆల‌స్యం వ‌ర్ష‌కాలంలో ఉవెత్తున ఎగిసిప‌డుతోన్న తెలంగాణ న‌యాగర జ‌ల‌పాతాన్ని మీరు సంద‌ర్శించండి మ‌రీ.

ఎలా చేరుకోవాలి..

ఎలా చేరుకోవాలి..

రైలు మార్గంలో ఇక్క‌డికి చేరుకునేందుకు ప్ర‌ధాన న‌గ‌రాల‌కు అనుసంధానించ‌బ‌డిన వ‌రంగ‌ల్ రైల్వేస్టేష‌న్ అందుబాటులో ఉంది. హైద‌రాబాద్‌-న్యూఢిల్లీ, చెన్నై కోల్‌క‌త్తా మార్గంలో వ‌రంగ‌ల్ ఒక ప్ర‌ధాన రైల్వే జంక్ష‌న్‌గా ఉంది. అలాగే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల‌నుకునేవారు ఖ‌మ్మం నుంచి 243 కిలోమీట‌ర్లు , భ‌ద్రాచ‌లం నుంచి 123 కిలోమీట‌ర్లు తెలంగాణ రాజ‌ధాని హైద‌ర‌బాద్ నుంచి 280 కిలో మీట‌ర్లు ప్ర‌యాణించాల్సి ఉంటుంది.

  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X