Search
  • Follow NativePlanet
Share
» » నాగపంచమిరోజు ఇక్కడ ఇలా చేస్తే సంతానం ఖచ్చితం...సాక్షాత్తు శివుడు పార్వతికి చెప్పిన రహస్యం

నాగపంచమిరోజు ఇక్కడ ఇలా చేస్తే సంతానం ఖచ్చితం...సాక్షాత్తు శివుడు పార్వతికి చెప్పిన రహస్యం

నాగపంచమి గురించి కథనం.

నాగపంచమిని ఈ ఆగస్టు 15న జరుపుకొంటారు. నాగపంచమి రోజున ముఖ్యంగా నాగుపామును పూజిస్తారు. పామును ఆరాధించడం వేలాది సంత్సరాల నుంచి హిందు సంప్రదాయంలో వస్తున్న సంప్రదాయం. ముఖ్యంగా నాగపంచమి రోజున అనుసరించాల్సిన విధివిధానాలను గూర్చి సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీ దేవికి వివరించాడని స్కాందపురాణంలో చెప్పబడింది.

ఆ విధంగా చేయడం వల్ల వివాహ సమస్యలతో బాధపడుతున్న వారికి త్వరగా వివాహమవుతుందని చెబుతారు. ముఖ్యంగా సంతానలేమితో బాధపడేవారికి వెంటనే ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. వినికిడి సమస్యలు కూడా తీరిపోతాయని చెబుతారు. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో మీ కోసం. అంతే కాకుండా నాగుల పంచమిని విశేషంగా జరుపుకొనే కొన్ని పుణ్యక్షేత్రాలతో పాటు ఆ పర్యాటక కేంద్రాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

నాగపంచమి రోజున నాగ ప్రతిమకు పంచామ`తము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసము నివేదింస్తారు.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ముక్కంటి పార్వతికి వివరించినట్లు స్కాందపురాణాల్లో పేర్కొనబడింది. అందువల్లే చాలా మంది నాగపంచమిని చాలా విశిష్టమైన రోజుగ భావిస్తారు.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

ఆ రోజున భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రం, నాగేంద్రస్వామి, బంగారు, వెండి తో చేసిన పాము పడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి రంగు గల పూలు సిద్ధం చేసుకొంటారు.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్లు, వడపప్పు, అరటిపండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతే కాకుండా ఈ రెండు ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో 7 వత్తులతో నేతితో దీపాన్ని వెలిగించాలి.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

నాగ పంచమి రోజు ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. పూజ చేసే మయంలో నుదుట కుంకుమను ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

ఓం నాగరాజాయనమ: అన్న మంత్రాన్ని 108 మార్లు జపించాలి. నాగ ప్రతిమ లేదా నాగేంద్రస్వామి చిత్రపటానికి కర్పూర హారతులు ఇచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

అటు పై నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్యపూజ, నాగదోష పరిహార పుస్తకాలను తాంబూలాలను, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్య దోషాలన్ని తొలిగిపోతాయి.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

ఈ క్షేత్రంలో ఆశ్లేష బలిపూజ, సుబ్రమణ్య స్వామి కాల సర్పదోషం, కుజ దోష పూజలు నిర్వహిస్తారు. అదే విధంగా సర్ప సంపస్కార దోష పూజలు కూడా ఎక్కవగా జరుగుతాయి. ఇందు కోసం ముందుగానే పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

అటు పై పండంటి సంతానం కలుగుతుందని శివుడు తన భార్య పార్వతికి చెప్పాడు. సంతాన, వివాహ సమస్యలే కాకుండా వినికిడి సమస్యలు ఉన్నవారికి కూడా పరిహారం దక్కుతుందని భక్తులు నమ్ముతారు.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

నాగపంచమి రోజున ముఖ్యంగా సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్న క్షేత్రాల్లో భక్తులు పూజలు చేస్తారు. దక్షిణ భారత దేశంలో సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్న క్షేత్రాలు చాలా ఉన్నాయి.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని క`ష్ణాజిల్లా దివి సీమకు చెందిన ఒక మండలం మోపీదేవి. ఇది మచిలీపట్టణం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి మోహినీపురమని, సర్పక్షేత్రమని కూడా పేరు.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

ఘాటీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం కర్నాటకలోనే కాకుండా దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రచూర్యం పొందిన సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం. ఇది బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో దొడ్దబళాపురం దగ్గర ఉంది. ఇక్కడ స్వామి స్వయంభువువు.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

సుప్రసిద్ధ శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం కూడా కర్నాటకలోనే ఉంది. దక్షిణ కన్నడ జిల్లా, సుల్యా తాలూకాలోని సుబ్రమణ్య అనే గ్రామంలో శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంది.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

పశ్చిమ కనుమల్లో కుమార పర్వతం దగ్గర ఉన్న ఈ దేవాలయానికి నాగపంచమి రోజున ఒక్క కర్నాటక నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

నాగపంచమి

నాగపంచమి

P.C: You Tube

గరుడికి భయపడిన దివ్య సర్పం అయిన వాసుకి సుబ్రమణ్యం చెంత శరణు పొందాయని స్థానిక పురాణ కథనం. కేవలం ఈ పుణ్యక్షేత్రాల్లోనే కాకుండా భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ నాగపంచమిని ఘనంగా జరుపుకొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X