» »ఆ ఊరంతా చేతబడి చేసేవాళ్ళే - క్షుద్రమాంత్రికులు మటుకే ఉండే ఊరు !

ఆ ఊరంతా చేతబడి చేసేవాళ్ళే - క్షుద్రమాంత్రికులు మటుకే ఉండే ఊరు !

తాంత్రిక విద్య లేక బ్లాక్ మ్యాజిక్ అని పిలువబడే ఈ విద్యను అభ్యసించిన వారిని మంత్రగాళ్ళు అని అంటారు. సాధారణంగా మన గ్రామాలలో మారుమూల ప్రదేశాలలో ఈ మంత్రగాళ్ళు ఉంటారని మనకు తెలుసు. అలాంటి వాళ్ళు ఒక ప్రాంతం మొత్తం వున్నారంటే ఆ ప్రాంతపు దరిదాపుల్లోకి వెళ్ళం. అయితే ఈ గ్రామంలో ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం పూర్తి గ్రామమే మంత్రగాళ్ళతో నిండివుంవుంటుందంటే మీరు నమ్మగలరా!

భారతదేశంలోనే అతి పొడవైన ధోలా సదియా బ్రిడ్జి ఎక్కడుందో మీకు తెలుసా ?

మరి ఈ విషయం తెలుసుకోవాలంటే మనం ఒకసారి అస్సాం వెళ్ళాల్సిందే. మన ఈశాన్య భారతంలోని అతి ముఖ్యమైన రాష్ట్రం అస్సాం. ఈ అస్సాం ముఖ్యపట్టణమైన గౌహతికి సుమారు 40 కి.మీ ల దూరంలో మయోంగ్ అనే గ్రామం వుంది.

భారత్ లో ప్రమాదకరమైన ప్రదేశాలు మీకు తెలుసా ?

చుట్టూ పచ్చటి అడవులతో, కొండకోనలతో ఎంతో అందంగా వుండే ఈ ప్రాంతం ఒళ్ళు గగుర్పొడిచే భయానక క్షుద్రవిద్యను ప్రయోగించే మంత్రగాళ్ళతో నిండివుంది. ఈ ప్రాంతానికి ఈ పేరు రావటానికి చాలా కథలు వున్నట్లు అక్కడి వారు చెప్పిన దానిబట్టి తెలుస్తుంది. కొంతమంది వాదన ప్రకారం ఈ ప్రాంతానికి మాయా అనే సంస్కృత పదం నుండి ఈ పేరు వచ్చినట్లు చెబుతుంటే మరి కొంత మంది ఈ ప్రాంతానికి మా - ఎర్ - ఒంగో నుంచి వచ్చిందని చెపుతున్నారు.

తర తరాలుగా చేతబడి చేస్తున్న గ్రామం

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ఘటోత్కచుడి రాజ్యం

1. ఘటోత్కచుడి రాజ్యం

ఈ ప్రాంతం యొక్క చరిత్ర గురించి ఎవ్వరికీ సరిగా తెలియకపోయినా అక్కడి వారు చెపుతున్న దాని ప్రకారం పూర్వం మహాభారత కాలంలో ఘటోత్కచుడి రాజ్యం ఈ ప్రాంతంలోనే వుండేదని, ఆ కాలంలో మంత్ర విద్యలు, క్షుద్రవిద్యలపై తన సైన్యానికి ఈ మయోంగ్ ప్రాంతంలో శిక్షణ ఇప్పించేవాడని అంటారు.

అస్సాం లో ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్కులు !!

PC:youtube

2. తరతరాలుగా

2. తరతరాలుగా

అందుకనే అప్పటినుంచి ఈ ప్రాంతంలో మంత్రగాళ్ళు స్థిరనివాసం ఏర్పరచుకుని తమ మంత్ర విద్యను తరతరాలుగా కొనసాగిస్తున్నారని అక్కడి వారు చెబుతున్నారు.అయితే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతం మంత్రవిద్యలకు ఒక విశ్వవిద్యాలయంగా బాసిల్లినట్లు తెలుస్తుంది.

శిబ సాగర్ - కరుణించే శివుని సముద్రం !

PC:youtube

3. మయోంగ్

3. మయోంగ్

పూర్వం ఈ ప్రాంతానికి క్షుద్రవిద్యలు నేర్చుకోవడానికి చాలా ప్రదేశాల నుంచి వచ్చేవారట. మయోంగ్ లో మంత్రగాళ్ళకు సంబంధించిన చాలా కథలు ప్రాచుర్యంలో వున్నాయి. పూర్వం ఇక్కడ ఒక శక్తివంతమైన మంత్రవిద్యలు పొందటానికి నర బలులుకూడా ఇచ్చేవారట.

ప్రతి ఏటా రుతుస్రావము ఆచరించే దేవత !

PC:youtube

4. అఫీషియల్ గా రికార్డ్

4. అఫీషియల్ గా రికార్డ్

అయితే ఇప్పుడు ఈ నర బలులు ఎవ్వరూ చేయటంలేదు. కానీ కొంతమంది వాదన ప్రకారం ఇంకా అక్కడ అడవులలో కొంతమంది మంత్రగాళ్ళు చిన్నపిల్లల్ని ఈ మంత్ర విద్యల్ని పొందటానికి బలులు ఇస్తున్నారని అయితే అలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో అఫీషియల్ గా రికార్డ్ కాలేదు.

ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ... మజులి !!

PC:youtube

5. కొన్ని వందల సంవత్సరాల క్రితమే

5. కొన్ని వందల సంవత్సరాల క్రితమే

ఇది ఇలా వుంటే ఇక్కడి మంత్రగాళ్ళు మంత్రవిద్యతో ఈ మనిషినైనా జంతువుగా మార్చగలరని అవసరమైతే చంపగలరని చెపుతున్నారు. ఈ ఊరిలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ మంత్ర విద్యలపై కొన్ని గ్రంథాలు కూడా రాసారు.

శిబ సాగర్ - కరుణించే శివుని సముద్రం !

PC: youtube

6. ప్రకృతిని సైతం

6. ప్రకృతిని సైతం

వాటిలో మనిషిని మాయం చేయటం, ప్రకృతిని సైతం తన వశం చేసుకోవటం, ప్రపంచంలో వున్న వివిధ నిధులను బయటకు రప్పించటం లాంటి వాటి గురించి రాసి వుందని అక్కడివారంటారు. అయితే ఈ తరంవారు ఆ గ్రంథాలలో రాసిన మంత్రాన్ని ఎలా చదవాలి,వాటిని ఎలా ఉపయోగించాలి అనే విధానాన్ని తెలుసుకోలేకపోతున్నారంట.

కామాఖ్య ఆలయం - నరకాసురుడు కట్టించిన దేవాలయం !

PC:youtube

7. పూర్వికులు

7. పూర్వికులు

ఇప్పటికీ చాలామంది ఈ మంత్రాల యొక్క గుట్టు విప్పడానికి రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారట. అక్కడున్న మంత్రగాడు ఒక ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో తాను చిన్నతనం నుంచి ఈ మంత్రవిద్యను అభ్యసిస్తున్నానని, తన పూర్వికులు కూడా ఇదే పని చేసేవారని చెప్పాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ... మజులి !!

PC:youtube

8. బెజ్ లేదా ఓజ

8. బెజ్ లేదా ఓజ

అంతేకాదు, ఇప్పుడు తనకు ఎవరూ లేరని తన ఇంట్లో వుండే దెయ్యాలే తనకు కావలసిన అన్ని పనులు చేస్తాయని చెప్పాడు. అతని మాటల్లో ఎంత నిజముందో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ మంత్రవిద్యలను అభ్యసించే మంత్రగాళ్ళను 'బెజ్ లేదా ఓజ' అని అంటారు.

ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ... మజులి !!

PC:youtube

9. మయోంగ్ - పోబిటోరా అనే పండుగ

9. మయోంగ్ - పోబిటోరా అనే పండుగ

అంతే కాదు ఇక్కడ ప్రజలు క్షుద్రదేవతలను సంతృప్తి పరచటానికి ప్రతిసంవత్సరం మయోంగ్ - పోబిటోరా అనే పండుగను కూడా చేసుకుంటారు. ఆ పండుగరోజు గ్రామంలో ఆడ,మగ,చిన్న,పెద్ద అందరూ ఒక చోట చేరి వారి క్షుద్రదేవతలను స్తుతిస్తూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ కల్లు,మాంసం వంటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు.

శ్రీవారి ఆలయం చేరుకోవటానికి ఎన్ని నడకదారులు ఉన్నాయో తెలుసా ?

PC:youtube

10. మ్యూజియం

10. మ్యూజియం

ఆ తరువాత ఊరు మొత్తం తిరుగుతూ రంగులు జల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు.ఈ వూరిలో ఒక మ్యూజియం కూడా వుంది. దీన్ని మయోంగ్ సెంట్రల్ మ్యూజియంగా పిలుస్తారు.

బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసిన రవ్వలకొండ ప్రదేశం !

PC:youtube

11. టూరిస్ట్ ల సందర్శనార్ధం

11. టూరిస్ట్ ల సందర్శనార్ధం

ఈ మ్యూజియంలో పూర్వకాలంలో అక్కడ మంత్రగాళ్ళు ఉపయోగించిన వస్తువులను టూరిస్ట్ ల సందర్శనార్ధం వుంచారు. ఇదిలా వుంటే అక్కడ ప్రజలకు క్షుద్రవిద్యలు మాత్రమే కాకుండా మ్యాజిక్ ట్రిక్స్ మీద, ఆయుర్వేదం మీద బాగా పట్టుందట.

భారతదేశంలో భగవద్గీత మహాభారతం జరిగిన ప్రదేశాలు !

PC:youtube

12. మ్యాజిక్ షో

12. మ్యాజిక్ షో

ఈ ప్రాంతంలోని చాలా మంది దేశంలోని వివిధ ప్రాంతాలలో మ్యాజిక్ షోలు నిర్వహిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు.అంతే కాకుండా వీరి వద్దకు ఎవరైనా అనారోగ్యంతో వెళ్తే వారి బాధల్ని ఆ మంత్రాలతో తగ్గిస్తారట.

బెంగళూరు లో తప్పక చూడవలసిన 30 ప్రదేశాలు !!

PC:youtube

13. రాగిపళ్ళెం

13. రాగిపళ్ళెం

ఉదాహరణకు మీకు నడుం నొప్పి వుండి దాని నివారణకు వీరి వద్దకు వెళ్తే మీ వీపు పైన ఒక రాగిపళ్ళెం అతికించి ఏవో కొన్ని మంత్రాలు చదువుతారు. ఇలా కొన్ని రోజులపాటు వారు చెప్పిన సమయానికి ఈ విధంగా చేయించుకుంటే మీకు వున్న నడుంనొప్పి పోతుందట.

శృంగారభరిత సన్నివేశాల కేరాఫ్ ... పొల్లాచి !

PC:youtube

14. ప్రజల జీవితం

14. ప్రజల జీవితం

అయితే అక్కడి ప్రభుత్వం ఆ ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంతో అక్కడి ప్రజల జీవితం దారిద్ర్యరేఖకు దిగువున వుండటంతో ఇప్పుడు చాలామంది ఈ వృత్తిని వదిలేసి పొలంపనులు చేసుకోవడమో లేక వలస కార్మికులుగా మారటమో చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి బీచ్ లు కూడా ఉన్నాయా?

PC:youtube

15. క్షుద్రవిద్యల రాజధాని

15. క్షుద్రవిద్యల రాజధాని

ఒకప్పుడు క్షుద్రవిద్యల రాజధానిగా వెలిగిన ఈ ప్రాంతంలో ప్రజలు ఇప్పుడు ఆర్ధికఇబ్బందులతో చాలా బాధలు పడుతున్నారు.

శివుడు తలదాచుకున్న చీకటి గుహ .. చాలామందికి తెలీదు !

PC:youtube