• Follow NativePlanet
Share
» »భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

క్రీ.శ. 629 లో నిర్మించిన చేరామన్ జమా మసీద్ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన మసీదు. ఇది కొండగలూర్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన ధార్మిక కేంద్రం. దీనిని మాలిక్ బిన్ దీనార్ కట్టించారు. ఈయన మహమ్మద్ ప్రవక్త అనుయాయుడు, భారత్ కు వచ్చిన మొదటి సహాబీ, వర్తక మరియు ధార్మిక ప్రచారకర్త.

చేరామన్ మస్జీద్, భారతదేశంలోని మొట్టమొదటి మస్జిద్. దీనిని చేరామన్ జుమా మస్జిద్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రార్థనా స్థలం కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలోని చిన్న పట్టణం కొడుంగలూర్ లో కలదు. ఈ కొడుంగలూరు మలబార్ తీరంలో ఉన్నది. చేరామన్ మస్జిద్ కు 'ప్రపంచంలో రెండవ అతి ప్రాచీన మసీద్' గా గుర్తించారు.

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

మాలిక్ బిన్ దీనార్ సమాధి

మాలిక్ బిన్ దీనార్ క్రీ.శ. 8 వ శతాబ్దం ఆరంభంలో మరణించారు. ఈయన కేరళ కాసర్గోడ్ లోని తలంగర లో మరణించినట్లు తెలుస్తుంది. అయన సమాధి అక్కడే ఉన్న మాలిక్ దీనార్ గ్రాండ్ జమా మసీద్ లో దర్శించవచ్చు. కాసర్గోడ్ ఊరి మధ్యలో గల తెరువత్ మసీద్ కూడా సందర్శించదగ్గదే! తలంగర కాసర్గోడ్ కు పశ్చిమాన మరియు కాసర్గోడ్ రైల్వే స్టేషన్ కు చేరువలో కలదు. ఇక్కడ తలంగార బీచ్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

చిత్రకృప :Sidheeq

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

ఉర్సు మాలిక్ బిన్ దీనార్

ఉర్సు ను భారతీయ ముస్లిం లు ఒక పండుగ గా జరుపుకుంటారు. కేరళ రాష్ట్రంలో ముస్లిం ప్రజలందరూ ఈ ఉరుసు కార్యక్రమానికి భక్తిశ్రద్దలతో హాజరవుతారు. ఈ ఉరుసు సాధారణంగా మొహర్రం మాసంలో జరుగుతుంది. జియారత్, పటకాయర్తల్ లేదా జెండా ఎగరేయటం మరియు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి.

చిత్రకృప :Ashrafnlkn

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

చేరామన్ జమా మస్జిద్ మలిచరిత్ర

చరిత్రానుసారం క్రీ.శ. 1341 లో వచ్చిన వరద ఈ మసీదు ని చాలా మేరకు ధ్వంసం చేసింది. నేడు మనం చూస్తున్న చేరామన్ జమా మసీదు కొత్తగా నిర్మించబడింది. మసీదు నిర్మాణం గుర్తించ తగ్గది.

చిత్రకృప :Challiyan

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

నిర్మాణ సౌందర్యం

హిందూ దేవాలయాల శైలి, ఆకృతిని అనుసరిస్తుంది. మసీదు మధ్యలో ఒక నూనె దీపం వెలుగుతూ ఉంటుంది. మంగళప్రదమైన రోజుల్లో మత విశ్వాసాలకి అతీతంగా ప్రజలందరూ ఈ దీపం కొరకు నూనె తెస్తారు. మసీదు లో పెట్టబడిన ఇత్తడి నూనె దీపాలు నిర్మాణ సౌందర్యానికి మరింత వన్నె తెస్తాయి.

చిత్రకృప :Sherenk

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

మక్కా పాల రాయి

అద్భుతమైన చెక్కడాలు గల నూకమాను (రోజ్ వుడ్) వేదిక మిక్కిలి ఆకర్షణీయంగా ఉంటుంది. మక్కా నించి తెప్పించబడినిది గా నమ్ముతున్న పాల రాయి ముక్క మసీదు లో ఉంచబడింది. చేరామన్ జమా మసీదు భారతదేశం లోని మహమ్మదీయ చరిత్ర లో ప్రముఖ భూమిక పోషిస్తుంది. కొడంగలూర్ వెళ్ళిన యాత్రికులు దీనిని తప్పక సందర్శించాలి.

చిత్రకృప :Shahinmusthafa

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

సందర్శకులు

దేశవిదేశాలకు చెందిన అనేక సందర్శకులు ఈ మస్జిద్ ను సందర్శించడానికి వస్తారు. భారత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె.అబ్దుల్ కలాం కూడా సందర్శించారు.

చిత్రకృప : Fotokannan

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

చేరామన్ మస్జీద్ సమీప సందర్శనీయ స్థలాలు

కులమతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని దర్శించేవారు క్రీ.శ. 52 లో సెయింట్ థామస్ అడుగుపెట్టిన సైట్ ను, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న భగవతి ఆలయం ను చూడవచ్చు. చిత్రకృప :Koshy Koshy చేరామన్ మస్జీద్ సమీప సందర్శనీయ స్థలాలు అర కిలోమీటర్ దూరంలో మహాదేవ ఆలయం, చేర రాజుల ప్రాచీన ప్యాలెస్ లను వీక్షించవచ్చు. కొడుంగలూర్ ప్రజలు స్నేహస్వభావులు మరియు హెల్పింగ్ నేచర్ కలవారు.

చిత్రకృప :Aruna Radhakrishnan

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

వసతి

కొడుంగలూర్ లో వసతి సదుపాయాలు అనుకూలంగా ఉంటాయి. గదుల అద్దె మధ్యతరగతి వారికి సరిపోతుంది. భాష తెలియదు కదా అని గాబరపడకండి ఇక్కడి ప్రజలు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతారు.

చిత్రకృప :Rajeev Nair

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో ఫస్ట్ మసీద్ ఎక్కడుందో తెలుసా?

కొడుంగలూర్ ఎలా చేరుకోవాలి ?

కొడుంగలూరు ను సందర్శించే పర్యాటకులకు కొచ్చి అన్ని విధాలా అనుకూలమైనది. కొచ్చి ఎయిర్ పోర్ట్ కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే కలదు. ఎయిర్ పోర్ట్ నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో కొడుంగలూర్ చేరుకోవచ్చు. 122 కి. మీ ల దూరంలో కాలికట్ ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కూడా కలదు.

రైలు మార్గం

రైలు మార్గం గుండా వచ్చే పర్యాటకులు ఇరింజలకూడ (14 కి. మీ) లేదా చలకుడి (17 కి. మీ) రైల్వే స్టేషన్ వద్ద దిగి ప్రభుత్వ బస్సులలో లేదా అద్దె వాహనాలలో ప్రయాణించి కొడుంగలూర్ చేరుకోవచ్చు.

బస్సు మార్గం

త్రిస్సూర్, కొచ్చి, చలకుడి, పాతానం తిట్ట తదితర ప్రాంతాల నుండి వచ్చే ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు కొడుంగలూర్ వద్ద ఆగుతాయి.

చిత్రకృప :Aruna

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి