Search
  • Follow NativePlanet
Share
» » కళ్లను మిరుమిట్లుగొలిపే అందాలకు నిదర్శనం రాన్ ఆఫ్ కచ్

కళ్లను మిరుమిట్లుగొలిపే అందాలకు నిదర్శనం రాన్ ఆఫ్ కచ్

కళ్లను మిరుమిట్లుగొలిపే అందాలకు నిదర్శనం రాన్ ఆఫ్ కచ్

భౌగోళిక పరంగా విభిన్న సంస్కృతులు కలిగిన గుజరాత్ రాష్ట్రం ఇండియాకు పడమటి భాగంలో ఉంది. సింధు నాగరికతకు ఈ ప్రదేశం పెట్టింది పేరు. మన భారత చరిత్రలో పూర్తి భాగం ఒక సాంస్కృతిక మరియు వాణిజ్య కేంద్రంగా పేరు తెచ్చుకుంది. మనకు స్వాతంత్రం తెచ్చి పెట్టిన మహాత్మా గాంధీ ఈ రాష్ట్రానికి చెందిన వాడే. భౌగోళిక వైవిధ్యం కల గుజరాత్ రాష్ట్రంలో కచ్ లోని ఉప్పు కయ్యలు, బీచ్ లు మరియు గిర్నార్, సపూతర ప్రదేశాలలోని పర్వత శ్రేణులు పర్యాటకులకు పూర్తి గా ఆహ్లదకరమైన వాతావరణంలోకి మార్చేస్తాయి.

మన భారత దేశంలోనే అతి పెద్ద జిల్లా గుజరాత్ లోని కచ్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కుట్లు, అల్లికల్లో కళ్ళు చెదిరే నైపుణ్యం అక్కడ మహిళల సొంతం. కచ్ వర్క్ వచ్చి ఉండడమంటే ఎంబ్రాయిడరీలో పిహెచ్‌డి చేసినంత గొప్ప అన్నమాట. అలాంటి కచ్‌కు ఓ సారి టూర్‌కెళ్తే ఎలా ఉంటుంది? కచ్‌వర్క్ దుస్తుల్లో మునిగితేలినట్లు ఉంటుంది. కేవలం ఆడవాల్లే కాదు, సృజనాత్మకతలో మగవాళ్లు కూడా మేమేం తక్కువ కాదు అంటారు, కలపతో కళాత్మక వస్తువుల అలవోకగా తయారుచేస్తారు. వర్షకాలంలో ఇక్కడ ఎడారి సరస్సు సముద్ర జలాలలో కనువిందు చేస్తూ ఆహ్లాదపరుస్తుంది. ఈ సరస్సు విస్తీర్ణం సుమారు ఏడున్నరవేల కిలో మీటర్లకు పైగా ఉంటుంది. శరత్కాల వెన్నెలలో ఉప్పూరి, మంచు ఎడారిలా కనువిందు చేస్తుంది. ఆ అద్భుతాన్నే వైట్ రణ్ అంటారు.

గుజరాత్ రాష్ట్రంలో కచ్ ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం

గుజరాత్ రాష్ట్రంలో కచ్ ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం

గుజరాత్ రాష్ట్రంలో కచ్ ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. కచ్ గుజరాత్‌లో ఓ జిల్లా. దేశానికి చివరగా ఉంటుంది. ఒకవైపు పాకిస్థాన్‌, ఒకవైపు అరేబియా సముద్రం ఉంటాయి. అరేబియా సముద్రం ఇక్కడ అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి ఉంటుంది. దాంతో జిల్లాలో మూడు వంతుల తీరం అరేబియాతోనే అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో రన్ ఆఫ్ కచ్ ప్రత్యేకమైంది.

రన్ అంటే ఎడారి. ఇది ఉప్పు ఎడారి.

రన్ అంటే ఎడారి. ఇది ఉప్పు ఎడారి.

రన్ అంటే ఎడారి. ఇది ఉప్పు ఎడారి. మనకు ఉప్పుటేరు, ఉప్పు కాల్వలే తెలిసి ఉంటాయి. కానీ ఉప్పుటెడారి మన తూర్పు తీర ప్రాంతం వాళ్ల ఊహకు అందని విషయమే. ఈ ఉప్పుటెడారి ఏడు వేల ఐదొందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది.

 ప్రపంచంలోనే పెద్ద ఉప్పుటెడారి.

ప్రపంచంలోనే పెద్ద ఉప్పుటెడారి.

ప్రపంచంలోనే పెద్ద ఉప్పుటెడారి. ఈ చరిత్ర, భౌగోళిక శాస్త్రం కోసం కాదు అక్కడికి వెళ్లాల్సింది. విస్తారమైన తెల్లటి ఎడారిలో సూర్యస్తమయాన్ని చూడడానికి, నిండు పున్నమి వెన్నెలలో ఉప్పుటెడారిలో విశ్రమించడానికి వెళ్లాలి.

 సూర్యాస్తమయాలు కళ్లను మిరుమిట్లు గొలుపుతుంటాయి

సూర్యాస్తమయాలు కళ్లను మిరుమిట్లు గొలుపుతుంటాయి

సూర్యాస్తమయాలు కళ్లను మిరుమిట్లు గొలుపుతుంటాయి. తదేకంగా చూస్తే కళ్లు చెదురుతాయి కూడా. పండు వెన్నెలలో ఇక్కడి గుడారాల్లో నైట్ స్టే చేయడం అనే ఊహే మనసును నిలవనీయదు.

ఇంత అందమైన ప్రదేశం కావడంతోనే అనేక సినిమాలకు ఇది షూటింగ్ లొకేషన్ అవుతోంది. తెలుగులో మగధీర, సరైనోడు సినిమాల షూటింగ్ కూడా జరిగింది.

ఏటా ఇక్కడ రణ్ ఉత్సవ్ ను ఘనంగా జరుపుకుంటారు

ఏటా ఇక్కడ రణ్ ఉత్సవ్ ను ఘనంగా జరుపుకుంటారు

ఏటా ఇక్కడ రణ్ ఉత్సవ్ ను ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాలు ఒకటి రెండు రోజులు కాదు, ఒకటి రెండు వారాలూ కాదు. ఏకంగా మూడు నెలలు జరుగుతాయి. టెంట్ విలేజ్ నుండి ఉప్పుటెడారి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. రకరకాలైన ప్రయాణ సాధానాల ద్వారా పర్యాటకులు వైట్ రణ్ కు చేరుకుంటారు. ఒంటెలపై వెళ్లేవారు వెళుతుంటారు. ఒంటెల బండిపై ఊరేగింపుగా కూడా వెళుతుంటారు. ఇంకొదరు టెంట్ విలేజ్ నుండి మోటార్ బైక్ లపై చిత్రవిచిత్రమైన అలంకరణతో వెళుతుంటారు.

 పున్నమి రేయిలో లవణసీమంతా లావణ్యభరితంగా మారిపోతుంది.

పున్నమి రేయిలో లవణసీమంతా లావణ్యభరితంగా మారిపోతుంది.

ఓపెన్ టాప్ బస్సులో సాగే రన్ సఫారీ ఒక మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. శుక్లపక్షంలో చంద్రుడు పెరిగే కొద్దీ, రణ్ ఉత్సవ్ లో సందడి పెరుగుతుంది. పున్నమి రేయిలో లవణసీమంతా లావణ్యభరితంగా మారిపోతుంది. ఇక ఇక్కడ పర్యటనకు వచ్చే వారు ప్రకృతి ప్రసాదించిన మధురక్షణాలను కెమెరాల్లో బంధిస్తుంటారు.

ఇక ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి

ఇక ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి

ఇక ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి ఈ రణ్ ఉత్సవ్ లో తీరికే ఉండదు. ఎప్పుడూ తమ కెమరాకు పనిచెబుతూనే ఉంటారు. వైట్ రణ్ కు దగ్గర్లో అనేక సాహస క్రీడల వేదికలు కూడా ఉంటాయి. రాక్ క్లైంబింగ్, పారా సైలింగ్, ర్యాపెలింగ్ వాల్ వంటికి యువతను రారమ్మని పిలుస్తుంటాయి.

ఇందులో విదేశీయులు కనీసం 30 శాతం మంది

ఇందులో విదేశీయులు కనీసం 30 శాతం మంది

ఇందులో విదేశీయులు కనీసం 30 శాతం మంది ఉంటారు. వీరి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ ఉంది. పర్యాటకుల కోసం ఉప్పు సరస్సుకు సమీపంలో ఉన్న థోర్డో గ్రామంలో తాత్కాలికంగా బస ఏర్పాటు చేస్తారు.

కచ్‌కి వెళ్లి షాపింగ్ చేయకుండా వస్తే

కచ్‌కి వెళ్లి షాపింగ్ చేయకుండా వస్తే

కచ్‌కి వెళ్లి షాపింగ్ చేయకుండా వస్తే మనవాళ్లు విచిత్రంగా చూస్తారు. కచ్ వర్క్ కోసం ఇక్కడ వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటే అక్కడ స్థానికంగా దొరికే డిజైన్లను కొనుక్కోకుండా వెనక్కి రావడం కష్టమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X