Search
  • Follow NativePlanet
Share
» »వజ్రాయుధం తయారైన ప్రాంతం చూశారా?

వజ్రాయుధం తయారైన ప్రాంతం చూశారా?

భారత దేశంలో ఉన్న ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాలు ఏదో ఒక కాలానికి చెందినవై ఉంటాయి. అయితే కొన్ని క్షేత్రాలు మాత్రం అటు కతయుగానికి త్రేతాయుగానికి, ఇటు ద్వాపరయుగానికి, అటు పై కలియుగానికి కూడా చెందినవై ఉంటాయి. అటువంటి కోవకు చెందినదే మనం చెప్పుకోబోయే కథనం. దానవుల పై దేవతలు విజయం సాధించడానికి అవసరమైన వజ్రాయుధం తయారైన ప్రదేశం ఇదే. అదే విధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అశ్వమేథ యాగానికి ఎన్నుకోబడిన ప్రదేశం కూడా ఇదే. ఇక ద్వాపర యుగంలో బలరాముడి అంతటివాడికి బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టిన ప్రదేశం కూడా ఇదే. కలియుగంలో పాపాలను పోగొట్టే పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇందుకు సంబంధించించిన కథనం.

గోమతి నది ఒడ్డున

గోమతి నది ఒడ్డున

P.C: You Tube

నిమి అంటే చక్రం, అరణ్యం అంటే అడివి. ఒక పెద్ద చక్రం అటవీ ప్రాంతంలోకి వచ్చి విరిగిపోయిన ప్రదేశం కనుకనే ఇది నైమిశారణ్యం అయింది. నైమిశారణ్యం ఉత్తర ప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్కోకు 94 కిలోమీటర్ల దూరంలో గోమతి నది ఉంది.

కలియుగ ప్రభావం లేని ప్రాంతం

కలియుగ ప్రభావం లేని ప్రాంతం

P.C: You Tube

ఈ ప్రాంతానికి ఈ పేరు రావడానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయితే. వీటో చాలా ప్రాచూర్యంలో ఉన్న పురాణం ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత, కలియుగం ప్రారంభమయ్యే సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేవని పవిత్ర ప్రదేశాన్ని తాము యాగం నిర్వర్తించేందుకు చూపమని అర్థించారు.

బ్రహ్మ దేవుడు

బ్రహ్మ దేవుడు

P.C: You Tube

దీంతో బ్రహ్మదేవుడు దర్భలతో ఓ పెద్ద చక్రాన్ని స`ష్టించి ఆ చక్రం వెంట కదిలివెళ్లాల్సిందిగా సూచిస్తాడు. ఆ చక్రం ఏ ప్రదేశంలో విరిగిపోతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనదని, యాగం చేయడానికి అర్హత కలిగినదని చెబుతారు.

లింగాకృతిలో

లింగాకృతిలో

P.C: You Tube

దీంతో చక్రం ప్రస్తుతం నైమిశరణ్యం ఉన్న చోటుకు రాగానే పెద్ద శబ్దంతో విరిగిపోతుంది. ఆంతేకాకుండా ఆ చక్రం విరిగిపోయన చోటు నుంచి ఉద`త రూపంలో జలం ఉద్భవించి లింగాక`తిలో పొంగి ప్రవహిస్తుంది.

లలితా దేవి ఆలయంగా

లలితా దేవి ఆలయంగా

P.C: You Tube

దీంతో మునులు ఆ ఆది పరాశక్తిని పూజించగా ఆ జల ఉద`తిని ఆపివేస్తుంది. కాల క్రమంలో ఆ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లలితా దేవి ఆలయంగా పేరుగాంచింది. ఆ చక్రం ఆగి విరిగిపడిన ప్రాంతం చక్రతీర్థం అయ్యింది.

మహాభారతం రచించింది ఇక్కడే

మహాభారతం రచించింది ఇక్కడే

P.C: You Tube

నైమిశారణ్యంలోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించినట్లు చెబుతారు. హమాభారతంతో పాటు రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్యం ప్రస్తావన ఉంది. నైమిశారణ్యం వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటి.

వనరూపిగా ఉన్న స్వామివారు

వనరూపిగా ఉన్న స్వామివారు

P.C: You Tube

ఇక్కడ వనరూపిగి ఉన్న స్వామివారు ప్రధాన దైవం. నైమిశనాథ దేవాలయంలో స్వామివారు కొలువై ఉంటారు. వేంకటేశ్వరుడి విగ్రహాన్ని పోలిన నల్లని విగ్రహం చూడటానికి మనోహరంగా ఉంటుంది. శ్రీరాముడు అశ్వమేథ యాగం చేసింది ఇక్కడే అని చెబుతారు.

శ్రీరాముడు

శ్రీరాముడు

P.C: You Tube

అంతేకాకుండా లవకుశులను కలుసుకొన్న ప్రాంతం కూడా ఇదేనని స్థానికులు చెబుతారు. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి సీతాపురమని చెబుతారు. శుక్రాచార్యుల ద్వారా ఈ క్షేత్ర పవిత్రత తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్లు చెబుతారు.

మొదటిసారిగా మహాభారతాన్ని వినిపించింది

మొదటిసారిగా మహాభారతాన్ని వినిపించింది

P.C: You Tube

ఇక్కడ శౌనకాది మహర్షులకు సూత మహాముని మహాభారత కథను మొదటిసారిగా ఇక్కడే వినిపించాడని చెబుతారు. కురుక్షేత్ర సంగ్రామానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో బలరాముడు తాను తటస్థంగా ఉండిపోవాలని నిర్ణయించుకొంటాడు.

తీర్థయాత్రలకు బయలుదేరి

తీర్థయాత్రలకు బయలుదేరి

P.C: You Tube

ఇందుకోసం తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ఈ క్రమంలోనే నైమిశారణ్యం చేరుకొంటాడు. ఆ సమయంలో మునులందరూ ఆధ్యాత్మిక విషయాల పై సుదీర్ఘమైన చర్చలో మునిగి ఉంటారు. బలరాముడిని చూసి అందరూ లేచి నమస్కరిస్తారు.

శిరస్సును ఖండిస్తాడు

శిరస్సును ఖండిస్తాడు

P.C: You Tube

అయితే సభకు ఆచార్యపీఠాన ఉన్నవారు రోమహర్షణుడు సభా మర్యాదను అనుసరించి లేవలేదు. దీనిని బలరాముడు అవిధేయతగా భావించి అతని శిరస్సును ఖండిస్తాడు. దీంతో అక్కడ ఉన్న మునులు బలరాముడిని తీవ్రంగా నిందిస్తాడు.

మార్గం చెబుతారు

మార్గం చెబుతారు

P.C: You Tube

తనతప్పును తెలుసుకొన్న బలరాముడు ప్రాయశ్చిత్తం సూచించమని వేడుకొంటాడు. స్థానికంగా ఉన్న బల్వుడనే రాక్షసుడిని సంహరిస్తే బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందడానికి మార్గం చెబుతామంటాడు.

చక్రతీర్థం

చక్రతీర్థం

P.C: You Tube

దీంతో అమిత బలవంతుడైన బలరాముడు తన ఆయుధాలతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. తర్వాత మునుల సూచనమేరకు ఇక్కడి చక్రతీర్థంలో స్నానం చేసి తన బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకొన్నాడు. అందువల్లే ఈ చక్రతీర్థంలో స్నానం చేస్తే ఎటువంటి పాపాలైనా పటాపంచలైపోతాయని చెబుతారు.

అనేక దేవాలయాలు

అనేక దేవాలయాలు

P.C: You Tube

ఇక్కడ చూడటానికి అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. అందులో భూతేశ్వరాలయం, వ్యాసగద్ది, లలితాదేవి ఆలయం, హనుమాన్ ఘరి పురాణ పురష దేవాలయం దధీచి కుండం ముఖ్యమైనవి.

భూతేశ్వరాలయం

భూతేశ్వరాలయం

P.C: You Tube

చక్రతీర్థం పక్కనే భూతేశ్వరాలయం ఉంది. గయుడనే రాక్షసుడికి విష్ణువు అంటే పడేదికాదు. దీంతో ఈశ్వరుడిని గురించి తపస్సు చేస్తాడు. అయితే అతని మనస్సును మార్చాలన్న ఉద్దేశంతో విష్ణువు ప్రత్యక్షమవుతాడు.

గర్వంతో

గర్వంతో

P.C: You Tube

అయినా గర్వంతో ఆ రాక్షసుడు విష్ణువును నిందించడమే కాకుండా నీకే నేను వరాలను ఇస్తానని చెబుతాడు. దీంతో తన చేతిలో గయుడు చనిపోవాలని విష్ణువు వరం కోరుతాడు. దీంతో గయుడు విధిలేక ఆ వరాన్ని విష్ణువుకు ఇస్తాడు.

మూడు భాగాలుగా

మూడు భాగాలుగా

P.C: You Tube

వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని శరీరాన్ని మూడు భాగాలుగా ఖండిస్తాడు. ఒక భాగం గయలో మరో భాగం బదరీనాథ్ లో పడగా మూడో భాగం నైమిశరణ్యంలో ఉండిపోయింది ఈ నైమిశారణ్యంలో పడిన ప్రాంతంలోనే భూతేశ్వరస్వామి రూపంలో శివుడు వెలిశాడు.

వ్యాసగద్ది

వ్యాసగద్ది

P.C: You Tube

ఇక్కడే వ్యాసమహర్షి మహాభారతాన్ని చెబుతుంటే వినాయకుడు రచించడని చెబుతారు. దీనినే వ్యాసగద్ది అని అంటారు. ఇక్కడ వ్యాసమహర్షి విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ శుకమహర్షి, పరీక్షిత్తు మహారాజు విగ్రహాలను కూడా మనం చూడవచ్చు.

హనుమాన్ ఘరి

హనుమాన్ ఘరి

P.C: You Tube

రామలక్ష్మణులను మైరావణుడు అపహరించికుపోయి దాచిపెట్టిన చోటు ఇదే. విషయం తెలుసుకొన్న హనుమంతుడు మైరావడుని చంపి రామలక్ష్మణులను రక్షింస్తాడు. అందువల్లే ఇక్కడ ఉన్న నిలువెత్తు హనుమంతుని విగ్రహం భుజాల పై రామలక్ష్మణులు కుర్చొని ఉండగా హనుమంతుడి కాలి కింద మైరావనుడు ఉంటాడు.

పురాణ పురష మందిరం

పురాణ పురష మందిరం

P.C: You Tube

ఆనందమయి మాత ఫౌండేషన్ వారు నిర్మించిన పురాణ పురుష ఆలయం చూడటానికి చాలా బాగుంటుంది. చిలుక తలతో, అభయ ముద్రతో ప్రశాంత గంభీర వదనంతో మూలవిరాట్టు ఉంటారు. ఇక్కడ మన 18 పురాణాల పై పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి.

దదీచి కుండం

దదీచి కుండం

P.C: You Tube

ఇక్కడకు దగ్గర్లో మిశ్రిక్ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది. దదీచి అనే మహర్షి ఇంద్రుని కోరిక పై ఆత్మహుతి చేసుకొని తన వెన్నెముకను వజ్రాయుధంగా మలిచి ఇస్తాడు. ఆ ఘటన జరిగిన ప్రాంతం ఇదే. ఈ కుండాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్ముతారు.

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

P.C: You Tube

లక్కో-బాలాము మధ్య గల శాండిలా స్టేషన్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో నైమిశారణ్యం రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడకు వివిధ నగరాల నుంచి నేరుగా బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి. నైమిశారణ్యం స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో అనేక సందర్శనీయ స్థలాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more