» »భారతదేశం చూడవలసిన పన్నెండు జ్యోతిర్లింగాలు

భారతదేశం చూడవలసిన పన్నెండు జ్యోతిర్లింగాలు

By: Venkata Karunasri Nalluru

ప్రపంచంలోనే అత్యధిక దేవాలయాలు మన భారతదేశంలో వున్నందుకు మనమంతా గర్వపడాలి. విస్తారమైన జనాభా కలిగిన భారతదేశంలో వివిధ మతాల వారు జీవిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ దేవాలయాలను సందర్శించి ఆధ్యాత్మికంగా తన భక్తిని చాటుకుంటారు. ఈ అందమైన దేవాలయాలకు గొప్ప నిర్మాణం మరియు గొప్ప చరిత్ర ఖచ్చితంగా వుంటుంది.

పరమశివుని యొక్క ముఖ్యమైన దేవాలయాలు కొన్ని భారతదేశం లో ఉన్నాయి. వీటిని 'జ్యోతిర్లింగాలు' అని పిలుస్తారు. హిందూ మత భక్తులకు ప్రపంచంలో కొన్నిఅత్యంత పవిత్రమైన స్థలాలుగా పరిగణింపబడతాయి. భారతదేశం నలుమూలలా "పన్నెండు జ్యోతిర్లింగాలు" ఉన్నాయి.

'జ్యోతిర్లింగం' అంటే ఇంగ్లీష్ లో 'ఆల్మైటీ యొక్క రేడియంట్ ఇన్' అని అర్థం.

ఈ 'జ్యోతిర్లింగాలు' భారతదేశంలో ముఖ్యమైన ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి పన్నెండుగా భారతదేశంలో వివిధ పుణ్యక్షేత్రాలుగా వెలసినది. ఈ జ్యోతిర్లింగాలను సందర్శిస్తే భక్తులకు శివుడు మోక్షం ప్రసాదిస్తారని నమ్ముతారు.

భారతదేశంలో పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాల గురించి మరింత తెలుసుకోండి.

గుజరాత్ లోని సోమనాథ్ పుణ్యక్షేత్రం

గుజరాత్ లోని సోమనాథ్ పుణ్యక్షేత్రం

సోమనాథ్ ఆలయం గుజరాత్ లోని సౌరాష్ట్రలో గలదు. ఇది జ్యోతిర్లింగ తీర్థయాత్రలలో మొదటిగా చెప్పబడుతుంది. అనేక మంది భక్తులు మొదటగా సోమనాథ్ ఆలయంను సందర్శించటంతో వారి జ్యోతిర్లింగ టూర్ మొదలవుతుంది. దేవాలయంను పదహారు సార్లు ధ్వంసం చేసి మరలా పునర్నిర్మించారు.

ఆంధ్రప్రదేశ్ లోని మల్లికార్జున పుణ్యక్షేత్రం

ఆంధ్రప్రదేశ్ లోని మల్లికార్జున పుణ్యక్షేత్రం

మల్లికార్జున పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం వద్ద గలదు. 'శక్తి పీఠా' మరియు జ్యోతిర్లింగ ఇద్దరూ ఒకే చోట పూజలు అందుకుంటున్న ప్రదేశం. ఇంకా ఈ ఆలయం యొక్క గొప్ప శిల్పాలు మరియు భవన నిర్మాణం చాలా అందంగా వుంటుంది.

మధ్యప్రదేశ్ లోని మహంకాలేశ్వర పుణ్యక్షేత్రం

మధ్యప్రదేశ్ లోని మహంకాలేశ్వర పుణ్యక్షేత్రం

ఇక్కడ శివలింగం సొంతంగా ఏర్పడింది అంటే శివుడు ఇక్కడ 'స్వయంభూ' గా వెలిశాడు. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. గర్భగుడి లోపల "శ్రీ యంత్రం" కూడా కలదు. ఈ ఆలయం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ వద్ద ఉంది.

ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ పుణ్యక్షేత్రం

ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ పుణ్యక్షేత్రం

శివుని యొక్క శాశ్వతమైన నివాసం హిమాలయాలలో వుంది. కేదార్నాథ్ పుణ్యక్షేత్రం కూడా భారతదేశం యొక్క జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది ఉత్తరాఖండ్ లో వుంది. ఈ మందిరంనకు గొప్ప వారసత్వ చరిత్ర వుంది. ఈ ఆలయంను దర్శించుటకు పాదయాత్ర చేయవలెను. ఒక సంవత్సరంలో కేవలం ఆరు నెలల మాత్రమే ప్రజలకు ఈ అవకాశం కల్పిస్తారు.

మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రం

మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రం

'ఓం' చిహ్నం ఆకారంలో వున్న ఈ ఆలయం నర్మదా నది ఒడ్డున గల ఒక ద్వీపంలో గలదు. ఓంకారేశ్వర్ మందిరం మధ్యప్రదేశ్ లో గల మరొక ముఖ్యమైన జ్యోతిర్లింగం.

భీమశంకర్ పుణ్యక్షేత్రం, మహారాష్ట్ర

భీమశంకర్ పుణ్యక్షేత్రం, మహారాష్ట్ర

భీమశంకర్ పుణ్యక్షేత్రం, మహారాష్ట్రలోని పూనే సమీపంలో ఉన్నది. ఇది భారతదేశం యొక్క పన్నెండు జ్యోతిర్లింగాలలో మరొకటి. ఇది భక్తులకు పచ్చని అడవి మరియు సుందరమైన పరిసరాలు గల నిష్కల్మషమైన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యస్థలం చుట్టూ భీమ నది మరియు సహ్యాద్రి శ్రేణులు కలవు.

ఉత్తరప్రదేశ్ లోని విశ్వకర్మేశ్వర్ పుణ్యక్షేత్రం

ఉత్తరప్రదేశ్ లోని విశ్వకర్మేశ్వర్ పుణ్యక్షేత్రం

వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయం భారతదేశంలో హిందూ మతానికి పవిత్రమైన ప్రదేశం. ఈ ఆలయాన్ని కూడా మరొక జ్యోతిర్లింగంగా చెప్తారు. ఈ ప్రదేశం గంగా నది ఒడ్డున ఉంది. ఇక్కడ హిందువులు మతసంబంధమైన ఆచారాలు జరుపుతారు. ఈ ఆలయంలో కొలువైనటువంటి విశ్వనాథుడు శివుని యొక్క మరొక రూపం.

మహారాష్ట్రలోని త్రింబకేశ్వర్ పుణ్యక్షేత్రం

మహారాష్ట్రలోని త్రింబకేశ్వర్ పుణ్యక్షేత్రం

మరో ముఖ్యమైన జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సమీపంలో ఉంది. దీనిని "త్రింబకేశ్వర్ పుణ్యక్షేత్రం" అంటారు.

జార్ఖండ్ లోని బైద్యనాథ్ పుణ్యక్షేత్రం

జార్ఖండ్ లోని బైద్యనాథ్ పుణ్యక్షేత్రం

బైద్యనాథ్ పుణ్యక్షేత్రం జార్ఖండ్ రాష్ట్రంలో "దియోఘడ్" లో కలదు. ఇది భారతదేశం యొక్క జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ క్షేత్రంలో శివుడు "బాబా బైద్యనాథ్" గా దర్శనమిస్తాడు. ఇక్కడ 21 దేవాలయాలు కలిసి ఒక సముదాయంగా వున్నది. హిందూ మతంలో గల శ్రావణమాసంలో చాలామంది భక్తులు ఇక్కడకు వస్తారు.

ఉత్తరాఖండ్ లోని నాగేశ్వర పుణ్యక్షేత్రం

ఉత్తరాఖండ్ లోని నాగేశ్వర పుణ్యక్షేత్రం

ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రానికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ క్షేత్రం ఉత్తరాఖండ్ లోని అల్మోర సమీపంలో వుంది. ఇది జగేశ్వర్ లో గల 124 ఆలయాలలో ఒకటి. ఈ జ్యోతిర్లింగ ఆలయంలో 'మహాశివరాత్రి పండుగ' మరియు 'జగేశ్వర్ మాన్సూన్ పండుగ' ను జరుపుకుంటారు

తమిళనాడులోని రామేశ్వర పుణ్యక్షేత్రం

తమిళనాడులోని రామేశ్వర పుణ్యక్షేత్రం

తమిళనాడులోని రామలింగేశ్వర పుణ్యక్షేత్రం భారతదేశంలోని దక్షిణ జ్యోతిర్లింగగా వుంది. ఇక్కడ రామనాథస్వామి కొలువైవున్నాడు. ఇంకా ఇక్కడ ఇతర దేవతల విగ్రహాలు కూడా వున్నాయి.

రాజస్థాన్ లోని గుష్మేశ్వర పుణ్యక్షేత్రం

రాజస్థాన్ లోని గుష్మేశ్వర పుణ్యక్షేత్రం

గుష్మేశ్వర పుణ్యక్షేత్రం రాజస్థాన్లోని ప్రఖ్యాత "రంతంబోరే నేషనల్ పార్క్" సమీపంలో ఉంది. పన్నెండవ జ్యోతిర్లింగంగా చెప్పబడుతుంది. ఈ దేవాలయానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి సందర్శిస్తారు.

Please Wait while comments are loading...