Search
  • Follow NativePlanet
Share
» »ఇనుము ఇంతడిని బంగరంగా మార్చే రాయి ఈ కోటలో ఉంది

ఇనుము ఇంతడిని బంగరంగా మార్చే రాయి ఈ కోటలో ఉంది

రాజస్థాన్ లోని తిమాన్ ఘడ్ కోట గురించిన పూర్తి సమాచారం

తిమాన్ ఘడ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ కోట రాజస్థాన్ లోని ఒక చారిత్రాత్మకమైన స్థలం. క్రీస్తుశకం 1100 లో ఈ కోటను నిర్మించినట్లు చెబుతారు. అయితే ఈ కోటను నిర్మించిన కొద్ది కాలానికే దీని పై అనేక దాడులు జరిగాయి. దీంతో ఈ కోట నిర్మించిన అతి కొద్ది కాలానికే కొంత నాశనం అయ్యింది. అయితే ఈ కోటను విజయ పాల్న కుడి, యదువంశ రాజ తిమాన్పల్ క్రీస్తు శకం 1244లో తిరిగి పున: నిర్మించారు. అటు పై కొన్ని సంవత్సరాలకు ఈ కోట శిథిలమై పోయింది. ఈ కోటలో ఇప్పటికీ పురాతన పంచలోహ విగ్రహాలు, కనేక శక్తులు కలిగిన రాతితో రూపొందించిన విగ్రహాలు ఉన్నాయని స్థానికులు నమ్ముతుంటారు. అటువంటి ఓ శిలగురించి ఈ కథనంలో తెలుసుకొందాం.

దసరా సమయంలో ఈ చాముండి గురించి తెలుసుకోవాల్సిందేదసరా సమయంలో ఈ చాముండి గురించి తెలుసుకోవాల్సిందే

ఇక్కడ దంపతులు జంటగా స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసాఇక్కడ దంపతులు జంటగా స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా

తిమాన్ ఘడ్ కోట

తిమాన్ ఘడ్ కోట

P.C: You Tube

క్రీస్తుశకం 1196, 1244లో ఈ కోటను మహ్మద్ ఘోరీ ఆక్రమించాడు. ఇందుకు సంబంధించిన అనేక శాసనాలను మనం చూడవచ్చు. ఈ కోట లోపల ఉన్న ఒక సరస్సు మధ్యలో ఒక విచిత్రమైన రాయి ఉందని స్థానికులు చెబుతారు. దానిని పారాస్ శిల అని అంటారు.

తిమాన్ ఘడ్ కోట

తిమాన్ ఘడ్ కోట

P.C: You Tube
ఈ శిలను ఉపయోగించే తిమాన్పల్ రాజు ఇనుము, ఇత్తడి, రాగి వంటి ఎటువంటి లోహానైన్నా బంగారంగా మార్చేవాడని చెబుతారు. ఈ విషయం అలా ఆ నోట, ఈ నోట చాలా మంది రాజులకు తెలిసిపోయింది.

తిమాన్ ఘడ్ కోట

తిమాన్ ఘడ్ కోట

P.C: You Tube
దీంతో పొరుగున ఉన్న రాజులు అనేక సార్లు ఈ కోట పై దాడికి పాల్పడి ఆ రాయిని స్వాధీనం చేసుకోవాలని చూశారు. ఈ క్రమంలోనే మహ్మద్ ఘెరీ కూడా ఈ కోటను ఆక్రమించుకోవాలని రెండు సార్లు ప్రయత్నించాడు.

తిమాన్ ఘడ్ కోట

తిమాన్ ఘడ్ కోట

P.C: You Tube
రెండోసారి ఈ కోట పై దండెత్తినప్పుడు ఈ రాయిని తన ఆస్థానంలోని ఒక పురోహితుడికి ఇచ్చి రాజు భద్రపరచమని చెబుతాడు. అయితే సదరు పురోహితుడికి ఆ రాయి విలువ తెలియదు. దీంతో ఇది కూడా సాధారణ రాయి అనే భావించి దానిని సరస్సలోకి విసిరివేస్తాడు.

తిమాన్ ఘడ్ కోట

తిమాన్ ఘడ్ కోట

P.C: You Tube
అటు పై రాజుకు ఈ విషయం తెలిసి చింతిస్తాడు. ఆ రాయిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం ఆ సరస్సులోని నీటిని ఏనుగుల ద్వారా బయటికి తోడేస్తాడు. ఈ క్రమంలో ఒక ఏనుగు కాలుకు ఉన్న ఇనుప గొలుసు బంగారపు గొలుసుగా మారిపోతుంది.

శివుడు కుంభకర్ణుడి పుత్రుడుని సంహరించింది ఈ క్షేత్రంలోనే...శివుడు కుంభకర్ణుడి పుత్రుడుని సంహరించింది ఈ క్షేత్రంలోనే...

తిమాన్ ఘడ్ కోట

తిమాన్ ఘడ్ కోట

P.C: You Tube

దీంతో ఆ రాయి ఆ సరస్సులోనే ఉందని నిర్థారణకు వస్తారు. ఇక తిమాన్ ఘడ్ కోటకు కొద్ది దూరంలోనే శహనాబాద్ కోట ఉంది. ఇందులో ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల విలువచేసే సంపద ఉన్నట్లు చెబుతారు.

తిమాన్ ఘడ్ కోట

తిమాన్ ఘడ్ కోట

P.C: You Tube

మరో కథనం ప్రకారం ఈ పారస్ రాయిని రక్షించే ఉద్దేశంతో తమాన్పాల్ రాజు ఈ కోటకు రహస్య మార్గం ద్వారా చేరవేశారని చెబుతారు. ఈ కోటలో ఇప్పటికీ కొంతమంది బంగారు వెండి ఆభరణాలు దొరుకుతాయని చెబుతారు.

తిమాన్ ఘడ్ కోట

తిమాన్ ఘడ్ కోట

P.C: You Tube

ఇక శహనాబాద్ కోటలో ఇప్పటికీ ఒక పాడుపడిన బావిని చూడవచ్చు. దీనిలో ఆరు రహస్య మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలకు తాళాలు వేశారు. ఈ మార్గాల ద్వారా కొంత దూరం వెలితే అంతులేని ఖజానా మన సొంతమవుతుందని చెబుతారు.

శని చూపు పడకూడదంటే ఇక్కడికి ఒక్కసారైనా వెళ్లండిశని చూపు పడకూడదంటే ఇక్కడికి ఒక్కసారైనా వెళ్లండి

తిమాన్ ఘడ్ కోట

తిమాన్ ఘడ్ కోట

P.C: You Tube
అయితే ప్రస్తుతం ఆ పాడుపడిన భావి పూర్తిగా శిథిలమై పోయింది. అందువల్లే ఆ ఖజానాను ఎవరూ సొంతం చేసుకోలేకపోతున్నారని చెబుతారు. ఇదిలా ఉండగా రాజస్థాన్ లో ఈ రెండు కోటలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా మారిపోయాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X