Search
  • Follow NativePlanet
Share
» »వామనుడు రెండో సారి దర్శనమిచ్చిన ప్రాంతం...సందర్శనతో అనంతమైన ఐశ్వర్యం

వామనుడు రెండో సారి దర్శనమిచ్చిన ప్రాంతం...సందర్శనతో అనంతమైన ఐశ్వర్యం

తిరుక్కోవలూరులోని త్రివిక్రమ రూపంలో ఉన్న వామనుడి గురించిన కథనం.

By Kishore

భారత దేశంలో వామనాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో మూడు ఆలయాలు ఒక్క తమిళనాడులోనే ఉన్నాయి. అందులో ఈ వామన రూపంలో విష్ణువు రెండు సార్లు సాక్షాత్కరించిన పుణ్యక్షేత్రం తిరుక్కోవలూరు. ఇక ఇక్కడే 12 మంది ఆళ్వారులో మొదటి ముగ్గురైన పోయ్ గై ఆళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారులు విష్ణువును కీర్తిస్తూ మొదటిసారిగా పాశురాలు ( భక్తి పాటలు) ఈ క్షేత్రంలోనే పాడినట్లు స్థళ పురాణం చెబుతుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ తిరుక్కోవలూరు వైష్ణవులకు అత్యంత పవిత్రమైనది. ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే అనంత మైన ఐశ్వర్యం మనకు దక్కుతుందని స్థానికులు చెబుతుంటారు. చెన్నై నుంచి తిరుక్కోవలూరు 237 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడకు నిత్యం బస్సు సర్వీసులు ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం మీ కోసం

ఈ 'వృద్ధ'కాశీలో చనిపోతే స్వయంగా అమ్మవారే తన ఒడిలోకి తీసుకొని...ఈ 'వృద్ధ'కాశీలో చనిపోతే స్వయంగా అమ్మవారే తన ఒడిలోకి తీసుకొని...

1. రాక్షసరాజు బలి

1. రాక్షసరాజు బలి

P.C: You Tube

పూర్వం రాక్షసరాజు బలి చక్రవర్తి ఉండేవాడు. అతను గొప్పదాన శీలి. అయితే రాక్షస స్వభావం వల్ల మునులను, ప్రజలను హింసించేవాడు. దీంతో మునులందరూ విష్ణువు వద్దకు వెళ్లి తమ బాధలు చెప్పుకొన్నాడు.

2. వామన మూర్తి రూపంలో

2. వామన మూర్తి రూపంలో

P.C: You Tube

తాను త్వరలోనే ఆ బలిచక్రవర్తిని అంతమొందిస్తానని వారికి విష్ణువు అభయమిస్తాడు. దీని ప్రకారం కశ్యప మహర్షి భార్య అదితితో కలిసి పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తూ ఉంటాడు. ఆ సమయంలో యాగ పురుషుడైన శ్రీ మన్నారాయణుడు వామన అమూర్తిగా అవతరిస్తాడు.

3. శిబి చక్రవర్తి చేస్తున్న యాగం వద్దకు

3. శిబి చక్రవర్తి చేస్తున్న యాగం వద్దకు

.C: You Tube

అటు పై శిబి చక్రవర్తి చేస్తున్న యాగం వద్దకు వామనుడు వెళుతాడు. వామనుడిని చూసి ముచ్చట పడిన శివిచక్రవర్తి ఏదేని వరం కోరుకోమని వటుడైన వామనుడిని కోరుతాడు.

4. మూడు అడుగుల భూమి

4. మూడు అడుగుల భూమి

P.C: You Tube

దీంతో వమన రూపంలో ఉన్న విష్ణువు మూడు అడుగుల భూమి కావాలని అడుగుతాడు. ఇందుకు శిబి చక్రవార్తి అంగీకరిస్తాడు. అయితే రాక్షసరాజైన శుక్రాచార్యుడు ఇందులో ఏదో మోసం ఉందని భావిస్తాడు.

5. నీరు వచ్చే ప్రదేశంలో అడ్డుగా

5. నీరు వచ్చే ప్రదేశంలో అడ్డుగా

P.C: You Tube

దానం ఇచ్చే సమయంలో కమండలంలోకి వెళ్లి నీరు వచ్చే ప్రదేశంలో అడ్డుగా నిలబడుతాడు. దీంతో వామనుడు దర్భతీసుకొని ఆ రంద్రంలో పొడుస్తాడు. దీంతో బాధతో శుక్రాచార్యుడు కమండలం నుంచి బయటికి వచ్చేస్తాడు.

6. ఒక కాలుతో ఆకాశం మొత్తాన్ని

6. ఒక కాలుతో ఆకాశం మొత్తాన్ని

P.C: You Tube

అటు పై శిబి చక్రవర్తి నుంచి మూడు అడుగుల స్థలం తీసుకునే విధానంలో భాగంగా ఒక కాలుతో ఆకాశం మొత్తాన్ని ఆక్రమిస్తాడు. మరో కాలుతో ఈ భూ లోకానంతటిని ఆక్రమిస్తాడు. ఇక మూడో అడుగు కోసం తన పాదాన్ని విభిచక్రవర్తి తల పై పెట్టేస్తాడు.

7. బలి చక్రవర్తి పాతాళంలోకి

7. బలి చక్రవర్తి పాతాళంలోకి

P.C: You Tube

దీంతో బలి చక్రవర్తి పాతాళంలోకి వెళ్లిపోతాడు. ఇలా శిబిచక్రవర్తి వామనుడిగా అవతరించి మూడు అడుగుల స్థలం కోరి వాటి కోసం ఒక కాలుతో ఆకాశమంతటిని ఆక్రమించడాన్నే త్రివిక్రమ రూపమని అంటారు.

8. మూడు ఆలయాలు ఒక్క తమిళనాడులోనే

8. మూడు ఆలయాలు ఒక్క తమిళనాడులోనే

P.C: You Tube

ఈ రూపంలో భారత దేశంలో వామనాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో మూడు ఆలయాలు ఒక్క తమిళనాడులోనే ఉన్నాయి.

9. ఆకాశాన్ని ఆక్రమిస్తున్నట్లు ఉండే ఆలయం తిరుక్కోవలూరులో

9. ఆకాశాన్ని ఆక్రమిస్తున్నట్లు ఉండే ఆలయం తిరుక్కోవలూరులో

P.C: You Tube

భూమిని ఆక్రమించే ఆకారం సీర్కళిలో ఉండగా, ఆకాశాన్ని కొలుస్తున్నట్లు ఉండే ఆలయం తిరుక్కోవలూరులో ఉంది. ఇక చివరిదైన శిచక్రవర్తి తల పై వామనుడు కాలు పెట్టినట్లు ఉండే ఆకారంతో కాంచిలో శ్రీ మహావిష్ణువు వెలిసాడు.

10. రెండు సార్లు ఆవిర్భవించాడు

10. రెండు సార్లు ఆవిర్భవించాడు

P.C: You Tube

ఇక తిరుక్కోవలూరులో త్రివక్రమ రూపంతో మహావిష్ణువు రెండు సార్లు ఆవిర్భవించాడని చెబుతారు. అందువల్లే హిందువులు ముఖ్యంగా వైష్ణవులు ఈ తిరుక్కోవలూరును పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు.

11. 12 మంది ముదలాళ్వార్లు

11. 12 మంది ముదలాళ్వార్లు

P.C: You Tube

ఇందుకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం పూర్వం 12 మంది ముదలాళ్వార్లు ఉండేవారు. వీరు విష్ణువును కీర్తిస్తూ పాడిన పాటలనే పాశురాలని అంటారు.

12. ముందుగా వీరు ముగ్గురు

12. ముందుగా వీరు ముగ్గురు

P.C: You Tube

ఈ పన్నెండుమందిలో ముందుగా జన్మించిన పోయ్ గై ఆళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారు. వీరు వరుసగా కాంచిపురం, కడల్ మల్లై, ముయిలాపురంలో అవతరించారు.

13. వేర్వేరు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ

13. వేర్వేరు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ

P.C: You Tube

వీరు వేర్వేరు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఒక రోజు రాత్రి తిరుక్కోవెలూర్ వచ్చారు. ముందుగా ఆ గ్రామానికి వచ్చిన పోయగై ఆళ్వారు అక్కడ ఉన్న మ`కండ ముని ఆశ్రయానికి వచ్చి అక్కడ పడుకోవడానికి స్థలం చూపించమని అడుగుతాడు.

14. ఒక మూలన కొంత స్థలం చూపించి

14. ఒక మూలన కొంత స్థలం చూపించి

P.C: You Tube

ఒక మూలన కొంత స్థలం చూపించి అక్కడ పడుకోమని చెబుతాడు. ఇది జరిగిన కొద్ది సేపటికి పూదత్తాళ్వారు, అటు పై పోయ్ గై ఆళ్వారు అక్కడకు వస్తారు.

15. కనీసం నిలబడుకోవడానికి కూడా

15. కనీసం నిలబడుకోవడానికి కూడా

P.C: You Tube

దీంతో పడుకోవడానికి కాదు కదా కనీసం నిలబడుకోవడానికి కూడా వారికి స్థలం ఉండదు. అయినా అతి కష్టం మీద ముగ్గురూ అక్కడ నిలబడి దేవుడి విషయమై చర్చించుకొంటూ ఉంటారు.

16. త్రి విక్రమ రూపంలో దర్శనమిస్తాడు

16. త్రి విక్రమ రూపంలో దర్శనమిస్తాడు

P.C: You Tube

వారి సంభాషనకు మెచ్చిన విష్ణవు వారికి త్రి విక్రమ రూపంలో దర్శనమిస్తాడు. దీంతో పరవశించిన ఆళ్వారులు ఒక్కొక్కరు వంద పాశురాలతో స్వామిని స్తుతిస్థారు. ఇలా మొదట త్రివిక్రమ రూపంలో విష్ణవు సాక్షాత్కరించింది. ఇక్కడ. అలాగే మొదట పాశురాలు మొదట ఆవిర్భవించింది ఇక్కడే.

17. చాలా ఏళ్ల పాటు విష్ణువు గురించి తపస్సు చేసి

17. చాలా ఏళ్ల పాటు విష్ణువు గురించి తపస్సు చేసి

P.C: You Tube

ఇక త్రివిక్రమ రూపంలో విష్ణువు సాక్షాత్కారాన్ని తెలుసుకొన్న మ`కండ మహర్షి తనకు కూడా ఆ రూపంతో దర్శన వివ్వాలని చాలా ఏళ్ల పాటు విష్ణువు గురించి తపస్సు చేసి తన కోరికను తీర్చుకొంటాడు. అలా రెండు సార్లు విష్ణువు త్రివిక్రమ రూపంలో ఇక్కడ సాక్షాత్కరించినట్లు చెబుతారు.

18. మూలవిరాట్టు రూపం పెద్దదిగా ఉంటుంది

18. మూలవిరాట్టు రూపం పెద్దదిగా ఉంటుంది

P.C: You Tube

ఇక ఆలయంలో మూలవిరాట్టు రూపం పెద్దదిగా ఉంటుంది. కుడికాలు పైకి ఎత్తి ఆకాశానంతటిని ఆక్రమించినట్లు కనిపిస్తుంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని కడుగుతున్నట్లు విగ్రహం చెక్కబడింది. కుడి చేతిలో శంఖాన్ని, ఎడమ చేతిలో చక్రము ఉంటుంది.

19. నడుముకి దశావతార ఒడ్డాణము

19. నడుముకి దశావతార ఒడ్డాణము

P.C: You Tube

ఇక మరో అడుగు పాతాళమును కొలిచి, మూడవ అడుగు ఎక్కడ పెట్టాలని వామన రూపంలో ఉన్న విష్ణవు బలి చక్రవర్తిని అడుగుతున్నట్లు విగ్రహాన్ని భక్తులు దర్శనం చేసుకోవచ్చు.

20. అభిషేకం లేదు

20. అభిషేకం లేదు

P.C: You Tube

స్వామి వారికి 108 సాలగ్రామల మాల, నడుముకి దశావతార ఒడ్డాణము ఉంటాయి. ఇక్కడ విగ్రహం చెక్కతో చేసినది. అందువల్లే విగ్రహానికి అభిషేకం ఉండదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X