Search
  • Follow NativePlanet
Share
» »మీ హనీమూన్ ఇక్కడైతే జీవితం మొత్తం మొదటి రాత్రులే

మీ హనీమూన్ ఇక్కడైతే జీవితం మొత్తం మొదటి రాత్రులే

దక్షిణ భారత దేశంలో హనిమూన్ కు అనువైన హిల్ స్టేషన్లకు సంబంధించిన కథనం.

మనిషి జీవితంలో ముఖ్యమైన దశ గృహస్తుడు కావడం. పెళ్లి దానికి పునాది. వివాహం తొలిరోజుల్లో తన జీవితంలోకి వచ్చిన వారితో ఏకాంతంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటాడు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక ప్రాంతాలను ఎంపిక చేసుకొంటాడు. అందులో శృంగార కోరికలను పెంచే ప్రాంతాలు తప్పకుండా ఉండాలని ప్రణాళికలు రచించుకొంటాడు.

ఇందు కోసం ఎంత దూరమైన ప్రయాణించడానికి సిద్ధమవుతారు. దీనినే హనీమూన్ అంటారు. ఈ నేపథ్యంలో హనీమూన్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి హిల్ స్టేషన్లు. వర్షాకాలం ప్రారంభమవుతున్న వేళ దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని కొండ ప్రాంతాలు పచ్చని తివాచి పరిచినట్లు రూపు దిద్దుకొంటూ కొత్త జంటలను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.

ఈ ప్రాంతాల్లో శరీరాలే కాదు మనసులు కూడా దగ్గరవుతాయి. అందువల్లే ఇక్కడ హనీమూన్ కు వెళ్లి తిరిగి వచ్చిన వారికి వారి జీవితంలో ప్రతిరోజూ మొదటి రాత్రే అవుతుందని చెబుతారు. అటువంటి వాటిలో ఎంపిక చేసిన ఐదు హిల్ స్టేషన్ల వివరాలు మీ కోసం

దేవికులం

దేవికులం

P.C: You Tube

కేరళలోని ఈ ప్రముఖ హిల్ స్టేషన్ కొత్త జంటలను వేసవిలోనే కాకుండా ఏడాది మొత్తం రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. గలగల పారే జలపాతాలు, కనుచూపుమేర కనిపించే పచ్చటి కొండలను చూస్తూ ఇట్టే సమయాన్ని గడిపేయవచ్చు. ఇక్కడ ఉన్న సీతా దేవి సరస్సు కూడా ప్రధాన ఆకర్షణ.

అరకు వ్యాలీ

అరకు వ్యాలీ

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక కేంద్రాల్లో అరకువ్యాలీ మొదటి వరుసలో ఉంటుంది. ముఖ్యంగా హనీమూన్ కోసం కేవలం ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ బొర్రా గుహలు ప్రధాన ఆకర్షణ.

ఎర్కాడ్

ఎర్కాడ్

P.C: You Tube

తమిళనాడులో ఎక్కువ మంది హనీమూన్ కోసం ఎంపిక చేసుకునే హిల్ స్టేషన్ ఎర్కాడ్. తూర్పు కనుమల్లో ఉన్న ఈ హిల్ స్టేషన్ ఏడాది మొత్తం హనీమూన్ కోసం అనువైన హిల్ స్టేషన్. ఇక్కడ ఎప్పుడూ కూడా 30 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండదు.

కుద్రేముఖ్

కుద్రేముఖ్

P.C: You Tube

కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో కుద్రేముఖ్ హిల్ స్టేషన్ ఉంది. వర్షాకాలం ప్రారంభంలో కనుచూపుమేరలో పచ్చదనం తప్ప మరొకటి కనిపించదంటే అతిశయోక్తి కాదు. వేడి కోరికలను రెచ్చగొట్టే కుద్రేముఖ్ కర్నాటకలో హనీమూన్ కు అనువైన ప్రాంతాల్లో మొదటి వరుసలో ఉంటుంది.

కన్నూర్

కన్నూర్

P.C: You Tube

తమిళనాడులో ఉన్న హిల్ స్టేషన్ ఎల్లప్పుడూ పచ్చగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడి టీ ఎస్టేట్స్ పర్యాటకుల ప్రధాన ఆకర్షణ. ఇక్కడకు హనీమూన్ జంటలకు స్వర్గధామమైన కన్నూర్ లో వసతి సౌకర్యాలు కూడా బాగున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X