• Follow NativePlanet
Share
» »ఇండియాలో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనే ప్రదేశాలు !!

ఇండియాలో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనే ప్రదేశాలు !!

Posted By: Staff

క్రిస్మస్ రానే వచ్చింది. మరి క్రిస్మస్ సెలవుల్లో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని లేదా ?? ఎవరికి ఉండదండీ ... సెలవులు రావాలే గాని ఎవ్వరికైనా ఎంజాయ్ చేయాలని అనిపించదూ .. మరి ఈ క్రిస్మస్ సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు ? ప్లాన్ చేసుకోలేదా ?? ఐతే మీరు ఈ ప్రదేశాలను తప్పక సందర్శించవలసిందే ..!

క్రిస్మస్ సెలవులను హాయిగా, జాలీగా గడిపేయటానికి ఈ క్రింద పేర్కొనబడిన ప్రదేశాలు ఎంతగానో దోహదపడతాయి. ఏకాంతాన్ని ఇష్టపడేవారు సైతం, తమ ఏకాంతాన్ని మరిచిపోయి మరీ ఉత్సాహంగా గడిపేస్తారు. క్రిస్మస్ సెలవుల్లో, క్రిస్మస్ ను వైభవంగా జరుపుకొనే ప్రదేశాల్లో ఉంటే ఆ ఆనందం, ఉత్సాహం వేరు. శాంతా క్లాజ్ లు, క్రిస్మస్ ట్రీ లు, విద్యుద్దీపకంతుల్లో వెలిగే చర్చీలు, కేకులు అహా .. ఆ కోలాహాలమే మిమ్మల్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి : గోవాలో మొదలైన క్రిస్మస్ సందడి ..!

ఇండియాలో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనే ప్రదేశాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే అవి పోర్చుగీసు వారు పాలించిన ప్రాంతాలు అని చెప్పవచ్చు. ఆ ప్రదేశాల్లో చర్చీలను క్రిస్మస్ రోజున ఎప్పుడూ లేనంత అందంగా ముస్తాబు చేస్తారు. క్రిస్మస్ రోజున ఉదయాన్నే చర్చీలన్నీ కీర్తనలతో మారుమ్రోగుతుంటాయి.

గోవా

గోవా

గోవాలో అప్పుడే క్రిస్మస్ సందడి మొదలైనది. దేశ విదేశాల్లో స్థిరపడ్డ గోవా ప్రజలు సైతం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనటానికి వస్తున్నారు. చర్చీలన్నీ అప్పుడే విద్యుద్దీపకాంతుల్లో మునిగితేలాయి. గోవా లోని ప్రధాన షాపింగ్ ప్రదేశాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. గోవా లోని చర్చీలన్నీ కూడా పోర్చుగీసువారి పాలనలో నిర్మించినవే.

చిత్ర కృప : Tolis Fragoudis

పాండిచ్చేరి

పాండిచ్చేరి

పాండిచ్చేరి దక్షిణ భారత దేశంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ఈ ప్రదేశాన్ని పోర్చుగీసు వారు పాలించారు కనుకనే దీనిని పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అని పిలుస్తుంటారు. ఇక్కడ కూడా క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తుంటారు. చర్చీలన్నీ కూడా ఆ సమయంలో అందంగా అలంకరించబడి ముస్తాబు చేస్తారు, చర్చీలలో ప్రత్యేకమైన ప్రార్థన లు నిర్వహిస్తారు. ఇక్కడి చర్చీలలో ప్రధానమైనది చర్చ్ అఫ్ సేక్రేడ్ హార్ట్ అఫ్ జీసస్. ఏసుక్రీస్తు జీవిత చరిత్రను, కాలాన్ని తెలిపే అద్దాలు, కిటికీలను ఇక్కడ గమనించవచ్చు.

చిత్ర కృప : Christopher Porter

కేరళ

కేరళ

కేరళ గురించి మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. మనదేశంలో కెల్లా ఎక్కవ సంఖ్యలో చర్చీలు ఉన్న రాష్ట్రం ఇదే. కనుకనే ఇక్కడ క్రిస్మస్ సంబరాలు మిన్నంటుతాయి. ఆ సమయంలో రెస్టారెంట్ లు ఆహారపానీయాల మీద ఆఫర్లను, డిస్కౌంట్ లను ప్రకటిస్తుంది. విధుల్లోని చర్చీలన్నీ అందంగా అలంకరించబడి రాత్రంతా తెరిచే ఉంటారు. ఇక్కడ బ్యాక్ వాటర్, బీచ్ వంటివి మీకు ఎంతగానో సహాయపడతాయి.

చిత్ర కృప : -Reji

ముంబై

ముంబై

క్రిస్మస్ వేడుకల సమయంలో ముంబై లోని అన్ని వీధులు, చర్చీలు అన్నీ కూడా క్రిస్మస్ చెట్లతో విద్యుద్దీప కాంతుల్లో మునిగితేలుతుంటాయి. బాంద్రా వీధుల్లో షాపింగ్ మాల్స్, బేకరీ లను అందంగా ముస్తాబు చేసి ఉంటారు. ముంబై నగరంలోని బెసిలికా ఆఫ్ అవర్ లేడి ఆఫ్ ది మౌంట్ చర్చి గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఈ చర్చి అరేబియా సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ఉంటుంది. నగరంలో అతి పెద్దది గా ఉండే ఈ చర్చి లో క్రిస్మస్ ప్రార్థనలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

చిత్ర కృప : Shagun Seda

డామన్ మరియు డయ్యు

డామన్ మరియు డయ్యు

డామన్ మరియు డయ్యు రెండు ప్రాంతాల కలయిక. ఇక్కడ కూడా క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో డయ్యు లోని సెయింట్ థామస్ చర్చి, సెయింట్ పాల్ చర్చి లో ప్రత్యేకమైన ప్రార్థన లు జరుపుతారు. డామన్ లోని రెమిడీస్ లేడి ప్ర్రార్థనాలయం, రోసరీ లేడి ప్రార్థనాలయం, బోమే జీసస్ చర్చి మరియు అంగుస్థీఅస్ లేడి ప్రార్థనాలయంలో క్రిస్మస్ సందర్భంలో ప్రత్యేకమైన ప్రార్థన లు నిర్వహిస్తారు.

చిత్ర కృప : SSnides

దాద్రా నాగర్ హవేలీ

దాద్రా నాగర్ హవేలీ

దాద్రా నాగర్ హవేలీ ఒక కేంద్ర పాలిత ప్రాంతం. భారత దేశానికి పశ్చిమం వైపున అరేబియా సముద్రానికి దగ్గరిలో ఉన్న సిల్వస్సా దీనికి రాజధాని. ఇక్కడ ఉన్న రోమన్ క్యథలిక్ చర్చి దేశంలో ప్రసిద్ధి చెందినది. దీనిని క్రీ.శ.1886 - 1889 మధ్యలో నిర్మించినారు. ఈ చర్చి యొక్క వైభవోపేతమైన నిర్మాణం మరియు బాహ్య వంపులు దాని కళాత్మకంగా రూపొందించిన తీరు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. క్రిస్మస్ సమయంలో ఈ చర్చి కి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.

చిత్ర కృప : Ameya Gokhale

షిల్లాంగ్

షిల్లాంగ్

తూర్పు స్కాట్లాండ్ గా పిలువబడే షిల్లాంగ్ మేఘాలయ రాజధాని. ఇక్కడ షిల్లాంగ్ యొక్క అద్భుత కట్టడం అయిన కేథడ్రాల్ కాథలిక్ చర్చి ఉన్నది. అధికారికంగా క్రైస్తవులు మేరీ సహాయ కేథడ్రల్ అని అంటారు. సుమారు 3,00,000 పై చిలుకు మందికి పైగా కాథలిక్కులు కేథడ్రల్ లో ప్రార్థన లు చేస్తారు. క్రీస్తు యొక్క కథనాలతో చిత్రకళా శిలువతో 14 కేంద్రాలు ఉన్నాయి. కిటికీలు కూడా అనేక రంగులలో పేయింట్ చేసి ఉంటాయి. కేథడ్రాల్ పై భాగం నుండి చర్చి శిలువ వంటి ఆకృతి చూడవచ్చు. క్రిస్మస్ సమయంలో ఈ చర్చి ఎంతో ముస్తాబుగా అలంకరించబడి ఉంటుంది.

చిత్ర కృప : Emmanuel David

మనాలి

మనాలి

మనాలి లో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఒక టూరిస్ట్ స్పాట్. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. మంచుచే కప్పబడిన ఈ ప్రదేశంలో మంచుతో మనిషి బొమ్మలను, బంతులను తయారు చేసుకొని ఆనందించవచ్చు.

చిత్ర కృప : HolidayLandmark

బెంగళూరు

బెంగళూరు

బెంగళూరు నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. చర్చీలు, బేకరీ లు ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు. పిల్లలకి క్రిస్మస్ కి ముందు రోజు రాత్రి శాంతా క్లాజ్ తాత బహుమతులు పంచుతాడు. గరుడ మాల్, మంత్రిస్క్వేర్ మాల్, ఒరియన్ మాల్ వంటి ప్రధాన షాపింగ్ మాల్స్ విద్యుద్దీపాలతో ధగ ధగ మెరుస్తూ కనిపిస్తాయి.

చిత్ర కృప : Parshotam Lal Tandon

ఢిల్లీ

ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీ లో క్రిస్మస్ వేడుకలు వారం ముందు నుంచే మొదలయ్యాయి. నగరంలోని చర్చీ వీదులన్నీ విద్యుద్దీపాలతో, క్రిస్మస్ చెట్లతో నిండి పోయాయి. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ లు ఆహార పానీయాల మీద ముందుగానే భారీగా ఆఫర్ లను, డిస్కౌంట్ లను ప్రకటించింది. నగరంలో క్రిస్మస్ రోజున భక్తులు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు.

చిత్ర కృప : Niyam Bhushan

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి