Search
  • Follow NativePlanet
Share
» »పర్వతారోహణ ప్రీయులకు ఇక్కడ ఎల్లప్పుడూ సు స్వాగతం

పర్వతారోహణ ప్రీయులకు ఇక్కడ ఎల్లప్పుడూ సు స్వాగతం

పర్వతారోహణకు అనుకూలమైన ప్రాంతాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన కథనం.

By Gayatri Devupalli

ప్రపంచం వ్యాప్తంగా ఉన్న సాహస ప్రేమికులు ఎల్లప్పుడూ, పర్వతారోహణకు ఉత్తమ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు. భారతదేశం, సులభతరం నుండి కఠినతరం వరకు, అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలతో వెలసిల్లే అన్ని రకాల సుందర ట్రెక్కింగ్ గమ్యాలకు ఆలవాలం. అయితే, ఈ వ్యాసంలో మాత్రం ట్రెక్కింగ్ లో విస్తృతమైన అనుభవం కలిగిన సాహశీకులకు మాత్రమే అనువైన గమ్యాలను గురించి మీకు తెలియజేయబోతున్నాము.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube

భారతదేశంలోఉన్న ప్రపంచంలోని మూడవ అతి పెద్ద శిఖరం అయిన కంచన్ జంగాను అధిరోహించడానికి ప్రపంచ వ్యాప్త సాహస యాత్రికులు ఆసక్తిని కనబరుస్తారు. భారతదేశంలోని కంచన్ జంగా మరియు ఇతర పర్వతారోహణ అనుకూల ప్రదేశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి ఎన్నటికీ మరపురాని అనుభూతిని ఇస్తాయి.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube

కంచన్ జంగా: 8586 మీటర్ల భయానక ఎత్తులో ఉండే కంచన్ జంగా, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద శిఖరం. ఈ పర్వతం భారతదేశంలో సిక్కిం మరియు నేపాల్ మధ్య విభజించబడింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్వతారోహణ ప్రాంతాలలో ఒకటి.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube

ఈ ట్రెక్ పూర్తి చేయడానికి పూర్తిగా ఒకనెల పడుతుంది. మీ జీవితంలోనే అద్భుతమైన మరియు గంభీరమైన శిఖరాన్ని సందర్శించబోయే ఈ యాత్రలో భాగంగా, మీరు సిక్కింలోని అందమైన రాడోడెండ్రాన్లతో నిండి ఉన్న అడవుల గుండా ప్రయాణిస్తారు. కంచన్ జంగాను పర్వత శిఖరాన్ని అధిరోహించడమంటే, మీ జీవితాన్ని మార్చివేసే అనుభూతిని స్వంతం చేసుకోవడం అని అర్ధం.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube

హనుమాన్ టిబ్బా: హిమాచల్ ప్రదేశ్ లోని ధౌలాధర్ పర్వత శ్రేణుల మధ్య నెలకొని ఉన్న హనుమాన్ టిబ్బా, ఈ శ్రేణిలోనే అత్యున్నత పర్వతం. దీనిని "ది వైట్ మౌంటెన్" అని కూడా పిలుస్తారు. ఈ పర్వతాన్ని అధిరోహించడం చాలా కఠినమైన పని.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube

పర్వతం చుట్టూ ఉన్న సుందరమైన హిమానీనదాల వలన, ఇది తెల్లని పిరమిడ్ లాగా కనిపిస్తుంది. ఈ ట్రెక్ కు 17-20 రోజులు పడుతుంది. అక్కడ మీరు అత్యంత సహజమైన ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. ఈ ట్రెక్కింగ్ కు మే నెల నుండి సెప్టెంబరు నెలల మధ్య కాలం అనుకూలంగా ఉంటుంది.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube

కామెట్: ఉత్తరాఖండ్ లోని గఢ్వాల్ ప్రాంతంలోని రెండవ అతిపెద్ద పర్వత కామెట్. 7756 మీటర్ల ఎత్తులో ఉన్న, కామేట్ ఒక పెద్ద పిరమిడ్ లాగా కనిపిస్తుంది. బల్లపరుపుగా ఉండే ఈ శిఖరం, రెండు కొనలు కలిగి ఉన్నట్లు ఉంటుంది.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube

అధిరోహణ మార్గం సూటిగా ఉన్నప్పటికీ, పూర్తి చేయడానికి పూర్తిగా ఒక నెల సమయం పడుతుంది. మే, జూన్, సెప్టెంబరు మరియు అక్టోబర్ నెలల్లో వాతావరణం అంత కఠినంగా ఉండదు కనుక ఈ పర్వతాన్ని అధిరోహించడానికి, ఇది ఉత్తమ సమయం.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube

గఢ్వాల్ ప్రాంతంలోని అత్యున్నత శిఖరం నందా దేవి అయినందున, ఎక్కువమంది ఈ శిఖరాన్ని అధిరోహిస్తారు. కనుక, కమెట్ పర్వతంపైకి ట్రెక్కింగ్ చేయడమనేది ఒక వినూత్నమైన అనుభవంగా నిలిచిపోతుంది.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube

రాథోంగ్: రాథోంగ్ పర్వతం, సముద్ర మట్టానికి 6678 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడే రాథోంగ్ హిమానీనదంను కూడా చూడవచ్చు. రాథోంగ్ హిమానీనదాలపై ట్రెక్కింగ్, సాధ్యమైనంత త్వరగా అనుభవించాల్సిన, ఉత్కంఠతతో కూడుకున్న సాహసం.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube


గ్లోబల్ వార్మింగ్ కారణంగా, రాథోంగ్ హిమానీనదం చాలా త్వరగా కరుగుతూ పోతుంది. సాధారణంగా సాహశీకులు, రాథోంగ్ గ్లేసియర్ ట్రెక్కింగ్ తో పాటుగా, సిక్కింలోని గోచా లా లాంటి ప్రముఖ పర్వతారోహణలో కూడా పాల్గొంటారు. గోచా లా ట్రెక్కింగ్ ను ప్రపంచంలోని సాహసవంతులైన యాత్రికుల అభిమాన ప్రదేశాలలో ఒకటిగా చెప్పవచ్చు.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube

చంగాబాంగ్: కామత్ మరియు నందా దేవి కాకుండా, పర్వతారోహణ ప్రియులలో అత్యంత ఆదరణ పొందిన గఢ్వాల్ పర్వత శ్రేణులలోని చంగాబాంగ్ పర్వతము ఒకటి. చంబాబాంగ్ 6866 మీటర్ల ఎత్తులో ఉంది.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube


వెడల్పాటి మొరైన్ పచ్చిక బయళ్ళు, అద్భుత జీవవైవిధ్యం, బాగిని హిమానీనదం మరియు కామెట్ మరియు నందా దేవి శిఖరాల యొక్క అద్భుతమైన వీక్షణ దృశ్యాలను, ఈ అద్భుతమైన ట్రెక్ ద్వారా మీరు ఆశించవచ్చు. చంగాబాంగ్ బేస్ క్యాంప్ కు ట్రెక్కింగ్ చేయాలంటే, 9-12 రోజులు పడుతుంది. మీరు చంగాబాంగ్ శిఖరాగ్రాన్ని చేరుకోవాలనుకుంటే మరికొన్ని రోజులు పడుతుంది.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube

ఈ పర్వతారోహణ ప్రదేశాలన్ని, ట్రెక్కింగ్ లో విశేష అనుభవం కలిగిన ప్రొఫెషినల్ ట్రెక్కర్లకు మాత్రమే ఉద్దేశింపబడినవి అయినప్పటికీ, ఈ ట్రెక్ లను చేపట్టడానికి ముందు అవసరమైనవైద్య తనిఖీలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ ట్రెక్లలో కొన్నింటిని చేయడానికి అనుమతులు అవసరమవుతాయి. వీటికి కావలసిన అనుమతి పత్రాలు మీ వద్ద తప్పక ఉంచుకోవాలి.

పర్వతారోహణ

పర్వతారోహణ

P.C: You Tube

ఇటువంటి యాత్రలకు ఒంటరిగా వెళ్లడానికి బదులుగా ఎల్లప్పుడూ గుంపుతో వెళ్లండి. మీరు సాగే బాటను పరిశుభ్రంగా ఉంచుతూ, చెత్తను మీ బేస్ క్యాంప్ కు తిరిగి తీసుకురండి. సరైన వైద్య సహాయ సామాగ్రిని మీ వెంట తీసుకెళ్లండి మరియు ట్రెక్ మొదలుపెట్టక మునుపే, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X