Search
  • Follow NativePlanet
Share
» »బ్రిటిష్ కాలం నాటి సొగసైన భవనాలు లక్నోలో చూసి తరించాల్సిందే...

బ్రిటిష్ కాలం నాటి సొగసైన భవనాలు లక్నోలో చూసి తరించాల్సిందే...

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్కోకు ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఎంతో ఉంది. దేశంలోనే కాదు విదేశాల నుండి కూడా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి విహారానికి వస్తుంటారు. అందుకే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లక్నో సమీపంలోని అనేక ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిందారు. లక్నో నగరం లక్ష్మణుడి పేర వెలిసిన లక్ష్మణపటికి హ్రస్వరూపం అని మొదట్లో లక్షణపురిగి పిలవబడి కాలక్రమేణా లక్ష్మణవటి, లక్ష్మణపూర్, లఖన్ పూర్, లఖ్నావతిగా మారి చివరకు లక్నోగా మారిందని కథనం.

ముస్లిం రాజులు నిర్మించిన ప్రాసాదాలు, ఉద్యానవనాలు, మసీదులు, అలనాటి వారి వైభవానికి చిహ్నాలుగా మిగిలాయి. 1857లో భారతదేశాన్ని సందర్శించిన విలియం హెచ్. రసెల్ అనే సాహీతీవేత్త లక్నోనగరం రోమ్, ఎథెన్స్ నగరాల కంటే అందంగా ఉందని అభివర్ణించాడు. ఒకసారి లక్నో చరిత్రను గమనిస్తే మొఘలుల పతనానంతరం 1724 నుండి 1856 వరకు అవధ్ నవాబులు తమ ఆధీనంలో ఉంచుకుని పలించారు. చాలా వరకు చారిత్రక నిర్మాణాలన్నీలక్నో ఆగ్నేయ ప్రాంతంలోనే ఉండటం విశేషం. మరి ఇటువంటి అద్భుతమైన చరిత్ర కలిగిన లక్నోలో విడిది చేసి వీటిని చుట్టేసి రావచ్చు.

దూవాంశరీఫ్:

దూవాంశరీఫ్:

దేవాంశరీఫ్ లక్కో నుండి 25 కిలోమీటర్ల దూరంలో బారాంబంకీ జిల్లాలోని ఒక ధార్మిక స్థలం. దీన్ని మహా సూఫీ సంత్ హాజీ వారిస్ ఆలీ షాహ్ కేంద్రంగా భావిస్తుంటారు. దీనికి అవధ్ చరిత్రలో ఎంతో కీలకమైన స్థనం ఉంది. వానిక అలీషాహ్ కు హుసైనీ సయ్యద్ కుటుంబంతో సంబంధం ఉంది. కేవలం 14ఏళ్ళ వయస్సు నుండే ఆయన ప్రజల్ని తన ప్రభావంతో ఆశ్చర్య చకితుల్ని చేసే వారు. ఆయన అనుచరుల్లో హిందువులు, ముస్లీంలు ఇద్దరున్నారు. ఈ పవిత్ర స్థలానికి ఆయన అనుచరులు ఏడాది పొడవునా వచ్చిపోతుంటారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇక్కడ సంత్ జ్ఝాపకార్థం వార్షిక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఒక మేళ కూడా ఏర్పాటు చేస్తారు. ఇది దేవ మేళాగా చాలా ప్రసిద్ది చెందింది. ఈ మేళాలో సాహిత్య కార్యక్రమాలు , కవి సమ్మేళనాలు, సంగీత కచేరీలు నిర్వహిస్తారు. ఇక్కడ పర్యాటకులకు వివిధ రకాల హస్త కళల సామాగ్రి లభిస్తుంది.

Image Courtesy: Spverma007

అయోధ్య:

అయోధ్య:

లక్నోకు 110కిలోమీటర్ల దూరంలో సరయూ నదికి కుడివైపు తీరాన ఉన్న అయోధ్య రామజన్మ భూబిగా ప్రసిద్ది చెందిన ముఖ్యమైన తీర్థస్ళం. కొన్ని శతాబ్ధాలు ఇది సూర్యవంశ రాజుల రాజధానిగా ఉండేది. ఇందులో ముఖ్యమైన రాజుల్లో రాముని పేరు వస్తుంది . ప్రాచీన కాలం నుండి దీన్ని కౌశల దేశంగా పిలుస్తున్నారు. స్కంద పురాణంలో అయోధ్యను భారతదేశంలోని ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు. హిందూ మతం, బౌద్దమత, జైనమతం ఇస్లామ్ ల అవశేషాలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తున్నాయి. రామ్ కోట్, హనుమాన్ గఢీ, కనక్ భవన్, సూరజ్ కుండు ఇక్కడి ప్రసిద్ద దర్శనీయ కేంద్రాలు .

PC: Swaminathan

బిఠూర్:

బిఠూర్:

కాన్పూర్ బయట గంగా తీరానా ఉన్న బిఠూర్ లోని చిన్న మందిరంలో ప్రశాంతంగా కొంత సమయం గడపటానికి అనువైన ప్రదేశం. మంచి అనుభూతిని కలిగిస్తుంది. బిఠూర్ గుిరంచి అనేక పురాణ గాథలున్నాయి. దీన్ని స్రుష్టికర్త బ్రహ్మ నివాస స్థానం అని పిలుస్తుంటారు. స్థానికి కథనాల ప్రకారం సీతాదేవిని అడవిలో వదిలాక ఇక్కడ ఉండే ఆమె లవ, కుశలనే కవల పిల్లలకు జన్మనిచ్చిందిని అంటారు. అలాగే స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన రాణి లక్ష్మీ బాయ్, నానా సాహెబ్ , పీస్వాల కార్యక్షేత్రంగా ఈ స్థానానికి మంచి గుర్తింపు ఉంది. గంగా తీరం నుండి బిఠూర్ లో సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటం కూడా విభిన్న అనుభూతి కలిగిస్తుంది. ఇక్కడ వాల్మీకి ఆశ్రమం, బ్రహ్మవర్త ఘాట్, ధ్రువటీలా, నానాసాహెబ్ మహాల్ కూడా సందర్శించదగ్గ ప్రదేశాలు .

PC: Swaminathan

కతర్నియా ఘూట్ :

కతర్నియా ఘూట్ :

కతర్నియా ఘాట్ : లక్నో నుండి 200కిలోమీటర్ల దూరంలో బహరాయిచ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ప్రేశం దూధ్వా టైగర్ రిజర్వ్ లో భాగంగా ఉంటుంది. ఈ ఘాట్ నెపాల్ లో బర్ దియా జాతీయ ఉద్యానవనం సరిహద్దుతో అనుసంధానమై ఉంటుంది. ఇక్కడి గిర్వా , కోర్డియా నదులు కలిసిపోతాయి. గిర్వా నదిలో డాల్ఫిన్లు ఉంటాయి, ఇక్కడి పర్యాటకులు పెద్ద పులులు, చిరుతలు, జింకలు వాటి సహజమైన ఆవాసాల్లో చూసి ఆనందించే అవకాశం ఉంటుంది.

Image Courtesy: DARSHAN SEN

నైమిషారణ్యం:

నైమిషారణ్యం:

లక్నో నుండి 9కిలోమీటర్ల దూరంలోని సీతాపూర్ జిల్లాలో ఉన్న నైమిషారణ్యం వైదిక యుగం నుండే హిందువులకు ముఖ్యమైన తీర్థ స్థానంగా ఉంది. గోమతీ నది తీరాన ఉన్న ఈ ప్రదేశం ప్రాచీన కాలంలో ఎంతో మంది సాధువులు తపస్సు కారణంగా కూడా ప్రసిద్ది చెందింది.చక్రతీర్థం, వ్యాసపీఠం, సూరజ్ కుండ్, పాండవుల కోట, హనుమాన్ గఢీ, లలితాదేవి మందరి వంటి ముఖ్యమైన పూజా స్థలాలు జనాన్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. తీర్థయాత్రలు చేస్తున్న వారికి నైమిషారణ్యంలో ప్రతి ఏటా మార్చిలో నిర్వహించే ప్రక్షిణలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.

PC: T.Sujatha

దుధ్వా జాతీయ పార్కు:

దుధ్వా జాతీయ పార్కు:

ఇది లక్కో నుండి 230కిలో మీటర్ల దూరంలోని లఖిమ్ పూర్ ఖీరి లోయ ప్రాంతంలో నేపాల్ సరిహద్దుకు సమీపంగా ఉంటుంది. పెద్ద పులులు సంరక్షణ కోసం ఇది ఏర్పాటైంది. జీవావరణ క్రమంలో పులుల స్థానాన్ని కాపాడేందుకు ఈ పార్కును నెలకొల్పారు. కానీ దుధ్వాలో కేవలం పెద్ద పులులేగాక చిరుతలు, జింకలు, ఏనుగులు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రక్రుతి రమణీయంగా ఉంటుంది. ఇందులో 400కంటే

ఎక్కువ జాతులు పక్షులను చూడొచ్చు.

Image Courtesy: DARSHAN SEN

లక్నో రైల్వే స్టేషన్:

లక్నో రైల్వే స్టేషన్:

లక్నో రైల్వే స్టేషన్ బయటి నుండి చూస్తే ఒక రాజభవంలా కనిపిస్తుంది. ప్రపంచంలోకెల్లా అందమైన రైల్వేస్టేషన్లలో ఇదొకటి. 1914 మార్చి 21న దీని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రఖ్యాత వాస్తుశిల్పి జేకబు దీనికి ప్లాన్ రూపొందించాడు. ప్లాట్ ఫాంపైకి రైళ్ళు ఎంత పెద్ద శబ్ధంతో వచ్చినా బయట ఉన్నవారికి ఏమాత్రం వినిపించవు.

PC: Mohit

బారా ఇమాంబారా:

బారా ఇమాంబారా:

1784లో అవధ్ నవాబు అసపుద్దౌలా కరవు వచ్చినప్పుడు పౌరులకు ఉపాది కల్పించడానికి దీనిని నిర్మించారు. బారా ఇమాంబార ప్రపంచవ్యాప్తంగా విశాలమైనే భూగర్భ గ్రుహల్లో ఒకటి 48.6 మీటర్ల పొడవు హాలును చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఆ హాలు పైభాగం ఆధారం లేకుండా నిలబడిందా అని ఆశ్చర్యచకితులవుతారు. కర్భలాలోని హుస్సేన్, హాసన్ సమాధులను పోలిన ప్రతిమలు ఇందులో దర్శనమిస్తాయి. మెట్ట వరుస కూడా ఉంది. దాని వెంబడి వెళ్తే మయసభను తలపించే భూల్ భూలయ్యా గడులోకి చేరుకోవచ్చు.

PC: MohitW1

రూమీ దర్వాజా

రూమీ దర్వాజా

బారా ఇమాంబారా బయటగల ఒక పెద్ద ద్వారం ఇది. ఇందులో అవధ్ నిర్మాణ నైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది. పూర్వం రోమ్ సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉన్న ఇస్తాంబుల్ పట్టణంలో ఉన్నదానికి రూమి అనే మాట మహ్మదీయుల రోమ్కు ప్రతిరూపం దీనినే టర్కిష్ గేట్ వే అని కూడా పిలుస్తారు. అవథ్ నిర్మాణ కౌశలానికి ఇదొక మచ్చుతునక.

గడియార స్థంభం :

గడియార స్థంభం :

దీని ఎత్తు 221 అడుగులు. ఈ స్థంభం నిర్మాణం 1880లో ప్రారంభించబడినది. 1887లో పూర్తయింది. ఆ కాలంలోనే ఈ నిర్మాణానికి ఒకలక్షా 75వేల రూపాయలు వెచ్చించబడ్డాయి. ఇది బ్రిటిష్ వాస్తు నైపుణ్యానికి చక్కని ఉదాహరణ.

PC: Mohitextreme

జమా మసీద్:

జమా మసీద్:

చోటా ఇమాంబారాకు పడమరగా జామా మసీదు ఉంది. వైభవంగా నలిచిన ఈ మసీదు మూడు డోములు, రెండు స్థంభాలతో వినూత్నంగా అలరారుతోంది. అద్భుతమైన మొగళాయి శైలిలో నిర్మించబడిన ఈ మసీదు మహ్మద్ ఆలీషా ప్రారంభించాడు. మెగలాయి శూలిలో నిర్మించబడిన ఈ మసీదు మహ్మద్ అలీషా ప్రారంభించాడు. అంతలోనే అతడు మరణించాడు. తర్వాత ఆయన భార్య మలిక్ జుహా పూర్తిచేసింది.

PC: Varun Shiv Kapur

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more