» »వాలెంటైన్ తో ఒక రోజు ఇలా ప్లాన్ చేసుకుందాం

వాలెంటైన్ తో ఒక రోజు ఇలా ప్లాన్ చేసుకుందాం

Written By: Beldaru Sajjendrakishore

జీవితంలో మనలను ప్రేవించేవారు పక్కన ఉండగా నచ్చిన ప్రదేశాల్లో జగమంతా మనమే అనుకుంటూ తిరగడం మరుపురాని అనుభూతి. ఇందు కోసం మీ ట్రావెల్ నేస్తం నేటివ్ ప్లానెట్ ప్రేమ పక్షులకు ఇష్టమైన, అవసరమైన పర్యాటక ప్రాంతాలను అందిస్తోంది. ఇందులో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలతో పాటు రోమాంటిక్ ఆలోచనలను రెట్టింపు చేసే ఉద్యానవనాలు, సరస్సులూ ఉన్నాయి. కలల రాణి తీసుకువెళ్లాలను కేంటే.. అలనాటి రాజరికానికి గుర్తులైన ఎన్నో ప్యాలెస్ లు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. అంతే కాకుండా వాలెంటైన్ కు వినూత్న బహుమతులు అందజేయడానికి షాపింగ్ ప్రాంతాలు, మూన్ లైట్ డిన్నర్ డెస్టినేషన్లను కూడా మీకు అందిస్తున్నాం. ప్రస్తుతానికి బెంగళూరు నగరంలో అందుబాటులో ఉన్న ఇలాంటి పర్యాటక ప్రాంతాలను మాత్రమే ఇక్కడ ఇచ్చాం. ఇదే విధంగా మీరు ఉంటున్న నగరాల్లోని ప్రాంతాలను ఎన్నుకొని అక్కడికి మీ వాలెంటైన్ ను తీసుకువెళ్లి ఈ వాలెంటైన్ రోజును జీవితంలో మరుపురానిదిగా మార్చుకోండి. ఈ ఫిబ్రవరి 14న మీకు వీలు దొరకకపోతే వచ్చే వీకెండ్ మీ వాలెంటైన్ తో నచ్చిన ప్రాంతంలో సెలబ్రేట్ చేసుకోండి...

1. ప్రేమ దేవుడికి మొదట....

1. ప్రేమ దేవుడికి మొదట....

Image source

శ్రీక`ష్ణుడిని ప్రేమకు ప్రతి రూపంగా కొలుస్తారు. ఈ వాలెంటైన్ డే రోజు తమ ప్రేమ నిరంతరం కొనసాగాలని కోరుతూ ఆ శ్రీక`ష్ణుడిని పూజించాలనుకునే వారికి నగరంలోని ఇస్కాన్ దేవాలయం సరైన చోటు. యశ్వంతపురలో ఉన్న ఈ దేవాలయానికి నగరంలోని చాలా చోట్ల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఇటీవలే మెట్రో కూడా అందుబాటులోకి వచ్చింది. గట్ట పై ఉన్న ప్రధాన ఆలయంలో శ్రీక`ష్ణుడిని ఆరాధించి ఈ ప్రేమ కలకాలం నిలవాలని ప్రార్థన మనస్త్ఫూర్తిగా ప్రార్థించండి.

2. దొడ్డ మనస్సుతో దీవించమని

2. దొడ్డ మనస్సుతో దీవించమని

Image source

ఏదైన ఒక ముఖ్యకార్యక్రమాన్ని ప్రారంభించే ముందు చాలా మంది దైవగణాల అధిపతి అయిన గణపతికి పూజలు చేయడం సాధారణంగా జరిగేది. ఇలాంటి వారికి నగరంలోని దొడ్డగణపతి దేవాలయం చక్కని పర్యాటక ప్రాంతం. బసవనగుడిలోని ఈ దేవాలయంలోని గణపతికి పూజలు చేస్తే కోరిన కోర్కెలు తప్పక తీరుతాయని స్థానికుల నమ్మకం. తమ ప్రేమ విజయ తీరాలను చేరుకోవాలని ఆ ఆదిదేవుడిని పూజించించవచ్చు. ఇక్కడ బ`హదాకారంలోని గణపతి, దగ్గర్లోని బుల్ టెంపుల్ దేవాలయాలను కూడా చూడవచ్చు.

3. చుట్టూ లోకాన్ని మరిచి...

3. చుట్టూ లోకాన్ని మరిచి...

Image source

దైవ దర్శనం తర్వాత మనసుకు నచ్చిన వారితో ఏకాంతంగా ఊసులాడుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఐటీ సీటిగా పేరొందిన బెంగళూరు నిత్యం రద్దీగా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఈ నగరికి ఉద్యాన నగరి అన్న పేరు కూడా ఉందని మరిచిపోకండి. నగరంలోని అనేక ఉద్యానవనాలు ఉన్నా ప్రేమికులకు మొదట గుర్తుకు వచ్చేది కబ్బన్ పార్క్. దాదాపు 300 ఎకరాల్లో 6వేల వ`క్షాలతో ఎటు చూసినా పచ్చగా ఉండే ఈ ఉద్యానవనం నగరం నడిబొడ్డున ఉంది. ఇక్కడ కుర్చొని ఊసులాడుకుంటూ ఉంటే సమయమన్నదే తెలియదు.

4. కోరికలు ఉరకలు వేసే చోటు...

4. కోరికలు ఉరకలు వేసే చోటు...

Image source

నగరంలో కబ్బన్ పార్క్ తర్వాత లాల్ బాగ్ కూడా ప్రేమ పక్షులకు నిలయం. వాలెంటైన్ రోజున ఈ లాల్ బాగ్ ప్రేమికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి నేరుగా బస్సులు ఉన్నాయి. కనుచూపు మేర పచ్చగా ఉండటం, చుట్టూ ప్రేమికులే ఉండటంతో ఆ ప్రాంతం వద్దనా కొత్త కోరికలను పుట్టిస్తుంది. దీంతో నగరం నుంచే కాకుండా చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వాలెంటైన్ రోజున చాలా మంది వస్తుంటారు.

5. బహుమతుల అడ్డ

5. బహుమతుల అడ్డ

Image source

వాలెంటైన్ రోజున నచ్చి, మెచ్చి, మనసిచ్చిన ప్రేమికురాలి లేదా ప్రేమికుడికి చక్కని బహుమతి ఇవ్వక పోతే ఏదో వెలితి ఉన్నట్లే. దీంతో నగరంలో బెస్ట్ షాపింగ్ ప్రాంతాలు అన్న వాటిలో మొదట గుర్తుకు వచ్చేది ఎంజీ రోడ్. దీని పక్కనే బ్రిగెడ్ రోడ్డు కూడా ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం షాపింగ్ కు ప్రసిద్ది. రూ.50 నుంచి రూ.50 లక్షల విలువ చేసే కీచైన్, వస్తాలు, ఆభరణాలు, వాలెట్ తదితరాలు ఎన్నో దొరుకుతాయి. దీంతో మీ అభిరుచికి తగ్గట్టు, మీ వాలెంటైన్ కు ఇష్టమైన వస్తువును బహుమతిగా అందించడమే ఆలస్యం.

6. కమర్షియల్ స్ట్రీట్

6. కమర్షియల్ స్ట్రీట్

Image source

శివాజీ నగర్ దగ్గరగా ఉన్న కమర్షియల్ కమర్షియల్ స్ట్రీట్ లో వివిధ రకాల వస్త్రాలు దొరుకుతాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉన్ని, తోలు దుస్తులు కూడా ఇక్కడ లభిస్తాయి. ఈ ప్రాంతం మొత్తం తిరగడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది.

7.ఇంద్రభవనం లాంటి...

7.ఇంద్రభవనం లాంటి...

Image source

బెంగళూరు అంటేనే మాల్స్ కల్చర్ కు మారు పేరు. అందులో నగరం నడిబొడ్డున ఉన్న యూబీ సిటీ నగర యువతను రా...రమ్మని ఆహ్వనిస్తూ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి దాదాపు 11 గంటల వరకూ ఈ షాపింగ్ మాల్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కేవలం షాపింగ్ కే కాకుండా ఇండియా, కాంటినెంటల్, చైనీస్ తదితర రెస్టో రెంట్లు కూడా మంచి విందుతో మిమ్ములను ఆహ్వనిస్తూ ఉంటాయి. ఇక్కడ రూ.1000 నుంచి రూ.కోటి విలువ చేసే వస్తువులు దొరుకుతాయి. ఇంద్రభవనం లాంటి యూబీ సిటీలో షాపింగ్ ను ఎప్పటికీ మర్చి పోలేము.

8.ఓరియన్ మాల్

8.ఓరియన్ మాల్

Image source

యశ్వంతపుర దగ్గరగా ఉన్న ఈ మాల్ ఇప్పుడిప్పుడే షాపింగ్ అడ్డాగా మారుతూ ఉంది. ఇక్కడ వివిధ బ్రాండ్ లకు చెందిన దుస్తులు ఎక్కువగా దొరుకుతాయి. వాలెంటైన్ వంటి ప్రత్యేక రోజుల్లో లైవ్ మ్యూజిక్ ను మాల్ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకువస్తుంటారు.

9.హలసూరు లేక్

9.హలసూరు లేక్

Image source

మీలో చాలా మంది ప్రక`తి ప్రేమికులు ఉంటారు. అలాంటి వారికి హలసూర్ లేక్ సరైన ప్రాంతం. కనుచూపుమేరలో నీరు, ఆ నీటి ఒడ్డున ప్రియుడు, లేదా ప్రియురాలుతో నడుచుకుంటూ పోవడం మరుపురాని అనుభూతే కదు. ఇక్కడ ఉదయం సాయంత్రం సమయాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం మరిచిపోలేము.

10 సాంకీట్యాంక్

10 సాంకీట్యాంక్

Image source

స్థానికులతో పాటు ప్రభుత్వం కూడా సాంకీ ట్యాంక్ ను బాగా అభివ`ద్ధి చేసింది. ఇక్కడ బర్డ్ వాచ్ సదుపాయం కూడా ఉంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో వాటర్ స్పోర్ట్ ను కూడా నిర్వహిస్తుంటారు. వాలెంటైన్ రోజున నగర యువత ఎక్కువగా వెళ్లే ప్రాంతాల్లో సాంకీ ట్యాంకీ కూడా ముందు వరుసలో ఉంటుంది.

11. టిప్పు సుల్తాన్ ప్యాలెస్

11. టిప్పు సుల్తాన్ ప్యాలెస్

Image source

నగరంలో కళాసి పాళ్య మార్కెట్ కు దగ్గరగా ఉన్న టిప్పు సుల్తాన్ ప్యాలెస్ చూడదగిన పర్యాటక ప్రాతం. గతంలో టిప్పు సుల్తాన్ దీన్ని వేసవి విడిదిగా వినియోగించే వారని చరిత్ర చెబుతుంది. ఇక్కడి ఉన్న చిత్రకళ కూడా అద్భుతంగా ఉంటుంది. మీ మనసుకు నచ్చిన యువరాణీని ఈ ప్యాలెస్ ను చూపిస్తూ నీవే నా హ`దయరాణివని కాస్త పొయెటిక్ గా చెప్పండి. ఫలితం మీరే చూస్తారు.

12. బెంగళూరు ప్యాలెస్

12. బెంగళూరు ప్యాలెస్

Image source

నగరం నడి బొడ్డున ఉన్న ఈ ప్యాలెస్ లోకి మీ కలల రాకుమారుడిని లేదా కలల రాణిని తీసుకు వెళ్లి చూపించండి. కొంత ఖర్చు పెడితే గుర్నపు బగ్గీలో కూడా తిప్పవచ్చు. అనేక సినిమా షూటింగ్ లు కూడా ఇక్కడ జరిగాయి. బెంగళూరు ప్యాలెస్ ను చూపిస్తూ నా హ`దయం అనే కోట ఇక నీ ఆధీనం అని చెప్పండి. వెంటనే మీ వాలెంటైన్ కన్నుల్లో తడి, పెదవి పై చిరునవ్వూ ఒకేసారి చూడవచ్చు.

13.చిత్రకళ పరిషత్

13.చిత్రకళ పరిషత్

Image source

వినూత్నమైన కానుక ఇవ్వాలన్న వారికి నగరంలోని చిత్రకళ పరిషత్ సరైన చోటు. శివాజీ నగర్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నిత్యం వివిధ రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు, కళాకారులు తమ చిత్రాలను, శిల్పాలను ప్రదర్శనకు ఉంచుతుంటారు. నచ్చిన వాటిని ఖరీదు చేసే సదుపాయం కూడా ఉంటుంది. మరింకెందుకు మన భవిష్యత్తు నిత్యం ఇంద్ర ధనుస్సు వలే రంగుల మయం కావాలని కోరుకుంటూ మీ వాలెంటైన్ కు మంచి పెయింటింగ్ ను బహుమతిగా అందించండి.

14. వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ

14. వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ

Image sourc

కబ్బన్ పార్క్ కు దగ్గరగా ఎం.జీ రోడ్డుకు కూత వేటు దూరంలో ఉన్న ఈ గ్యాలరీలో వివిధ దేశాలకు చెందిన మాడ్రన్ ఆర్ట్ ప్రదర్శనకు ఉంచుతారు. అందువల్ల మీ ఇష్టసఖికి సదరు విదేశీ ఇంటర్నేషనల్ ఆర్ట్ ను గిఫ్ట్ గా అందించి వారి కళ్లలో ఆనందాన్ని చూడండి.

15.ఇందిరా నగర్

15.ఇందిరా నగర్

Image source

ఇప్పుడిప్పుడే పార్టీ హబ్ గామారుతున్న ఇందిరా నగర్ లో పబ్ లు రెస్టో రెంట్లు వెలుస్తున్నాయి. వీకెండ్ తో పాటు వాలెంటైన్ వంటి ప్రత్యేకమైన రోజుల్లో కాండిల్ లైట్ డిన్నర్ లను అందజేస్తున్నాయి. రోజంతా నగరంలో తిరిగిన మీ వాలెంటైన్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ గా మూన్ లైట్ డిన్నర్ ను ఆఫర్ చేయడం. అప్పుడు చూడంటి వారి కళ్లల్లో ఆనందం. జీవితంలో ఆ ద`ష్యాన్ని ఎప్పటికీ మర్చి పోరు. అన్నట్టు ఇందిరా నగర్ స్ట్రీట్ ఫుడ్ కు కూడా బాగా ఫేమస్.

 16. కోరమంగళ

16. కోరమంగళ

Image source

కోరమంగళ కూడా మంచి ఫుడ్ హబ్. వాలెంటైన్ డే రోజు చివరిగా ఇక్కడకు మీ లవర్ ను తీసుకువెళ్లవచ్చు. అన్నట్టు ఇక్కడ రూఫ్ టాప్ రెస్టో రెంట్లు ఎక్కువగా ఉన్నాయి. సాయం సమయంలో మసక చీకటిలో మన నెచ్చెలి పక్కన ఉండటం ఆ సమయంలో ఆకాశంలో చంద్రుడిని చూటం జీవితంలో మరుపురాని అనుభూతి కదు. ఇలా ఒక రోజు పాటు మీ వాలెంటైన్ టూర్ ను ముగించి జీవితంలో మరుపురాని అనుభూతిని పొందండి.