Search
  • Follow NativePlanet
Share
» »మియావో - ప్రశాంతతకు నెలవు !!

మియావో - ప్రశాంతతకు నెలవు !!

మియావో ను ప్రశాంత పట్టణం అనుకుంటే పొరబడినట్లే! ఇక్కడ చూసేందుకు అనేక ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో టైగర్ రిజర్వ్, జూ, మ్యూజియం, ఆహ్లాదకరమైన ప్రదేశాలు కొన్ని.

By Mohammad

అస్సాం సరిహద్దు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియావో చాంగ్లాంగ్ జిల్లాలోని ఒక సబ్-డివిజన్. అత్యధిక వర్షపాతం ఉండే ఈశాన్య రాష్ట్రాలలోని అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే మియావోను వర్ధమాన నగరంగా చెప్పుకోవచ్చు. మియావో గుండా నవో-దిహింగ్ అనే నది ప్రవహిస్తుంది, ఈ నది సముద్రమట్టానికి 213 అడుగుల ఎత్తున ఉంది. హిమాలయాలకు తూర్పువైపు విస్తరణగా ఉండే పాటకాయి బుం అనే పర్వతశ్రేణులు ఈ నగరం చుట్టూ ఉంటాయి.

ఒక ప్రశాంతమైన పట్టణమే కాక, మియావోలో చాలా పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. నామ్దఫా టైగర్ ప్రాజెక్ట్, చిన్న జూ, ఓ మ్యూజియం, ఇతర ఆహ్లాదకర ప్రదేశాలతో ఈ పట్టణం పర్యాటకులను ఆకర్షిస్తుంది. అనేక హిందూ దేవాలయాలు, రివైవల్ చర్చ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, కాథలిక్ చర్చ్ లుకూడా మియావోలో ఉన్నాయి. పైగా, ఈ పట్టణంలో చాలా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఉన్నాయి. పిసి జాంగ్ ప్రచురించే స్థానిక వార్తలతో కూడిన "ద మియావో టైమ్స్" అనే వారపత్రిక కూడా ఇక్కడినుండే ప్రచురితమవుతుంది.

అరుణాచల్ ప్రదేశ్ లోని అందమైన పట్టణం

అరుణాచల్ ప్రదేశ్ లోని అందమైన పట్టణం

చిత్రకృప : Krish9

నమ్పొంగ్

నమ్పొంగ్, అరుణాచల్ ప్రదేశ్ లోని మరో ఆసక్తికరమైన పట్టణం. ఈ పట్టణం ఛంగ్లంగ్ జిల్లలో, పంగ్సా పాస్ కి దగ్గరలో ఉంది. 308 మీటర్ల ఎత్తున ఉండే నామ్పొంగ్ పూర్వం స్టిల్వేల్ రోడ్డుగా పిలువబడే లెడో రోడ్డుమీద ఉంది. జనరల్ జోసెఫ్ స్టిల్వేల్ పేరిట ఈ రోడ్డు ఏర్పడింది. తరచుగా సంభవించే భూకంపాలు, కఠినమైన పరిస్థితుల వల్ల ఈ ప్రాంతాన్ని "హెల్ పాస్" గా పిలిచేవారు. మయన్మార్ దేశంతో సరిహద్దు కలిగిన భారతదేశ తూర్పు భాగంలోని చిట్టచివరి పట్టణం నామ్పొంగ్. ఈ పాన్గ్సు పాస్ ద్వారా ప్రతినెలా ప్రజలని మయన్మార్ లోకి వెళ్ళడానికి అనుమతిస్తారు.

స్థానిక తెగల నృత్యం

స్థానిక తెగల నృత్యం

చిత్రకృప : Arunachal2009

బోర్డుమ్సా

అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్లాంగ్ జిల్లలో ఉండే చిన్న పట్టణం బోర్డుమ్సా. 150 మీటర్ల ఎత్తున ఉండే బోర్డుమ్సా లో షుమారు 25,368 మంది జనాభా ఉంటారు. సింగ్ఫో అనే తెగవారి ప్రధాన నివాసకేంద్రం ఈ పట్టణం. టై-ఖమ్ప్తి, టై-ఖామ్యంగ్, టై-ఫకే అనే ఇతర తేగల వాళ్ళు కూడా ఈ పట్టణంలో ఉంటారు. 'పెద్ద' అనే అర్ధం వచ్చే 'బోర్' అనే పదం సింగ్ఫో జాతిలోని సంబోధనలలో ఒకటైన 'దుమ్సా' అనే పదం ఈ రెండిటి కలయికతో ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది.

అటవీ అందాలు

అటవీ అందాలు

చిత్రకృప : Rohit Naniwadekar

జైరాంపూర్

జైరాంపూర్ పట్టణం, అరుణాచల్ ప్రదేశ్ ఆగ్నేయభాగంవద్ద చగ్లంగ్ జిల్లలో ఉంది. ఈ పట్టణం ఛంగ్లంగ్ జిల్లాకు ఏడిసి ప్రధానకార్యాలయం. ఇండో-మయన్మార్ సరిహద్దు తోపాటు, నమ్చిక్ బేసిన్, జైరంపూర్ లో సతతహరిత ఉష్ణమండల అడవులు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. కొండ ప్రాంతం వద్ద ఉన్న జైరంపూర్ లో సందర్శకులు ప్రకృతి నిజమైన అందాన్ని చూడవచ్చు, హోలోక్ గిబ్బంల అరుపులతో మేల్కొని, పరుచుకున్న పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు.

నీటి ప్రవాహం

నీటి ప్రవాహం

చిత్రకృప : Rohit Naniwadekar

నామ్సాయి

నామ్సాయి అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రధానమైన పట్టణాల్లో ఒకటి. 'బంగారు గోపురాల ప్రదేశం'గా పిలువబడే నామ్సాయి, లోహిత్ జిల్లాలోని దిహింగ్ నది వద్ద వుంది. దేశ౦ నలుమూలల నుంచి వ్యాపారులు ఇక్కడికి రావడంతో ఈ పట్టణం వేగంగా అభివృద్ది చెందుతోంది. గిరిజన, ఆధునిక జీవన శైలుల మేలుకలయిక నామ్సాయి పట్టణం.

ఇది కూడా చదవండి : అరుణాచల్ ప్రదేశ్ - అనుభవించే ప్రదేశాలు కోకొల్లలు !!

మియావో ఎలా చేరుకోవాలి ?

బస్ ప్రయాణం

బస్సు ద్వారా దిబ్రూఘర్ నుంచి తీన్ సుకియా, మార్ఘేరిటా, లేడో, జగున్, ఖార్సాంగ్ ల మీదుగా మియావోకు నిత్యం అస్సాం ప్రభుత్వ బస్సులు, అరుణాచల్ ప్రదేశ్ బస్సులు తిరుగుతాయి - వీటి ద్వారా మియావోకు తేలిగ్గా చెరుకొవచ్చు.

రైలు ద్వారా

మియావో లో రైల్వే స్టేషన్ లేదు. మియావో - తీన్ సుకియా రైల్వే స్టేషన్ నుంచి 115 కిలోమీటర్లు, అస్సా౦ లోని మార్ఘేరిటా రైల్వే స్టేషన్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వుంటుంది.

వాయుమార్గం ద్వారా

దిబ్రూఘర్ విమానాశ్రయం, తీన్ సుకియా రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరి కేంద్రాలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X