Search
  • Follow NativePlanet
Share
» »వేలన్ కన్ని - అద్భుతాలు జరిగిన భూమి !!

వేలన్ కన్ని - అద్భుతాలు జరిగిన భూమి !!

ఇతిహాసం మేరకు ఈ ఓడ సరిగ్గా మేరీ జన్మదినం సెప్టెంబర్ 8 వ తేదీన అక్కడకు చేరింది. అయిదు వందల సంవత్సరాల నుండి ఈ అద్భుతాన్ని ఒక వేడుకగా లక్షలాది భక్తులు ఇక్కడకు వచ్చి అతి వైభవంగా జరుపుతారు.

By Mohammad

తమిళనాడు కోరమండల్ కోస్తా తీరంలో కల వేలన్ కన్ని ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడకు అన్ని మతాల ప్రజలు అన్ని ప్రాంతాలనుండి వస్తారు. నాగపట్టినం జిల్లలో కల వేలన్ కన్నిలో వర్జిన్ మేరీ గుడి కలదు. ఈ పుణ్య క్షేత్రం మడోన్నా వేలన్ కన్నికి అన్కితమివ్వబడినది. ఈ దేవత నే 'అవర్ లేడీ ఆఫ్ హెల్త్' అని కూడా అంటారు. చెన్నై నుండి వేలన్ కన్ని సుమారు 325 కి.మీ.ల దూరంలో దక్షిణ దిశగా వుండి తేలికగా చేరేది గానే వుంటుంది.

అద్భుతాలు జరిగిన భూమి !

వర్జిన్ మేరీ, వేలన్ కన్నిలో 1560లో సాత్కాతరించినదని ఈ టవున్ లో ఈ కాలానికి ముందే ఆధ్యాత్మక చింతన అధికంగా ఉండేదని చెపుతారు. ప్రసిద్ధ నమ్మకాల మేరకు, మేరీ ఒక గొర్రెల కాపరిని తన బిడ్డ అయిన జీసస్ దాహం తీర్చటానికి గాను పాలు కోరింది.ఈ సంఘటన చూపుతూ అందుకు గుర్తుగా ఇక్కడ ఒక చాపెల్ నిర్మించారు. వేలన్ కన్ని ని 'అద్భుతాల భూమి' అని అంటారు. ఇక్కడ అనేక అద్భుతాలు జరిగినట్లు పట్టణంలో చెప్పుకుంటారు.

వేలన్ కన్ని - అద్భుతాలు జరిగిన భూమి !!

చిత్రకృప : Drmalathi13

వాటిలో ఒకటి చెప్పాలంటే, 17 వ శతాబ్దంలో ఒక పోర్చుగీస్ వాణిజ్య ఓడ బంగాళా ఖాతంలోని పెను తుఫానుకు గురైంది. నిరాశలో కల ఆ ఓడ నావికులు వారు సురక్షిత ప్రదేశానికి ఎక్కడకు చేరితే అక్కడ ఒక చాపెల్ నిర్మిస్తామని వర్జిన్ మేరీ కి వాగ్దానం చేసారు. ఆ ఓడ ఈ ప్రదేశానికి చేరింది. వాగ్దానం చేసిన నావికులు అక్కడే కల మేరీ చాపెల్ ను మరో మారు పునర్మించారు.

ఇతిహాసం మేరకు ఈ ఓడ సరిగ్గా మేరీ జన్మదినం సెప్టెంబర్ 8 వ తేదీన అక్కడకు చేరింది. అయిదు వందల సంవత్సరాల నుండి ఈ అద్భుతాన్ని ఒక వేడుకగా లక్షలాది భక్తులు ఇక్కడకు వచ్చి అతి వైభవంగా జరుపుతారు. ఈ యొక్క 'అవర్ లేడీ' చాపెల్ దేశం లోనే ప్రసిద్ధి చెందినా క్రైస్తవ క్షేత్రాలలో ఒకటిగా నిలచింది. మరో అద్భుతం చెప్పాలంటే, ఒక హిందూ పాల మనిషి, మేరీ కి తన గిన్నె నుండి కొన్ని పాలు పోసి మరల ఆ గిన్నె లోని పాలను ఒక ఖాతాదారు కు పూర్తిగా పోయటం జరిగింది. మరొక అద్భుతం అంటే, ఒక కుంటి బాలుడు మేరీ కి మజ్జిగను అందించి తన కుంటితనాన్ని పోగొట్టుకున్నాడు.

వేలన్ కన్ని - అద్భుతాలు జరిగిన భూమి !!

చిత్రకృప : Bexel O J

వేలన్ కన్ని బీచ్, వేలన్ కన్ని

వేలన్ కన్ని బీచ్ లో ఎన్నో దుకాణాలు కలవు. పర్యాటకులకు ఈ షాపులు దేశం లోని ఇతర షాపుల కంటే విభిన్న అనుభూతిని అందిస్తాయి. తక్షణ ఫోటోలు తీయుట, ఫోటోలు, సి.డి.లు అమ్మకం, చిన్న హోటళ్లు , మొదలైనవి ఎన్నో వుంటాయి. వేలన్కన్ని లో ఆధునికత మరియు పురాతనం రెండూ వుంటాయి. కొంతమంది వాక్స్ తో చేయబడిన శరీర భాగాలను చర్చిలో వేసేందుకు అమ్ముతారు. అంటే చాలా మంది తమ వ్యాధుల నివారణకు ఇక్కడకు వస్తారు. ఇక్కడ స్విమ్మింగ్ అందరూ కోరతారు. సముద్రం చాలా లోతు. అనేక మంది సముద్ర స్నానాలు చేయటం చూడవచ్చు.

వేలన్ కన్ని - అద్భుతాలు జరిగిన భూమి !!

చిత్రకృప : Kumbalam

వేలన్ కన్ని చర్చి

బసిలిక ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ గా పిలువబడే వేలన్ కన్ని చర్చి వేలన్ కన్ని టవున్ లో ప్రసిద్ధ ఆకర్షణ. ఒకప్పుడు అంటే 16 వ శతాబ్దంలో ఒక తాటి ఆకుల గుడిసెగా వున్న వేలన్ కన్ని చర్చి 1771 నాటికి ఒక పారిష్ చర్చి గా మారి, 1962 లో పోప్ జాన్ XXIII చే ఒక ప్రత్యేక హోదా కల మైనర్ బాసిలికా గా గుర్తించబడినది.

ఈ క్షేత్రం ఉదయం అయిదు గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకూ తెరచి వుంటుంది. ప్రతి రోజూ తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాషలలో వివిధ సమయాలలో ప్రార్థనలు చేస్తారు. 1974-75 లలో ఫ్రాన్స్ లోని లూర్దెస్ చర్చి నమూనాలో ఇక్కడి బాసిలికాకు మార్పులు చేసారు. దీనితో వేలన్ కన్ని చర్చిని లూర్దెస్ ఆఫ్ ఈస్ట్ అని పిలిచారు. సెప్టెంబర్ లో జరిగే ఫీస్ట్ మరియు క్రిస్మస్ సీజన్లో యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు.

వేలన్ కన్ని - అద్భుతాలు జరిగిన భూమి !!

చిత్రకృప : Rojypala

వేలన్ కన్ని లో చూసేందుకు అనేక ఆకర్షణలు కలవు. వేలన్ కన్ని బాసిలిక, మ్యూజియం ఆఫ్ ఆఫరింగ్, శ్రిన్ డిపో, వేలన్ కన్ని బీచ్ మొదలైనవి. అద్భుత ఫౌంటెన్, హోలీ పాత్, మరియు లేడీ ట్యాంక్ చర్చి వంటివి కొన్ని టూరిస్ట్ ఆకర్షణలు. ఈ టవున్ లో అనేక ఆధునిక సౌకర్యాలు అంటే ఏ టి ఎం లు , హోటళ్లు , హోం స్టే లు, మరియు ఒక రైల్వే స్టేషన్ కలవు. గుడి డిపో లో మీకు హస్త కళల వస్తువులు, ఇతర మతపర వస్తువులు దొరుకుతాయి. ఇదే భవనంలో ఒక సమాచార కౌంటర్ కలదు. ఇక్కడ మీరు టవున్ గురించిన సమాచారం పొందవచ్చు.

ఇది కూడా చదవండి : ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చి ఎక్కడ ఉందో తెలుసా ?

వేలన్ కన్ని ఎలా చేరుకోవాలి ?

మధురై, ట్రిచి, తిరువనంతపురం, తంజావూరు తో పాటు హైదరాబాద్, బెంగళూరు నుండి కూడా నాగపట్టినం కు బస్సులు కలవు. అక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేలన్ కన్ని చేరుకోవటానికి ప్రభుత్వ/ప్రవేట్ వాహనాలు కలవు.

నాగపట్టిణంలో రైల్వే స్టేషన్ మరియు దగ్గరలో తిరుచిరాప్పల్లి విమానాశ్రయం కలదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X