Search
  • Follow NativePlanet
Share
» »మహాబలిపురం ... పల్లవుల అద్భుత సృష్టి !!

మహాబలిపురం ... పల్లవుల అద్భుత సృష్టి !!

By Mohammad

మహాబలిపురం తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 66 కి.మీ. దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నైకి 70 కి.మీ. దూరంలో ఉంది. మహాబలిపురం తమిళ భాషలో మామల్లపురం (Mamallapuram) అని పిలుస్తారు. ఈ పట్టణంలో ఉన్న తీరం వెంబడి ఉన్న దేవాలయం ప్రపంచంలో యునెస్కో వారి చేత సంరక్షించ బడుతున్న హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటి.

చరిత్ర

7 వ శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహాబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టనణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్ట బడిందని చరిత్రకారులు చెబుతారు.

సముద్రం ఒడ్డున ఉన్న షోర్ టెంపుల్

సముద్రం ఒడ్డున ఉన్న షోర్ టెంపుల్

చిత్రకృప : Karthik Easvur

మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.

నిజంగా ఒక అద్భుతమైన శిల్పకళా స్థావరం అయిన మామల్లాపురం లేదా మహాబలిపురంలో చూడవలిసిన ప్రదేశాలని మూడు భాగాలుగా విభజించవచ్చు.

ద్రౌపది స్నానం చేసిన ప్రదేశం

ద్రౌపది స్నానం చేసిన ప్రదేశం

చిత్రకృప : Nandhinikandhasamy

మొదటివి మండపాలు, గోపురాలు, లైట్ హౌస్, బిగ్ రాక్ మొదలైనవి వున్న ప్రాంతం. వీటిని చూడటానికి, ఫొటోలకి రుసుము లేదు పూర్తిగా ఉచితం. రెండవది అక్కడినుంచి పావు నుంచి అరకిలోమీటరు దూరంలో వుండే పాండవ రథాలు. ఇవి చూడటానికి, ఫొటోలకి టికట్ తీసుకోవాలి. మూడవది అతి సుందరమైన సీషోర్ టెంపుల్. ఇక్కడికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి. సముద్రుం ఒడ్డున అందమైన గొపురపు గుడి ఇది. ఇది కూడా చాలా దగ్గరే. బస్సు దిగిన దగ్గరనుంచి ఎడమవైపు సముద్రం ఒడ్డున ఉంటుంది.

బిగ్ రాక్: ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే వుంది. ఇది ఒక విచిత్రం. ఇక్కడ ఒక చెట్టు వుంది. ఆ చెట్టుకి కాసే కాయలు అరచేయ్యంత పరిమాణం కలిగి వుంటాయి.

కోటికల మండపం

కోటికల మండపం

చిత్రకృప : Hariharanmg

బీచ్ : మహాబలిపురం బీచ్ అందమైనది. సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఈ బీచ్ లోని అలలు చాల భయంకరంగా వుంటాయి. మరియు బీచ్ లో సముద్రపు లోతు ఎక్కువ. కనుక సముద్ర స్నానం ప్రమాధకరము. గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇక్కడ బీచ్ తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీఫుడ్ అత్యంత రుచికరంగా ఉంటుంది. ఇక్కడ భొజనం హోటళ్ళకి, లాడ్జిలకి కొరతే లేదు. కాని రాత్రి సమయాలలో ఉండేటందుకు అనువైన సౌకర్యాలు కలిగిన ప్రాంతంకాదు. భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువమంది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు.

పాండవుల రథాలు

పాండవుల రథాలు

చిత్రకృప : Girish Gopi

విశేషాలు

ఇది పూదత్తాళ్వార్ జన్మించిన స్థలము. ఆళ్వార్లు మంగళాశాసనము చేసిన సన్నిధి శిథిలమై సముద్రతీరమున ఉంది. ఇది శిథిలము అయినందున కొంత దూరములో మరియొక సన్నిధిని నిర్మించారు. స్వామి స్థలశయనముగా సేవ సాయించు క్షేత్రము ఇదియొక్కటియే. పుండరీకమహర్షి తామర పుష్పములతో స్వామిని అర్చించాలని వెళ్ళిన సమయంలో స్వామి ఒక వృద్ద బ్రాహ్మణుని రూపముతో వచ్చి ఆకలిగానున్నది, ఆహారం కావాలని అడిగాడు. అంతట పుండరీకుడు ఆహారమును తీసికొని వచ్చుటకు వెళ్ళాడు. ఇంతలో స్వామి ఆ తామరపుష్పములను అలంకరించుకొని పుండరీకమహర్షి తలచిన రూపముతో శయనించాడు.

అరేబియా సముద్రం మరియు టెంపుల్

అరేబియా సముద్రం మరియు టెంపుల్

చిత్రకృప : J'ram DJ

మహర్షి తిరిగివచ్చి స్వామిని సేవించి ఆశ్చర్యపడి వారిని స్థలశయనర్ పిలిచాడు. తరువాత స్వామికి స్థలశయనర్ అని పేరు వచ్చింది. ఈక్షేత్రమునగల జ్ఞానపిరాన్ (వరాహస్వామి) సన్నిధి ఉంది. ఇచ్చట స్వామి మేనిలో తాయార్లు కుడివైపున ఉండుటచే ఈసన్నిధికి వలనెంజై (కుడి హృదయం) అనిపేరు. ఇది అతిమనోహరమైన శిల్పసంపదతో అలరారుతున్న క్షేత్రము. తిరుమంగై ఆళ్వారు ఈక్షేత్రస్వామిని కీర్తించుచుండ తిన్ఱనూర్ భక్తవత్సలస్వామి ప్రత్యక్షం అయినందున భక్తవత్సలస్వామి ఇక్కడి నుండి మంగళాశాసనము చేసారని కథనాలు వివరిస్తున్నాయి.

కేవ్ టెంపుల్ దారి

కేవ్ టెంపుల్ దారి

చిత్రకృప : Samsat83

ఇది కూడా చదవండి : శీర్కాళి - ప్రసిద్ధ ఆలయాలు, విశిష్టతలు !!

మహాబలిపురం ఎలా చేరుకోవాలి ?

  • బస్సు మార్గం : కంచి, చెన్నై ప్రాంతాల నుండి ప్రతి రోజూ మహాబలిపురానికి బస్సులు తిరుగుతుంటాయి.
  • రైలు మార్గం : చెంగల్పట్టు మహాబలిపురానికి సమీప రైల్వే స్టేషన్ (29 కి.మీ.)
  • వాయు మార్గం : చెన్నై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ మహాబలిపురానికి సమీపాన కలదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X