» »రైళ్ళను ఆపే గుడి ఎక్కడ వుందో మీకు తెలుసా?

రైళ్ళను ఆపే గుడి ఎక్కడ వుందో మీకు తెలుసా?

Posted By: Venkata Karunasri Nalluru

మధ్య ప్రదేశ్ పేరుకు తగినట్లే భారతదేశం మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని నగరం భోపాల్. మధ్యప్రదేశ్ భౌగోళిక స్వరూపంలో నర్మదా నది, వింధ్య పర్వతాలు, సాత్పూరా పర్వతాలు ప్రధాన అంశాలు. తూర్పు, పడమరలుగా విస్తరించిన ఈ రెండు పర్వతశ్రేణుల మధ్య నర్మదానది ప్రవహిస్తున్నది. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు తరతరాలుగా ఈ కొండలు, నది హద్దులుగా పరిగణింపబడుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన గుజరాత్, వాయువ్యాన రాజస్థాన్, ఈశాన్యాన ఉత్తర ప్రదేశ్, తూర్పున ఛత్తీస్‌గఢ్, దక్షిణాన మహారాష్ట్ర రాష్ట్రాలతో హద్దులున్నాయి.

విజ్ఞానం విస్తరిస్తోంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఒకప్పుడు బొగ్గుతో నడిచే రైళ్ళు ఇప్పుడు గాలివేగంతో పోటీపడుతున్నాయి. కానీ ఓ చిన్నగ్రామంలో మందిరం దగ్గరకు రాగానే రైళ్ళ వేగం తగ్గిపోతోంది.రైల్వే అధికారులకు కూడా ఈ విషయం అంతుపట్టడం లేదు.

మధ్యప్రదేశ్ లోని శాజాపూర్ జిల్లాలో బోలాయ్ అనే ఒక చిన్న గ్రామంలో వున్న హనుమాన్ మందిరం వద్దకు రాగానే వాటంతటవే రైళ్ళు స్లో అయిపోతాయి. గుడి దాటే వరకు చాలా నెమ్మదిగా వెళతాయి.

ఇది కూడా చదవండి:మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు

హనుమాన్ మందిర మహత్యం

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1.శ్రీరాముని భక్తుడు.

1.శ్రీరాముని భక్తుడు.

హనుమంతుడు శ్రీరాముని భక్తుడు. మహా బలశాలి. వినయవిధేయతలలో ఆయనకు సాటి రారు.అత్యంత బలవంతుడైనప్పటికీ ఆయనలో ఏమాత్రం అహంకారం కనిపించదు. కోరినకోరికలను మారుతి నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. రైలు ప్రమాదాల నుంచి కూడా కాపాడతాడనేది నమ్మకం.

pc:Akshat Saxena

2. హనుమాన్ మందిరం

2. హనుమాన్ మందిరం

ఈ అద్భుత హనుమాన్ మందిరానికి వెళ్ళాలంటే మధ్యప్రదేశ్ లోని శాజాపూర్ జిల్లాకు వెళ్ళాల్సిందే. ఈ జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఆగ్రా, ముంబాయ్ హైవేని కలుపుతుంది.

pc:Bijay chaurasia

3. చరిత్ర

3. చరిత్ర

చరిత్ర ప్రకారం శాజాపూర్ ను మొఘల్ బాద్షా షాజహాన్ 1640లో నిర్మించారు. ప్రస్తుతం శాజాపూర్ ప్రసిద్ధ ఆలయాలు, ప్రత్తికి ప్రసిద్ధిచెందినది.

pc:Bholesh P.Vashisth

4. ప్రాముఖ్యత

4. ప్రాముఖ్యత

వ్యాపారపరంగా ఈ ప్రాంతం చాలా ప్రాముఖ్యత కలిగినది. అలాంటి చోట బోలాయ్ గ్రామంలో వున్న రామ భక్త హనుమంతుని ఆలయం విశేషంగా గుర్తింపు పొందింది.

pc:Bijay chaurasia

5. స్థానికుల నమ్మకం

5. స్థానికుల నమ్మకం

ఈ గుడిలో వున్న రామ భక్త ఆంజనేయుడు రైళ్ళను దుర్ఘటనల నుండి కాపాడతాడనేది స్థానికుల నమ్మకం. రైళ్ళు ఈ గుడి వద్దకు చేరుకోగానే నెమ్మదించాల్సిందిగా ఆంజనేయుడు ఆదేశాన్నిచ్చాడట. ఈ దేవాలయం మీదుగా వెళ్ళేటప్పుడు రైళ్ళ వేగం ఆటోమేటిక్ గా ఆగిపోతుందట.

pc:wikicommns

6. అంజనీసుత

6. అంజనీసుత

అంజనీసుత హనుమాన్ ను అతులిత బలశాలిగా కొలుస్తారు. లంకను నాశనం చేసిన ఆంజనేయుడు సంజీవినితో శ్రీరాముడిని కాపాడటానికి హిమాలయాల నుండి ఏకంగా సంజీవపర్వతాన్నే తీసుకునివస్తాడు. అంతటి బలశాలి తన భక్తితో శ్రీరాముని మనస్సులో స్థానాన్ని సంపాదించాడు.

pc:Rvbalaiyer

7. సంకటాలు

7. సంకటాలు

ఈ మందిరానికి మరో ప్రత్యేకత కూడా వుంది. ఇక్కడ ఆంజనేయుని విగ్రహంతో పాటు వినాయకుడు కూడా వున్నాడు. ఇలా ఇద్దరూ కలిసుండటం చాలా అరుదే కాదు అద్భుతంగా భావిస్తారు. ఈ విగ్రహాలను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. ఈ కోవెల సంకటాలను దూరం చేస్తుందనేది స్థానికుల నమ్మకం.

pc:Gyanendrasinghchauha

8. వేడుకలు

8. వేడుకలు

శ్రీరామనవమి, హనుమాన్ జయంతి రోజులలో ఇక్కడ పెద్ద జాతరలే నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఈ భక్తులలో ఇప్పుడు భారతీయ రైల్వేలు కూడా చేరిపోయాయి. భగవంతుని ఆదేశాలు పాటిస్తూ ఆలయం వద్దకు రాగానే రైళ్ళ వేగాన్ని తగ్గిస్తున్నట్లు రైల్వే అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

pc:Satishk01

9. మందిర మహత్యం

9. మందిర మహత్యం

రైలు వేగం తగ్గకపోతే స్వామికి కోపం వస్తుందంట. చివరికి అది ప్రమాదాలకు కారణం అవుతుందంట. ఈ ప్రదేశంలో ఒకసారి గూడ్సు రైలు ప్రమాదానికి గురైంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా డ్రైవర్ కి ఏమీ కాలేదట. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామి ముందు సాష్టాంగ నమస్కారం చేశాడట.

pc:Shrutuja Shirke

10. 600 ఏళ్ళనాటి హనుమాన్ మందిరం

10. 600 ఏళ్ళనాటి హనుమాన్ మందిరం

600 ఏళ్ళనాటి హనుమాన్ మందిరం ముందు నుంచి రైళ్ళు అత్యంత వేగంగా వెళ్ళకూడదు అనేది నియమం. కానీ గూడ్స్ రైలు డ్రైవర్ దీని పట్టించుకోలేదట. మందిరం మహిమను కో డ్రైవర్ చెప్పినప్పటికీ పట్టించుకోకుండా ఆలయం ముందు నుంచి వేగంగా రైలుని తీసుకువెళ్ళాడట.

pc:Sharukhrock

11. హనుమంతుని మహత్యం

11. హనుమంతుని మహత్యం

ఆలయం దాటి వెళ్ళిన వెంటనే ఆ గూడ్సు రైలు ఎదురుగా వస్తున్న మరో గూడ్సు రైలుతో యాక్సిడెంట్ అయ్యిందట. విచిత్రమేమిటంటే డ్రైవర్ కు, కో డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదట.

pc:Bijay chaurasia

12. మారుతి ఫోటో

12. మారుతి ఫోటో

ఆంజనేయుని ఆదేశాలు పాటించనందుకే ఇలా జరిగిందని భావించిన డ్రైవర్ పరుగుపరుగున రామభక్తుని దగ్గరకు వెళ్లి చేసిన తప్పుకు క్షమించమని వేడుకున్నాడట. అంతేకాదు మారుతి ఫోటోను తీసుకువెళ్ళి తన ఇంటి వద్ద గుడి కూడా కట్టించాడట.

pc:Ganesh Dhamodkar

13. రైలు ఘటన

13. రైలు ఘటన

ఇప్పుడు ఆ డ్రైవర్ రిటైర్ అయినా ఇప్పటికీ రామభక్తుని పూజిస్తూనే వున్నాడు. ఆనాడు గూడ్స్ రైలు ఘటన నుంచి ఆ మార్గంలో వెళ్ళే రైళ్ళని గుడి వద్దకు రాగానే స్పేడ్ తగ్గించేయటం ఆనవాయితీగా మారింది. కాస్త ముందుకు వెళ్ళగానే మళ్ళీ వేగం పెంచుతారు.

pc:Gyanendrasinghchauha

14. అతీత శక్తులు

14. అతీత శక్తులు

అత్యంత శక్తివంతమైన సంకటమోచుని ఆలయం వద్ద అతీత శక్తులున్నాయని భావిస్తారు. ఇటీవలే ఆలయసమీపంలో రైలు పట్టా విరిగింది. దానిపై రైలు వెళ్ళినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరక్కుండా ఆంజనేయుడు కాపాడాడు అనేది భక్తుల విశ్వాసం.

pc:Mahi29