» »ఔత్సాహికుల కోసం ఇండియా ట్రెక్కింగ్ గైడ్!

ఔత్సాహికుల కోసం ఇండియా ట్రెక్కింగ్ గైడ్!

Posted By: Venkata Karunasri Nalluru

సాధారణంగా మనలో చాలామందికి ట్రెక్కింగ్ అంటే భయం దీనిని నిపుణులు మాత్రమే చేస్తారు అనే అభిప్రాయం వుంది. ట్రెక్కింగ్ వివిధ స్థాయిలలో వుంటుంది. ఎక్కువ ఎత్తులో వుండేవి మరియు సులభంగా వుండేవి. భారతదేశంలో ట్రెక్కింగ్ మూడు స్థాయిలలో ఉన్నాయి. భారతదేశంలో దేశవ్యాప్తంగా పుష్కలంగా కొండలు మరియు పర్వతాలు అనేకం వున్నాయి. వాటిలో ఆకుపచ్చని సహ్యాద్రి, ఆరావళి శ్రేణులు, త్రిశూల్ మొదలైనవి వున్నాయి.

హిమాలయ శ్రేణులను అధిరోహించడం చాలా కష్టం. ఈ పర్వతారోహణలో కొన్నిటికి గైడ్ అవసరం లేదు. మరికొన్నిటికి మార్గనిర్దేశం చేసేందుకు ఒక నిపుణుడు అవసరం ఎంతైనా వుంది. పర్వతారోహణ అంటే ఉత్సాహం చూపే వారి కోసం మేము కొన్ని ప్రదేశాల గురించిన వివరాలను మీ కోసం ఇందులో పొందుపరిచాం. చదవండి.

1. చెంబ్రా పీక్

1. చెంబ్రా పీక్

చెంబ్రా పీక్ వయనాడ్ జిల్లాలోని ఎత్తైన శిఖరం. ఇక్కడ ట్రెక్కింగ్ ఫూట్ హిల్స్ నుంచి ప్రారంభమవుతుంది. ఫూట్ హిల్స్ నుంచి కొండ మీదికి ట్రెక్ నెమ్మదిగా అధిరోహించటం చాలా ముఖ్యం. వాచ్ టవర్ వద్ద మొదటి బ్రేక్ తీసుకోవచ్చును. వాచ్ టవర్ నుండి అలా వెళ్తే హార్ట్ షేప్ లో వుండే ఒక సరస్సువస్తుంది. ఈ సరస్సును దాటిన తర్వాత శిఖరం చేరుటకు కొంచెం కష్టంగా వుంటుంది. భారీ వర్షాల సమయంలో కొండ ఎక్కకుండా వుంటే మంచిదని సలహా ఇవ్వబడుతోంది.

PC: wikimedia.org

2. తదియండమోల్

2. తదియండమోల్

తదియండమోల్ అనే ట్రెక్ రోడ్డు ద్వారా అందుబాటులో ఉండే కాక్కబే అనే ప్రదేశము నుండి సులభంగా మొదలవుతుంది. ట్రెక్ సులభంగా వుంటుంది. నీటి ప్రవాహం ప్రవహించే ప్రదేశాలలో ప్రారంభమవుతుంది. మొత్తం ట్రెక్కింగ్ 2.6 కిలోమీటర్ల దూరం వుంటుంది. మీరు ఒక వీకెండ్ ప్లాన్ వేసుకుని గుంపుగా కొండ మీదకు ట్రెక్ చేయవచ్చును. ఇటీవలి కాలంలో ఈ మార్గంలో ఏనుగులు సంచరిస్తున్నట్లు తెలుస్తుంది. మీ వెంట టార్చ్ తీసుకుని వెళ్ళటం మంచిదని సలహా ఇవ్వటం జరుగుతోంది.

PC: wikimedia.org

3. త్రియుండ్

3. త్రియుండ్

ఈ ట్రెక్ హిమాచల్ లో మెక్లియోడ్ గంజ్ నుండి ప్రారంభమవుతుంది. మొదటగా ధరంకోట్ నుండి ప్రారంభమై అటవీ ట్రయల్ లో వాకింగ్ ప్రారంభించాలి. మీరు అలా కొంతదూరం వెళ్ళినతర్వాత గల్లు దేవి ఆలయం చేరుకుంటారు. అక్కడ నుండి శిఖరాగ్రాన్ని చేరటానికి మూడు నాలుగు గంటల సమయం పడుతుంది. అటవీ శాఖ యొక్క గెస్థ హౌస్ లను ముందుగా బుకింగ్ చేసుకోవచ్చును లేదా శిఖరం వద్ద అద్దెకు ఇచ్చే రూమ్ లలో వుండవచ్చును.

PC: wikimedia.org

4. కరేరి లేక్

4. కరేరి లేక్

కరేరి లేక్ ట్రెక్ ఘెరా గ్రామ ప్రధాన మార్కెట్ ప్రాంతం నుండి మొదలవుతుంది. మీరు వంతెన దాటిన తర్వాత భోటే ఖోసి మీదుగా, ట్రెక్ కరేరి లేక్ మీదుగా నైతే కరేరి గ్రామానికి తీసుకు వెళ్తుంది. మొత్తం ట్రెక్ పూర్తవటానికి 9 లేదా 10 గంటల సమయం పడుతుంది. మీరు అడవిలో కాలిబాట ద్వారా ట్రెక్ చేస్తూ వెళ్తే చీర గ్రామంలో ఒక పాఠశాల మీదుగానయితే మరొక 5 నుండి 6 గంటల పడుతుంది. కరేరి గ్రామం వద్ద స్టే చేయటం మంచిది.

PC: wikimedia.org

5. ప్రాషర్ లేక్

5. ప్రాషర్ లేక్

మండి జిల్లాలో వున్న బగ్గి గ్రామం నుండి ట్రెక్ ప్రారంభమవుతుంది. ఈ గ్రామానికి జీప్ లో వెళ్ళవచ్చును. సుమారు 40 నిమిషాల పాటు పడుతుంది. దట్టమైన అడవి నుండి ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది.
అందమైన ప్రాషర్ లేక్ చేరుకోవటానికి 4 గంటల సమయం పడుతుంది. ఇక్కడ ప్రభుత్వ గెస్థ హౌస్ లేదా సాధారణ శిబిరాలలో వుండవచ్చును.

PC: wikimedia.org