• Follow NativePlanet
Share
» »బ్రహ్మదేవుడే జ్ఞానం పొందిన చోటు...సందర్శిస్తే అపరజ్ఞానంమన సొంతం

బ్రహ్మదేవుడే జ్ఞానం పొందిన చోటు...సందర్శిస్తే అపరజ్ఞానంమన సొంతం

Written By: Beldaru Sajjendrakishore

కోటప్పకొండ గుంటూరు జిల్లా, నరసరావుపేట దగ్గర ఉన్న త్రికూటేశ్వరుని సన్నిధి. చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా!...... అంటూ, యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలో మాత్రం కాలు పెట్టే సందుకూడాలేనంతగా భక్తజనంతో నిండిపోతుంది.

కొండమీదకు పోవడానికి నిర్మించబడిన ఘాటు రోడ్డులో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ కొటప్ప కొండకు బ్రహ్మ జ్జానం పొందడానికి సంబంధం ఏమిటీ...దీనిని దర్శించడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి తదితర విషయాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం.

1. పురాణకథనాలను అనుసరించి

1. పురాణకథనాలను అనుసరించి

Image source:


దక్షాయఙం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకుతాను చిన్నబాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో ఖఠినంగా తపస్సు చేసేవాడు. బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు ఙానభోధ చెయ్యమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్థానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు.

2. పాత కోటప్ప గుడి

2. పాత కోటప్ప గుడి

Image source:


ఈచోటనున్న గుడికే పాత కోటప్పగుడి అను పేరు. లోపల లింగము ఒక అడుగు ఎత్తుకలది. ఈ గుడి ఉన్న శిఖరమును రుద్ర శిఖరము అనబడుచున్నది. ఈ రుద్ర శిఖరము పక్కనున్నది విష్ణు శిఖరము. దక్ష యజ్ఞమున హవిర్భాగములను స్వీకరించిన పాపము పొవుటకై విష్ణువీ శిఖరము వద్దే పరమశివుడిని గురించి తపస్సు చేస్తాడు. దీంతో పరమశివుడు ప్రత్యక్షమై త్రిశూలముతో నేలమీద పొడుస్తాడు.

3. పాపవినాశనేశ్వుడిగా

3. పాపవినాశనేశ్వుడిగా

Image source:


వెంటనే ఆరంధ్రములనుండి వెంటనే అక్కడ నుంచి నీరు పైకి వస్తుంది. ఆ నీటిలో స్నానం చేసి తనను ప్రార్థిస్తే పాపము పోవునని పరమశివుడు, విష్ణువుకు చెబుతాడు. పరమశివుడు చెప్పినట్లు చేసి విష్ణువు తన పాపాలను పోగొట్టుకుంటాడు. .ఇచ్చట ప్రత్యక్షమయిన పరమేశ్వరుడిని పాపవినాశనేశ్వరుడు అని కూడా పిలుస్తారు. మొదట ఈ పాపవినాశనేశ్వరుడినే భక్తలు సందర్శించాలని చెబుతారు.

4. గద్దలచోటు అని కూడా

4. గద్దలచోటు అని కూడా

Image source:


ఈశిఖరమునకు 'గద్దలచోడు' అని పేరు కూడా ఉంది. యాత్రికులు తొలుత ఈశిఖరమునకుఎక్కి ఇక్కడ తీర్ధమున స్నానం చేసి పాపవినాశనేశ్వరుడుని సందర్శించుకుంటారు. తరువాత కొత్త కోటప్పకొండకు చేరుకుంటారు. రుద్ర శిఖరమునకు నైఋతి భాగమునున్న శిఖరమునకు బ్రహ్మశిఖరమనిపేరు. బ్రహ్మ శివునిగూర్చి తపము చేసి శివుడిని లింగమును ఆవిర్భవింపజేసెను. ఇదియే బ్రహ్మశిఖరము. దీనిని ఎంతో పవిత్రమైన ప్రాంతంగా భక్తులు భావిస్తారు.

5. విద్యలో ముందు

5. విద్యలో ముందు

Image source:


ఇచ్చట తూర్పున గల చిన్నపల్లె మునిమంద , ఎల్లమంద అని పిలుస్తారు. తొలుత బ్రహ్మాది దేవతలు, సకల మునిగణములు ఇక్కడకు వచ్చి శివుడిని పూజించారు. అందువల్లే దీనికి ఆ పేరు వచ్చింది. ఈశిఖరమున వున్న లింగమునకే కొత్త కోటప్పకొండ అనువ్యవహారము. ఈదేవునకే శివరాత్రినాడు అతివైభవముతో తిరునాళ్ళు జరుపుతారు. ఇక బ్రహ్మదేవుడే జ్జానం పొందిన ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే జ్జానం పెరిగి విద్య, వ్యాపారాల్లో ముందుంటారని చెబుతారు.

6. క్రీస్తూ పూర్వం నిర్మాణం

6. క్రీస్తూ పూర్వం నిర్మాణం

Image source:


శాసనాల ఆధారంగా ఈ ఆలయం క్రీస్తు పూర్వం 1172 నిర్మించబడింది. అటు పై శ్రీకృష్ణదేవరాయలు దేవాయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి మరియు ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేకవిధాఐన దానాలు చేసారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది.

7. మూడు దారులు

7. మూడు దారులు

Image source:


కొండమీదకు వెళ్ళడానికి మూడు దారులు ఉన్నాయి. యాత్రీకులు సాధారణంగా శ్రీ రాలజమల్లు రాజు నరసింహరాయలు నిర్మించిన మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. ఈ కొండను ఏకోణం నుండి చూసినా మూడుశిఖరాలు కనపడుతుంటాయి కనుక దీనికి త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావించబడుతుంటాయి.

8. ఈ కొత్త కోటప్పకొండను గురించి మరో కథ

8. ఈ కొత్త కోటప్పకొండను గురించి మరో కథ

Image source:


ఇక్కడికి దగ్గర్లో కొండకావూలు అనుపల్లె ఆ వూరిలో ఒక గొల్లవానికి ఆనందవల్లి అనే కూతురు ఉండేది. ఆమె గొప్ప శివభక్తురాలు. ప్రతి రోజూ త్రికూటేశ్వరుడిని పూజించడానికి కొండపైకి వచ్చేది. స్వామి వారిని అభిషేకించడానికి కుండలో పాలు, పూలు, పళ్లు తదితరాలు తెచ్చేది. ఒక్క రోజు కూడా ఆమె దైవారాధనను విడిచిపెట్టేది కాదు. చిన్న వయస్సుల్లోనే గొప్ప భక్తి భావం కలిగిన ఆమెను చూసి ఊరి వారు ఎంతో గౌరవించేవారు.

9. అందుకే కాకులు కనిపించవు

9. అందుకే కాకులు కనిపించవు

Image source:


ఈ క్రమంలో ఒక రోజు కుండలో పాలు తీసుకుని రాగా ఒక కాకి దాని పై వాలింది. దీంతో కుండ పక్కకు పడిపోవడంతో పాలు నేలపాలయ్యింది. ఈ సంఘటనతో కోపగించుకున్న ఆనందవల్లి ఇక పై ఈ కొండ పైకి కాకులు రాకుండా ఉండాలని శపించింది. అందుకే ఇక్కడ కాకులు కనిపించవు. ఇక ఆమె ఇలాగే శివుని ప్రతిదినము సేవిస్తూ ఉండేది.

10. శివ పరీక్ష

10. శివ పరీక్ష

Image source:


ఆనందవల్లి శివ భక్తిని పరీక్షించాలని ఆ పరమశివుడు భావించాడు. దీంతో తన మాయ చేత పెళ్లి కాని ఆ ఆనందవల్లికి గర్భము వచ్చేలా చేస్తాడు. అయినా ఆమె రోజూ కొండపైకి వచ్చి శివుడిని పూజించేది. ఆమె భక్తి శ్రద్ధలకు పరమశివుడు ఎంతో ఆనందించాడు. దీంతో ఒక రోజు ఓ పరమశివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యి నీవు శ్రమపడవలదు నేనె నీఇంటికి వచ్చెదను. నీవు ముందుగా నడు నేను నీ వెనుకనే వచ్చెదను వెనుకకు మాత్రము చూడకూడదని చెప్పాడు.

11. కొత్త కోటప్ప కొండ

11. కొత్త కోటప్ప కొండ

Image source:


అందుకు ఆనందవల్లి అంగీకరించి నడక సాగించెను. కొంతదూర పోయాక ఆనందవల్లికి ఒక భయంకర ధ్వని వినపడింది. దీంతో ఆమె జడిసి వెనుతిరిగి చూడగ ఆ మహా పురుషుడక్కడనే సమాధినిష్ఠ అయ్యెను. ఆబిలమునె ఇప్పుడు కొత్త కోటప్పకొండ అని అందురు.అప్పుడె ఆనందవల్లి కుమారుని ప్రసవించెను. జరిగినదానికి ఆమె ఎంతో భాదపడుతుండగా ఆ శిశువు కూడా మాయ మయ్యింది.

12. ఆమెకు కూడా ఆలయం

12. ఆమెకు కూడా ఆలయం

Image source:


కొంత సేపటికి అశరీర వాణి ఆమెకు జరిగినదంతా చెప్పింది. దీంతో ఆమె శివుడి గురించి తప్పస్సు చేసి అతనిలో ఐఖ్యమయ్యింది. అక్కడే ఆమెకు ఒక ఆలయం కూడా ఉంది. ఇది ప్రస్తుతం కొత్త కోటప్పకొండకు కొంచెము దిగువున ఉంది. ఆనందవల్లి గ్రామానికి చెందిన లింగ బలిజ సాలంకయ్యఅను శివభక్తుడొకడు ఈ కొతా కోటప్ప కొండను, ఆనందవల్లి దేవాలయమును కట్టించినాడట.

13. వివాహాలకు అనుమతి లేదు...

13. వివాహాలకు అనుమతి లేదు...

Image source:


తరువాత కోటప్పకు కల్యాణాది మహోత్సవములు చేయదలచి లింగ బలిజ సాలంకయ్య పడమరగా పార్వతికి దేవళము కట్టించాడు. బ్రహ్మచర్య దీక్షనుండు దక్షిణామూర్తి నెలకొనిన క్షేత్రమిది.అందువలన ఇక్కడ వివాహాలు చేయకూడదను అశరీరవాణి లింగ బలిజ సాలంకయ్యకు వినపడగ ఆయన ఆప్రయత్నమును విరమించెను. అందువలన ఈ గుడిలో వివాహాది కార్యక్రములను అనుమతించరు. ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రల్లో వివాహాలకు అనుమతించని పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి.

14. ప్రభల సంభరం

14. ప్రభల సంభరం

Image source:


శివరాత్రికి ఇక్కడ జరిగే ప్రభల సంభరం అత్యంత పేరు కలిగినది, విశేషమైనదీను. చుట్టుప్రక్కల గ్రామాలనుండి చిన్నపిల్లల చేతులలో చిన్న చిన్న ప్రభలనుండి దాదాపు డెభై ఎనభై అడుగుల వరకూ ఎత్తు గలిగిన ప్రభలు కోటప్పకొండకు శివరాత్రి సంబరాలకు తీసుకొస్తారు. వీటిని ట్రాక్టర్లలో బండ్లలో డప్పులు, బ్యాండు, రికార్డింగ్ డ్యాన్సులతోనూ, పగటి వేషాల వంటి పలు కార్యక్రమములతోనూ తీసుకొస్తారు.

15. సముద్రంలో తెరచాపలా...

15. సముద్రంలో తెరచాపలా...

Image source:


ఒక్కొక్క ప్రభను ఒక్కొక్క రకంగా అలంకరించి కొండక్రింద పొలాల్లో ఉంచుతారు. ఇవి పెద్దవే వందల సంఖ్యలో ఉంటాయి. చిన్నవయితే లక్షల సంఖ్యలో కనుపిస్తూ, కొండ పైభాగమునుండి చూసేవారికి సముద్రంలో తెరచాపల్లా కనువిందు చేస్తూఉంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఈ కోటప్ప కొండ ప్రభలను చూడటానికి చాలా మంది వస్తుంటారు.

16. కృత్రిమ జురాసిక్ పార్క్

16. కృత్రిమ జురాసిక్ పార్క్

Image source:


కొండమీద ఒక చిన్న సరసును నిర్మించి దాని మద్యలో కాళీయమర్ధన శిల్పాన్ని నిరించి ప్రత్యేక కాంతిప్రసారం చేస్తుంటారు. ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. కృత్రిమ జురాసిక్ పార్క్ మరొక పర్యాటక ఆఅర్షణగా ఉంది. ఇక్కడ స్థలమార్పిడి చేయగలిగిన పెద్ద జురాసిక్‌లను ఏర్పాటు చేసారు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన నెమళ్ళు, పావురాళ్ళు, ఈమోలు మరియు చిలుకలు కూడా ఉన్నాయి.

17. వసతి కూడా ఉంది

17. వసతి కూడా ఉంది

Image source:


యాత్రీకుల సౌకర్యార్ధం 30 వసతి గదులు కూడా నిర్మించబడ్డాయి. ఇవన్ని యుద్ధప్రాతిపదికలో రెండు మాసాలలో నిర్మించబడడం విశేషం. యాత్రీక ఆకర్షణలలో మరొకటి ధ్యానమందిరం. ఇక్కడ హోమాలు నిర్వహించబడతాయి. ఇందులో విశాలమైన భోజనశాల కూడా ఉంది. త్రవ్వకాలలో లభించిన అవశేషాలను బధ్రపరచిన మ్యూజియం పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇక్కడ సరదాగా గడపడానికి వీలుంటుంది.

18. ఇలా చేరుకోవచ్చు...

18. ఇలా చేరుకోవచ్చు...

Image source:


కోటప్పకొండకు దగ్గరలో కల నరసరావుపేట పాత బస్ స్టాండు, కొత్త బస్ స్టాండుల నుండి ప్రతి అరగంటకు ఇక్కడకు బస్సు ఉంది. ఇవేకాక ప్రైవెటు వాహనములు కూడా ఈ దారి గుండా ప్రయాణిస్తుంటాయి. కొండ పైకి వెళ్ళుటకు బస్సులు, జీపులు, ఆటోలు దొరకుతాయి. మిగిలిన రోజుల కంటే శివరాత్రి మహోత్సవాల సమయంలో ఈ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

ఈ అడవిలో కాకులు కనపడవు...కారణం ఇదే

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి