Search
  • Follow NativePlanet
Share
» »ఈ వినాయకుడు త్రినేత్రుడు

ఈ వినాయకుడు త్రినేత్రుడు

రణథంబోర్ త్రినేత్ర గణపతి దేవాలయానికి సంబంధించిన కథనం.

గణపతిని విఘ్న వినాయకుడు అని అంటారు. అందుంవల్లే ఏ శుభకార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా మొదట ఆ ఆది దేవుడికి పూజ చేసిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని మొదలుపెడుతారు. అందుల్ల ఆ పని జరిగే సమయంలో అనుకోని కష్టాలు ఎదురైతే వాటిని ఆ బొజ్జ గణపయ్య తొలగిస్తాడని చెబుతారు. భారత దేశంలో చాలా చోట్ల గణపతి ఆలయాలు ఉన్నాయి. అయితే రాజస్థాన్ లోని ఓ దేవాలయం మాత్రం విభిన్నమైనది. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

త్రినేత్ర గణపతి, రణథంబోర్

త్రినేత్ర గణపతి, రణథంబోర్

P.C: You Tube

రాజస్థాన్ లోని రణథంబోర్ త్రినేత్ర గణపతి దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న దేవాలయం. ఇక్కడ ఆ విఘ్న వినాయకుడికి మూడు నేత్రాలు ఉంటాయి కాబట్టే ఆయన్ను త్రినేత్ర గణపతి అని అంటారు.

త్రినేత్ర గణపతి, రణథంబోర్

త్రినేత్ర గణపతి, రణథంబోర్

P.C: You Tube

రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న సవై మాదవ్ పురానికి వచ్చి అక్కడి నుంచి ట్యాక్సీ ద్వారా రణథంబోర్ కు చేరుకోవచ్చు. సవై మాదవ్ పూర్ నుంచి రణథంబోర్ కు 12 కిలోమీటర్ల దూరం. ఇక్కడ ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమే రణథంబోర్ కోట.

త్రినేత్ర గణపతి, రణథంబోర్

త్రినేత్ర గణపతి, రణథంబోర్

P.C: You Tube

ఈ కోట పైనే త్రినేత్ర గణపతి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి అనేక మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఈ దేవాలయం అత్యంత ప్రాచీన దేవాలయం. అత్యంత విశిష్టమైనదని కూడా చెబుతారు. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు మన:పూర్తిగా కోరుకొన్న కోర్కెలన్నీ నెరవేరుస్తాడని స్థానికుల నమ్మకం.

సతీదేవి అగ్నికి ఆహుతైన ప్రాంతం ఇదే. సందర్శిస్తే మోక్షంసతీదేవి అగ్నికి ఆహుతైన ప్రాంతం ఇదే. సందర్శిస్తే మోక్షం

త్రినేత్ర గణపతి, రణథంబోర్

త్రినేత్ర గణపతి, రణథంబోర్

P.C: You Tube

ఇక్కడికి ప్రతిరోజూ వేల పెళ్లి పత్రికలు వస్తుంటాయి. దేశంలోని అనేక మంది ప్రజలు తమ వివాహ పత్రికల్లో మొదటి పత్రికను ఈ రణథంబోర్ త్రినేత్ర గణపతికే అందజేయాలనుకొంటారు. వీలుకుదిరిన వారు నేరుగా ఈ దేవాలయానికి వచ్చి లగ్న పత్రికను అందజేస్తుంటారు.

కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి?కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి?

త్రినేత్ర గణపతి, రణథంబోర్

త్రినేత్ర గణపతి, రణథంబోర్

P.C: You Tube

సమయాభావం, సుదూర ప్రాంతం తదితర కారణాల వల్ల ఇక్కడికి రాలేనివారు పోస్టుద్వారా తమ పెళ్లి ఆహ్వాన పత్రిక అదేనంటి లగ్నపత్రికను ఈ దేవాలయానికి పంపిస్తుంటారు. ఇలా వచ్చిన ప్రతి లగ్న పత్రికను ఇక్కడి పూజారులు ఆ వినాయకుడి ముందు చదువుతారు.

త్రినేత్ర గణపతి, రణథంబోర్

త్రినేత్ర గణపతి, రణథంబోర్

P.C: You Tube

తద్వారా వివాహం, వివాహం ద్వారా ఒక్కటైన దంపతులు కలకాలం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారని భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చే భక్తుల మరొక కోరికతో వస్తారు. ఎవరైనా కొత్త ఇళ్లు నిర్మించడానికి ముందు ఇక్కడికి వచ్చి తమ కోర్కెను త్రినేత్ర రణథంబోర్ గణపతికి తెలియజేస్తారు.

త్రినేత్ర గణపతి, రణథంబోర్

త్రినేత్ర గణపతి, రణథంబోర్

P.C: You Tube

తద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని భక్తులు నమ్మకం. ముఖ్యంగా ఇంటిని కట్టడానికి ముందు వారితో పాటు ఒక రాయిని తీసుకువస్తారు. ఇక్కడి త్రినేత్ర గణపతి ముందు పెట్టి పూజిస్తారు.

త్రినేత్ర గణపతి, రణథంబోర్

త్రినేత్ర గణపతి, రణథంబోర్

P.C: You Tube

అటు పై ఆ రాయిని తమతో పాటు తీసుకువెళ్లి ఇంటి నిర్మాణంలో వాడుతారు. దీని వల్ల త్వరగా ప్రశాంతంగా ఇంటి నిర్మాణం ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుందని నమ్ముతారు. అదే విధంగా స్థానికులు పొలం పనులు ప్రారంభించడానికి ముందు ఇక్కడి విగ్రహం ముందు ఆ గింజలను ఉంచుతారు.

కామ కోరికలు రివ్వున పెరగాలాకామ కోరికలు రివ్వున పెరగాలా

త్రినేత్ర గణపతి, రణథంబోర్

త్రినేత్ర గణపతి, రణథంబోర్

P.C: You Tube

అటు పై వాటిని తీసుకువెళ్లి తమ పొలంలో చల్లుతారు. తద్వారా మంచి పంట పండుతుందని స్థానికుల నమ్మకం. ముఖ్యంగా వివాహం అయ్యి చాలా రోజులు అయినా కూడా సంతానం కలగని వారు ఇక్కడికి వచ్చి త్రినేత్ర గణపతిని పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు.

త్రినేత్ర గణపతి, రణథంబోర్

త్రినేత్ర గణపతి, రణథంబోర్

P.C: You Tube

ఈ త్రినేత్ర గణపతి ఇక్కడ వెలియడానికి సంబంధించి ఒక కథనం ప్రచారంలో ఉంది. క్రీస్తుశకం 1299 లో రాజ హమ్మిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీ మధ్య యుద్ధం మొదలవుతుంది. రాజు తన ప్రజలకు కావాల్సిన ధాన్యాన్ని రణథంబోర్ కోటలో నిల్వచేస్తాడు.

త్రినేత్ర గణపతి, రణథంబోర్

త్రినేత్ర గణపతి, రణథంబోర్

P.C: You Tube

యుద్ధం అనేక రోజుల పాటు కొనసాగుతుంది. గోదాములో ఉన్న ఆహారధాన్యాలన్నీ కాళీ అవుతాయి. అయితే రాజు గణపతికి పరమభక్తుడు. ఈ క్రమంలో రాజు కలలో గణపతి కనిపించి మరుసటి రోజు ఉదయానికి సమస్యలన్నీ పరిష్కారవుతాయని చెబుతాడు.

ఇక్కడికి వెళ్లండి మీ మరణం ఎప్పుడో తెలుసుకోండిఇక్కడికి వెళ్లండి మీ మరణం ఎప్పుడో తెలుసుకోండి

త్రినేత్ర గణపతి, రణథంబోర్

త్రినేత్ర గణపతి, రణథంబోర్

P.C: You Tube

ఉదయం లేచి చూస్తే కోట గోడ వద్ద త్రినేత్ర గణపతి విగ్రహం ఉంటుంది. అంతే కాకుండా అదే రోజు యుద్ధం పరిసమాప్తమవుతుంది. దీంతో రాజు త్రినేత్ర గణపతి దేవాలయాన్ని కోట లోపల క్రీస్తుశకం 1300లో నిర్మించాడు.

మైసూరు దసరాకు వెలుతున్నారామైసూరు దసరాకు వెలుతున్నారా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X