• Follow NativePlanet
Share
» »ఇక్కడ బెల్లం నీళ్లలో స్నానం చేస్తారు...చర్మవాధులు పోగొట్టుకొంటారు

ఇక్కడ బెల్లం నీళ్లలో స్నానం చేస్తారు...చర్మవాధులు పోగొట్టుకొంటారు

Written By: Kishore

తమిళనాడులోని వైదీశ్వరన్ దేవాలయం లో పరమశివుడు వైద్యుడి రూపంలో వెలిసాడని నమ్ముతారు. ఇక్కడ ఆయనతో పాటు నవగ్రహాల్లో ఒకడైన అంగారకుడికి కూడా ప్రత్యేక దేవాలయం ఉంది. ఇలా నవగ్రహాల్లో ఒకడైన అంగారకుడికి ప్రత్యేక దేవాలయం ఉండటం అరుదైన విషయం. ఇక ఇక్కడ ఉన్న కోనేరులో భక్తులు బెల్లం కలిపి ఆ నీటితో స్నానం చేస్తారు. దానివల్ల చర్మవాధులు నశించిపోతాయని వారి నమ్మకం. ఇక్కడ నాడీ జ్యోతిష్యం కూడా చాలా ప్రాముఖ్యం, ప్రాచూర్యం చెందినది. బొనటవేలి గుర్తులను చూసి భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి ఇక్కడి వారు మనకు చెబుతారు. 12 కుటుంబాలకు వంశపార్యంపర్యంగా ఈ విద్య అలవడుతోంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ దేవాలయం గురించిన పూర్తి వివరాలు మీ కోసం.....

రావణుడిని దేవుడిగా కొలుస్తున్న భారతీయులు

1. స్థలపురాణం ప్రకారం

1. స్థలపురాణం ప్రకారం

Image Source:

పురాణాల ప్రకారం అంగారకుడు కుమారస్వామి కుమారుడు. ఈ అంగారకుడికి ఒకసారి కుష్టురోగం వస్తుంది. అప్పుడు తన తండ్రి అయిన కుమారస్వామి వద్దకు వెళ్లి తనకు ఈ కుష్టు రోగం నుంచి విముక్తి కలిగించాలని ప్రార్థిస్తాడు.

2. వినాయకుడి వద్దకు

2. వినాయకుడి వద్దకు

Image Source:

అయితే కుమారస్వామి తాను దేవతల గణానికి సైన్యాధ్యక్షుడిని మాత్రమేనని అందువల్ల నాకు ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేదని చెబుతాడు. అయితే సూక్ష్మబుద్ధి, అపార తెలివితేటలు ఉన్న మీ పెద్దనాన్న వినాయకుడి వద్దకు వెళ్లమని సూచిస్తాడు.

3. ఇద్దరూ కలిసి

3. ఇద్దరూ కలిసి

Image Source:

దీంతో అంగారకుడు, కుమారస్వామి ఇద్దరూ కలిసి వినాయకుడి వద్దకు వెళుతాడు. అక్కడ అంగారకుడు తన బాధ మొత్తాన్ని వివరిస్తాడు. తాను నీ స్థితికి జాలిపడగలను కాని సహయం చేయలేనని చెబుతాడు.

4. వినాయకుడు కూడా

4. వినాయకుడు కూడా

Image Source:

తాను విద్యా, బుద్ధులకు మాత్రమే అధిపతినని వైద్యుడిని కానని స్పష్టం చేస్తాడు. అయితే శివుడి అనుమతి లేనిదే చీమైనా కుట్టదని చెబుతారు. ఈ క్రమంలో నవగ్రహాల్లో ఒకడైన నీకే ఈ భయంకరమైన రావడానికి కారణం శివుడు కారణం కావచ్చునని చెబుతాడు.

5. శివుడిని వేడుకొంటాడు

5. శివుడిని వేడుకొంటాడు

Image Source:

ఆయన్ను వేడుకొంటే ఫలితం ఉంటుందని సూచిస్తాడు. అంతే కాకుండా కుమాస్వామిని, అంగారకుడిని తీసుకొని కైలాసానికి చేరుకొంటాడు. అక్కడ వినాయకుడు, కుమారస్వామి, అంగారకుడు కలిసి శివుడిని ప్రార్థిస్తాడు.

6. నిరాశతో

6. నిరాశతో

Image Source:

తనకు ఎలాగైనా ఈ పాపం నుంచి విముక్తి కలిగించాలని అంగారకుడు పరమశివుడిని పరిపరి విదాలుగా వేడుకొంటాడు. అయితే తాన లయకారుడినని నీకు సహాయం చేయలేనని చెబుతాడు. దీంతో అంగారకుడు నిరాశతో వెనక్కు తిరుగుతాడు.

7. వినాయకుడి సూచన మేరకు

7. వినాయకుడి సూచన మేరకు

Image Source:

అటు పై వినాయకుడి సూచనమేరకు ప్రస్తుతం వైదీశ్వరన్ కోయిల్ ఉన్న ప్రాంతంలో శివుడి గురించి ఘోర తప్పస్సు చేస్తాడు. శివుడు అంగారకుడి భక్తికి మెచ్చి వెంటనే కోరిక కోరుకోమంటాడు.

8. వైద్యుడిగా మారి

8. వైద్యుడిగా మారి

Image Source:

తానకు ఈ కుష్టరోగం నుంచి విముక్తి కలిగించాలని ప్రార్థనచేస్తాడు. దీంతో శివుడు వైద్యుడిగా మారి అంగారకుడికి వచ్చిన కుష్టువ్యాధికి చికిత్స చేసి నయం చేస్తాడు. ఇందుకోసం దేవాలయం ఉన్న చోట కొన్ని రోజులు ఉండిపోతాడు.

9. ఒక ముఖంతో

9. ఒక ముఖంతో

Image Source:

అందువల్ల ఇక్కడ శివుడిని వైదీశ్వరన్ అనే పేరుతో పిలుస్తాడు. మరో కథనం ప్రకారం ఇక్కడ కుమారస్వామి తన సహజ రూపమైన ఆరు ముఖాలతో కాకుండా ఒక ముఖంతోనే భక్తులకు దర్శనమివ్వాలని కోరుతుంది.

10. శూలం బహుమతిగా

10. శూలం బహుమతిగా

Image Source:

దీంతో కుమారస్వామి తన తల్లి కోరికను తీర్చడానికి అప్పటి నుంచి భక్తులకు ఒక ముఖంతోనే దర్శనమివ్వడం మొదలు పెట్టాడు. దీనికి సంతోషించిన పార్వతి దేవి కుమారస్వామికి ఆయుధంగా శూలాన్ని అందజేస్తుంది.

11. సురపద్మం అనే రాక్షసుడిని

11. సురపద్మం అనే రాక్షసుడిని

Image Source:

ఈ శూలంతోనే కుమారస్వామి సుురపద్మం అనే రాక్షసుడిని సంహరిస్తాడు. వీరిద్దరికి జరిగిన ఘోర యుద్ధంలో దేవతల పక్షాన పోరాడుతున్న వేలాది మంది సైనికులు తీవ్రంగా గాయపడుతాడు. వీరికి శివుడు వైద్యుడిగా సేవలందిస్తాడు.

12. ప్రత్యేక ఆలయం

12. ప్రత్యేక ఆలయం

Image Source:

ఈ ఘటన జరిగింది ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంగణంలోనే అందువల్లే ఇక్కడ శివుడు వైదీశ్వరుడిగా వెలిసాడని చెబుతారు. మరోవైపు నవగ్రహాల్లో ఒకటైన ఈ ఆలయంలో అంగారకుడికి ప్రత్యేక విగ్రహం ఉంది.

13. బెల్లం సమర్పిస్తాడు

13. బెల్లం సమర్పిస్తాడు

Image Source:

ఇలా అంగారకుడికి ప్రత్యేక ఆలయం ఉండటం ఇదొక్కటే. అంగారకుడికి ఇష్టమైన పదార్థం బెల్లం. వివిధ చర్మరోగాలతో బాధపడే వారు అంగారకుడికి ముడుపుగా బెల్లం సమర్పిస్తారు.

14. కోనేరులో కలుపుతారు

14. కోనేరులో కలుపుతారు

Image Source:

ఈ బెల్లం దేవాలయంలో అంగారకుడి విగ్రహం ముందు భాగంలో ఉన్న కోనేరులో కలుపుతారు. అటు పై అదే నీటితో స్నానం చేసి అంగారకుడిని, వైదీశ్వరన్ రూపంలో ఉన్న శివుడిని అర్చిస్తారు. దీని వల్ల చర్మవ్యాధులన్నీ పోతాయని నమ్ముతారు.

15. ధన్వంతరికి కూడా

15. ధన్వంతరికి కూడా

Image Source:

ఇక్కడ అంగారకుడితో పాటు నటరాజు, శివుడు, కుమారస్వామి, గణపతి దేవుళ్లకు ప్రత్యేక గుళ్లు ఉన్నాయి. అంతే కాకుండా ఆలయంలో భారతీయ ఆయుర్వేద శాస్త్ర పితామహుడిగా పురుగాంచిన ధన్వంతరికి కూడా ప్రత్యేక ఆలయం ఉంది.

16. చెట్లు కూడా

16. చెట్లు కూడా

Image Source:

ఇక ఆలయంలో ఉన్న పురాతన చెట్లు గొప్ప ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్నాయని చెబుతారు. ఈ చెట్లకు చెందిన అన్ని భాగాలు అంటే కాండం, పుష్పాలు, ఆకులు అన్నీ కూడా వివిధ రోగాలకు ఔషదంగా పనిచేస్తాయని చెబుతారు. అందువల్లే భక్తులు ఈ చెట్లకు కూడా ముడుపులు కట్టి తమ వ్యాధులు తగ్గించాలని ప్రార్థనలు చేస్తుంటారు.

 17. నాడీజోతిష్యం కూడా

17. నాడీజోతిష్యం కూడా

Image Source:

ఈ వైదీశ్వరన్ కోవెల దగ్గర చెప్పే నాడీజోతిష్యం కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. బొటనవేలి ముద్రల ఆధారంగా ఇక్కడ మన భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి చెబుతారు.

18. వంశపార్యంపర్యంగా

18. వంశపార్యంపర్యంగా

Image Source:

స్థానికంగా ఉంటుంన్న 12 కుటుంబాలకు వంశపార్యంపర్యంగా ఈ విద్య వస్తోంది. ఇక్కడ జోతిష్యం చెప్పించుకోవడానికి విదేశాల నుంచి కూడా పలువురు వస్తుంటారు. చెన్నై నుంచి నేరుగా వైదీశ్వరన్ కోవెల్ కు బస్సులు ఉన్నాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి