Search
  • Follow NativePlanet
Share
» »ఈ కొలను మీలోని చర్మ వ్యాధులను పోగొడుతుంది?

ఈ కొలను మీలోని చర్మ వ్యాధులను పోగొడుతుంది?

మహారాష్ట్రలో ఉన్న వజ్రేశ్వరీ మాత అమ్మవారి గురించి కథనం.

దేవాలయాల నిలయమైన భారత దేశంలో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క విశిష్టత. అటువంటి విశిష్టత కలిగినదే వజ్రేశ్వరీ దేవాలయం. ఈ వజ్రేశ్వరీ మాత దేవాలయం ముందు ఒక వేడి నీట బుగ్గ ఉంది. ఇందులో స్నానం చేస్తే పాపాలతో పాటు చర్మవ్యాధులు కూడా సమసిపోతాయని చెబుతారు. అదువల్లే భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి అనేకమంది భక్తులు నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు. అంతేకాకుండా అమ్మవారిని పూజిస్తే తాంత్రిక శక్తులు శస్తాయని విశ్వసిస్తారు. అందుకే అఘోరాలు ఎక్కువ సంఖ్యలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

పార్వతీ దేవి స్వరూపమైన వజ్రేశ్వరీ దేవి ఆలయం మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. ముంబై పశ్చిమ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 29 కిలోమీటర్ల దూరంలో వజ్రేశ్వరీ మాత కొలువై ఉన్నారు. చిన్న గుట్ట పై ఈ అమ్మవారు వెళిశారు.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

ఈ వజ్రేశ్వరీ మాతను దేవవల్లి అని కూడా పిలుస్తారు. మరాఠీలకే కాకుండా పొరుగున ఉన్న కన్నడ, తమిళనాడు వాసులకు కూడా అమ్మవారు ఆరాధ్య దైవం. ఈ అమ్మవారికి అనేక మహిమలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

అందువల్లే ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు ఈ అమ్మవారిని సందర్శిస్తుంటారు. వాస్తవంగా ప్రస్తుతం ఉన్న వజ్రేశ్వరీ మాత ఆలయానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో గుజ్ అనే చిన్న గ్రామంలో అమ్మవారు కొలువై ఉండేవారు.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

పోర్చుగీసువారు మొదట మన భారతదేశానికి వచ్చిన కొత్తలో ఈ దేవాలయాన్ని పూర్తిగా ధ్వంస చేశారు. అటు పై వజ్రేశ్వరీ దేవి ఆలయాన్ని క్రీస్తుశంక 1739లో పున: నిర్మించారు. ఈ దేవాలయానికి కేవలం మరాఠా యోథులే కాకుండా తమిళ, కన్నడ భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం పున: నిర్మాణం వెనుక ఒక కథనం ప్రచారంలో ఉంది. పోర్చుగీసువారు మొదట మన భారత దేశానికి వచ్చిన తర్వాత వజ్రేశ్వరి మాత కొలువై ఉన్న ప్రాంతం చుట్టు పక్కల ఉన్న కోటలన్నింటినీ ఆక్రమించుకొన్నారు.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

ఆ సమయంలో స్థానిక రాజు బాజీరావ్ పాశ్వా సహోదరుడు జిమాజీ అప్ప పాశ్వ తిరిగి ఆ కోటలను తన వశం చేసుకోవడానికి సహకారం అందించాల్సిందిగా వజ్రేశ్వరీ మాతను కోరుకొంటాడు. అంతేకాకుండా తన చేజారిన కోటలు తిరిగి తన వశం అయితే నీకు ఒక దేవాలయాన్ని కట్టించి ఇస్తామని వేడుకొంటాడు.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

అదే రోజురాత్రి వజ్రేశ్వరీ మాత జిమాజీ అప్ప పాశ్వ కలలో కనబడి తిరిగి కోటలను వశం చేసుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలను వివరించింది. అదే విధంగా పోర్చిగీసువారి విరుద్ధంగా పోరాడి తిరిగి కోటలను స్వాధీనం చేసుకొన్నాడు.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

అదే విధంగా వజ్రేశ్వరీ మాతకు ఇచ్చిన మాట ప్రకారం స్థినిక అధికారి శంకర్ కేశవ్ పాండ్య కు సూచించి దేవాలయాలను నిర్మించాల్సిందిగా ఆజ్జాపిస్తాడు. అలా వజ్రేశ్వరీ మాత దేవాలయం ఇప్పుడున్న చోట వెలిసింది.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయంలో సాధారణ పూజలతో పాటు ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. సాధారణంగా ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి. నవరాత్రి, శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయి. ఈ దేవాలయ గోపురం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్లగానే బంగారు వర్ణంతో మెరిసిపోయే అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. అంతేకాకుండా మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన కూర్మావతార విగ్రహం మనకు కనిపిస్తుంది. దేవాలయాన్ని మొత్తం మూడు భాగాలుగా విభజింపచేయవచ్చు.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

ఒకటి గర్భగుడి, సభామంటపం, ఉపాలయాలు. ఈ వజ్రేశ్వరీ దేవి దేవాలయం లోపలి వైపు రేణుకాదేవి, సప్తశ`ంగి మహాలక్ష్మి, కాళి, గణపతి, భైరవ, హనుమంతుడి విగ్రహం చూడవచ్చు. అదే విధంగా నిత్యం యజ్జయాగాలు నడుస్తుండటం వల్ల ఇక్కడ యాగ మంటపాన్ని కూడా భక్తులు చూడటానికి అవకాశం ఉంది.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

వజ్రేశ్వరీ దేవి దేవాలయం నుంచి కొంత దూరంలో 17వ శతాబ్దానికి చెందిన బాబా దేవ్ సమాధిని మనం ఇక్కడ చూడవచ్చు. వజ్రేశ్వరి దేవి గర్భగుడిలో అమ్మవారి విగ్రహానికి వెనుకవైపున ఒక నాణ్యాన్ని ఉంచి తమ కోర్కెలను తీర్చాల్సిందిగా భక్తులు వేడుకొంటారు.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

అటు పై భక్తులు ఇక్కడ తమ కోర్కెలు తీరితే దేవతకు పసుపు, కుంకుమ, చీర, పూలు, బియ్యం, బెళ్లం తదితర వస్తువులను కానుకగా సమర్పిస్తారు. ఇక వజ్రేశ్వరీ దేవి దేవాలయం ముందు భాగంలో ఒక వేడినీటి బుగ్గ ఉంటుంది. ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలతో పాటు చర్మ రోగాలు సమసిపోతాయాని భక్తులు నమ్ముతారు.

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

వజ్రేశ్వరీ దేవి దేవాలయం

P.C: You Tube

ఈ వజ్రేశ్వరీ దేవి దేవాలయం ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకూ తెరిచే ఉంచుతారు. ఈ వజ్రేశ్వరీ దేవాలయం మహారాష్ట్ర రాజధాని ముంబై నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X